కూర్మ మహా పురాణము

Table of Contents

4వ అధ్యాయము

ఓ బ్రహ్మవాదులారా ఏదేవదేవుని చేత సమస్తము ప్రవర్తించునో అతని మాహాత్మ్యమును చెప్పుదును. మీరు సావధానులై వినుడు.

నేను వివిధములైన తపస్సుచేత, దానముచేత, యజ్ఞకర్మచేత కానీ తెలిసికొనుటకు శక్యుడను కాను. శ్రేష్ఠమైన భక్తిచే కాక మరొక విధముగా నన్ను తెలియలేరు.

నేను సమస్తభూతములలోపల అంతటా వ్యాపించి ఉంటాను. ఓ మునీశ్వరులారా ఈ లోకము సర్వసాక్షినైన నన్ను సరిగా గుర్తించదు.  ఈ సమస్తము ఎవనిలోపల నిండియుండునో, ఎవడు గొప్పనైన సర్వలయకారకుడో, అట్టినేను ధాతను, విధాతను, కాలరూపుడను, అగ్నినీ, అంతటముఖములు కలవాడను.

అందరు మునులు, పీతరులు, దేవతలు, బ్రహ్మదేవుడు, మనువులు, ఇంద్రుడు, ఇంకను ఇతరులు మహిమాన్వితులుగా ప్రసిద్ధులోవారెవ్వరు నన్ను చూడలేరు.  

వేదాలు ఎల్లప్పుడు నన్ను ఒక్కణ్ణి పరమేశ్వరుణ్ణిగా వర్ణించును. బ్రాహ్మణులు వివిధములైన వేదవిహిత యజ్ఞాలతో నన్ను పూజింతురు.

లోకపితాహుడైన బ్రహ్మ సమస్త లోకాలు కూడా నన్ను చూడలేవు. యోగులు భూతాధిపతి, ఈశ్వరుడు అగు భగవంతుని నన్ను ధ్యానింతురు.

నేనే సర్వహవిస్సులకు భోక్తను, ఫలములనిచ్చేవాడను. సర్వదేవతలు శరీరములుగా కలవాడనై, సర్వాత్మకుడను, అంతట వ్యాపించిన పొడసు అగుచున్నాను.  వేదవాదులు, ధర్మస్వరూపులు అగు పండితులు నన్ను దర్శించుచున్నారు. ఎవరునన్ను ఎల్లప్పుడు సేవింతురో వారికినేను అందుబాటులో ఉంటాను.

ధర్మస్వభావులైన బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు నస్ను పూజింతురు. వారికి ఆనందమయమైన. ఆపరమ పదమును ఇచ్చెదను.

శూద్రులు మొదలుగా కల ఇతర జాతులవారు కూడ తమ ధర్మమునవలంబించినవారై, భక్తికలవారై సేవింతురో వారుకూడ కాలము కలిసి వచ్చి ముక్తిని పొందుదురు.

నా భక్తులు నశించరు. నా భక్తులు తొలగిన పాపములు కలవారగుదురు. నా భక్తుడు నాశము పొందడని మొదటనే ప్రతిజ్ఞచేసితిని.

ఏ మూడుడు అటువంటి భక్తుని నిందించునో, వాడు దేవదేవుని నిందించిన వాడగును. ఎవడు భక్తితో నాభక్తునారాధించునో, పోడు నన్ను పూజించినవాడగును. ఆకు, పూవు, పండు, నీరు అను వస్తువులను ఎవరు నాపూజనిమిత్తముగా అర్పింతురో, అట్టివారు నాకు ప్రియమైన భక్తులుగా ఇష్టులు. నేను మొట్టమొదట ప్రపంచమునకు పరమేష్టియగు బ్రహ్మను సృజించితిని. అతనికి నా నుండి బయల్వెడలిన వేదములనప్పగించితిని.

నేను సమస్త యోగులకు నాశరహితుడైన గురువును. ధర్మాత్ములను కాపాడువాడను. వేద శత్రువులను సంహరించువాడను నేనే. ఈ లోకములో యోగులకు సంసారబంధమునుండి విముక్తి కలిగించువాడను, సంసారమునకు కారణభూతుడను, సంసారబంధములేనివాడను నేనే.

నేనే సంహరించువాడను, సృజించుచోడను, రక్షించువాడను కూడ. మాయ అనునది నాయొక్క శక్తి, ఈ మాయ లోకములను మోహింపజేయును.

నాయొక్క పరాశక్తియే విద్య అని కీర్తింపబడుచున్నది. యోగుల యొక్క హృదయ మందున్నపోడనై ఆ మాయను నశింపజేయుచున్నాను.

నేనే అన్ని శక్తుల యొక్క ప్రవర్తకుడను, నివర్తింపజేయువాడను కూడ. అన్ని శక్తులకు ఆధారమైన వాడను, అమృతమునకు స్థానమైన వాడను.

అన్నిటియందునిండియున్న ఒక్కశక్తియే సమస్త ప్రపంచమును నిర్మించుచున్నది. బ్రహ్మయొక్క రూపమును ధరించి, నా స్వరూపము కలదై నన్నాశ్రయించి ఆశక్తి పని చేయును.

మరియొక విశాలమైన నా శక్తి లోకమును స్థాపించుచుండును. అనంతుడు, జగన్నాథుడు, జగన్మయుడు అగు నారాయణరూపము కలదై ఆపనిచేయును.

విశ్వమును లయింపజేయును. అది తమోగుణప్రధానమై, కాలనామకమైన, రుద్రరూపిణియై యుండును.  

కొందరు నన్ను ధ్యానముతో దర్శింతురు. మరికొందరు జ్ఞానమార్గముతో చూచేదరు. ఇతరులు భక్తియోగముతో, కొందరు కర్మయోగముతో నన్ను సాక్షాత్కరించుకొందురు.

అన్ని విధముల భక్తులలోను, ఎవడైతే జ్ఞానమార్గముతో ఎల్లప్పుడు నన్నారాధించునో, ఇతర పద్ధతినాశ్రయింపడో అతడే సాకు మిక్కిలి " ప్రియమైనవాడు, ఇష్టుడును అగుచున్నాడు.

విష్ణువునకు భక్తులైన ఇతరులు కూడ నన్ను ఆరాధించినట్లైన వారుకూడ నన్ను చేరుకొందురు. మరల జన్మ పరంపరను పొందరు.

ప్రధాన, పురుష స్వరూపమైన యీ సమస్త విశ్వము సొచేత వ్యాపింపజేయబడినది. మనస్సనునది నాయందే నీలిచియున్నది. ఈ లోకమునాచే ప్రేరేపింపబడుచున్నది. గొప్పనైన యోగము నాశ్రయించిననేను ప్రేరకుడను కాను. ఓ బ్రాహ్మణులారా సమస్త లోకమునకు నేను ప్రేరణ కలిగించుచున్నాను. దీనిని తెలిసినవాడు అమృతస్వరూపుడగును.  స్వభావముచేతనే ప్రవర్తించుచున్న యీ సమస్తమును నేను చూచుచున్నాను. మహాయోగేశ్వరుడు, కాలరూపుడగు భగవంతుడు స్వయముగా దీనినంతయు చేయుచున్నాడు.

శాస్త్రములయందు పండితులచేత మాయామయుడని, యోగి అని చెప్పబడునేను స్వయముగా భగవంతుడగు మహాయోగేశ్వర రూపుడను.  సమస్త సత్త్వముల యొక్క గొప్పతనము, పరమేష్టి యొక్క శ్రేష్ఠత్వమువలన భగవంతుడగు బ్రహ్మ, మహాబ్రహ్మమయుడని, అమలుడని చెప్పబడుచున్నాడు.

ఎవడైతే నన్ను ఈవిధముగా మహాయోగేశ్వరేశ్వరుడని తెలిసికొనునో, పోడు నిర్వికల్పయోగముతో కూడుకొనుటలో సందేహము లేదు. అట్టి నేను ప్రేరకుడనై పరమానందమును పొంది యోగినై నృత్యముచేయుదును. ఎవడుదానిని తెలియునో పోడు యోగవేత్త అనబడును.

మిక్కిలి రహస్యమైన, అన్ని వేదములయందు నిర్ధారింపబడిన యీ జ్ఞానము, నిర్మలమనస్సు కలవాడు, ధర్మస్వభావుడు, ఆహితాగ్ని అగు వానికి ఉపదేశింపదగినదీ.

శ్రీ కూర్మపురాణము ఉత్తరార్థములో ఈశ్వరగీతయను ఉపనిషత్తునందు బ్రహ్మవిద్యయగు యోగశాస్త్రములో ఋషివ్యాససంపాదనను నాలుగవ అధ్యాయము సమాప్తము.