కూర్మ మహా పురాణము

Table of Contents

42వ అధ్యాయము

సూతమహర్షి పలికెను.

మరియొక తీర్ణము జప్యేశ్వర సమీపమున పంచనదమని పరమపావనము సర్వపాప ప్రణాశనము. ఇచట స్నానమాడి మూడు దీనములుపవసించీ మహేశ్వరుని పూజించినవాడు సర్వపాపవినిర్ముక్తుడై రుద్రలోకమున నివసించును. శంకరుని మరియొక తీర్ఘ ప్రవరము మహాభైరవము మహాపాతకములనుకూడా నశింపచేయునది. ఈ తీర్థమున వితస్తలను పరమనది సర్వపాపహరము పుణ్యము. ఈనదీ సాక్షాత్తు పార్వతీరూపము, మరియొక తీర్థము పంచతపము అమితతేజస్వీయగు శంకరుని క్షేత్రమిది. ఇచట శ్రీ మహావిష్ణువు చక్రము కొరకు శంకరుని పూజించెను. ఇచట చేయబడిన పిండ ప్రదానోదకము పరలోకమున అనంతఫల ప్రదము. ఇచట మృతి చెందిన వాడు నీయమ పూర్వకముగా బ్రహ్మలోకమున విరాజిల్లును.

మరియొక శుభతీర్థము కాయావరోహణము. ఇది మహాదేవాలయము. ఇచట మునులు మహేశ్వరధర్మమును ప్రవర్తింప చేసిరి. ఈ తీర్థమున చేయబడిన శ్రాద్దము, దానము, తపస్సు, హోమము, ఉపవాసము అక్షయఫలము నిచ్చును. ఇచట ప్రాణములను విడిచినవాడు రుద్ర లోకమునకు వెళ్ళును. ఇచట మరియొక తీర్థము కన్యాతీర్థమని ప్రసిద్ధిగాంచినది. ఇచట ప్రాణములను, వీడుచువాడు శాశ్వతలోకములనుపొందును. అద్బుత కర్మల నాచరించిన పరశురాముని లీర్ణము కలదు. ఇచట స్నానమాడినపోడు గోసహస్ర ఫలమును పొందును. త్రిలోక ప్రసిద్ధమగు తీర్థము మహాకాలమని కలదు. ఇచట ప్రాణములను విడిచిన వాడు గాణాపత్యమును పొందును. అతిరహస్యమగు నకులీశ్వర తీర్థము కలదు. ఇచట నకులీశ్వర భగవానుడు ఎపుడూ నివసించును.

 రమ్యమును హిమవచ్చిఖరమున సుశోభన మగు గంగా ద్వారమున, మహాదేవుడు దేవీతో శిష్యులతో కలసి నివసించియుండును, ఇచట స్నానము చేసి వృషధ్వజుడగు మహాదేవుని పూజించిన సర్వపాప వినిర్ముక్తుడగును. మరణించిన తరువాత బ్రహ్మజ్ఞానమును పొందును.

దేవదేవుని పరమపావనమగు స్థానము భీమేశ్వరమని సుప్రసిద్ధమైనది. ఇచటికి వెళ్ళిన చాలును పాపములు తొలగును. ఇట్లే మరియో , తీర్ధము చండవేగానదీ ఉర్గమస్థానము సర్వపాప నాశనము. ఇచట స్నానము చేసి జలమును త్రాగినచో బ్రహ్మ హత్యాపాతకము కూడా తొలగును. ఇట్లు ఇచట చెప్పబడిన అన్ని తీర్థములకన్నా వారాణసీ అనునది పరమపురి కలదు. ఇది పదివేలకోట్ల రెట్లు అధికఫలమును ఇచ్చును. నేను మొదట వారాణసీ మాహాత్మ్యమును చెప్పియుంటిని. ఒకే జన్మలో యోగికి కూడా మరియొక చోట ముక్తి లభించదు. ఈ ప్రదేశములను ముఖ్యమగు వానిని మాత్రమే చెప్పితిని. ఈ తీర్థములకు వెళ్ళి వందల జన్మల పాపమును కడిగివేసుకొన వలయును. స్వధర్మములను విడిచి తీర్థములను సేవించువానికి ఇహపరములలో ఫల ప్రదము కాజాలదు. ప్రాయశ్చిత్తములను చేయవలసిన వాడు, పాపములను ఆచరించినవాడు, పత్నీవీముక్తుడు. ఇటువంటి వాడు తీర్థయాత్రలను సంచరించవలయును. అగ్నితో పత్నితో కలిసి తీర్థయాత్రలను సంచరించవలయును. సర్వపాప వినిర్ముక్తుడై యధోక్తలోకములను పొందును. దేవఋషి పితృఋణములను తొలగించుకోని తీర్ధసేవనము చేయవలయును. పుత్రులకు జీవనవృత్తిని ఏర్పరిచి భార్యను పుత్రులయందుంచి తీర్థ యాత్రలను చేయవలయును. ప్రాయశ్చిత్త ప్రసంగమున తీర్థ మాహాత్మ్యము చెప్పబడినది. ఈ మాహాత్యమును చెప్పిననూ వినిననూ సర్వపాపములు నశించును.

ఇది కూర్మపురాణమున షట్సాహస్రిసంహితలో ఉపరి విభాగమున 42వ అధ్యాయము.