కూర్మ మహా పురాణము
26 - శంకరకీర్తి వర్ణనము
సూతుడు చెప్పెను :-
భగవంతుడగు మహేశ్వరుడు, మేరుపర్వతశిఖరమైన, బంగారు కాంతులుకల కైలాసమును ప్రవేశించి కేశవునితోకూడో విహరించెను.
కైలాస పర్వతమునందు నివసించువారు, మహాత్ముడు, అచ్యుతుడునగు. కృష్ణునిచూచిరి. దేవదేవుడగు శంకరునివలె అతనిని గూడ పూజించిరి.
నాలుగు భుజములుకలవాడు, శ్రేష్ఠమైన శరీరముకలవాడు, నీలమేఘమువంటి కాంతికలవాడు, కిరీటము, శార్ జ్ఞమును ధరించి, వక్షమున శ్రీవత్స చిహ్నము కలవాడుగా కేశవుడుండెను.
పొడవుభుజములుకలవాడు, విశాలమైన కన్నులు కలవాడు, పచ్చని వస్త్రము ధరించినవాడు, నాశములేనివాడు, లక్ష్మీదేవితోప్రకాశించు చున్నపోడు, తరుణవయస్కుడు, సుకుమారుడు, కమలములవంటి పాదములు, కన్నులుకలపోడు, చిరునవ్వుతోకూడినవాడు, పుణ్యగతినిచ్చు వాడునగు కేశవుని వారు పూజించిరి.
దేవకీదేవికి సంతోషమును పెంచు శ్రీకృష్ణుడు ఒకానొకప్పుడు తేజస్సుతో ప్రకాశించువాడై విలాసము కోరకు అక్కడ పర్వతగుహప్రాంతములో సంచరించేను.
గంధర్వులలో, అప్సరసలలో ముఖ్యులైనవారు, సోగకన్యలు, సిద్ధులు, యక్షులు, గంధర్వులు, సమస్తదేవతలుకూడ విశ్వాత్మకుడైన ఆ కృష్ణుని చూచి మిక్కిలి ఆశ్చర్యమును పొంది సంతోషముతో వికసించిన కన్నులు కలవారై ఆ మహాత్ముడైన కృష్ణునియొక్క శిరస్సుపైన పూలవానలను కురిపించిరి.
శ్రేష్ఠులైన గంధర్వకన్యలు, ఉత్తములైన అప్సరసలుకూడ శుభ్రములైన ఆభరణములను ధరించినవారై కొనియాడదగిన కృష్ణుని చూచి కామమును పొందిరి.
పాటలయందు నైపుణ్యముకల కోందరు ఆందమైన దేవకీ కుమారుడగు కృష్ణుని చూచి కోరికతో మోహమును పొందినవారై, వివిధములైన పాటలను పాడిరి.
అధికమైన విలాసములు కలకొందరు స్త్రీలు ఆయన ఎదురుగా నాట్యము చేసిరి. మరికొందరా కృష్ణుని చూచి చిరునవ్వుతో కూడ అతనిని చుంబించి అధరామృతమును పానముచేసిరి.
మరికొందరు కన్యలు తమశరీరములనుండి ఆభరణములనుతీసి, లోకమునకే అలంకారప్రాయుడైన ఆకృష్ణునికి ఆదరపూర్వకముగా అలంకరింపజేసిరి.
కొంతమంది అంగనలు కృష్ణుని శరీరము మీదినుండి శ్రేష్ఠములైన నగలను తీసుకోని తమనుతాము అలంకరించుకొనిరి. తమనగలతో అతనిని గూడ అలంకరించిరి.
అమాయకమైన జింకకన్నులవంటి కన్నులుకల ఒకవనిత కృష్ణుని దగ్గరగా వచ్చి, కామముతో మోహితురాలై కృష్ణుని పద్మమువంటి ముఖమును చుంబించేను.
మరియొక తరుణీ కృష్ణునిమాయచేత మోహమును పొంది తన చేతితో గ్రహించి తనభవనములోనికి తీసుకొని వెళ్లెను.
తామరలవంటి కన్నులుకల భగవంతుడగు కృష్ణుడు ఆ స్త్రీలయొక్క కోరికలను, తన లీలతో అనేక రూపములను ధరించి పూరించెను.
ఈ విధముగా చాలకాలము వరకు దేవదేవుడైన శివుని పట్టణములో శ్రీమంతుడు, నారాయణుడు అగు కృష్ణుడు తన మాయతో ప్రపంచమును మోహింపజేయుచు విహరించెను.
చాలదినముల కాలము గడచిపోగా, కృష్ణుని ఎడబాటు వలన ద్వారకా నగరమునందు నివసించుప్రజలు భయముతో కలత చెందినవారైరి,
తరువాత బలవంతుడైన గరుత్మంతుడు అంతకుముందే పంపించబడినవాడై శ్రీకృష్ణునిజాడను వెదకుచు హిమాలయ పర్వతమునకు వెళ్లెను.
అక్కడ శ్రీకృష్ణుడు కన్పించక అక్కడనున్న ఉపమన్యుమునికి నమస్కరించి తిరిగి ద్వారకాపురమునకు మరలివచ్చెను. ఈలోపల మిక్కిలి భయంకరులైన పెద్ద రాక్షసులునిర్మలమైన ద్వారకాపట్టణమును భయపెట్టుచు వేలకొలదిగా అక్కడికివచ్చిరి.
అప్పుడు బలవంతుడు, కృష్ణునితో సమానమైన పరాక్రమముకలవాడును అగు గరుడుడు గొప్పయుద్ధము చేసి ఆరాక్షసులను చంపి ద్వారకను కాపాడెను.
ఈసమయములోనే పూజ్యుడైన నారదఋషి కైలాస పర్వతశిఖరమునందు శ్రీకృష్ణునిచూచి ద్వారకానగరమునకు వెళ్లాను.
అప్పుడుద్వారకలోనివసించు జనులందరు ఆ నారదునిచూచి, “భగవంతుడు, మాకు రక్షకుడు అయిన కృష్ణుడు ఎక్కడున్నాడు ” అని ప్రశ్నించిరి.
ఆనారదుడు వారితో ఇట్లుచెప్పెను. “భగవంతుడైన కృష్ణుడు గొప్పయోగిగా ఇప్పుడుకైలాసపర్వతశిఖరమందు విహరించుచున్నాడు. నేనాయనను చూచి ఇక్కడకు వచ్చితిని”. అని
ద్విజులారా ఆ నారదుని మాటను వీని పక్షులలో శ్రేష్టుడైన గరుత్మంతుడు వెంటనే ఆకాశమార్గమును చేరి శ్రేష్ఠమైన కైలాసపర్వతమునకు వెళ్లెను.
అక్కడ గరుత్మంతుడు, రత్నములతో అలంకరింపబడిన భవనములో, దేవదేపుడైన శివుని సమీపములో ఆసనమందు కూర్చుండి యున్న కృష్ణుని చూచెను.
ఆకృష్ణుడక్కడ దేవతలచేత, దేవతాస్త్రీలచేత అంతటసేవింపబడుచు, దేవతాగణములచేత, సిద్దులచేత, యోగులచేత, చుట్టబడి యుండెను.
అప్పుడు గరుడుడు మంగళకరుడైన శివునకు భూమిపై సాష్టాంగదండ ప్రణామముచేసి, ద్వారకాపురములో జరిగిన ప్రజల వ్యాకులతను కృష్ణునకు తెలిపెను.
తరువాత శ్రీకృష్ణుడు శిరస్సుతో నీలలోహితుడైన శంకరునకు నమస్కరించి, ఆయనతో అనుమతిని పొంది తనద్వారకకు తిరిగి వచ్చెను. అక్కడి స్త్రీలచేత పూజింపబడి, అమృతమువంటి మధురమైన మాటలచేత సత్కరింపబడినవాడు కశ్యప ప్రజాపతి పుత్రుడైన గరుత్మంతునిపైనెక్కి వెళ్లిపోవుచున్న, శత్రునాశకుడైన, గొప్పయోగీశ్వరుడు, శంఖచక్ర గదాధరుడు అయిన కృష్ణుని చూచీ గంధర్వులు, అప్సరసలుకూడ అనుసరించినడచిరి.
ప్రపంచస్వరూపుడైన కృష్ణుడు ఆ స్త్రీలందరిని వీడ్కొని, శీఘ్రముగా తన శ్రేష్ఠమైన ద్వారకా పట్టణమునకు వెళ్లెను.
రాక్షసులకు శత్రువైన ఆశ్రీకృష్ణుడు అక్కడినుండి వెళ్లిపోగా, చంద్రుడులేని రాత్రివలే అక్కడి మునీశ్వరులు, స్త్రీలుకూడ ఆయన లేకుండా ప్రకాశించరైరీ.
ద్వారవతీ పట్టణములోని జనులు తమకిష్టమైన కృష్ణునిరాకనుగూర్చివిని, మంగళకరము, దివ్యము అయిన ద్వారకా పట్టణమును చక్కగా అలంకరించిరి.
విశాలములైన పతోకములతో, లోపల బయటకూడ నెలకొల్పబడిన ధ్వజములతో, పూలహారములు మొదలగువానితో అందమైన ఆ పట్టణమును ప్రజలు అలంకరించిరి.
కమ్మని శ్రావ్యమైన ధ్వనీకలిగిన వివిధములగు వాద్యములను కూడ జనులు మ్రోగించిరి. వేలకొలదిగా శంఖములనూదిరి. వీణా వాదనలను చేసిరి.
గోవిందుడగు శ్రీకృష్ణుడు మంగళకరమైన ద్వారకా నగరమును ప్రవేశించగానే, యౌవనముతో ప్రకాశించువనితలు మధురమైన పాటలను పాడిరి.
తమ ప్రభువైన ఆ కృష్ణుని చూచి, స్త్రీలు మేడల పైభాగములందు నిలిచిన వారై నృత్యముచేసిరి. వసుదేవుని కుమారుడైన అతనిమీద పుష్పవర్షములను కురీయించిరి.
భగవంతుడైన కృష్ణుడు పట్టణమును ప్రవేశించి, ఆశీర్వాదములచే అభినందింపబడుచు తన భార్యలతోగూడ గొప్పయేగి యగునతడు శ్రేష్ఠమైన ఆసనముపై కూర్చొని శోభించేను.
మిక్కిలి అందమైన మంటపములో శంఖుడు మొదలగు తనకుమారులతో పరివేష్టింపబడి, ముఖ్యులైన వేలకొలది స్త్రీలతో కూడి యుండెను.
అక్కడ మనోహరమైన ఆసనముమీద జాంబవతితో కలిసి కూర్చున్న కృష్ణుడు, పార్వతీదేవితో కూడియున్న మహాదేవుడగు శివునివలె ప్రకాశించేను.
లోకములకాది పురుషుడు, నాశరహితుడు అగు ఆ కృష్ణుని చూచుటకు దేవతలు, గంధర్వులు, ప్రాచీనులైన మార్కండేయాది మునులు అక్కడికి వచ్చిరి.
తరువాత మహాత్ముడైన కృష్ణుడు తన వద్దకు వచ్చిన మార్కండేయుని చూచి లేచి శిరసువంచి నమస్కరించి, శ్రేష్ఠమైన ఆసనమునిచ్చెను.
కృష్ణుడు తన అనుచరులతో గూడ ఆ ఋషుల సమూహమును నమస్కారములతో పూజించి, వారు కోరిన వస్తువులను సమర్పించి సెలవు పొంది వెళ్లాను.
అప్పుడు మధ్యాహ్న సమయము కాగా దేవదేవుడైన కృష్ణుడు స్నానము చేసి నిర్మల వస్త్రములను ధరించిన వాడై స్వయముగా సూర్యోపస్థానము చేయుచు దోసిలిపట్టిన వాడై;
సూర్యుని వైపు చూచుచు జపించవలసిన సూర్యమంత్రమును విధానము ప్రకారము జపించెను. దేవతలకు ప్రభువుఐన కృష్ణుడు దేవతలకు, పితృదేవతలకు, ఋషులకు తర్పణములు విడిచెను.
తరువాత మార్కెండేయమునితో గూడ దేవతామందిరమును ప్రవేశించి, భూతపతి, భస్మము నలంకారముగా ధరించు లింగరూపియగు శివుని పూజించేను.
మనుష్యులందరిని స్వయముగా శాసించువాడైన ఆ కృష్ణుడు సమస్త నియమమును పాటించి, ఆ మునీశ్వరునికీ భోజనము పెట్టించి బ్రాహ్మణులను గౌరవించి;
బ్రాహ్మణ శ్రేష్ఠులారా ఆత్మయోగము నవలంబించి కృష్ణుడు, కుమారులతో కూడుకున్న వాడై మార్కండేయమునితో పురాణ సంబంధమైన పుణ్యకథా ప్రసంగమును చేసెను.
ఇది యంతయు చూచి గొప్ప మునియగు మార్కండేయుడు నవ్వుచు కృష్ణుని గూర్చి మధురమైన వాక్కులనిట్లు పలికెను.
మార్కండేయుడిట్లనెను:-
కర్మల చేత పూజింపదగిన పోడవు, యోగులకు ధ్యానింప దగినవాడవునగు నీవు చెప్పుము. నీచేత శుభములైన కర్మల చేత ఎవడు ఆరాధింపబడుచున్నాడు? .
శ్రేష్ఠమైన బ్రహ్మ స్వరూపమునీవే. నిర్మలమైన మోక్షస్థాన రూపమైన గమ్యమునీవే. ప్రపంచము యొక్క భారమును తొలగించుట కొరకు వృష్టివంశములో జన్మించిన భగవంతుడవు నీవు.
బ్రహ్మవేత్తలలో శ్రేష్టుడైన కృష్ణుడు ఆ మాటలు విని మార్కండేయునితో, తన కుమారులందరు వీనుచుండగా నవ్వుచున్న పోని వలె ఇట్లనెను.
భగవంతుడైన కృష్ణుడు పలికెను -
మీ చేత చెప్పబడినదంతయు యథార్థమే. అందులో సందేహము లేదు. అయినప్పటికి నేను సనాతనుడు, భగవంతుడును అగు ఈశ్వరుని పూజించుచున్నాను.
ఓ ద్విజుడా నాకు చేయదగిన విధి అనునది ఏదీ లేదు. నాచే పొందబడనిది కూడా ఏదియు లేదు. అయినను ఈశ్వరుడు పరమదైవతమని తెలిసికోని ఆయనను పూజించుచున్నాను.
మాయచేత మోహమును పొందిన ప్రజలు ఆ దేవుని తత్త్వమును గుర్తించలేరు. అందువలన ఆత్మకు కారణభూతుడైన వాడని తెలియజేయుచు ఆ యీశ్వరుని అర్చించుచున్నాను.
ఈ లోకములో దుర్గతిని నశింప జేయువానిలో లింగార్చన కంటే శ్రేష్ఠము మరొకటి లేదు. అందువలన లోకముల మేలు కొరకు లింగరూపములో నున్న శివుని పూజించవలెను. .
వేదములందలి సిద్దాంతములను తెలిసిన పండితులు ఆ లింగ స్వరూపుడను నేనని చెప్పుచుందురు. ఆ కారణము వలన నా ఆత్మ స్వరూపుడైన ఈశానుని నా ఆత్మతోనే పూజించుచున్నాను. మా ఇద్దరికి ఏకాత్మతా స్వరూపము కలదు.
ఆ యీశ్వరుని యొక్క శ్రేష్ఠమైన రూపాంతరమగు నేను, అతని స్వరూపమైన వాడనే. ఇందులో సంశయము లేదు. మా ఇద్దరికీ భేదములేదు. వేదముల యందీ విషయము అసందిగ్ధముగా చెప్పబడినది.
మహాదేవుడైన యీ శివుడు సంసారబంధము వలన భయపడుచున్న జనుల చేత ఎల్లప్పుడు పూజింపదగిన వాడు, యజ్ఞముచే అర్చింపదగిన వాడు, నమస్కరింప దగినవాడు, లింగమునందు తెలియదగిన మహేశ్వరుడై యున్నాడు. మార్కండేయుడు పలికెను
ఓ దేవతా శ్రేష్ఠుడా ఆ లింగమేమిటి? లింగాకారములో పూజింపబడువాడెవ్వడు? విశాలమైన కన్నులు గల ఓ కృష్ణా శ్రేష్ఠము, సులభముగా తెలియరానీదగు ఈ విషయమును మాకు తెలుపుము. శ్రీకృష్ణుడిట్లు చెప్పెను
పరమేశ్వరుని యొక్క అవ్యక్త రూపమును లింగమని అందురు. ఆ లింగరూపము ఆనంద స్వరూపము, సౌశరహితమైన జ్యోతి అనబడును. వేదములు భగవంతుడైన మహేశ్వరుని నాశరహితుడైన లింగరూపునిగా పేర్కొనుచున్నవి.
పురాతన కాలములో ప్రపంచములోని స్థావరజంగమములన్నియు భయంకరమైన, ప్రపంచవ్యాప్తమైన, సముద్రములో నాశము చెందగా బ్రహ్మను మేలు కోలుపుట కొరకు మహాశివుడు నాకు సాక్షాత్కరించినాడు.
ఆ కాలమునుండి ఆరంభించి బ్రహ్మదేవుడు మరియు నేను లోకముల మేలును కోరినవారమై మహాదేవుడగు శివుని ఎల్లప్పుడు పూజించుచున్నాము. మార్కండేయుడు పలికెను
ఓ కృష్ణాప్రాచీన కాలములో ఈశ్వర సంబంధి సర్వోత్తమ స్థానమగు లింగము మేలు కొలుపుట కొరకు స్వయముగా ఎట్లు ఆవిర్భవించినదో నీవిప్పుడు చెప్పుట ఉచితముగా నుండును.
శ్రీకృష్ణుడిట్లు చెప్పెను
పూర్వము ఈ ప్రపంపచమంతయు ఏకసముద్రరూపము, విభాగములు లేనిది, భయంకరమైనది, చీకటితో నిండినదిగా ఉండెను. ఆ అఖండ సముద్రమధ్యములో శంఖము, చక్రము, గద అను ఆయుధములను ధరించినవాడు; .
వేయి తలలు, వేయి కన్నులు, వేయి పాదములు వేయి భుజములు కల పురుషుడుగా నేను ఆవిర్భవించి, సనాతనుడగు రూపముతో సముద్రము నందు శయనించితిని.
ఈ మధ్య అవకాశములో దూర ప్రదేశమున అపరిమితమైన కాంతి కలది, కోటి మంది సూర్యుల తేజస్సుతో సమానమైనది, సంపదతో కూడి ప్రకాశించుచున్నది అగు ఒక తేజస్సును చూచితిని.
నాలుగు ముఖములు కలిగి, గొప్ప యోగశక్తి కలవాడు, ప్రభుపు, నల్లని జింక చర్మను ధరించిన పోడు, ఋగ్యజుస్సామవేదముల మంత్రముల చేత కొని యాడబడుచున్న కారణభూతుడైన పరమేశ్వరుడే ఆ తేజోరాశి.
యోగవేత్తలలో శ్రేష్ఠుడైన ఆ పరమేశ్వరుడు ఒక్క నిమేష కాలములో నన్ను చేరుకొనెను. గొప్ప తేజస్సుతో కూడిన ఆ బ్రహ్మ చిరునవ్వుతో స్వయముగా ఇట్లు పలికెను.
ఓ ప్రభూ నీవు ఎవరవు? ఎక్కడి నుండి వచ్చితివి? ఎందువలన ఇక్కడ నిలిచి ఉన్నావు? నాకు తెలుపుము. నేను స్వయముగా అవతరించినవాడను, ప్రపితామహుడను, లోకములన్నింటికి సృష్టికర్తనై యున్నాను. .
ఈ విధముగా అప్పుడా బ్రహ్మ చేత ప్రశ్నించబడిన నేను అతనితో ఇట్లంటిని. ఈ లోకములన్నింటిని మాటి మాటికి సృష్టించి మరల నశింప జేయువాడను నేను.
ఆ పరమేష్టి యొక్క మాయచేత మా యిద్దరి మధ్య ఇట్లు వివాదము వ్యాపించగా మమ్ములను జ్ఞానవంతులను చేయుటకు శివ స్వరూపమైన గొప్ప లింగాకారము అక్కడ సాక్షాత్కరించెను.
ఆ లింగమూర్తి ప్రళయకాలములోని అగ్నితో సమానతేజస్సు కలిగి యుండెను. జ్వాలల వరుసలతో కూడియున్నదీ, పెరుగదల సొశము అనునవి లేనిది, మొదలు, మధ్య, అంతము అనువీభాగములు లేనిదై యుండెను.
అప్పుడా భగవంతుడు బ్రహ్మ నీవు తొందరగా క్రింది భాగమునకు వెళ్లుమని, దీని చివర ఎక్కడ కలదో తెలిసి కొనుమని సోతో అనెను. నేను పై భాగమునకు వెళ్లుదునని కూడా పలికెను.
అప్పుడు నియమము చేసికొని శీఘ్రముగా బ్రహ్మా, నేను కూడా ఊర్ధ్వ, అధోభాగములకు వెళ్లి ఆ లింగాకారపు అంతమును కనుగొన జాలమైతిమి.
తరువాత ఆశ్చర్యమును పొందిన వారమై, భయమంది, భగవంతుడగు శివుని మాయ చేత మోహమును పొంది, విశ్వాత్మకుడైన యీశ్వరుని ధ్యానించుచు;
ఓంకార రూపమైన మహానాదమును బిగ్గరగా పలుకుచు, దోసిలి జోడించి పరమ పదస్థానమైన ఆ శివుని స్తోత్రము చేసితిమి.
మొదలు లేని, వేరు లేని సంసార మను రోగమునకు వైద్యుడైన శంభుదేవునకు, శాంతుడైన శివునికి, లింగరూపు డైన బ్రహ్మయగు ఈశ్వరునికి నమస్కారము.
ప్రళయమను సముద్రములో నివసించువాడు, ప్రళయమునకు, సృష్టికి కారణభూతుడు, శాంతరూపుడు, లింగ స్వరూపియగు బ్రహ్మము అయిన శివునకు వందనము.
అగ్నిజ్వాలల పరంపర చిహ్నము కలవాడు, అగ్ని స్తంభ స్వరూపుడు, శాంతుడు, లింగరూపుడు, బ్రహ్మము నగు శివునకు నమస్కారము.
మొదలు, మధ్యము, అంతము అనుదశలు లేనివాడు, సహజమైన, స్వచ్ఛమైన ప్రకాశము కలవాడు, నాశము లేనివాడు, లింగరూపియగు బ్రహ్మమైన శివునకు ప్రణామము.
ప్రధాన పురుషుడగు ఈశ్వరుడు, ఆకాశ స్వరూపుడగు బ్రహ్మ, శాంతుడు, లింగాకారుడు, బ్రహ్మమునకు శివునకు నమస్కారము.
వికారములు లేని వాడు, సత్యరూపుడు, శాశ్వతుడు, సాటి లేని తేజస్సు కల వాడు, వేదాంతముల సారమైన స్వరూపము కలవాడు, కాల - స్వరూపుడవగు శివునకు నీకు ప్రణామము.
శాంతుడు, లింగ స్వరూపుడు, బ్రహ్మము అగు శివునకు వందనము. అని యీ విధముగా కొనియాడబడుచున్న మహేశ్వరుడు సాక్షాత్కరించి, గోపయోగీశ్వరుడు, కోటి సూర్యులతో సమానమైన కాంతి కలవాడు, వేల కొలది ముఖముల సమూహములతో ఆకాశమును మ్రింగుచున్న వానివలె ప్రకాశించెను.
అనంతములైన పాదములు, చేతులు కలవాడు, సూర్యుడు చంద్రుడు అగ్నీ అను ముగ్గురు కన్నులుగా కలవాడు, పినాకమను ధనుస్సు చేతిలో ధరించిన వాడు, చర్మము వస్త్రముగా కలవాడు, త్రిశూలమును ధరించిన వాడై భగవంతుడు కాంపించెను.
సర్పములే యజ్ఞోపవీతముగా కలవాడు, మేఘమువంటి, దుందుభి వంటినాదము కలవాడు అగు మహాదేవుడు సాక్షాత్కరించి ఇట్లనెను. “ఓ దేవతా శ్రేష్టులారా నేను సంతోషించినాను”.
మహాదేవుడనైన నన్నుచూడుడు, మీ భయము నంతటిని విడువుడు. మీరిద్దరు అనాదిగా, నాకంటే పూర్వము వంశముల వలన జన్మించియున్నారు. .
లోకములకు పితామహుడైన యీ బ్రహ్మ నాకు కుడిభాగముననున్నాడు. నా ఎడమ భాగములో లోకరక్షకుడైన విష్ణు వున్నాడు. నా మనస్సులో శివుడున్నాడు.
నేను మీ ఇరువురి విషయంలో సంతోషించినాను. మీకు మీ ఇష్ట ప్రకారముగా మంచివరము నిత్తును. అని నన్ను గూర్చీ యిట్లు పలికి మహాదేవుడగు శివుడు స్వయముగా బ్రహ్మదేవుని కౌగిలించుకొని అనుగ్రహముతో కూడిన ముఖము కలవాడాయెను. తరువాత బ్రహ్మ విష్ణుపులు సంతోషించిన మనస్సు కలవారై మహేశ్వరునికి నమస్కరించి; ఆయన ముఖమును చూచి, “మీకు మా యందు ప్రీతి కలిగిన యెడల, మాకు నీవు వరము నీ దలచినచో, ఓ దేవా మాకు మహేశ్వరుడవయిన నీ యందు ఎల్లప్పుడు భక్తి కలుగుగాక” అని పలుకగా భగవంతుడగు పరమేశ్వరుడు నవ్వుచు, ప్రీతి కలమనస్సుతో, సంతోషించిన నాతో ఇట్లనెను. ఓ రాజా ప్రళయము, స్థితి, సృష్టి అను కార్యములకు నీవు కర్తవు కదా.
కుమారా! వీష్ణూ! ఈచరాచర రూపమైన విశ్వమును పాలించుము. ఓ హరే నేను బ్రహ్మ, విష్ణు, శివ స్వరూపములతో మూడు విధముల భిన్న రూపుడనైయున్నాను.
సర్గము, రక్షణ, నాశము అసుగుణాలతో ఆ మూడు రూపములను ధరించినాను. గుణ రహితుడను, వీకారము లేని వాడనైనను ఆయా రూపములను స్వీకరించినాను. ఓ వీషూ మోహమును విడిచి పెట్టి ఈ పితామహుని కాపాడుము.
పూజనీయుడగు ఈ బ్రహ్మ సనాతనుడైనను నీకు పుత్రుడుగా జన్మించగలడు. నేను కూడా కల్పాది కాలములో దేవతా రూపమును ధరించి నీ ముఖము నుండి శూలహస్తుడుగా జన్మించును. క్రోధగుణము నుండి పుట్టిన నీ పుత్రుడనగుదును. ఓ మునీశ్వరా మహాదేవుడగు శివుడు బ్రహ్మను గూర్చి ఇట్లు పలికీ, నన్నను గ్రహించి వెంటనే అక్కడనే అంతర్థానము చెందెను. అప్పటి నుంచి లోకముల యందు లింగార్చన అనునది చక్కగా నెలకొని స్థిరపడినది.
ఓ బ్రహ్మదేవుడా ఆ లింగము పరబ్రహ్మము యొక్క శ్రేష్ఠమైన శరీరము. ఓ పుణ్యాత్ముడా ఇదీ ఆ లింగము యొక్క మాహాత్య్మము, నీ కొరకు. సోచే తెలుపబడినది.
దీని మహిమను యోగము తెలిసిన పోరు మాత్రము తెలిసికొందురు. దేవతలు కానీ, దానవులు కానీ తెలియజాలరు. ఇది అవ్యక్త రూపము, శివనామకము అగు ఉత్తమమైన జ్ఞానము.
దేని ద్వారా జ్ఞానదృష్టి కలవారు సూక్ష్మము, ఆలోచింపశక్యము కానిది అగు ఆ తత్త్వమును దర్శింతురో అటువంటి భగవంతునకు ఎల్లప్పుడు నమస్కారమును చేయుదుము.
మహాదేవుడవు, దేవుడవు, దేవతలకు దేవుడవు, వేద రహస్యభూతుడవు, నల్లని కంఠము కలవాడవు. భృంగీశ్వరుడవు అగు నీకు నమస్కారము.
భయంకరమైన రూపము కలవాడవు, శాంతుడవు, స్థాణురూపుడవు, కారణభూతుడవు, బ్రహ్మవు, వామదేవుడవు, మూడు కన్నులు కలపొడవు, గొప్పవాడవు నగు నీకు వందనము.
శుభముల నిచ్చువాడు, మహేశుడు, గిరీశుడు, శివుడు అగు ఆ భగవంతునకు ఎల్లప్పుడు నమస్కరించుము. ఆ మహేశ్వరుని ధ్యానింపుము.
ఈ సంసార సముద్రము నుండి శీఘ్రముగా ఉద్ధరించగలవు. ఈ రీతిగా ఆ మునిశ్రేష్ఠుడు కృష్ణుని చేత పలుకబడినాడు.
తరువాత అతడు అంతట ప్యోపించి యున్న ఈశ్వరుణ్ణి మనస్సులో ధ్యానించేను. శిరసుతో కృష్ణునికి నమస్కరించి ఆజ్ఞ పొంది ఆ మహాముని, (109) తన కిష్టుడైన, త్రిశూలధారియై, దేవదేవుడైన శివుని పొందెను. శ్రేష్ఠమైన యీ లింగాధ్యాయాన్ని ఎల్లప్పుడు ఎపడు వినిపించునో, వినునో, చదువునో, ఈతపశ్చరణ వృత్తాంతాన్ని ఒక్కసారైనా విన్నప్పటికి అన్ని పాపములచేత విడువబడుతాడు.
బ్రాహ్మణ ముఖ్యులారా ఈ వాసుదేవ తపస్సు వృత్తాంతమును మనుష్యుడు ప్రతి దినము జపించితే పాపము తొలగించుకుంటాడు. బ్రహ్మలోకంలో ప్రకాశిస్తాడు. అని ఈ విధంగా పూజ్యుడైన మహాయోగి వ్యాసుడు చెప్పెను.
శ్రీ కూర్మమహాపురాణములో యదువంశాను కీర్తనం లో లింగోత్పత్తి అను ఇరవై ఆరవ అధ్యాయము సమాప్తము.
