కూర్మ మహా పురాణము

Table of Contents

43 - భువనకోశ వర్ణనం

ఈ విధముగా దేవదేవుడు, మహాదేవుడు అగు పితామహుడు కొలనియతిని చేయుచున్నాడు. ఈశ్వరశరీరము కాలాత్మకమైనది కదా.

బ్రాహ్మణులారా అతని కిరణములేవి కలవో అవి అన్ని లోకములను ప్రకాశింపజేయును, ఆ కిరణములలో శ్రేష్ఠములైనవి యేడు కలవు.

సుషుమ్నము, హరికేశము, విశ్వకర్మ, విశ్వశ్రవస్సు, సంయద్వసువు అనియు, అర్వావసువు స్వరకము అనుపేర్లతో ఆసప్తరశ్ములు ప్రఖ్యాతములైయున్నవి. సుషుమ్నము అను సూర్యరశ్మి తనకాంతితో చంద్రుని పోషించును.

ఈ సుషుమ్నరశ్ని అడ్డముగా, నిలువుగా కూడ ప్రసరించు స్వభావము కలది. హరికేశము అనబడు రశ్నీ సక్షత్రములకు బలము కలిగించును.

విశ్వకర్మ అనబడు సూర్యరశ్మి బుధగ్రహమును ఎల్లవేళల పోషించుచుండును. విశ్వశ్రవస్సు అను పేరుగల సూర్యరశ్మి సర్వకాలము శుక్రగ్రహమునకు ప్రకాశము కలిగించును.  

సంయద్వసు వను పేరుతో ప్రఖ్యాతమైన రశ్మి అంగారక గ్రహమును పోషించుచున్నది. సమర్థమైన అర్వావసువను రశ్మి బృహస్పతి - గ్రహమును బాగుగాపోషించును.

ఏడవదైన స్వరమను రశ్మి శనైశ్చర గ్రహమును పోషించును, ఈ ప్రకారము సూర్యుని యొక్క ప్రభావముచేత అన్నీ నక్షత్రములు వృద్ధి పొందుచున్నవి. పెంపొందినవై ఎల్లప్పుడు లోకమును సంతోషపరచుచున్నవి. దేవతలయొక్క భూమికి సంబంధించినవారి యొక్క రాత్రిచరుల యొక్క తేజస్సులను, చీకట్లను స్వీకరించుట వలన ఆదిత్యుడనబడుచున్నాడు. ఆ సూర్యుడు తన వేయినాడులతో అన్నివైపులనుండి నదులకు చెందినది, సముద్రసంబంధి, బావుల లోనిది, నిలకడగా ఉండునది, ప్రవహించునది అగు కాలువలు మొదలగు వాని జలము ఏది కలదో, దానిని గ్రహించుచున్నాడు.

ఆ సూర్యుని వేయి రశ్ములు చలిని, వర్షమును, వేడిని ప్రసరింపజేయుచు, వానిలో నాలుగు వందల సౌడులు చిత్రమైన రూపముకలవై వర్షము కురియించును.

వర్షమునకు కారణభూతములైన రశ్ములుగా అన్నియు చంద్రగములు, గాహములు, కంచనములు, శాతనములు, అమృతములు అనుపేర్లతో పేర్కొనబడినవి.  

మంచునుండి బయలుదేరిన ఆనాడులు, దశ్ములుగా బయలువెడలీనమై, రేష్యము, మేష్యము, పోస్యము, మెరుపులు, వర్షకారకములు, చంద్రములు అని పేర్లతో అవి యన్నియు పసుపుపచ్చని కాంతులుగా ఉండును. విశ్వభృత్తుయొక్క కిరణాలు తెల్లనివి, కుంకుమరంగు కలవిగాను ఉండును.

శుక్లములను పేరుగల ఆరశ్ములు మూడువిధముల వేడిమిని ప్రసరించును. సూర్యుడు ఆ రశ్ములతో మనుష్యులను, పితరులను, దేవతలను సమానముగా భరించును.  

ఈ సూర్యభగవానుడు మనుష్యులను ఔషధముతో, పితరులను స్వధతోను, దేవతలందరినీ అమృతముతోను మూడు విధములసాధనములతో ముగ్గురిని తృప్తిపరచుచున్నాడు.

వసంతగ్రీష్మఋతువులలో సూర్యుడు ఆరురశ్ములతో వేడిని ప్రసరించును. శరత్కాలములో, వర్షఋతువులో నాలుగు రశ్ములతో వర్షమును కురియును.

హేమంతశిశిరఋతువులలో ప్రభువైన సూర్యుడు మంచును వ్యాపింపజేయును. సూర్యుడు మాఘమాసములో వరుణుడుగాను, ఫాల్గుణములో పూషగాను,  చైత్రమాసములో దేవేశుడని, వైశాఖములో ధాత అనుపేరుతోను, జ్యేష్ఠములో ఇంద్రుడని, ఆషాఢమాసములో రవి అనియును  శ్రావణమాసములో వివస్వంతుడని, భాద్రపదములో భగుడనియును, ఆశ్వయుజములో పర్జన్యుడని, కార్తీకమాసములో భాస్కరుడని వ్యవహరింపబడును.   మార్గశీర్షములో మిత్రుడని, పౌషమాసములో సనాతనుడైన విష్ణురూపుడుగాను వ్యవహరింపబడును. వరుణరూపుడైన సూర్యుడు తన వ్యాపారములో 5వేల రశ్ములనుపయోగించును.

పూషరూపములో సూర్యుడు 6వేల రశ్ములతో, దేవేశుడు ఏడువేల రశ్ములతోను, ధాతరూపుడైన భాస్కరుడు 8వేలతోను, ఇంద్రరూపుడుగా తొమ్మిది వేల రశ్ములతో,  వివస్వంతుడు 10వేల రశ్ములతో, భగుడు 11వేల రశ్ములతో, మిత్రుడు ఏడువేలతోను, త్వష్ట 8వేల రశ్ములతో

ప్రకాశించును.  అర్యముడు 10వేలతోను, పర్జన్యుడు 9వేల రశ్ములతోను, విష్ణునామకుడైన సూర్యుడు 6వేల రశ్ములతో తపింపజేయును.

సూర్యుడు వసంతకాలములో కపిలవర్ణుడుగాను, గ్రీష్మకాలములో బంగారు కాంతి కలపొడుగాను, వర్షఋతువులో తేలుపుగాను, శరత్కాలములో పొండువర్ణముగాను ప్రకాశించును.  సూర్యుడు హేమంతఋతువులో రాగీరంగుకలవాడుగా నుండును. శిశిరకాలములో ఎరుపురంగు కలిగియుండును. ఔషధుల యందు అతడు తన కళను ధరించును. పితృదేవతలయందు స్వధను ధరించును.  

సూర్యుడు దేవతలయందు మూడు విధముల అమృతమును మూడు భాగముల యందు వినియోగించును. విప్రులారా సూర్యునిచేత అధిష్టింపబడిన గ్రహములు ఎనిమిదింటినీ విధముగా తెలియవలెను.

చంద్రుడు, బుధుడు, శుక్రుడు మరియు బృహస్పతి, అంగారకుడు శని, రాహువు, కేతుమంతుడు అని ఆ ఎనిమిది గ్రహముల పేర్లు.

ఆగ్రహములన్నీయు వాయురశ్ములచే నియమింపబడినపై, త్రిప్పటడుచు వారి వారి నియమానుసారము సూర్యుని అనుసరించి తిరుగుచున్నవి.

పాతచక్రముచేత ప్రేరేపింబడినవై ఆగ్రహములు కొలవి చక్రము వలె సంచరించును. ఆ గ్రహములను వహించుచున్న కారణముచేత " వాయువునకు ప్రవహము అను పేరు ప్రసిద్ధమైనది.  చంద్రునియొక్క రథము మూడు చక్రములు కలది. అతని గుఱ్ఱములు మొల్లపూవువంటి కాంతి కలవి. అవి కుడి యెడమ భాగములలో కట్టబడిన పది గుఱ్ఱములు దానిని మోయును. చంద్రుడు,

దానితో వీథుల నాశ్రయించి యున్న నక్షత్రములను గూర్చి, సూర్యుని వలె సంచరించును. బ్రాహ్మణాశ్రేష్ఠులారా చంద్రుని వృద్ధి క్షయములు ఎల్లప్పుడు ధ్రువస్థానముపై ఆధారపడియుండును.

ఆ చంద్రుడు శుక్లపక్షములో సూర్యుడు ఆవలిభాగములో నుండగా కళలచేనింపబడును. శుక్లపక్షము సమాప్తిచెందగా ఆకళలు ఎల్లప్పుడు దేవతలచే గబడి క్షీణించును. సూర్యుడు సుషుమ్నమను రశ్మితో చంద్రుని ఎల్లప్పుడు కాంతివంతముగా చేయును.

సూర్యుని తేజస్సుచేత ప్రకాశవంతము చేయబడిన ఈ చంద్రుని శరీరము దినక్రమములో వృద్ధిపొంది పూర్ణిమనాడు సంపూర్ణ రూపముతో కన్పించును.

నిండుబింబముకల చంద్రుని అమృతాత్మకమైన

రూపమును, దేవతలు అమృతభోజనులు కనుక పక్షము రోజులలో క్రమముగా ఒక్కొక్క కళచొప్పున పానము చేయుదురు.  

తరువాత పదునైదవ కళారూపమైన భాగము కొంచెము మిగిలియుండగా అపరాహ్లాకాలములో పితృగణములు వెనుకభాగము నాశ్రయిం తురు.

ఆ చంద్రుని మీగిలిన కళను రెండు లవలకాలము అమృతమయము, అమృతరూపము, పుణ్యకరము అయినదానిని పానము చేయుదురు.

అమావాస్యనాడు కిరణములనుండి ప్రసరించుచున్న ఆ అమృతమును పితృదేవతలు ఆస్వాదించి సుఖముకలవారై మాసతృప్తిని పొందుదురు.

చంద్రునకు పూర్తిగా వినాశనము జరుగదు. అమృతము ఈవిధముగా చక్కగా ఆస్వాదింపబడును. ఓ సజ్జనులారా ఇట్లు చంద్రుని యొక్క వృద్ధి క్షయములు సూర్యుని కారణముగా జరుగుచుండును.

చంద్రుని కుమారుడైన బుధునియొక్కరథము, వాయువేగముకల, నీటి నుండి పుట్టిన గుఱ్ఱములతో కూర్చబడియుండును, ఆ బుధుడుదానితో అంతట సంచరించును.  

 శుక్రునియొక్క రథము భూమియందు పుట్టిన పది అశ్వములు కలిగి యుండును. అంగారకుని రథము బంగారముతో చేయబడినది, మిక్కిలి అందమైనదై ఎనిమిది గుఱ్ఱములతో కూడియుండును.   బృ: హస్పతి రథము ఎనిమిది గుఱ్ఱములు కలది, బంగారముతో నిర్మించబడినది. శనియొక్క రథము వెండితో చేయబడినది, ఎనిమిది అశ్వములు కలదిగా ఉండును.

రాహుకేతువుల యొక్క రథములు కూడ ఇనుముతో చేయబడినవై ఎనిమిది అశ్వములు కలవై యుండును. ఇవి మహాగ్రహముల యొక్క రథములు మీకు వివరింపబడినవి.

ఇవి యన్నియు పోయురశ్ములతో ధ్రువసానముతో నియమింపబడియున్నవి. గ్రహముల, నక్షత్రముల స్థానములన్నియు సంపూర్ణముగా ధ్రువస్థానముతో నిబంధింపబడినవి. అవి తీరుగుచు, వాయురశ్ములతో భ్రమింపజేయుచుండును.