కూర్మ మహా పురాణము
5వ అధ్యాయము
యోగులకు పరమేశ్వరుడగు శంకరభగవానుడింతవరకు చెప్పి, తన పరమఐశ్వర్యమును ప్రదర్శింపుచు, నృత్యము చేసెను. తేజోనిధి అయిన ఈశ్వరుని ఆకాశమున నృత్యము చేయుచుండగా విష్ణువుతో కలిసి దేవతలు, జితేంద్రియులైన యోగులు, యోగతత్త్వము చక్కగా తెలిసినవారు చూచిరి. సకల జగత్తు ఎవని మాయా రూపముగా ఆవిర్భవించునో, ఎవని సంకల్పముతో ప్రవర్తించునో, అట్టీ విశ్వేశ్వరుడు సృత్యము చేయుచు స్వయముగా బ్రాహ్మణోత్తములకు సాక్షాత్కరించెను. జీవుడు ఏ శివుని పాదపద్మములను స్మరించి, అజ్ఞానమువలన కలుగు భయమును తొలగించుకోనునో, అట్టి భూతేశుడు నృత్యము చేయుచుండగా వారందరు చూడగలిగిరి.
నిద్రనువీడి, ప్రాణాయామ పరాయణులై, ఇంద్రియనిగ్రహము నలవరచుకొని, భక్తి కలిగినవారు మాత్రమే, జ్యోతి స్వరూపుడైన, మహా యోగేశ్వరుని చూడగలరు. అట్టి వారికే యోగేశ్వరుడు దర్శనమిచ్చును. భక్తవత్సలుడగు శివుడు ప్రసన్నుడైనచో, జీవులను త్వరగా అజ్ఞానమునుండీ విడిపించును. ఇట్లు అజ్ఞానమును తొలగించురుద్రునీ ఆకాశమున చూచిరి. ఆ పరమరుద్రుడు వేయి శిరములు, వేయి చేతులు కలవాడు, జటాధారి. అర్థ చంద్రుని శిరమున ఆభరణముగా కలవాడు వ్యాఘ్ర చర్మమును ధరించువాడు. పొడవైన చేతిలో శూలము ధరించువాడు. దండపాణి, వేదత్రయమును నేత్రములుగా గలవాడు. సూర్య చంద్రాగ్నులు నేత్రములుగా కలవాడు. సకల బ్రహ్మాండమును తన తేజస్సుతో అధిష్టించి యున్నవాడు, దంష్టలతో భయంకరమైన వక్రము గలవాడు. ఇతరులచే ఓడింపబడనివాడు (చేనకబడనీవాడు), కోటి సూర్యులతో సమాసమగు కాంతిగలవాడు. అగ్ని జ్వాలలను సృజించి అఖిల జగత్తును దపొంచువాడు. సకల జగత్తును సృజించువాడగు ఈశ్వరుని నృత్యము చేయుచుండగా చూచిరి. ఈ పరమేశ్వరుడు, మహాదేవుడు, మహా యోగస్వరూపుడు, దేవతలకు కూడ దేవత, పశుపతి, నిఖిల జగచ్చాసకుడు, ఆనందరూపుడు, జ్యోతిస్వరూపుడు, నాశములేనివాడు, ధనువును ధరించినవాడు, విశాలనేత్రుడు, సంసారవ్యాధిగ్రస్తులకు దివ్యౌషధము. కాలస్వరూపుడు, యమునికి యముడు, దేవదేవుడు, మహేశ్వరుడు, ఉమాపతి, విశాలనేత్రుడు, యోగరూపుడు, పరమానందరూపుడు, జ్ఞాన వైరాగ్యనిలయుడు, జ్ఞానయోగమును శరీరముగా కలపోడు, సనాతనుడు. ఉత్పత్తి నాశములు లేని ఐశ్వర్య వైభవములు కలవాడు. ధర్మమునకు ఆధారభూతుడు. అందరానివాడు. మహేంద్ర ఉపేంద్రాదులతో, మహర్షిగణములతో నమస్కరింపబడువాడు. యోగుల హృదయములో నివసించు వాడు. యోగమాయచే ఆవరించబడి యున్నవాడు. జగత్కారణ భూతుడు, ఆద్యంతములు లేని శ్రీ మన్నారాయణుడు క్షణములో ఈశ్వరునిలో ఐక్యము పొందుటను బ్రహ్మవాదులైన ఋషులు చూడగలిగిరి.
నారాయణస్వరూపుడైన పరమేశ్వరుని చూచిన బ్రహ్మవాదులు తమనుతాము కృతార్థులుగ తలచిరి, సనత్కుమారుడు, సనకుడు, భృగువు, - సనాతనుడు, సనన్దనుడు, రుద్రుడు ఆంగిరసుడు, వామదేవుడు, శుక్రుడు, అత్రి, కపిల, మరీచి మహరులు అందరు జగచ్ఛాసకుడగు రుద్రుని వామభాగమున నారాయణుడు నివసించియున్న స్వరూపమును చూచి, హృదయమున నిలుపుకొని, ధ్యానముచేసి, శిరసుతో ప్రణమిల్లి, తమ శిరములయందు దోసిలొగ్గి, ఓంకారమును ఉచ్చరించి, హృదయమున నివసించియున్న ఆదిదేవుని సాక్షాత్కరించుకొని పరిపూర్ణానందము నిండిన మనసుకలవారై వేదమయములగు వాక్కులతో ఇట్లు స్తుతించసాగిరి.
తామొక్కరే ఈశ్వరులు, పురాణపురుషులు, ప్రాణేశ్వరులు అసంత యోగ స్వరూపులు. మునులు, హృదయమున అధివసించేవాని, సకల జగత్తునకు చైతన్యమును ప్రసాదించువాని, పవిత్రుడగు బ్రహ్మ స్వరూపుడగు రుద్రుని సమస్కరించుచున్నాము. బాహ్యేంద్రీయములను అంతరింద్రి యములను వశములో నుంచుకొనినపోరు ధ్యానము గావించుచు తమశరీరమును నిశ్చలుని పావనుని, హిరణ్యవర్ణుని, బ్రహ్మకు కూడ కారణ భూతుని పరులందరికంటే పరుని ఆఖిలదర్శనుడగు తమను చూచుచుందురు. సకలజగత్ సృష్టి నీ నుండి జరిగినది. అందరికి ఆత్మవు నీవే, నీవు పరమాణురూపుడవు. సత్పురుషులు నిన్ను పెద్ద వాడి కంటే పెద్దదానిగా చిన్నవాడికంటే చిన్నవానిగా చెప్పుచుందురు.
సకల జగత్తునకంతరాత్మ పురాణపురుషుడగు హీరణ్యగర్భుడు (చతుర్ముఖ బ్రహ్మ) నీ వలన పుట్టెను. నీచేత సృజించబడగా పుట్టిన ఆ బ్రహ్మ విధిననుసరించి సకల జగత్తును సృజించెను. సకల వేదములు నీవలననే వెలువడినవి. ప్రళయ కాలమున నీలోనే నిలుచును. జగత్కారణ భూతుడవు. మా హృదయములలో అధివసించి యున్న నృత్యము చేయుచున్న నిన్ను చూచుచున్నాము. సకల బ్రహ్మ చక్రమును (కాల) తామే తప్పుచున్నారు. తాము పరమ మాయావులు. సకల ప్రపంచమునకు ఏకమాత్ర అధినాయకులు, నీన్ను శరణు పొంది నమస్కరించుచున్నాము. యోగరూపుడవు, చీత్పతివి, దివ్యనృత్యమును చేయుచున్న నీన్ను పరమాకాశమధ్యమున చూచుచున్నాము. నీ మహిమనుస్మరించుచున్నాము. సర్వస్వరూపుడవు అనేక రూపములతో అధివసించు నీన్ను పలుమార్లు అనుభవించుచున్నాము.
నిన్ను చెప్పుముక్తి బీజము ఓంకారము. ప్రకృతిలో రహస్యముగా నివసించువాడవు, నాశములేనివాడవు. నీ ప్రకోశము సహజముగా వెలువడినది. అట్టి నిన్ను సజ్జనులు సత్యమూర్తిగా చెప్పుచుదురు. అన్నీ వేదములు నీన్ను స్తుతించుచున్నవి. దోషరహితులగు ఋషులు నిన్ను నమస్కరించుచున్నారు. శాంతస్వభావులు సత్యసంధులు బ్రహ్మ విష్ణులగు యతులు శ్రేష్ఠ తముడవగు నీలో చేరెదరు.
పలుశాఖలు కలది అనన్తమగు ఒకేవేదము నిన్నొక్కనినే ఒకేరూపుగలవనిగా బోధించుచున్నది. తెలియదగిన నిన్ను శరణు వేడిన వారికి మాత్రమే శాశ్వతమగు శాంతి లభించును. ఇతరులకు లభించదు. నీవే ఈశ్వరుడవు ఆధిలేని పొడవు తేజోరాశివీ, బ్రహ్మవు విశ్వరూపుడవు పరమేష్ఠివి శ్రేష్ఠతముడవు ఆత్మానందానుభవముతో శయనించియుందువు. స్వయం ప్రకాశుడవు, నిశ్చలుడవు నిత్యముక్తుడవు. నీ వొక్కడవే రుద్రుడవు. విశ్వమును సృజించుచున్నావు. విశ్వరూపుడవై ఆ విశ్వమును పొలించుచున్నావు. ప్రళయకాలమున సకల ప్రపంచము నీలోనే లీనమగును. నీన్ను శరణు పొందినమేము నీకు నమస్కరించుచున్నాము.
తమను అద్వితీయునిగా కవిగా అద్వితీయరుద్రునిగా, సకల ప్రాణ భూతునిగా, బ్రహ్మగా, హారిగా అగ్నిగా ఈశ్వరునిగా ఇంద్రునిగా, మృత్యువుగా, వాయువుగా, సర్వవ్యాపకునిగా సర్వమును ధరించువాని, సూర్యునిగా బహురూపునిగా చెప్పుచుందురు. నీవు నాశరహితునివి. పరమాత్మవు. తెలియదగినవానివి. ఈ సకలప్రపంచమునకు పరమాశ్రయభూతుడవు. నాశరహితుడవు, సర్వకాలములందు అనాదియగు ధర్మమును రక్షించువాడవు. నీవు సనాతనుడవు. నీవే పురుషోత్తముడవు. నీవే విష్ణువు నీవే బ్రహ్మవు నీవే రుద్రుడవు. అధీశ్వరుడవు నీవే విశ్వమునకు మూలము. నీవే ప్రకృతివి;నీవే ప్రతిష్ఠ సర్వేశ్వరుడవు నీవే. పరమేశ్వరుడవు నీవే.
నీవొక్కడవే పురాణపురుషుడవు. సూర్యసమానవర్ణుడవు అజ్ఞానమునకు అందనివాడవు. జ్ఞానపుంజమవు. తెలియబడని పోడవు, చింతించలేని రూపుగలవాడవు. ఆకాశము, బ్రహ్మా, శూన్యము, ప్రకృతి రూపుడవు నీగుణుడవు. ఈ సకలజగత్తునీలోనే భాసించుచుండును. నీవు అవ్యయుడవు. పరిశుద్ధుడవు. ఏకరూపుడవు. అనగా మార్పులేనివాడవు. నీ రూపము మా బుద్దికి అందదు. నీలోనే ఈ సకల తత్త్వము భాసించును.
యోగేశ్వరుడవు రుద్రుడవు అనన్త శక్తిని, పరమాధార భూతుడవు బ్రహ్మరూపుడవు పవిత్రుడవగు నీన్ను శరణు కోరు మేమందరము నమస్కరించుచుస్నోము. భూతపతీ మహేశా మాయెడ ప్రసన్నుడవు కమ్ము నీ పాదపద్మములను స్మరించుట వలన సకల సంసార బీజములు నశించును. మనస్సు నిగ్రహించుకొని, శరీరమును వశపరచుకొని ఏకమాత్ర ఈశుడవగునిన్ను ప్రసన్నుని చేసుకోనుచున్నాము.
సంసార రూపునకు, సంసారమును సృజించువానికి కాలరూపునకు, సర్వ రూపునకు నమస్కారము. రుద్రునికి జటాజూట ధరునికి, అగ్నికీ శిపునకు నమస్కారము.
అంతట మునులస్తోత్రమును వినిన జటాజూటధారి వృషభ పోహనుడు జ్ఞానోదిషాఢుణ్యయుక్తుడగు మహాదేవుడు విశ్వరూపమును ఉపసంహరించి సహజరూపునిగా నిలిచెను.
భూత భవ్వేశుని భవుని నారాయణుని ఎప్పటిలా ఉన్నవానిని చూచిన మునులు ఆశ్చర్యముతో ఇట్లు పలికిరి.
భగవన్ భూతభవ్యశ సత్యధర్మములను సంరక్షించుపోడా. సనాతనా. నీ విశ్వరూపమును చూచి పరమానందమును పొందితిమి. మీ అనుగ్రహము వలన పరిశుద్ధుడవు పరుడవు పరమేశ్వరుడవు అగు నీ యందు అనన్యమగు భక్తీ ఏర్పడును. ఇపుడు నీ మాహాత్మ్యమును నిత్యము యధార్థమగు వైభవమును వినగోరుచున్నాము.
యోగసిద్ధిని ప్రసాదించు శంకరుడు ఆయోగులమాటలను విని శ్రీమహావిష్ణువునుచూచి గంభీరమగు వాక్కుతో ఇట్లు పలికెను.
ఇది శ్రీ కూర్మపురాణమున షట్ సాహసీలో ఉత్తర భాగమున ఈశ్వర గీతలలో 5వ అధ్యాయము.
