కూర్మ మహా పురాణము
50వ అధ్యాయము
సూతుడు పలికెను :
శాకద్వీపముయొక్క వైశాల్యమునకు రెండురెట్లుగా క్షీరసాగరము నాశ్రయించి పుష్కరమను పేరుగల ద్వీపము నెలకొనియున్నది.
బ్రాహ్మణోత్తములారా ఈ ద్వీపములో మానసోత్తరమను పేరుగల పర్వతము ఒక్కటే వేయియోజనముల పొడవు, ఏబది యోజనముల ఎత్తును కలిగియున్నది.
అంతే విస్తీర్ణము కలిగి, అన్నివైపుల వ్యాపించి ఆద్వీపము యొక్క సగభాగము మానసోత్తరపర్వతము నాశ్రయించి మండలాకారముగా నున్నది.
ఒకపెద్దభాగమే రెండు విభాగములుగా కల్పించబడినది. ఆ ద్వీపమునందు రెండు పుణ్యములైన, మంగళకరములైన జనపదములు పేర్కొనబడినవి. మానసోత్తరపర్వతము ననుసరించిన మండలముగా చెప్పదగినవి ఆ
రెండు జనపదములు. మహావీతమునుపేరుగల వర్షము, ధాతఖండము అనునవి ఆజనపదములపేర్లు పుష్కరద్వీపము శుద్దోదక సముద్రము చేతచుట్టబడియున్నది. ఆ ద్వీపమునందు దేవతలచేత పూజింపబడు ఒక పెద్ద మట్టి చెట్టు కలదు.
ఆ ద్వీపమునందు విశ్వరూపుడు, విశ్వభావనుడు అయిన బ్రహ్మనివసించును. ఓమునీశ్వరులారా అక్కడనే శివసారాయణుల నివాసము కలదు.
ఇచ్చట సగభాగమున మహాదేవుడగు శివుడు, సగమున నాశరహితుడగు విష్ణువు, బ్రహ్మాదులచే పూజింపబడుచు, కుమారుడు మున్నగు యోగులచేత అర్చింపబడుచు వసింతురు.
కృష్ణపింగళవర్ణముకల ఈశ్వరుడు గంధర్వులచేత, కిన్నరులచేత, యక్షులచేత పూజింపబడుచుండును. అక్కడ ప్రజలందరు స్వస్థులుగా నుందురు, బ్రాహ్మణులు అధికతేజస్సుకలవారుగా నుందురు.
అచట ప్రజలు రోగరహీతులుగా, శోకములేని పోరుగా, రాగద్వేషములచే విడువబడినపొరుగానుందురు. అక్కడ సత్యము, అనృతము అనువీభాగములేడు. ఉత్తమ, మధ్యమ, అధమ భేదము లేదు.
అక్కడ వర్ణాశ్రమ ధర్మములు కానీ, నదులు పర్వతాలు కానీ లేవు. పుష్కరద్వీపమునకు ఆవలి భాగమున ఆవరించి పెద్దదైన శుద్దోదక సముద్రము అన్నివైపుల ఉన్నది. విప్రవరులారా దానికి అవతలి భాగమున విశాలమైన లోకముయొక్క వ్యాప్తి ఉన్నది.
బంగారుమయమైన రెట్టింపు భూమీ, ఒకేళిలతో పోల్చదగినదై అంతట ఉండును. దానికి ఆవలిభాగములో సూర్యమండల ప్రచారమునకు అవధియగు పర్వతముండును.
ఒకవైపు వెలుతురు, మరొకవైపు చీకటి కలిగి అది లోకాలోకమని చెప్పబడును. దానీయొక్క ఎత్తు పదివేల యోజనముల పరిమాణము కలిగియుండును.
లోకాలోకపర్వతముయొక్క విస్తారముకూడ అంతే పరిమాణము కలిగి యుండును. ఆపర్వతమును ఆవరించి అంతట నిలిచియుండునది, అన్నివైపుల ప్యోపించినది అగు చీకటి పాత్రమువంటి అండాకార భాగముతో నిండియుండును. ఇవి యేడు పొతాళములనబడుమహాలోకములు చెప్పబడినవి.
బ్రహ్మాండము యొక్క సమగ్రమైన విస్తారము సంగ్రహముగా నాచే చెప్పబడినది. ఇటువంటి అండాకారగోళములు వేలకొలది కలవని తెలియదగును.
అన్నిటికీ సంబంధించియుండుటవలన, కారణభూతుడైన, సౌశరహితుడైన భగవంతుడు ప్రధానమైయున్నాడు. ఈ అన్నిఅండములందు పదునాలుగు లోకములు ముఖ్యములైనవి.
అచ్చటచ్చట నాలుగు ముఖములు కల. నారాయణుడు మొదలుపోరు, రుద్రులు కలరు. తరువాత ఒక్కొక్కటి పదిరెట్లపరిమాణము కల ఏడు అండాపరణములుండును.
బ్రాహ్మణులారా ఆ అంటావరణములు అంతటా వ్యాపించియున్నవి. బుద్ధిమంతులైన సజ్జనులు అచ్చటికి వెళ్లుదురు. అది అంతములేనిది, వ్యక్తముకానిది, జననమరణములులేనిది, గొప్పది.
అక్షరరూపమైన ప్రకృతి సమస్త ప్రపంచమునతిక్రమించి వర్తించును. అనంతునియొక్క అనంతత్వము, ఏ కారణమువలన దానికి సంఖ్య ఉండదో, ఆ అవ్యక్త రూపమిదియని తెలియదగును. అది శ్రేష్టమైన, నిశ్చలమైన బ్రహ్మము. ఈతడు అనంతుడుగా అంతట అన్నిస్థలముల యందు కీర్తింపబడుచున్నాడు.
అతనియొక్క శ్రేష్టమైన మాహాత్మ్యము పూర్వము నాచేత ఏదిచెప్పబడినదో, దానిని వహించిన యితడు అన్ని స్థానములయందు పూజింప బడుచున్నాడు.
భూమిపైన, పొతాళమునందు, ఆకాశమునందు, వాయువునందు అగ్నియందు, అణుసంబంధులైన అన్నిటియందు స్వర్గమునందుకూడ, అట్లే తమోగుణమునండు, సత్త్వగుణమునందుకాని గొప్ప ప్రకాశము కలిగిన ఇతడే పురుషోత్తముడై అనేక విధముల విభజింపబడిన శరీరము కలవాడుగా విహరించుచున్నాడు.
శ్రేష్టుడైన మహేశ్వరుడు అవ్యక్తమునకంటే అతీతుడు. అవ్యక్తము నుండి బ్రహ్మాండము జనించినది. దానినుండి బ్రహ్మ ఉద్భవించేను. అతనిచేత ఈజగము సృజింపబడినది.
శ్రీ కూర్మపురాణములో భువనకోశవర్ణనమను ఏబదియవ అధ్యాయము సమాప్తము.
