కూర్మ మహా పురాణము

Table of Contents

32వ అధ్యాయము

వ్యాస మహర్షి పలికెను.

సురాపానము చేసినవాడు సురను బాగుగా అగ్నీతో కాచీ అగ్నీవర్ణము కలదానిని చేసి త్రాగ వలయును. ఆ సురతో శరీరము కాలినచో సురాపాన పాపము శమీంచును. గోమూత్రమును కాని గోమయము నుండి తీసిన రసమును కొని అగ్నివర్ణము కావించీ త్రాగవలయును. లేదా పాలు నెయ్యి నీరు కూడా బాగుగా కాచి త్రాగవలయును. దానితో ఆ పాపము తొలగును. తడి బట్టలతో నియమముతో శ్రీమన్నారాయణుని ధ్యానించి బ్రహ్మహత్యా ప్రతమును ఆచరించినచో సురాపాన జనిత పాపము తొలగును.

బంగారమును దొంగిలించిన వాడు రాజునకు ఎదురుగా వెళ్ళి తాను చేసిన దానిని తెలిపి నన్ను మీరు శీక్షించుడు అని చెప్పవలయును. రాజు రోకలి తీసుకొని ఒకసారి కొట్టవలయును. ఆ దెబ్బతో చచ్చినచో పాపము తొలగును. రోకలినీ కానీ దండమును కచండ్రి రెండు వైపుల అంచుగల ఖడ్గమును కాని ఇనుప దండమును కాని ధరించి జుట్టు విరబోసుకొని రాజు వద్దకు వెళ్ళవలయును. నేనీ తప్పు చేసితిని. నన్ను దండించుము. అని చెప్పవలయును. రాజు దండము వలన లేదా శరీర త్యాగము వలన ఆ పాపము తోలగును. ఒకవేళ రాజు శాసించనిచో ఆ పాపము రాజు పొందును. స్వర్ణ సేయ పాపమును తపముతో తొలగించ దలచినచో నార వస్త్రములను ధరించి అరణ్యమునకు వెళ్ళి బ్రహ్మహత్యా వ్రతము నాచరించవలయును. అశ్వమేథావభృథమున స్నానము గావించిననూ పరిశుద్దుడగును. లేదా తనంత బరువుగల బంగారమును బ్రాహ్మణులకు దానము చేయవలయును. లేదా బ్రహ్మచర్యముతో ఒక సంవత్సరము కృచ్ఛవతము నాచరించవలయును.

కామ మోహితుడగు బ్రాహ్మణుడు గురు భార్యాగమనము చేసినచో నల్లని ఉక్కుతో చేయబడిన స్త్రీ మూర్తిని బాగుగా కాల్చి ఆలింగనము చేసుకొనవలయును. లేదా శిశ్నమును వృషణములను కోసి దోసిటపట్టుకొని ప్రాణములు పోవు వరకు దక్షిణ దిక్కునకు నడువవలయును. గురువు కొరకు మరణించిననూ బ్రహ్మహత్యా వ్రతము నాచరించిననూ శుద్ది పొందును. లేదా ముళ్ళతో నున్న చెట్టు కొమ్మను ఒక సంవత్సరము ఆలింగనము చేసుకొని భూమిపై పరుండవలయును. నారవస్త్రములను ధరించి నియత మానసుడై ఒక సంవత్సరము కృచ్ఛవ్రతము నాచరించవలయును. అశ్వమేథావ భృధమున స్నానము చేసిననూ పరిశుద్దుడగును. లేదా బ్రహ్మచర్య వ్రతము నాచరించుచు ప్రతి నాలుగు దీనములకు ఒకసాయంకాలము భుజించుచు మూడు దినములు ఒకే ప్రదేశమున కూర్చొని ఒకే ఆసనమున కూర్చొని జలమును మాత్రము త్రాగుచు ఇట్లు మూడు సంవత్సరములు భూశయనము గావించుచు పరిశుద్దుడగును లేదా నాలుగు కాని ఐదు కాని చాంద్రాయణ వ్రతములను ఆచరించవలయును.

ఇక ఇపుడు పతితులతో కలిసిఉండు వారికి ప్రాయశ్చిత్తమును చెప్పుచున్నాను. పతీతునితో సంబంధము కలిగి యుండు బ్రాహ్మణుడు (ద్విజుడు) ఆ పతితులు ఆచరించు ప్రతమునే ఆచరించవలయును. లేదా ఒక సంవత్సరము తప్త కృచ్చ ప్రత మాచరించవలయును. 6 నెలలు కలిసున్నచో పైన చెప్పబడిన ప్రాయశ్చిత్తమును సగ మాచరించవలయును. ఈ వ్రతముతో మహాపాతకులు కూడా పాప నిర్ముక్తులగుదురు. లేదా తీర్థయాత్రలు గావించిననూ పరిశుద్ధులగుదురు.

బ్రహ్మహత్య సురాపానము స్తేయము గుర్వంగ నాగమనము మొదలగు మహాపాతకముల నాచరించిన వారితో కలిసున్నవాడు కూడా పుణ్య తీర్థములలో నియమబద్దుడై ఉపవసించవలయును. కపర్దిని ధ్యానించుచు అగ్నిలో ప్రవేశించవలయును. ఇంతకన్నా వేరే నిష్కృతినీ ధర్మవాదులగు మునులు తెలుపలేదు. కావున పుణ్యతీర్ధములలో స్వదేహమును దహింప చేయవలయును.

బుద్ధి పూర్వకముగా కన్నకూతురిని కాని చెల్లెలును కాని కోడలినీ కాని సంగమించిన విప్రుడు అగ్ని ప్రవేశము గావించవలయును. పినతల్లినీ, మేనమామ భార్యను మేనత్తను మేనకోడలితో కాని రమించినచో కృచ్చ అతి కృచ్చ వ్రతముల నాచరించవలయును. లేదా చాంద్రాయణ వ్రతమును ఆచరించవలయును. వ్రతాచరణ సమయమున జగత్కారణుడు అనాది నిధనుడగు పరమాత్మను ధ్యానించవలయును. సోదరుని భార్యతో రమించినచో నాలుగు లేదో ఐదుచాంద్రాయణ వ్రతముల నాచరించవలయును. మేనత్త కూతురుతో కానీ తల్లి సోదరి కూతురుతో కాని సంభోగించినచో, అట్లే మేనమామ కూతురుతో కాని సంభోగించినచో చాంద్రాయణ వ్రతము నాచరించవలయును. మిత్రునీ భార్యను కాని భార్య చెల్లెలును కోని సంభోగించిన ఒక దినముపవసించి తప్త కృచ్చ ప్రతము నాచరింవలయును, రజస్వల స్త్రీలతో రమించినచో మూడు రాత్రులుపవసించవలయును, చండాల స్త్రీతో రమించినచో మూడు తప్త కృచ్ఛముల నాచరించవలయును. లేదా సాంతపన వ్రతము నాచరించ వలయును. మరియొక నిష్కృతి లేదు.

మాతృగోత్ర స్త్రీని కాని, సమాన ప్రవరయగు స్త్రీఎని కాని పొంది సావధాన మనస్కుడై నియమిత యతియే చాంద్రాయణ ప్రత మాచరించిన శుద్ధుడగును. బ్రాహ్మణుడు అగమ్యయగు బ్రాహ్మణిని పొంది ఒక కృచ్ఛ వ్రతమాచరించవలయును. కన్యను చెరచినచో చాంద్రాయణ వ్రతము నాచరించవలయును. మానవేతర స్త్రీలతో రజస్వలా స్త్రీలతో యోని భిన్నమున, జలమున రేతసేచనము జరిపినచో కృచ్ఛసాంతపనమును ఆచరించవలయును. వేశ్యా సంగమము నాచరించిన త్రిరాత్రులలో శుద్ధి పొందును. గోవు యందు మిధున ధర్మము నాచరించినచో చాంద్రాయణ వ్రతము నాచరించవలయును. గొల్లె మేక మొదలగు వాటితో సంగమించినచో ప్రాజాపత్యము నాచరించవలయును. పులసీ స్త్రీ సంభోగమున కృచ్చ చాంద్రాయణము గోచరించవలయును. నటీ నర్తకి రజకి (చాకలి) వేదురుతో చర్మముతో జీవించు స్త్రీలతో రమించినచో చాంద్రాయణ వ్రతము నాచరించవలయును.

బ్రహ్మచారి స్త్రీతో రమించినచో గాడిద చర్మమును దాల్చి ఏడిండ్లలో భిక్షాటన గోవించవలయును. తాను చేసిన పాపమును తెలుపుచు మూడు పూటలా స్నానము నాచరించవలయును. ఇట్లు ఒక సంవత్సరము చేసినచో పరిశుద్దుడగును. లేదా ఆరు మాసములు బ్రహ్మహత్యా వ్రతము నాచరించిననూ శుద్దుడగును, ఏడు దినములు సామర్థ్యమున్ననూ భిక్షాచరణమును అగ్నిపూజసము గోవించని బ్రహ్మచారి, బుద్ధి పూర్వకముగా రేతస్సించనము గావించినవాడు ప్రాయశ్చిత్తము నాచరించవలయును. నదీ తీరములలో పుణ్యతీర్దములలో ఒక సంవత్సరము శాంత మనస్కుడై పవిత్రుడై ప్రణవము మహావ్యాహృతులతో కలిసి గాయత్రిని నిత్యము జపించుచు భిక్షవలన లభించిన దానిని రాత్రిపూట మాత్రమే భుజించుచు పరిశుద్ధుడగును.

క్షత్రియుని చంపిన బ్రాహ్మణుడు బ్రహ్మహత్యా వ్రతము సోచరించవలయును. అనుకోకుండా చంపినచో 500 గోవులను దానమియ వలయును. అడవిలో ఉంటూ నీయమబద్ధుడై సావధాన మనస్కుడై ఒకసంవత్సరము ప్రాజాపత్యము కాని తప్త కృచ్ఛము కానీ సాంతపన వ్రతమును కాని ఆచరించవలయును. అనుకోకుండా వైశ్యుని చంపినచో రెండు సంవత్సరములు బ్రహ్మ హత్యా వ్రతమును ఆచరించవలయును.

గోవులను దానమీయవలయును. కచ్చాతి కృచ్చ వ్రతములను కానీ చాంద్రాయణ వ్రతమును కాని ఆచరించవలయును. పొరపాటున శూద్రుని చంపినచో ఒక సంవత్సరం బ్రహ్మహత్యా వ్రతము నాచరించవలయును. ఇద్దీ పూర్వకముగా క్షత్రియుని చంపిన 6 సంవత్సరములు వైశ్యుని చంపిన 6సంవత్సరములు, శూద్రుని చంపిన 3 సంవత్సరములు బ్రహ్మహత్యా వ్రతము నాచరించవలయును. ఇదే నియమము బ్రాహ్మణ క్షత్రియ వైశ్య స్త్రీలను చంపిన వర్తించును, శూద్ర స్త్రీని చంపిన ఒక సంవత్సరము వ్రతమాచరించిన శుద్దుడగును. పొరపాటున వైశ్య స్త్రీని వధించిన బ్రాహ్మణునికి కొద్ది దానముతో సరిపోవును. అన్యజులను వధించినచో చాంద్రాయణ వ్రత మాచరించవలయును. లేదా పరాకవ్రతముతో శుద్దీయని బ్రహ్మ తెలిపెను. కప్పను ముంగిసను కాకిని సర్పము, ఎలుక కుక్కలను వధించినచో బ్రాహ్మణుడుపై వ్రతములో 16వ వంతు ఆచరించవలయును. కుక్కను వధించినచో సావధానముగా రాత్రిపూట పాలు మాత్రము త్రాగుచు మూడు దినములు ఉండవలయును. పిల్లిని కాని ముంగిసనుకాని చంపినచో 8 మైళ్ళు అనాహారముగా నడువవలయును. అశ్వమును వధించినచో 12 రాత్రులు కృచ్చవ్రతము నాచరించవలయును. బ్రాహ్మణుడు సర్పమును వధించినచో నల్లని ఉక్కుతో చేయబడిన తీక్షాగ్రముకల దండమును దానము చేయవలయును.

 వరాహమును వధించిన ఘృతకుంభమును, తిత్తిరిపక్షనీచంపిన ఒక పుట్టి నువ్వులను, శుకమును చంపిన రెండు సంవత్సరముల ఆవుదూడను, కొంగనుచంపిన 3 సంవత్సరముల ఆవుదూడను, హంసను కాని బలాకపక్షినీ కొంగను కాని నెమలినీకాని వానరమును డేగను భాసమును వధించిన బ్రాహ్మణునకు గోదానమీయవలయును. మాంసమును భుజించుఆరణ్యక మృగములను వధించినచో పాలిచ్చు ఆవును దానమీయవలయును. మాంసమును భుజించనీ మృగములను వధించినచో ఆవుదూడను దానమియవలయును. ఒంటెను చంపినచో ఒకతులము బంగారమును దానమీయవలయును. ఎముకలు గలవాటిని చంపినచో బ్రాహ్మణునికి ఏదో కొంత దానమీయవలయును. ఎముక లేని వాటిని చంపినచో ప్రాణాయామముతో శుద్ధి అగును. పండ్లనిచ్చు చెట్లను నరుకుచో నూరు ఋక్కులను జపించవలయును. పొదలు, తీగలు, పూలచెట్లు రసములనిచ్చు చెట్లు పండ్లుపూలనీచ్చు చెట్లు వీనిని నరికినచో ఘృతప్రాశనముతో శుద్ది జరుగును. ఏనుగును చంపినచో తప్త కృచ్ఛవ్రతము నాచరించవలయును. పొరపాటున గోహత్య గావించినచో చాంద్రాయణముకాని పరాకవ్రతముకాని ఆచరించవలయును. బుద్ధిపూర్వకముగా వధించినచో ప్రాయశ్చిత్తమే లేదు.

ఇది శ్రీ కూర్మపుర్మపురాణమున షట్చాహస్రసంహితలో ఉపరివిభాగమున 32వ అధ్యాయము.