కూర్మ మహా పురాణము

Table of Contents

27వ అధ్యాయము

వ్యాస మహర్షి పలికెను

ఆయుష్యములో రెండవ భాగము వరకు అనగా 60 సంవత్సరముల వరకు గృహస్థాశ్రమములో నుండి తరువాత భార్యతో అగ్నితో వాన ప్రస్థాశ్రమమునకు వెళ్ళవలయును. లేనిచో భార్యను పుత్రులకప్పగించి ఒంటిగా అరణ్యమునకు వెళ్ళ వలయును. పుత్రుని పుత్రుని చూచీ జీర్ణ శరీరుడు ఉత్తరాయణమున శుక్లపక్షమున పూర్వాహమున అరణ్యమునకు వెళ్ళి నియమముతో తపమాచరించవలయును. ప్రతి నిత్యము పరిశుద్ధము లగు ఫలమూలములను స్వీకరించవలయును. మితవాది కావలయును. ఆ ఆహారముతోనే పితరులను దేవతలను పూజించవలయును, నిత్యము స్నానమాచరించీ అతిథిని పూజించి దేవతలను ఆరాధించవలయును. ఇంటినుండి 8 ముద్దలు తెచ్చుకొని భుజించవలయును. జటలను ధరించవలయును. నఖములను రోమములను తొలగించరాదు. ఎపుడు స్వాధ్యాయపరుదు కావలయును. ఇతర విషయముల నుండి వాక్కును నీయమీంచవలయును.

ప్రతి నిత్యము అగ్నిహోత్రమును పూజించవలయును. పంచ యజ్ఞములను ఆచరించవలయును. పవిత్రములు పలు విధములగు మున్యన్నములతో శాకమూల ఫలములతో కాని గడుపవలయును. నార బట్టలను ధరించవలయును, ప్రతిదినము మూడుపూటలా స్నానము చేయవలయును. పవిత్రునిగా ఉండవలయును. అన్ని ప్రాణులపై దయచూపవలయును. ఎవరి నుండి దేనినీ గ్రహించరాదు. దర్శ పూర్ణ మాసములలో యజ్ఞము గావించవలయును. నక్షత్రేష్టి, ఆగ్రయణము, చాతుర్మాస్య యాగములు చేయవలయును. ఉత్తరాయణ దక్షిణాయన యాగములను చేయవలయును. వసంత కాలమున శరత్కాలమున తానుగా తెచ్చిన పవిత్రములగు మున్యన్నములతో పురోడాశమును చరువును సిద్ధము చేసి యధావిధిగా హోమములను తర్పణములను చేయవలయును. అట్లు దేవతలకు ఆహుతులనిచ్చి వన్యము అయి పవిత్రమైనదీ మీగిలీ నదీ తాను భుజింపవలయును. మధు మాంసములను పరిత్యజించవలయును. భూమిలో పుట్టిన భూతృణము శిగ్రుకము శ్లేష్మాతక ఫలమును విడువ వలయును. నాగలితో దున్ని పండించిన దానిని భుజించరాదు. ఇతరులు విడిచిన దానిని భుజించరాదు. శ్రావణ విధితో అగ్నికి పరిచర్య గావించవలయును. ఏ ప్రాణికి ద్రోహము సోచరించరాదు. శీతోషాది ద్వంద్వములను సహించవలయును. భయరహితుడు కావలయును, రాత్రి పూట భుజించరాదు, ధ్యానించు చుండవలయును. ఇంద్రియములను క్రోధమును జయించి తత్త్వజ్ఞానమును చింతించుచు బ్రహ్మచారీ కావలయును. భార్యను కూడా ఆశ్రయించరాదు.

భార్యతో వనమునకేగి కామ వశముతో భార్యతో సంభోగించినచోఅతని వాసప్రస్థ వ్రతము లోపించును. ప్రాయశ్చిత్తము చేసుకొన వలయును. అట్లు పుట్టిన సంతానము ద్విజులకు తాకరానిది. అట్టివాడు వేదాధికారి కాడు. ఆ వంశము కూడా అర్హత కోల్పోవును. ఎప్పుడూ గాయత్రిని జపించుచుండవలయును. భూమిపై పరుండ వలయును. అన్ని ప్రాణులకు ఆశ్రయము నీయవలయును. దానశీలుడు కావలయును. పరనిందను అసత్యమును, నిద్రను సోమరితనమును విడువవలయును. ఏకాగ్ని, గృహశూన్యుడు కావలయును. ప్రోక్షణ చేయబడిన భూమిని ఆశ్రయించవలయును. మృగములతో కలిసి సంచరించవలయును. వాటితో కలసి నీవసించవలయును. శిలయందు కాని ఇసుకలో కాని పరుండవలయును. ఎక్కువ కాలము నిల్వఉండని ఫలమూలములను. కాని ఒక నెల వరకుండు వాటిని 6 నెలలుండు పోటీని, సంవత్సరము వరకు ఉండు ఫలమూలములను కూర్చుకొనవచ్చును. ఆశ్వయుజ మాసమున అంతకు ముందు కూర్చిపెట్టిన పోటీనీ జీర్ణ వస్త్రములను, శాక మూల ఫలములను విడువ వలయును. దంతములనే ఉలూఖలము ముసలములు రోళ్ళు రోకళ్ళుగా చేసుకొనవలయును. అనగా నోటిలోని దంతములతోనే పొట్టు తీయుట పోడి చేయుట చేయవలయును. విడిగా దంచరాదు. విసరరాదు. లేదా పావురములవలె దొరికిన ధాన్యమును మాత్రమే భుజింపవలయును. అశ్మకుట్టుడు కావలయును. అనగా రాతి మీద రాతితో దంచీ తినవలయును. కాలముతో పండిన వాటినే భుజించవలయును. పగలు సంపాదించిన అన్నాదులను రాత్రి భుజించవలయును. నాలుగవ ఝామున లేదా 8వ ఝామున మాత్రము భుజించవలయును. శుక్ల కృష్ణ పక్షములలో చాంద్రాయణసోది వ్రతముల నాచరించువాడు కావలయును. 15 దినములకొకసారి వండి తీసిన గంజి భుజించవలయును.

లేదా ఎపుడూ పుష్పములతో మూలములతో ఫలములతో మాత్రమే గడుపవలయును. వైఖానస వ్రతమును స్వీకరించవలయును. అనగా సహజముగా పండి తమంతట తాము రాలు పండ్లను మాత్రము భుజించవలయును. భూమిమీద నీలువ వలయును. తన కాళ్ళమీద శ్రానునిలబడవలయును. కూర్చోనవలయును. నిలబడవలయును. ఎక్కడా ధైర్యమును విడువరాదు. వేసవిలో పంచాగ్ని మధ్యలో నుండవలయును. వర్షాకాలమున ఆకాశము క్రిందనే వుండవలయును. హేమంతమున తడి బట్టతో ఇట్లు తపమును పెంచవలయును. మూడు వేళల స్నానము ఆచమనము గావించి పితరులను దేవతలను తృప్తి పరచగలయును. ఒంటి కాలితో నిలువ వలయును. సూర్యకిరణములనే పానము చేయ వలయును. పంచాగ్నులను సేవించవలయును. యజ్ఞ ధూమమును పానము చేయవలయును. అగ్ని వేడిని పానము చేయవలయును. సోమపానము చేయవలయును. శుక్ల పక్షమున పాలు కృష్ణ పక్షమున గోమయమును సేవించవలయును, తమంతట తాము రాలిపడిన ఆకులతోను భుజించవలయును. లేదా కృచ్చ వ్రత పరాయణుడు కావలయును. యోగాభ్యాసరతుడు రుద్రాధ్యాయి కాపలయును. అధర్వ శిరమును చదుపువాడు వేదాంతాభ్యాస తత్పరుడు కావలయును. ఎపుడూ యమ నియమములను పాలించవలయును. కృష్ణాజీనధారి ఉత్తరీయము కలవాడు, శుక్ల యజ్ఞోపవీతి కావలయును అగ్నిని తనలో ఆరోపించుకొని ధ్యానతత్పరుడై గృహ్యాగ్నిని గృహమును విడిచి మునియై మోక్షమునకై ప్రయత్న శీలి కావలయును.

తపస్వుల బ్రాహ్మణుల వద్ద భిక్షను యాచించవలయును. ఇతర గృహస్థులను వనవాసులగు ద్విజులను కూడా యాచించవచ్చును. గ్రామము నుండి 8 ముద్దలు తెచ్చుకొని అడవిలో భుజించవచ్చును. ఆకుతో కొని చేతితో కాని, మట్టిపాత్ర పగిలిన భాగముతో కానీ గ్రహించి భుజించవలయును. ఆత్మసీద్దీ కోరకు చాలా ఉపనిషత్తులను జపించవలయును. ఇతర విశేష విద్యలను గాయత్రిని రుద్రాధ్యాయమును ఆవృత్తి చేయవలయును. బ్రహ్మార్పణ విధిని అనుసరించుచు, మహా ప్రస్థానమునకై నిరాకరిగా కాని అగ్ని ప్రవేశమును కాని చేయవలయును.

శుభప్రదము అశుభనాశకము అగు ఈ వానప్రస్థాశ్రమమును చక్కగా ఆశ్రయించినవాడు పరమేశ్వరుని స్థానమగు ఆ పరమపదమును పొందును.

ఇది శ్రీ కూర్మపురాణమున షట్సాహస్రి సంహితలో ఉపరి విభాగమున 27వ అధ్యాయము