కూర్మ మహా పురాణము
22 - వంశకీర్తనమ్
సూతుడిట్లు చెప్పెను. ఇల కుమారుడైన పురూరవుడు రాజై రాజ్యమును పాలించేను. అతనికి ఇంద్రసమాన తేజులగు ఆరుగురు కుమారులు కలిగిరి.
ఆయువు, మాయువు, అమాయువు, వీర్యవంతుడైన విశ్వాయువు, శతాయువు, శ్రుతాయువు అను ఈ ఆరుగురు దివ్యులైన ఉర్వశీపుత్రులు.
వారీలో ఆయువునకు గొప్పబలముకల ఐదుగురు కుమారులు కలిగిరి. స్వర్భానువుకుమార్తె యగు ప్రభయను భార్యయందు ఆపుత్రులు పుట్టిరని మేము విన్నాము. వారిలో ధర్మము తెలిసినవాడు, లోకములో ప్రసిద్ధుడైన నహుషుడనువాడు మొదటివాడు. నహుషునికి ఇంద్రునితో సమానతేజస్సుకలిగిన - అయిదుగురు సంతానము కలిగిరి.
వారు పితృదేవతల కన్యయగు విరజయను సామెయందు జన్మించిన యాతీ, యయాతి, సంయాతి, ఆయాతి అశ్వకుడు అను గొప్ప బలవంతులు.
వారు అయిదుగురిలో యయాతి అనువాడు గొప్ప పరాక్రమము కలవాడు. అతడు శుక్రాచార్యుల పుత్రిక అగు దేవయానినీ భార్యగా పొందెను.
రాక్షసరాజైన వృషపర్వుని కూతురైన శర్మిష్ఠను కూడ పత్నిగా స్వీకరించినాడు. వారిలో దేవయాని యదు, తుర్వసులను పుత్రులుగా పొందెను.
ద్రుహ్యుంచానుడు, పూరువు అనువారికి శర్మిష్ఠ జన్మనిచ్చెను. ఆ యయాతి పెద్దవాడైన, దోషరహితుడైన యదువును అతిక్రమించి;
చిన్నవాడైన పురువునే, తండ్రిమాటను పాటించినందువలన పట్టాభిషిక్తుని చేసెను. ఆగ్నేయదిక్కునందు తుర్వసుడనుపుత్రుని పాలకుడుగా ఉండుమని ఆజ్ఞాపించెను. దక్షిణ పశ్చిమదిక్కులయందు శ్రేష్ఠుడైన యదువును రాజునియమించెను. ఉత్తర పశ్చిమభాగములలో ద్రుహ్యుంచానుని నియమించినాడు.
వారీచేత ఈభూమీ మొత్తము ధర్మము ప్రకారము పరిపాలించబడినది. గొప్పకీర్తిగలరోజుకూడ భార్యతో కూడి అడవికి వెళ్లివాన ప్రస్థము నవలంబించెను.
యదువునకు దేవకుమారునితో సమానులైన అయిదుగురు పుత్రులు కలిగిరి. సహస్రజిత్తు, క్రోష్ణువు, నీలుడు, జినుడు, రఘువు, అని క్రమముగా వారి పేర్లు.
సహస్రజిత్తు కుమారుడుగా శతజిత్తు అనురాజు పుట్టెను. ఆశతజిత్తుకు మిక్కిలి ధర్మస్వభావము కల ముగ్గురు కుమారులు కలిగిరి.
హైహయుడు, హయుడు, వేణుహయుడు అనువారు ఆ ముగ్గురు కుమారులు. వారిలో హైహయుడను వానికి ధర్ముడనుపేరుతో ప్రసిద్ధుడైన పుత్రుడు పుట్టెను.
బ్రాహ్మణులారా ఆ ధర్మునికి ప్రతాపవంతుడైన ధర్మనేత్రుడను కుమారుడు జన్మించెను. ధర్మనేత్రునకు కీర్తి అనుపుత్రుడు, అతనికి సంచీతుడను కుమారుడు కలిగిరీ,
ఆ సంచితునకు మహీష్ముడను పుత్రుడు కలిగెను. అతనికి భద్రశ్రేణ్యుడనువాడు సంతతిగా జన్మించెను. ఆభద్రశ్రేణ్యునకు దుర్గముడను పేరుగలరాజు దాయాదుడుగా పుట్టెను.
దుర్ఘమునికి బుద్ధిమంతుడు, పరాక్రమముకలవాడును అగు అంధకుడను పాడు పుత్రుడైపుట్టెను. అంధకునకు లోకమునకు అభిమాన పాత్రులైన నలుగురు కుమారులు జన్మించినారు.
కృతవీర్యుడు, కృగ్ని, కృతవర్మ, కృతౌజుడు అని ఆనలుగురి పేర్లు. నాలుగవవాడైన కృతౌజుడనువాడు కార్తవీర్యార్జునుడు అనికూడ ప్రఖ్యాతుడు.
అతడు వేయిభుజములు కలవాడు, తేజోవంతుడు, విలువిద్యనేర్చినవారిలో శ్రేష్ఠుడునై యుండెను. అతనికి విష్ణువు అవతారము, జమదగ్ని కుమారుడు అయిన పరశురాముడు మరణ కారకుడైనాడు.
ఆ కార్తవీర్యార్జునునికి వందలమంది కుమారులు కలిగిరి. వారిలో మహారథులు, అస్త్రవిద్యలనెరిగినవారు, బలవంతులు, శూరులు, ధర్మ స్వభావముకలవారు, బుద్ధిమంతులైన వారు 5 గురు ఉండిరి.
శూరుడు, శూరసేనుడు, కృష్ణుడు మరియు ధృష్ణుడు అనుపోరు ముఖ్యులు. బలవంతుడు, నారాయణుని యందు భక్తికలవాడును అగు జయధ్వజుడనువాడు కూడ వారిలో ముఖ్యుడుగా ఉండెను.
పూర్వము చెప్పబడిన శూరుడు మొదలగు నలుగురు ప్రఖ్యాతమైన బలముకలపొర్రె, గొప్పస్వభావముకలిగీ శివునియందు భక్తికలవారై, శంకరుని పూజించుచుండిరి.
బుద్దిమంతుడు, ధర్మమునందాసక్తికలవాడును అగు జయధ్వజుడు భగవంతుడగు నారాయణదేవుని శరణుపొందెను.
ఆ కార్తవీర్యుని తక్కిన కుమారులు నలుగురు జయధ్వజునితో ఇట్లనిరి. పుణ్యాత్ముడా ఇది నీకు ధర్మముకాదు. మన తండ్రి శివుని ఆరాధించుటలో శ్రద్ధకలపొడని ప్రసిద్ధికదా
గొప్పతేజస్సుకల జయధ్వజుడు వారితో ఇట్లు పలికెను. ఇది నాకు గొప్ప ధర్మము. భూమండలముమీద రాజులందరు విష్ణువు యొక్క అంశ చేత జన్మించినవారే.
రాజ్యమును పాలించువాడు తప్పక పురుషోత్తముడైన విష్ణువే. లోకములను పాలించువాడు, ఎవరిచేత జయింపబడనివాడు అగు విష్ణువు పూజింపదగినవాడు.
. ఆ ప్రభువు స్వయముగా సాత్త్వికి, రాజసి, తామసి అను మూడు మూర్తులను, సృష్టిస్థితి లయకారణభూతములైనవానిని ధరించి ఉండును.
భగవంతుడగు విష్ణువు సత్త్వస్వరూపుడై లోకములను కాపాడుచుండును. రజోగుణమూర్తి యగు బ్రహ్మ ప్రపంచమును సృజించును. తామసరూపుడగు శంకరుడు లోకములను లయముపొందించును.
అందువలన రాజ్యమును పరిపాలించుచున్న రాజులందరికి, కేశి అనురాక్షసుని చంపినవాడు, భగవంతుడు, కేశవుడు అగు విష్ణువు పూజింపదగినవాడు,
అతని మాటనువిని, బుద్ధిమంతులైన తక్కిన సోదరులు “సంహార కారకుడైన రుద్రుడు మోక్షము కోరువారిచేత పూజింపదగినవాడు” అని పలికిరి.
భగవంతుడైన యీ రుద్రుడు సమస్త విశ్వమయరూపుడు. ప్రళయకాలములో తమోగుణము నాశ్రయించి లోకములను సంహరించును.
ఈ రుద్రుని మిక్కిలిభయంకరమైన తామసరూపము గొప్పతేజోమయమైనది. ఇతడు శూలమును ధరించియుండుట చేత జ్ఞానముతో సంసారబంధమును నశింపజేయును.
అని వారు పలుకగా, రాజగు జయధ్వజుడు బాగుగా ఆలోచించి వారితో ఇట్లు పలికెను.
సత్త్వగుణముతోప్రాణికి మోక్షము లభించును. సత్త్వగుణము స్వరూపముగా కలవాడు భగవంతుడైన విష్ణువు.
అతని సోదరులు జయధ్వజునితో ఇట్లనిరి. సాత్వికగుణము గల జనులచేత సేవించబడిన శివుడు మోక్షము ప్రసాదించును. అందువలన సత్త్వగుణము కలవాడు ఎల్లప్పుడు శివుని పూజించవలెను” అని.
అప్పుడు రాజకుమారుడైన జయధ్వజుడు పెద్దగా నవ్వుచు ఇట్లు పలికెను. “మోక్షము కొరకు ఎవరికీ వారి ధర్మమే తగినది. ఇతరుల ధర్మము స్వీకరించుట మునులకు సమ్మతము కాదు.
రాజ్యభారమును వహించుచున్న విష్ణుసంబంధి శక్తిని కలిగియున్న రోజులకు, అంతులేని మహిమ కలిగిన విష్ణుమూర్తియొక్క ఆరాధనము గొప్పధర్మము.”
అది విని రాజకుమారుడైన, బుద్ధిమంతులలో శ్రేష్టుడైన కృష్ణుడను సోదరుడు అతనితో ఇట్లనెను. “మన తండ్రియగు అర్జునుడు శివారాధాన రూపమైన ధర్మము నాచరించినందున మనకది కర్తవ్యము”.
ఈ రీతిగా వారిలో వివాదము సాగుచుండగా, శూరసేనుడను సోదరుడిట్లనెను. “ఈ విషయములో మనకు ఋషులే ప్రమాణము. వారు అధర్మమును అట్లే ప్రతిపాదింతురు. కనుక ఋషుల వద్దకు వెళ్లి వారివద్ద కర్తవ్యము విషయములో ఉపదేశమును పొందుదము”.
తరువాత రాజశ్రేష్ఠులైన, బ్రహ్మవాదులగు ఆ అయిదుగురు కుమారులు గొప్ప ఉత్సాహము కలవారై, సప్తులయొక్క ఆశ్రమమునకు వెళ్లి, తమకు కలిగిన సందేహమును గూర్చి ప్రశ్నించిరి.
వసిష్టుడు మొదలగు ఆ ఋషులు రాజకుమారులతో యథార్థతత్త్వమునీట్లు చెప్పిరి. ఏ పురుషునికి ఎవరు ప్రీతిపాత్రులవుతారో ఆదేవతయే అతనికీ పూజించదగినది.
కొని, ఆయా సందర్భములలో పూజింపబడిన దేవతలు మనుష్యులకు ఇష్టసిద్ది కలిగింతురు, ఇదే చిశేషవీధి. రాజకుమారు లారా ఈ నియమము అన్నీ కొలాలకు వర్తించదు.
రాజులకు దైవతము విష్ణువు. అట్లే శివుడు, ఇంద్రుడు కూడ దేవతలే. బ్రాహ్మణులకు అగ్నిహోత్రుడు, సూర్యుడు, బ్రహ్మదేవుడు, పినాకధారీ యగు శివుడు దేవతలు.
దేవతలకు దేవుడు నారాయణుడు. రాక్షసులకు త్రిశూలధారియైన శివుడు దేవుడు. గంధర్వులకు, యక్షులకు కూడ సోముడు దేవత అని చెప్పబడినది.
విద్యాధరులకు దేవత సరస్వతి, సిద్దులకు భగవంతుడగు విష్ణువు దేవత. రాక్షసులకు దేవుడు శంకరుడగు రుద్రుడు. కిన్నరులకు పార్వతీ దేవి దేవత. ఋషులకు భగవంతుడగు బ్రహ్మ దేవత; త్రిశూలధారియైన మహాదేవుడు కూడ దేవుడు. స్త్రీలకు పార్వతీదేవి, విష్ణు, రుద్ర, సూర్యులు పూజింపదగినవారు.
గృహస్థులకు అందరు దేవతలు పూజనీయులే. బ్రహ్మచారులకు బ్రహ్మముదేవత. వైఖానసులకు సూర్యుడు దేవత. సంన్యాసులకు మహేశ్వరుడు పూజనీయదేవత,
సమస్తభూతములకు రుద్రుడు దేవత, కూష్మాండులకు వినాయకుడు అధిదేవత. దేవదేవుడు, ప్రజాపతి, భగవంతుడగు బ్రహ్మ అందరికి పూజనీయుడగు దేవత.
ఈ విధముగా భగవంతుడగు బ్రహ్మదేవుడు స్వయముగా పలికెను. అందువలన జయధ్వజుడు నిశ్చయముగా నారాయణునీ పూజించుటకు తగియున్నాడు.
కానీ శివునితోగల అభేదభావాన్ని గుర్తించి మనుష్యులచేత విష్ణువు పూజింపదగినవాడు. అట్లుకాని యెడల హరి రాజు యొక్క శత్రువును చంపకుండును.
తరువాత పోరు అతనికి నమస్కరించి మిక్కిలి మంగళకరమైన తమపట్టణమునకు వెళ్లిరి. తమ శత్రువులందరిని యుద్ధములో గెలిచి భూమిని పరిపాలించిరి.
ఓ బ్రాహ్మణోత్తములారా తరువత ఒకప్పుడు విదేహుడను పేరుకల రాక్షసుడు, సమస్త ప్రాణులకు భయమును కలిగించువాడు, వారి పట్టణమునకు వచ్చెను.
ఆ రాక్షసుడు భయంకరములైన దంతములు కలిగి, ప్రళయకాలపు అగ్నితో సమానుడై ప్రకాశించుచు సూర్యునివంటి తేజస్సుకల శూలమును తీసుకోని పదీదిక్కులను ప్రతిధ్వనింపజేయుచు వచ్చెను.
ఆ ధ్వనిని వినుటవలన అక్కడ నివసించు మానవులు భయముతో ప్రాణములు విడిచిరి. ఇతరులు భయముతో కలతచెంది పారిపోయిరి.
తరువాత కార్తవీర్యుని కుమారులు శూరసేనుడు మొదలగు అయిదుగురు గొప్పబలవంతులైన రాజులు యుద్ధమునకు బాగా సిద్ధమైరి.
వారు శక్తి, పర్వతశిఖరములు, ఖడ్గము, అను ఆయుధములతో ఆరాక్షసునెదుర్కొని యుద్ధము చేసిరి. ఓ ద్విజులారా ఆ దానవుడు వారందరినీ శూలముతో నవ్వుచు ఎదుర్కొనెను.
రాజకుమారులు యుద్ధమునకు సన్నాహము చేసికొని విదేహరాక్షసుని ఎదుర్కొనిరి. శూరుడనువాడు రౌద్రాస్త్రమును ప్రయోగించగా, శూరసేనుడు పొరుణాస్త్రమును అతనిపై ప్రయోగించినాడు.
అట్లే కృష్ణుడను వాడు ప్రాజాపత్యాస్త్రమును, ధృష్ణుడు వాయవ్యాస్త్రమును, జయధ్వజుడు కౌబేరాస్త్రమును, ఐంద్రాస్త్ర, ఆగ్నేయాస్త్రములను ప్రయోగించిరి.
ఆరాక్షసుడా అస్త్రములన్నిటిని తనశూలముతో విఫలము చేసెను. తరువాత గొప్పపరాక్రమముగల కృష్ణుడు భయంకరమైన గదను తీసుకొని.
దానిని స్పృశించినంతనే వేగముతో విసరివైచి పెద్దనాదము చేసెను. ఆగద విదేహునియొక్క రాతితో సమానమైన వక్షస్థలమును చేరుకోనీ;
యమధర్మరాజుతో సమానుడైన ఆరాక్షసుని కదలించలేకపోయెను. అతని అధికమైన పరాక్రమమును చూచి, వారందరు భయముతో కూడినవారై పారిపోయిరి.
బుద్ధిమంతుడైన జయధ్వజుడు మాత్రము లోకములకు ప్రభువు, జయశీలుడు, లోకములన్నింటి కాది పురుషుడు, జ్ఞానముతో కొలువ శక్యముకానీవాడు, దోషరహితుడును అయిన విష్ణువును స్మరించెను.
రక్షకుడు, పురాణపురుషుడు, లక్ష్మీదేవికి భర్త, పచ్చని వస్త్రము ధరించినవాడు అగు విష్ణువును స్మరించగానే, అక్కడ పదివేల సూర్యులతో సమానమైన కాంతిగల సుదర్శన చక్రము సాక్షాత్కరించెను.
భక్తులను అనుగ్రహించు స్వభావముకల విష్ణువుయొక్క ఆజ్ఞ వలన ప్రత్యక్షమైన ఆచక్రమును, రాజు ప్రపంచమునకు కారణభూతుడైన నారాయణుని స్మరించి స్వీకరించెను.
ఆ చక్రమును గ్రహించి రాజు, రాక్షసులమీదికి విష్ణువు ప్రయోగించినట్లు విదేహుని పైకి వదలేను. ఆ సుదర్శన చక్రము భయంకరుడైన ఆరాక్షసుని మూపును చేరుకొని; । అతని తలను, పర్వత శిఖరము వంటి ఆకారము కలదానిని నేలమీద పడవైచేను. దేవతల శత్రువైన విదేహుడు చంపబడగా, రాజు సోదరులు శూరుడు మొదలగు రాజులు;
ఆ చక్రమును పూర్వము విష్ణువు, తపస్సుతో శంకరుని ఆరాధించి పొందినందువలన అది రాక్షసుల సంహారమునకు కారణమైనది.
శూరుడు మొదలగు సోదరులు మనోహరమైన తమపట్టణమునకు వచ్చి చేరిదీ, తమ సోదరుడైన జయధ్వజుని పూజించిరి. జయధ్వజుని పరాక్రమమును గూర్చివిని మహాత్ముడైన 167) విశ్వామిత్ర మహాముని, కార్తవీర్యుని పుత్రుడగు అతనిని చూచుటకు వచ్చెను. తన వద్దకు వచ్చిన ఆ విశ్వామిత్రునీచూచి రాజు జయధ్వజుడు తత్తర పడిన కన్నులు కలవాడై;
అందమైన ఒక ఆసనమందుయనను కూర్చుండబెట్టి శ్రద్ధాబావముతో పూజించెను. తరువాత ఇట్లు పలికెను “మహాత్మా మీ అనుగ్రహము వలన భయంకరుడైన ఆరాక్షసుడు.
విదేహుడనువాడు నాచేత చంపబడినాడు. అతనిమాటవలన సంశయములన్నియు తొలగింపబడినవాడై, సత్యమైన పరాక్రమముకల విష్ణువును.
శరణము పొందినాను. ఆ విష్ణువుచేత నాకు మంగళదాయకమైన అనుగ్రహము చేయబడినది. పరమేశ్వరుడు, తామర రేకుల వంటి కన్నులు గల విష్ణువును యాగముతో పూజింపగలను.
భగవంతుడగు ఆ విష్ణువు ఎట్లు, ఏ పద్దతితో పూజింపదగినవాడు? మంచి నిష్ఠ కల మునీ ఈ నారాయణదేవుడెవరు? అతని ప్రభావ మెటువంటిదీ?
ఈ విషయమంతయు నాకు తెలియజెప్పుము. నాకు చాల కుతూహలమున్నది”. అను జయధ్వజుని మాటను విని శాంతుడైన ఆ విశ్వామిత్రముని, 178) నారాయణుని యందతనికున్న భక్తిని గుర్తించి ఇట్లు పలికెను.
ఎవనివలన సమస్త భూతములు ప్రవర్తించునో, ఎవనియందు సర్వముచేరి యున్నదో, ఎవని నుండి ప్రపంచము పుట్టినదో,
అతడు సర్వభూతములు ఆత్మగాకల విష్ణుదేవుడు. అతని నాశ్రయించి మోక్షమును పొందవచ్చును. గుహాశ్రయుడైన ఏ విష్ణువును, మిక్కిలి శ్రేష్ఠమైన అక్షరము కంటే ఉన్నతమైనదిగా చెప్పుదురో; .
ఆనంద స్వరూపమైన పరమాకాశ రూపుడగు అతడే నారాయణుడని పేర్కొనబడినాడు. ఎల్లప్పుడు ఉదయమునందువాడు, వికారము లేనివాడు, సదా ఆనందము ననుభవించువాడు, మాలిన్యము లేనివాడు,
ఆ విష్ణువు స్వయముగా నాలుగు వ్యూహములను ధరించువాడైనను అవ్యూహుడని చెప్పబడుచున్నాడు. అతడు పరమాత్మరూపుడు, సర్వోన్నతస్థానము, పరమాకోశము, పరమ పదరూపుడు.
బ్రహ్మజ్ఞానముకల పండితులు అతనిని త్రిపాదుడు, నాశరహితుడైన బ్రహ్మ అని చెప్పుదురు. ఆవాసుదేవుడు విశ్వమే ఆత్మగాకల, యోగ స్వరూపుడైన పురుషోత్తముడు.
బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడైన శివుడుకూడ ఎవనియొక్క అంశమువలన జన్మించిరో, పురుషోత్తముడైన ఏ విష్ణువు పురుషులకు తమతమ వర్ణాశ్రమ ధర్మముననుసరించి,
కోరికలు లేకుండా, ప్రతనియమమును భావముతో పూజింపదగినవాడో, అతడు మరోక రీతిగా పూజించుటకు తగడు. అని ఇంతమాత్రము చెప్పి గొప్పతపస్సుకల, భగవంతుడగు విశ్వామిత్రముని,
శూరుడు మొదలగువారిచేత సత్కరింపబడి తన ఆశ్రమమునకు వెళ్లెను. అనంతరము శూరాది సోదరులు మహేశ్వరుడైన దేవుని యజ్ఞముతో పూజించిరి.
యజ్ఞముచేత తెలియదగిన, నాశరహితుడైన రుద్రుని, కోరికలను వదలినవారై యజ్ఞముద్వారా అర్చించిరి. ధర్మములు తెలిసిన వసిష్ఠమహాముని వారితో యజ్ఞమును చేయించెను.
గౌతముడు, అగస్త్యుడు, అత్రి అనువారు, అందరును రుద్రుని వంటి మహిమ కలవారు. భగవంతుడగు విశ్వామిత్రుడు శత్రు విజయియైన జయధ్వజుని ద్వారా;
ఇతి శ్రీ కూర్మపురణే సోమవంశానుకీర్తనం నామ ద్వావింశోఽధ్యాయః॥
సమస్తభూతములకాదిభూతుడు, మొట్టమొదటి భగవంతుడైన నారాయణుని గూర్చి, యజ్ఞము చేయించెను. ఆజయధ్వజుని యజ్ఞములో గొప్పయోగీశ్వరుడు, సాక్షాత్తు భగవంతుడగు విష్ణువు.
ప్రత్యక్షమాయెను. ఆ సంఘటన చాలా ఆశ్చర్యకరమైనదీవలే జరిగేను. జయధ్వజుడుకూడ శివుని యొక్క శ్రేష్ఠశరీరభూతుడైన ఆ విష్ణువును ఎల్లప్పుడు పూర్వోక్తవిధముగా తెలిసికొని ప్రయత్నపూర్వకముగా పూజించేను.
ఎవడైతే ఈ జయధ్వజుని పరాక్రమవృత్తాంతమును ఎల్లప్పుడు వినునో, అతడు అన్నిపాపములనుండి విడువబడినవాడై విష్ణులోకమును పొందును”.
శ్రీ కూర్మపురాణములో సోమవంశానుకీర్తనమను ఇరువది రెండవ అధ్యాయము సమాప్తము.
