కూర్మ మహా పురాణము
47 - భువనకోశవర్ణనమ్
సూతుడిట్లు పలికెను.
కేతుమాలవర్షములో అందరుమనుష్యులు, ధృష్టులు, పనసభోజనము చేయుదురు. అక్కడి స్త్రీలు కలువపూల వంటి కాంతి కలవారు. వారు పదివేల సంవత్సరకాలము జీవింతురు.
భద్రాశ్వవరములో పురుషులు తెల్లని వారుగాను, స్త్రీలు చంద్రునివెన్నెల వలె ప్రకాశించువారుగాను ఉందురు. పోరు అన్నమును భుజించు వారై పదివేల సంవత్సరాలు జీవింతురు.
రమ్యకవర్షములో వెండివలె మెరయుచున్న స్త్రీలు, పురుషులు పదివేల సంవత్సరాలు మరియు పదునైదు వందల సంవత్సరముల కాలము విహరించుచుందురు.
హిరణ్మయ వర్షములో బంగారము వంటి శరీరముకల నరులు సత్త్వగుణముకలవారై, మజ్జిఫలములను, శ్రీఫలములను ఆహారముగా స్వీకరించుచు జీవించెదరు.
అక్కడివారు పదునొకండు వేల, పదునైదు వందల సంవత్సరాల కాలము దేవలోకమునందున్న వారివలె పురుషులు, స్త్రీలు కూడ జీవనము గడుపుదురు.
కురు వర్షములో జనులు నల్లని శరీరము కలవారై, పొలు ఆహారముగా గ్రహించుచు పదమూడువేలు మరియు పదునైదు వందల సంవత్సరములపాటు జీవింతురు.
దంపతుల జంటలన్నియు ఎల్లప్పుడు సుఖముగా జీవించుచుందురు. చంద్రద్వీపమునందు ఎల్లప్పుడు మహాదేవుడైన శివుని పూజింతురు. అట్లే కింపురుషవర్షములో మానవులు బంగారురంగు కలవారైయుందురు. వారు జువ్వి ఫలములనాహారముగా గ్రహించి పదివేల సంవత్సరాలు జీవింతురు. వారు సోలుగు శిరములు, నాలుగు చేతులు కలిగిన దేవునిగూర్చీ, ధ్యానమునందు మనస్సు నిలిపి భక్తితో కూడి ఎల్లప్పుడు గౌరవముతో పూజింతురు.
హరివర్షములో మేలయిన వెండితో సమానవర్ణము కలవారై, చెరకురసము నాహారముగా తీసికొనుచు పదివేల సంవత్సరములు జీవించేదరు.
ఆ హరి వర్షములో విశ్వమునకు కారణభూతుడు, సనాతనుడు అగు నారాయణుని దేవుని విష్ణుప్రభావితులై మానవులు సేవింతురు.
అక్కడ స్వచ్చమైన చంద్రుని, నిర్మలమైన స్పటికముతో సమానమైన వానిని, పారిజాతవనము నాశ్రయించియున్న వాసుదేవుని యొక్క విమానమును, నాలుగు ద్వారములు కలదానినీ, సాటిలేనిదానినీ, నాలుగు తోరణములతో కూడియున్నదానిని, పది ప్రాకారములతో కూడిన దేనిని, తిరస్కరించుటకు తగని దానిని, పొందుటకు మిక్కిలి కష్టసాధ్యమైన దానినీ, స్పటిక మణులతో చేయబడిన మంటపములతో కూడిన దానిని, దేవేంద్రుని స్తంభములతో అంతట అలంకరింపబడినదానిని, బంగారు మెట్లతోకూడి, బహువిధములైన మణులతో అలంకరింపబడిన దానిని, శ్రేష్టమైన సింహాసనముతో కూడినదానిని, అన్ని శోభలతో కూడినదానినీ;
రుచికరమైన జలముతోకూడిన కొలనులతో, నదులతో కూడినదానిని, సోరోయణుని యందాసక్తులై, వేదాధ్యయనపరులై, శుదులైన, విష్ణువును ధ్యానించుచున్న యోగులతో నిండియున్న దానిని, మంత్రములతో ఎల్లప్పుడు హరిని స్తోత్రము చేయుచున్న, నమస్కరించుచున్న వారితో కూడిన దానిని;
అక్కడ రాజులు,దేవాధిదేవుడు, అమితమైన తేజస్సు కలవాడు అగు విష్ణువుయొక్క మహిమను అన్ని కాలముల యందు ప్రశంసించుచుందురు.
మనోహరులగు విలాసవతులు, యౌవనముతో ప్రకాశించువారు, ఎల్లప్పుడు అలంకారములందాసక్తులైన వారగు స్త్రీలు అక్కడ పాటలు పాడుచుందురు, నృత్యము చేయుచుందురు.
ఇలావృతవర్షములో నివసించువారు పద్మము వంటి రంగు కలపోరు, జంబూఫలములను, వానీ రసమును భుజించువారు, పదమూడు వేల సంవత్సరాలు చిరాయువు కలవారుగా ఉందురు.
భారతవర్షములో స్త్రీలు, పురుషులు కూడ అనేక వర్ణములు కలిగి ఉందురు. అనేక దేవతలను పూజింతురు, అనేక కర్మలను చేయు చుందురు.
వారి పరమాయుర్దాయము నూరు సంవత్సరములు. ఈభారత వర్షము తొమ్మిదివేల యోజనముల వైశాల్యము కలిగి ఉంటుంది.
బ్రాహ్మణులారా ఇది అధికారముకల మనుష్యులకు కర్మభూమి. మహేంద్రము, మలయము, సహ్యము, శక్తిమంతము, ఋక్షపర్వతము
వింధ్యపర్వతము, పొరియాత్రము అనుఏడు ఈ వరములోకల పర్వతములు. ఇంద్రద్వీపము, కసేరుక్మము, తామ్రపర్ణము, గభస్తిమంతము, సాగద్వీపము, సౌమ్యము, గంధర్వము, వారుణము అనుద్వీపములతో పాటు ఈద్వీపము సముద్రమందున్న తొమ్మిదవ సంఖ్య కలది.
ఈ ద్వీపము దక్షిణోత్తర దిశలకు వేయి యోజనముల దూరము వ్యాపించి ఉన్నది. దీని తూర్పుదిక్కు చివరి భాగములో కిరాతులు, పడమటి కొనయందు యవనజాతీవారు నివసింతురు.
ద్వీపమధ్యభాగములో బ్రాహ్మణ క్షత్రియవైశ్యులు మరియు శూద్రజాతి జనులు నివసింతురు. ఇక్కడి వర్ణముల మానవులు క్రమముగా యజ్ఞములు, యుద్దములు, వాణిజ్యము అను వృత్తులతో జీవనము సాగింతురు. ఇక్కడ పర్వతముల నుండి బయలుదేరి ప్రవహించు పవిత్రమైన నదులు కలవు. శతద్రుపు, చంద్రభాగ, సరయు, యమున, ఇరావతి, వితస్త, విపాశ, దేవిక, కుహూ, గోమతి, ధూమపాప, బాహుద మరియు దృషద్వతీ,
కౌశికి, లోహిని అని హిమవత్పర్వత పాదప్రదేశము నుండి బయలుదేరినవి. వేదస్కృతి, వేదవతి, ప్రతఘ్నిమరియుత్రిదివ అనునది, వర్ణాశ, చందన, చర్మణ్వతి, సుర, విదిశ, నేత్రవతీ, అనునదులు పారియాత్రపర్వతము నాశ్రయించినవి. నర్మద, సురస, శోణము, దశార్ణ, మహానది, మందాకిని, చిత్రకూట, తామసి, పిశాచిక, చిత్రోత్పల, విశాల, మంజుల, పొలుపొహిని అనునవి ఋక్షవత్పర్వతము నుండి బయలుదేరునవి, మనుష్యుల అన్నీ పాపములను నశింప జేయునదులు
తాపీ, పయోష్టి, నిర్వింధ్య, శీఘ్రద అను మహానది, విన్న మరియు వైతరణీ, బలాక, కుముద్వతి, మహాగౌరి, దుర్గ, అంతశ్మిల అను నదులు వింధ్యపర్వత పాదముల నుండి బయలుదేరునవి, మనుష్యుల పాపములను వెంటనే నశింపజేయునవి.
బ్రాహ్మణోత్తములారా గోదావరి, భీమరథి, కృష్ణవేణి, వశ్యత తుంగభద్ర, సుప్రయోగ మరియు కావేరియను సహ్యాపర్వత పాద ప్రదేశమునుండి బయలుదేరిన దక్షిణాపథపునదులు. ఋతుమాల, తామ్రపర్ణి, పుణ్యవతి, ఉత్పలావతి అను నదులు మలయపర్వతను నుండి బయలు వెడలినవీ. ఇవన్నియు చల్లని నీరు కలవిగా ప్రసిద్ధములు. ఋషికుల్య, త్రిసామ అనునవి గంధమాదన పర్వతమును ఆశ్రయించి నవి.
క్షిప్ర, పలాశిని, ఋషీక మరియు వంశధారిణి అను నదులు శుక్తి మత్పర్వత పాద ప్రదేశమునుండి పుట్టినవి. అవి మనుష్యుల పాపము లన్నిటిని నశింపజేయును.
విప్రులారా ఈ నదుల యొక్క ఉపనదులు వందల కొలదిగా కలవు. అవి పుణ్యకరములైనవి. స్నానదానాది కర్మల వలన అన్ని పాపములను తొలగించును.
వానియందు, ఈకురుపాంచాలదేశముల, మధ్యదేశము మొదలగు వాని, తూర్పుదేశము మున్నగు ప్రాంతాల జనులు, కామరూప దేశమందున్న ప్రజలు పుండ్రులు, కలింగులు, మగధులు, సంపూర్ణ దక్షిణ ప్రాంతజనులు, అపరాంత దేశవాసులు, సౌరాష్ట్ర శూద్రులు, అగ్బుదులు, తక్కువ జాతి ప్రజలును
మాలకులు, మలపులు, పారియాత్ర మందు నివసించువారు, సౌవీరులు, సింధుప్రాంతీయులు, హుణులు, మాల్యులు, బాల్యులు, అక్కడ నివసించువారు.
మాద్రులు, రాములు, ఆంధ్రులు, అట్లే పారశీకులు పూర్వము పేర్కొనబడిన నదుల నీటిని త్రాగుదురు. నదీ తీరాలలో నివసింతురు. భారత పర్షములో నాలుగు యుగములను పండితులు చెప్పిరి. కృత, త్రేతా, ద్వాపర, కలియుగములని వాని పేర్లు. ఇవి వేరేచోట ఎక్కడను లేవు.
మహరులారా కింపురుష వర్షము మొదలగు ఏ యెనిమిది చెప్పబడినవో, వానిలో శోకము, ఆయాసము, ఆకలి, ఉద్వేగము ఉండవు.
అక్కడి ప్రజలు రోగరహితులై, అన్ని దుఃఖములనుండి విడువబడినవారై, మంచి స్థితి కలవారుగా, అందరును స్థిరమైన యౌవనము కలవారై వివిధభావములతో విహరింతురు.
శ్రీ కూర్మపురాణములో భువనకోశవర్ణనమను సలుబది యేడవ అధ్యాయము సమాప్తము.
