కూర్మ మహా పురాణము

Table of Contents

39వ అధ్యాయము

మార్కండేయుడు పలికెను.

నర్మదానది అన్ని నదులలోకి శ్రేష్టమైనది. సర్వపాప ప్రణాశనము. శంకరుడు, బ్రహ్మ, మునులు కూడా పూర్వకాలమున నర్మదా ప్రభావమును తెలిపిరి. సర్వోత్తమమైన నర్మదానదిని, ఋషులు స్తుతించిరి. లోకములకు హితమును చేకూర్చుసంకల్పముతో రుద్ర దేహము నుండి వెలువడినది. ఈనది సర్వపాపహరము. ఎల్లప్పుడు దేవతలందరిచేత నమస్కరించబడునది. దేవగంధర్వ అప్సరసలతో స్తుతించ బడినది. ఈ నర్మదానదికి ఉత్తరతీరమున భద్రేశ్వరమను తీర్థము మూడులోకములలో సుప్రసిద్ధము. పరమ పావనము. సర్వపాపహరము. శుభకరము. ఈ తీర్థమున స్నానము చేసినవారు స్వర్గమున దేవతలతో కలిసి విహరింతురు. ఈ తీర్థమునుండి ఆమ్రతకేశ్వరమను తీర్థమునకు వేడవలవలెను. ఇచట స్నానము చేసినవాడు, గోసహస్ర దాన ఫలమును పొందును. ఇటనుండి అంగేశ్వర తీర్దమునకు వెళ్లవలెను. ఈ తీర్థమున మనోనిగ్రహము కలిగి, నియతాహారుడైన వానికి అన్ని పాపములు తొలగి, రుద్రలోకము లభించును. ఇటనుండి కేదార తీర్థమునకు వెళ్లవలెను, ఇచట స్నానముచేసి, తర్పణము చేసిన వానికి సకల అభీష్టములు సిద్ధించును. ఇటసుండీ సర్వపాపవినాశకమగు పిప్పలేశమును చేరవలెను. ఇచట స్నానము చేసినపోడు రుద్రలోకమున ఆనందించును. ఇచటనుండి విమలేశ్వరమునకు వెళ్లవలెను. విమలేశ్వరమున దేహమును విడచినవాడు రుద్రలోకమును పొందును. ఇటనుండి పుష్కరిణికి వెళ్లి స్నానమాచరించవలెను. పుష్కరిణీ తీరములో స్నానముచేసినంత మాత్రమున, ఇంద్రుని అర్ధాసనమును పొందును.

అటనుండి సుప్రసిద్ధమైన శూలభేద తీర్థమునకు వెళ్లవలయును. ఇచట స్నానమాడి, శివుని ఆరాధించినవానికి, సహాస్రగోదాన ఫలము లభించును. అటనుండి సర్వోత్తమమైన బలి తీర్థమునకు వెళ్లవలెను. ఇచట స్నానము చేసినపోడు, రాజ్యాధిపతి యగును. నర్మదకు దక్షిణ తీరముననున్న శక్ర తీర్థమునకు వెళ్లవలెను. ఇచట స్నానమాడి ఒకరాత్రి ఉపసించి, మహాయోగీశ్వరుడగు శ్రీమన్నారాయణుని అర్చించినవాడు సహస్రగోదాన ఫలమును పొంది విష్ణులోకము చేరును. ఇచటనుండి, సర్వపాపహరమైన ఋషీ తీర్థమునకు వెడలి, స్నానమాచరించిన శివలోకము లభించును. ఇచటనే పరమ శోభనమైన నారద తీర్థము గలదు. ఈ తీర్థమున స్నానమాడీనపొడు సహసగోదాన ఫలమును పొందును. పూర్వము దేవరియగు నారదుడు ఇచ్చటనే తపమాచరించెను. అంతట ప్రసన్నుడైన హరుడు నారదునకు యోగమును ప్రసాదించెను. ఇటనుండి బ్రహ్మ శివలింగమును స్థాపించిన, బ్రహ్మేశ్వర తీర్థమునకు వెడలి స్నానము చేసినవాడు, బ్రహ్మలోకము పొందును. ఇటనుండి ఋణ తీర్థమునకు వెడలవలెను. ఈ తీర్థమును దర్శించినవానికీ ఋణవిమోచనము కలుగును. ఇటనుండి, మాహేశ్వర తీర్థము వెళ్లినవారీ జన్మధన్యము. అటనుండి సర్వవ్యాధి వినాశకరమగు భీమేశ్వర తీర్థమునకు వెళ్లవలెను. ఇందు స్నానమాడిన సర్వదుఃఖములు తొలగును.

ఇటనుండి పింగళేశ్వరమునకు పోవలెను. ఇచట ఒకదినము ఉపపోసముండుట వలన మూడుదినములుపవాసముండిన ఫలమును లభించును. ఈ తీర్థమున కపిల గోదానము చేసినచో, ఆగోవునకు, గోవు సంతానమునకు ఉన్న రోమముల సంఖ్యలో అన్ని వేల సంవత్సరములు రుద్రలోకమున నివసించును. ఈ తీర్థమున దేహాము విడచినవారు, సూర్యచంద్రులున్నంతవరకు తరగని ఆనందమును పొందుదురు. నర్మదా తీరమున నివసించువారు సుజనులు, పుణ్యాత్ములవలె, దేహమును వీడిచిన వెంటనే స్వర్గమును చేరుదురు. తరువాత వ్యాస తీర్థమని పేరుగాంచిన దీపేశ్వరమను తపోవనమునకు వెళ్లవలెను. ఇచటనే వ్యాసభగవానునికి భయపడి, నర్మద వెనుదిరిగినది. వ్యాసుని కోపమును చూచి, అచటనుండి దక్షిణ దిశకు ప్రవహించినది. ఈ తీర్థమున ప్రదక్షిణము చేయువానికి వ్యాసుడు ప్రసన్నుడై అభీష్టములు ప్రసాదించును. ఇట నుండి ఇక్షునదీ సంగమమును చేరవలయును. ఇది త్రిలోక విశ్రుతము పరమ పావనము. ఇచట ఎల్లకాలము శివుడు సన్నిహితుడై యుండును. ఈ తీర్థమున స్నానమాడినవాడు, శివుని గాణా పత్యమును పొందును. అటనుండి సర్వపాపనాశకమగు స్కంద తీర్థమునకు వేడల వలయును. ఇచట స్నానమాడిన వాడు జన్మనుండి చేసిన సకల పాపములు నశింపచేసుకొనును. ఈ తీర్థమున గంధర్వులతో కూడిన దేవతలు, దేవోత్తముడు. శంకరుని పుత్రుడు, శక్తి ధరుడు మహానుభావుడునగు. కుమార స్వామిని, సేవించుచుందురు. ఇట నుండి ఆంగిరసతీర్థము వెళ్లవలెను. ఈ తీర్ధమున స్నానమాడిన వారు సహస్ర గోదాన ఫలము పొందెదరు.

ఈ తీర్థమున, బ్రహ్మపుత్రుడగు అంగీరసుడు, వృషభధ్వజుడగు శంకరుని తపస్సుతో ఆరాధించి, ఉత్తమ యోగమును పొందెను. ఇట నుండి సర్వపాపనాశకరమగు 'కుశ' తీర్థమును చేరవలయును. ఇట స్నానమాడిన అశ్వమేథ ఫలము లభించును. ఇటనుండి అఖిలపాప నిపోరకమగు కోటి తీర్థమునకు వెడలి, స్నానమాచరించినచో రాజ్యమును పొందును. కోటి తీర్థమునుండీ, చంద్రభాగా తీర్థమునకు వెడలి స్నానము చేయవలెను. అట్లు స్నానమాడినవాడు చంద్రలోకమును పొందును. నర్మదానదికి దక్షిణ తటమున సర్వోత్తమమగు సంగమేశ్వర తీర్థము కలదు ఇచట స్నానమాడినవారు సర్వయజ్ఞ ఫలమును పొందెదరు. నర్మదా ఉత్తర తీరమున పరమ శోభనమగు 'ఆదిత్యాయతనము' అను తీర్థము గలదు. స్వయముగా శివునిచే చెప్పబడినది యీ తీర్థము. ఇచట స్నానముచేసి, యధాశక్తి దానము చేసినవాడు యీ తీర్థ ప్రభావము వలన అక్షయ ఫలము పొందును, దరిద్రులు, వ్యాధి గ్రస్తులు, పాపము నాచరించినవారు ఎవరైనను, స్నానమాత్రమున అన్నిపాపముల నుండి విడివడి సూర్యలోకమును పొందెదరు. ఇట నుండి మాధేశ్వర తీర్థమునకు వెడలి స్నానమాచరించిన స్వర్గలోకమును పొందెదరు. ఈ తీర్ణమునకు పశ్చిమమున సర్వోత్తమమైన 'మరుదలయ' తీర్థము కలదు. ఇచట స్నానము చేసి, పవిత్రుడై తనకున్న సంపదకు అనుగుణముగా సువర్ణము దానము చేసినచో, పుష్పక విమానములో వాయులోకమునకు వెళ్లును.

ఆట నుండి అహల్యా తీర్థమునకు వెడలి, స్నానము చేసినంతనే అక్షయ కాలము అప్సరసలతో ఆనందించును. చైత్ర శుక్ల త్రయోదశి నాడు కామదేవ దినమున ఈ తీర్ధమున స్నానమాడి, అహల్యను పూజించినవాడు ఎక్కడ పుట్టియున్నను ఆదేశమున అందరిలో ఉత్తముడగును. సుందరుడగును. అపరమన్మధునీవలే యువతులకు వల్లభుడగును. అటనుండి ఇంద్రుని ప్రసిద్ధతీర్థమైన అయోధ్యను చేరి, స్నానమాడి నంతనే, సహస్ర గోదాన ఫలమును పొందును. తరువాత సోమ తీర్థమును వెళ్లి స్నానము చేయవలెను. ఇందు స్నానము సర్వపాపహరము. చంద్ర గ్రహణము సమయమున సర్వపాప నాశకమగు, త్రిలోక విశ్రుతమగు, మహాఫలప్రదమగు సోమతీర్థమున, సావధానముతో, చాంద్రాయణ ప్రత మాచరించిన సర్వపాప వినిర్ముక్తుడై చంద్రలోకమును చేరును. ఈ తీర్థమున అగ్ని ప్రవేశము జల ప్రవేశము, ఉపవాసములలో దేనిని ఆచరించినను పునర్జన్మ కలుగదు. ఇట నుండి స్తంభతీర్థమునకు వెడలి స్నానమాడినంతనే చంద్రలోకమును చేరును. అటనుండి ధనీ పురమును పేరుగల సర్వోత్తమమైన విష్ణుస్థానమగు విష్ణుతీర్థమునకు వెడలపలయును. ఈ ప్రదేశమున పూర్వము వాసుదేవుడు కోట్లకొలది రాక్షసులతో యుద్ధము చేసెను. అధికకాలము విష్ణువాసమైనందున ఇది పవిత్ర తీర్థమాయెను. ఇచట ఒకదినము ఉపవాసమున్నను, బ్రహ్మ హత్యా పాతకము తొలగించుకొని, విష్ణు సంపదను పొందును. నర్మదా దక్షిణ తీరమున పరమశోభనమైన 'కామతీర్థము' గలదు. ఇచట స్నానము చేసి, ఉపవసించి, పూర్వము మన్మధుడు శివుని ఆరాధించెను. ఇట్లే ఈ తీర్థములో స్నాన ఉపవాసములు గావించినవాడు మన్మథరూపముతో రుద్రలోకమున ఆనందించవచ్చును.

ఇక్కడి నుండి సర్వోత్తమమైన బ్రహ్మతీర్థమునకు వెడలవలెను. ఇది 'ఉమాహకము' అను పేరుతో ప్రసిద్ధి గాంచిన తీర్థము. ఇచట స్నానము చేసి, పితరులకు తర్పణమీయవలెను. పూర్ణిమనాడుగాని, అమావాస్యనాడుగాని యధావిధిగా శ్రాద్దమును ఆచరించవలయును. ఇచట జలమధ్యమున గజరూపముతో ఒక శిలగలడు. వైశాఖపూర్ణిమనాడు, విశ్లేషించి ఈ శిలపై పిండప్రదానము చేయవలయును. ఇచట స్నానము చేసి, సావధాన మనస్కుడై, దంభ మాత్సర్యములు విడచి, శ్రాద్ధము నాచరించినవానికి భూమి ఉన్నంతవరకు అతని పితరులు తృప్తి చెందుదురు. ఇటనుండి సిద్దేశ్వర తీర్థమునకు వెడలి స్నానము చేసినంతనే శివగాణా పత్యము లభించును తరువాత జనార్దనుడు లింగరూపమునున్న క్షేత్రమునకు వెళ్లి, స్నానము చేసినచో, విష్ణులోకమున నీత్య నివాసముండును. ఇచటనే నారాయణ దేవుడు పరమపావనులైన మునులకు తన స్వరూపమును లింగరూపముగా దర్శనమిచ్చెను. ఇచట ఈ క్షేత్రమును దర్శించినవానికి పరమపదము లభించును. అటనుండి సర్వ పాప వినాశకమగు 'అంకోల' తీర్థమునకు వెడలి, అట చేయబడు స్నానము, దానము, బ్రాహ్మణ భోజనము, పిండప్రదానము ఇహపరములలో అనంత ఫలప్రదమగును. ఇచట రుద్రతీర్థములో చేరు' (పొంగలి) ఉడికించి, అంకోల మూలమున యధావిధిగా పిండ ప్రదానము గావించిన, పితరులు సంతోషించి, సూర్య చంద్రులున్నంతకాలము తృప్తి చెందుదురు. ఇటనుండి తాపసేశ్వర తీర్థమునకు వెళ్లవలేను. ఇట స్నానము చేసినవారు తపఃఫలమును పొందెదరు. అక్కడీనుండీ సర్వపాపవినాశకమగు శుక్ల తీర్థమునకు వెళ్లవలెను. దీనితో సమానమగు తీర్థము నర్మదా తటమున మరియొకటి లేదు. ఈ తీర్థమును దర్శించినను, స్పృశించినను, స్నానము చేసినను, దానము, తపస్సు, హెూమము ఉపవాసములలో దేనిని ఆచరించినను మహాఫలమును పొందెదరు. ఈ తీర్జవిస్తీర్ణము ఒక యోజనము. ఇది దేవగంధర్వసేవీతము. ఈ తీర్థమున గల ఏ వృక్షము చివర భాగమును దర్శించినను బ్రహ్మహత్యా పాతకము తొలగును. ఈ తీరమున ఎపుడు, పార్వతితోకూడి పరమేశ్వరుడు నివసించును.

వైశాఖ కృష్ణ చతుర్దశినాడు శంకరుడు, కైలాసమునుండి బయలుదేరి ఇచట నివసించసాగెను. ఈ తీర్థమున, దేవ, దానవ, గంధర్వ, సిద్ద, విద్యాధర, అప్సర గణము, నాగులు అందరు అన్ని వేళల నివసించి యుందురు.

రజకుడు ఉదికి వస్త్రమును శుభ్రపరచునటుల, పుట్టుకనుండి చేసిన పాపములు శుక్ల తీర్థమున పరిశుద్ధములగును. ఈ తీర్థమున చేసిన స్నానము, దానము, తపస్సు, శ్రాద్ధము అనంతఫలములిచ్చును. శుక్ల తీర్థమును మించిన తీర్థము ఇదివరకు లేదు. ఇకముందురాదు. మానవుడు అంతవరకు చేసిన అన్ని పాపములు, ఈ తీర్థమున ఒక్క దినమున ఉపవాసములో తొలగించుకొన వచ్చును. కార్తీక కృష్ణ చతుర్దశినాడు స్నానముచేసి, ఉపవసించి, శివుని ఘృతముతో స్నానము చేయించిన, ఇరువది యొక్క తరముల వరకు, శివలోకమునకు భ్రష్టులుకారు. శుక్ల తీర్థమున పొందు ఫలమును తపస్సుతోగాని, బ్రహ్మచర్యముతోగాని, యజ్ఞదానములతోగాని పొందజాలరు. శుక్ల తీర్థము మహాతీర్థము. ఇది ఋషి, గంధర్వ సేవితము. ఇచట స్నానమాడిన వానికి పునర్జన్మలేదు, దక్షిణహాయన, ఉత్తరాయణ పుణ్య కాలములలో, చతుర్దశినాడు, సంక్రమణ, విషువ కాలమున (మేషతులా సంక్రమణములో) ఈ తీర్థమున స్నానముచేసి, మనో నిగ్రహముతో, సావధానముతో, ఉపవసించి, యధాశక్తిగా దానము గావించిన హరి హరులు ప్రీతి చెందేదరు. ఈ తీర్థ ప్రభావముతో అంతయు, అక్షయమగును. అనాధుడు, దరిద్రుడు అయిన బ్రాహ్మణునిగాని, దిక్కు ఉన్న బ్రాహ్మణునికి గాని, ఈ తీర్థమున వివాహము జరిపించిన, అతనికి అతని సంతానమునకు గల రోమసంఖ్యను అనుసరించి అన్ని వేల సంఖ్యలో) సంవత్సరములు, రుద్రలోకమున ఆనందించును. ఇట నుండి, యమ తీర్థమునకు వెళ్లవలేను. మాఘకృష్ణచతుర్దశినాడు, ఇచట "స్నానముచేసి పగలు ఉపవాసమునుండి, రాత్రిభుజించిన వానికి పునర్జన్మలేదు. ఇటనుండి, 'ఇరండీ' తీర్థమునకు వెళ్లవలెను. ఇచట సంగమమున స్నానమాడి, ఉపవాసముండి, ఒక బ్రాహ్మణుని భుజింపచేసిన, కోటి బ్రాహ్మణ భోజన ఫలము లభించును. భక్తిభావము గలవాడు మృత్తికనుశిరమున ఉంచుకొని, ఈ నీటిలో మునిగి, ఐరండీ సంగమమున స్నానమాడిన, నర్మదా తీర్థ స్నానముతో సమఫలము లభించును.

ఇక్కడినుండి కార్నాటికేశ్వర తీర్థమునకు వెళ్లవలెను, పర్వదినములలో ఈ తీర్థమున గంగ అవతరించును. ఇట స్నానమాడి, జలముద్రావి, యధావిధిగా దానముచేసినవాడు, సర్వపాప వినిర్ముక్తుడై బ్రహ్మలోకమున నివసించును. అటనుండి, నంది తీర్థమునకు వెళ్లి స్నానమాచరించిన వానికి సందీశ్వరుడు ప్రసన్నుడై సోమలోకమును ప్రసాదించును. ఇట నుండి ‘అనరకమ’ ను తీర్థమునకు వెళ్లి స్నానము చేసినవాడు, నరకమును చూడడు. అస్థినిమజ్జనము చేసినవాడు రూపవంతుడు, ధనవంతుడు భోగవంతుడుఅగును. ఇటనుండీ కపిల తీర్థమునకు వెడలి స్నానము చేసినచో, సహస్రగోదానఫలమును పొందును. ఈ తీర్థమున జ్యేష్ఠమాసమున చతుర్దశీ దీనమున స్నానముచేసి ఉపవసించి, భక్తితో ఘృత దీపమును దానముచేసి, ఘృతముతో రుద్రాభిషేకము చేయించి, ఘృతముతో కలిపి త్రిఫలము (మారేడు)తో హెూమముగావించి, కంఠాభరణములతో కూడిన కపిలధేనువును దానము చేసినచో, సర్వాభరణ సంయుతుడై, సర్వదేవన మస్కృతుడై, శివతుల్యబలుడై శివలోకమున, శివునితో సమానముగా క్రీడించును.

   మరియు మంగళవారము, చతుర్దివచ్చిన రోజున విశేషముగా శివునికి అభిషేకము చేసి, బ్రాహ్మణులను, భుజింపచేసినను, సర్వభోగములను పొంది, సర్వకామనలను యిచ్చు విమానముతో, ఇంద్రభవనమునకు వెళ్లి, ఇంద్రునితో కలిసి విహరించును. తరువాత స్వర్గము నుండి మరలివచ్చి భూలోకమున ధనంవంతునిగా, భోగవంతునిగా పుట్టును. అట్లే మంగళవారముతో కూడిన నవమినాడుగాని, అమావాస్యనాడుగాని, రుద్రాభిషేకము గావించిన, రూపవంతుడు, సౌభాగ్యవంతుడు అగును. అటనుండి గణేశ్వర తీర్థమునకు వెళ్లవలెను. ఈ తీర్థమున శ్రావణ కృష్ణ చతుర్దశిన స్నానము చేసిన రుద్రలోకమున వసించును. పితృదేవతలకు తర్పణము గావించిన ఋణత్రయవిముక్తు డగును. గణేశ్వర తీర్థ సమీపమున గంగావదనమను మరొక తీరముగలదు. కోరికలు కలహారైనను, లేనివారైనను, ఈ తీర్థమున స్నానమాడిన, పుట్టినప్పటినుండి సంక్రమించిన అన్ని పాపములనుండి విముక్తుడగును. ఈ తీర్థమునకు పశ్చిమ భాగమున సమీపముననే లోకవిశ్రుతమైన దశాశ్వమేధిక తీర్థముగలదు. ఇచట ఒకదినము ఉపవాసముండి, భాద్రపద అమావాస్యస్నానముచేసి, శంకరుని పూజించిన, గంటలతో అలంకరించబడిన బంగారు విమానముతో. రుద్రపురమునకు వెళ్లి, రుద్రునితో కలిసి ఆనందించును. దశాశ్వమేధ తీర్థములో అన్నిచోట్ల అన్నీ దినములలో, స్నానము పితృ తర్పణలు గావించిన పోడు అశ్వమేధఫలమును పొందును.

ఇది శ్రీ కూర్మపురాణమున షట్ సాహస్రి సంహితలో ఉపరివిభాగమున ముప్పది తొమ్మిదవ అధ్యాయము.