కూర్మ మహా పురాణము
20వ అధ్యాయము
వ్యాస మహర్షి పలికెను.
ద్విజోత్తములు అమావాస్యనాడు భుక్తి ముక్తులను ప్రసాదించు పిండాన్వాహార్యకమను శ్రాద్దమును చేయవలయును. శ్రాద్దమును ద్విజులు అమావాస్య అపరాష్ట్రమున ఆచరించవలయును. ఈ శ్రాద్దము నాచరించుట కృష్ణప్రతిపత్ నుండి అమావాస్య వరకు ఒక చతుర్దశీ తప్ప అన్ని తిథులు మొదటి పాటికంటే తరువాతవి ప్రశస్త తరములుగా చెప్పబడినవి.
అమావాస్య, పుష్య మాఘ ఫార్జున బహుళ అష్టములు, అట్లే బహుళనవములు మఘ పూర్ణిమ శ్రాద్దమునకు పుణ్యతిథులుగా చెప్పబడినవి. వర్షర్తువులో మఘా నక్షత్ర యుక్త త్రయోదశి, పంట చేతికొచ్చు సమయమున విశ్లేషించి శ్రాద్ధ యోగ్య కాలముగా గుర్తించబడినది. ఇవి ప్రతి దీనము చేయవలసిన నిత్య శ్రాద్ధములుగా తెలియవలయును.
చంద్ర సూర్యగ్రహణ సమయమున, బాంధవుల మరణ సమయమున నైమిత్తిక శ్రాద్ధము నాచరించవలయును. అట్లు చేయనివాడు నరకమును చేరుసు. గ్రహణాది పర్వములలో కాచ్యు శ్రాద్ధములు కూడా చెప్పబడుచున్నవి. ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలములందు, మేష తులా సంక్రమణములందు, వ్యతీపాతము నందు, (వీషునమునందు) చేయబడు శ్రాద్దము కూడా అనన్త ఫల ప్రదమగును. సంక్రాంతి : సమయములందు, జన్మ దినమందు, అన్ని నక్షత్రములందు చేయబడు శ్రాద్దము అక్షయ ఫలప్రదమగును. ఈ సమయములందు విశేష రూపముగా కామ్య శ్రాద్దము నాచరించవలయును.
కృత్తికా నక్షత్రమున శ్రాద్ద మాచరించినవాడు స్వర్ణమును పొందును. రోహిణీ నక్షత్రమందాచరించిన సత్సంతానము, మృగశిరా నక్షత్రమున ఆచరించిన బ్రహ్మ తేజస్సు, ఆర్తా నక్షత్రమున ఆచరించిన రౌద్ర కర్మ సిద్ధి, శౌర్య ప్రాప్తి కలుగును. పునర్వసులో ఆచరించినచో భూమి లాభము, పుష్యమి నక్షత్రమున సంపదను ఆశ్లేషయండు సర్వకామ ప్రాప్తి, మఘ నక్షత్రమున సౌభాగ్యము లభీంచును, పుబ్బ నక్షత్రమున పాపనాశనము ఉత్తరా నక్షత్రమున ధనలాభము, హస్తా నక్షత్రమున శ్రాద్దము నాచరించిన తన బంధువులలో శ్రేష్ఠత్వమును, చిత్రా నక్షత్రమున బహుపుత్ర లాభమును, స్వాతి నక్షత్రమున వాణిజ్య సిద్ది విశాఖలో సువర్ణము లభించును. అనూరాధా నక్షత్రమున మిత్రులు, జ్యేష్ఠా నక్షత్రమున రాజ్యము లభించును. మూలా నక్షత్రమున ఆచరించినచో కృషిని, పూర్వాషాఢలో సలిపిన సముద్ర యాత్రా లాభము కలుగును. ఉత్తరాషాఢ నక్షత్రమున జరిపిన సర్వకామ్య సిద్ధి జరుగును. శ్రవణా నక్షత్రమున శ్రాద్ధము జరిపిన' శ్రేష్టత లభించును. ధనిష్ఠలో జరిపిన కామసలు లభించును. శతభిషమున జరిపిన పరమ ఫలము లభించును. పూర్వాభాద్రలో జరిపిన స్వర్ణలాభము, ఉత్తరాభాద్రలో గృహలాభము, రేవతిలో శ్రాద్ధము జరిపిన బహు గోవులు లభించును. అశ్వినిలో జరిపిన అశ్వములు, భరణిలో జరిపిన దీర్ఘాయువు లభించును.
ఆదివారము జరిపిన ఆరోగ్యము, సోమవారము జరిపిన సౌభాగ్యము, మంగళహారము అంతట విజయము, బుధవారము సర్వాభీష్ట సిద్దీ గురువారము శ్రాద్ధము జరిపిన అభీష్ట విద్యా లాభము, శుక్రవారము ధనమును శనివారము ఆయువు లభించును.
పాడ్యమి శుభపుత్రులను విదియ కన్యకలను, తదియ నందులను, చతుర్థి క్షుద్ర పశులను, పంచమి సత్పుత్రులను, షష్ఠి ద్యూతమును సప్తమి వ్యవసాయమును, అష్టమినాడు శ్రాద్దము నాచరించిన వ్యాపారమును, నవమినాడు ఒక గిట్టగల పశువులు, దశమినాడు రెండు గుట్టలు కల పశువులు ఏకాదశినాడు వెండి, బ్రహ్మతేజో వంతులగు పుత్రులు, ద్వాదశినాడు జరిపిన బంగరము వెండి ఇత్తడి, త్రయోదశినాడాచరించిన తన వారిలో ఉత్తమత్వముసు, చతుర్దశి దుష్ట సంతానము పూర్ణిమనాడు సర్వాభీష్ట సిద్ధిని పొందును.
కావున ద్విజులు చతుర్దశినాడు శ్రాద్ధమును జరుపరాదు. శస్త్రముచే చంపబడినవారి శ్రాద్ధమును చతుర్దశినాడు జరుపవలయును. ద్రవ్యములు బ్రాహ్మణులు సమకూడినచో కాలనియమముతో పనిలేదు. కావున ద్విజులు భోగ మోక్షముల కొరకు శ్రాద్ధమును జరుపవలయును.
పుత్రజన్మాది సకల శుభ కర్మల ప్రారంభమున అభ్యుదయ శ్రాద్ధము నాచరించవలయును. పర్వలలో ఆచరించునది పార్వణ శ్రాద్దమనబడును. ప్రతి నిత్యము జరుపు శ్రాద్ధము నిత్యమని కామ్యమని అనబడును. ఏ కోద్దిష్టాది శ్రాద్ధములను నైమిత్తిక శ్రాద్ధమందురు. వృద్ధి శ్రాద్ధము పార్వణ శ్రాద్దము అను ఐదు విధముల శ్రద్దములను మనువు చెప్పెను. యాత్రలలో ఆచరించు శ్రాద్దము ఆరవది. దానిని ప్రయత్న పూర్వకముగా ఆచరించ వలయును. శుద్ధి కొరకు ఏడవ శ్రాద్ధమును బ్రహ్మ చెప్పి యుండెను. దైవిక శ్రాద్ధమనబడునది ఎనిమిదవ శ్రాద్ధము ఆచరించినచో సకల భయములు తొలగును. సంధ్యా సమయమున శ్రాద్ధము నాచరించరాదు. సూర్య చంద్ర గ్రహణ సమయమున మాత్రము రాత్రి పూట కూడా శ్రాద్ధమును జరుపవచ్చును. ఆయా విశేష దేశములలో జరిపిన శ్రాద్ధములు అనంత ఫలములనిచ్చును.
గంగా తీరమున ప్రయాగలో అమర కంటకమున జరుపబడు శ్రాద్దము అక్షయ ఫలమును ప్రసాదించును. పితృదేవతలు ఇట్లు గానము చేతురు. బుద్ధిమంతులు ఇట్లు కీర్తింతురు. శీలము గుణము కల చాలా మంది పుత్రులను పొందవలయును. వీరందరిలో ఒకడైననూ గయకు వేళ్ళును. గయకు వెళ్ళి శ్రాద్ధము జరిపిన పితరులు తరింతురు. ఉత్తమ గతులను పొందెదరు. పోరాహ పర్వతమున గంగాతీరమున శంకరుడు వసించు వారాణసిలో, హరిద్వారమున ప్రభాస తీర్థమున, బిల్వ తీర్థమున, నీల పర్వతమున, కురుక్షేత్రమున, కుబ్జ తీర్థమున, భృగు తుంగమున, మరీ లయమున, కేదారమున, ఫల్గుతీర్థమున, నైమిషారణ్యమున, సరస్వతీలో, విశేషించి పుష్కరమున, నర్మదలో, కుశావర్తమున శ్రీశైలమున, భద్ర కర్ణికలో వేత్రవతిలో విపాశాలో విశేషించి గోదావరి, వీటిలో ఇంకా ఇతర తీర్థములో నీరు తాగిన నదీ ప్రదేశములో నదీ తీరములో శ్రాద్ధమును జరిపినచో పితృదేవతలు ఎపుడూ సంతోషముతో నుందురు.
ప్రీహులతో, యవలతో, మినుములతో, జలములతో, కందమూల ఫలములతో, శ్యామాకములతో యవలతో శాకములతో, నీవారముతో ప్రియంగులతో, గోధుమలతో, నువ్వులతో, పెసలతో, చేయబడు శ్రాద్ధమున పితృదేవతలు ఒక నెల తృప్తులగుదురు. మామిడి, కర్బూజ్, చెరుకు, ద్రాక్ష, దాడీమ, మంచిగుమ్మడులను శ్రాద్ధకాలమున దానమీయవలయును. తేనెకలిసిన పేలాలను శర్కర కలిసిన సత్తు పిండినీ శృంగాటకములను కశేరుకములను శ్రాద్ధమున ఈయవలయును. మత్స్య మాంసముతో రెండు మాసములు, జింక మాంసముతో మూడు నెలలు దుప్పితో నాలుగు మాసములు, పక్షి మాంసముతో అయిదు నెలలు మేష మాంసముతో 6 నెలలు, లేడి మాంసముతో ఏడు నెలలు, ఐణ మాంసముతో 8 నెలలు దుప్పి మాంసముతో 9 నెలలు పీతరులు తృప్తి చెందదరు.
వారాహ మాహీష మాంసములతో 10 నెలలు కుందేలు తాబేలు మాంసములతో 11 నెలలు, ఆవు పాలతో పాయసముతో 12 నెలలు తృప్తి పొందెదరు. నార్థాణస మాంసముతో 12 సంవత్సరములు తృప్తి కలుగును. కోలశాకము, మహా శలము, ఖడ్గమృగ మాంసము తేనె మున్యన్నములు అనంత ఫలమును ప్రసాదించును. కాని కాని స్వయముగా పొందీకాని చనిపోయిన వాటిని తెచ్చి వానిని శ్రాద్ధమున ప్రయత్న పూర్వకముగా ఇచ్చినచో అక్షయ ఫలమును పొందును. పిప్పలి, క్రముకము, ముసురము, బూడిద గుమ్మడి, సొరకాయ, వంకాయ, గరక, కుసుంభ పిండమూలము సురసము (బీరకాయ) ఉల్లి గడ్డ, బొబ్బట్లు గేదెపాలు, ఇవి శ్రాద్దములో ఉపయోగించరాదు. చుక్కకూర, గోంగూర, పాలకూర, మిరియాలు శ్రాద్ధములో సర్వ ప్రయత్నముతో విడువ వలయును.
ఇది కూర్మపురాణమున షట్సాహస్ర సంహితలో ఉపరివిభాగమున 20వ అధ్యాయము.
