కూర్మ మహా పురాణము

Table of Contents

37వ అధ్యాయము

ఋషులు ఇట్లనిరి.

సూతుడా వృషభధ్వజుడగు దేవదేవుడు శంకరుడు దారుకావనమును ఎటుల చేరవచ్చెను? విప్రశ్రేష్ఠులగు వారిని. ఎటుల మోహింప చేసెను అంతయు తెలుపనగును.

 సూతుడిట్లు పలికెను.

పూర్వము దేవసిద్ధుల సంఘములు సంచరించేడీ యీ రమ్యమగు దేషదారు వనమునందు వేలకొలదిగా మహర్షులు దారాపుత్రులతో నివాసము చేయుచు, తపము చేయుచుండిరి. ఏవిధములగు వైదికకర్మలయందు నిరతులై, వానిని యధావిధి నిర్వర్తించెడివారు. ఆ మహరులు ఎన్నో యజ్ఞములు చేసిరి. తమ తపస్సు కొనసాగించిరి.

శూలపాణియగు శంకరుడు, అచటిమునులు అందరు ప్రవృత్తిమార్గనిరతులై (తాముచేయు కర్మలవలన సాధించుకొను లౌకిక ఫలములందు ఆసక్తికలవారై యుండుట తెలిసి, వారియందలి ఆ గోప్ప దోషమును వివరించుటకన్నట్లు ఊరువనమును చేరెను. జగద్గురువగు శ్రీమన్నారాయణుని పురస్కరించుకొని, దేవదేవుడు మహేశ్వరుడగు శంకరుడు నివృత్తివిజ్ఞాన స్థాపనకై అచటికి వెళ్లాను. మహాబాహుడు, మీన ఉరస్కుడు, రమణీయనేత్రుడు " అగు త్రినేత్రుడు, ఇరువది సంవత్సరములలోపు వయస్సుగల యువకుని లావణ్యస్వరూపమును ధరించి అచటికి వెళ్ళెను.

విజ్ఞానశ్రీయుతుడు, జగదీశ్వరుడు, భగవంతుడగు శంకరుడు బంగారువన్నె మేనితో, పూర్ణచంద్రునివంటి పదనముతో, మదగజగమనముతో, దిక్కులే వస్త్రములుకాగా (దిగంబరుడై) సర్వరత్నములచే అలంకృతమైన పద్మమాలికతో, చిరునవ్వుతో చక్కని రూపుధరించి, దారువనమును చేరెను.

శూలపాణియగు శంకరుని, అసంతుడు, ఆదిపురుషుడు, సకల జగదుదయ కారణుడు, శాశ్వతుడు, హరియునగు శ్రీ మహావిష్ణువు స్త్రీ వేషమును ధరించి, అనుసరించెను. ముఖము పూర్ణచంద్రబింబమువలెనున్నది. పయోధరములు ఉన్నతములు, పీనములు. చిరునవ్వుతో ముఖము ప్రసన్నముగా వెలయుచున్నది. పాదముల అందియలు మ్రోగుచున్నవి. దివ్యమగు పచ్చని వస్త్రము అందగించుచున్నది. శ్యామవర్ణము, విశాల నేత్రములు, మదమరాళగమనము విలాసములతో, హరీ ధరించిన ఆరూపము మనసులను హరించుచున్నది.)

అట్లు తన మాయతో జగత్తును మోహింపచేయుచు, హరితోకూడినహరుడు, భగవంతుడగు ఈశ్వరుడు భిక్షకై దారువనమంతయు సంచరించెను. అందందు ఇట్లు సంచరించేది దేవదేవుని, విశ్వేశ్వరుని, పినాకపాణిని దర్శించి, ఆతని మాయచే మోహపరవశలైన స్త్రీలు, అతనిని అనుసరింపసాగిరి. వస్త్రాభరణములు అస్తవ్యస్తములగు చుండగా, స్త్రీసహజమగు సిగ్గునుకూడవదలి పతివ్రతలై యుండియు ఇపుడు కామోపవిష్టులై, కామినీవిలాసములు ప్రదర్శించుచు శంకరుని వెంబడించసాగీరీ. అంతవరకును తపోనుష్టానమున మనోనిగ్రహము సాధించుకొనిన మునుల పుత్రులు యువకులగువారు అందరు, కామప్రపీడితులై స్త్రీ వేషముననున్న హృషీకేశుని (ఇంద్రియముల నియామకుని) అనుసరించసాగిరి ఎంత చిత్రము

మాయా ప్రపంచనిర్మాతయగు అద్వితీయుడగు ఈశుని, పత్నీసమేతుని, అత్యంత సుందరతర తనుని, దర్శించి, ముని భార్యలు అందరు విలాసములతో, గానము చేసిరి. నర్తించిరి. ఆతని పొందు కోరిరి, ఆలింగనము చేసికొనిరి. ఇంక ఆపంక, ఆదిదేవుడగు పద్మాపతిని స్త్రీ, రూపమున నున్నవానిని గాంచి, మహామునుల కుమారులు పొదములపై పడిరి. చిరునవ్వులు ఒలికించిరి. గీతములు గానము చేయసాగిరి. భ్రూభంగవిలాసములతో (క్రీకురీంపు చూపులతో) వెనుకబడసాగిరి. అంతట మాయా నియామకుడు, మురారియగు 'పాసుదేవుడు స్త్రీలయందు, పురుషులయందు మనసున తిష్టవేసి, కామభోగ ప్రవృత్తిని పుట్టించెను. అందరును ఈవిధముగా పూర్తిగా 'మాయానుభవమున ప్రసరించిరి.

సకల ప్రాణికోటులకు, అమరులకు సృష్టికర్త పోషకుడునగు ఆమాధవుడు, మునికాంతలనడుమ, అనంత శక్తులు పరివేష్టించియున్న ఆసనమందు, దేవదేవుడగు శంకరునితో కూడియున్న పార్వతీదేవినలె ప్రకాశించెను. అంతట చూచువారలనందర మాయా ప్రభావమున ముంచెత్తునటుల, శంకరుడు మాటిమాటికి నృత్యము చేయసాగెను. ఈశ్వరుని మనోభావము గుర్తెరింగి, ఆది దేవుడగు హరియు శంకరుని అనుగుణముగా అనుసరింపసాగెను.

తమస్త్రీలు అందరు రుద్రుని, పుత్రులందరు కేశవుని అనుసరించునట్లు మోహింపబడుచుండగా ముని శ్రేష్ఠులందరు అత్యంత క్రోధమును పూనిరి. కపర్దియగు ఆ దేవదేవుని అతిపరుషములగు మాటలాడిరి. ఆతనిమాయచేత ప్రభావితులై వివిధ శాప వాక్యములతో శపించిరి. సూర్య ప్రకాశమువలన ఆకాశమందు తారకలు వన్నెలేక నీలిచినట్లు, శంకరునిచే వారి తపశ్శక్తి అంతయు హరించుకొని పోయినది.

ఆ విధముగా తపః ఫలము భగ్నమైన విప్రులందరు ఒక్కచోటచేరి, దేవేశుడగు వృషభధ్వజుని శంకరునీ “ఎవరు నీవు” అని, మోహపరవశులై అడుగసాగిరి. అంతనాతడు “సువ్రతులారా ఈ దేశమున (మిపలెనే) భార్యాసహితముగా నుండి తపమాచరింపవచ్చితిని” అని ఈశ్వరుడు సమాధానమిచ్చెను.

అపుడాతని మాటవినీ, భృగువు మొదలగు మునిపుంగవులు ఇట్లనిరి” వస్త్రము ధరింపుము భార్యను విడువుము. అప్పుడు తపమాచరింపుము".

అంతట పినాకపాణి, నీలలోహితుడునగు విశ్వేశ్వరుడు, సకలజగత్తునకు ఆదిబీజమగు జనార్ధనుని, తనపార్శ్వమందు (భార్యా రూపమున) నిలిచినవానిని చూచుచు వారిని ఇట్లు అడిగెను. “మీ వంటి ధర్మజ్ఞులు, శాంతమనస్కులు, నిజదారసుతాదుల పోషణయందాసక్తులగు మోచేత, భార్యను వదలి పెట్టమని ఎట్లు పలుకబడుట.

ఋషులిట్లనిరి.

మావంటి మహానుభావుల నిర్దేశము ప్రకారము, వ్యభిచారరతులగు స్త్రీలు భర్తచే వీడువబడతగినవారు. అట్లే ఈమె (నీభార్య) కూడా అట్టిదే ఆమెను విడిచివేయమగును.

మహాదేవ ఉవాచః-

శివుడిట్లు పలికెను.

విప్రులారా ఈమె ఏనాడునూ అన్యులను ఎవ్వరిని మనసులో కోరలేదు. అదే విధముగా నేనును ఏనాడును, ఎట్టి స్థితియందు ఆమెను వీడువను.

“పురుషాధమా ఈమె వ్యభిచరించుట ఇక్కడ, మాకంటబడినది. నీవు అబద్ధము చెప్పితివి. వేగమే యిటనుండి వెడలిపొమ్ము”.

ఋషులిట్లనిరి.

మునులు ఇట్లనగానే మహాదేవుడు “నేను సత్యమునే చెప్పితిని. కాని మీకు ఈమె అట్లు కనిపించవచ్చును,” అని చెప్పి, ఆండందు సంచరింపసాగెను. అంతట పరమేశ్వరుడు రమేశ్వరుని, వెంట నీడుకొని, భిక్షార్థియై, వసిష్ట మహాముని పుణ్యాశ్రమమునకు కదలిపోయెను. భిక్షాటనకై అట్లు తన ముంగిటికి అరుదెంచిన శంకరుని చూచి, వసిష్ఠమహర్షి ప్రియభార్య అరుంధతి ఎదురేగి నమస్కరించెను.

పాదములు కడిగి, ఉత్తమము, నిర్మలమగు ఆసనమును ఇచ్చి, ఇతర మునుల దేబ్బలచే, గాయపడి శిధిలమైన ఆతని శరీరమును చూచీ, విషణ్ణవధనురాలై, సతీ అరుంధతి ఔషధములతో చికిత్సచేసెను. వారిని శ్రద్దతో పూజించెను. అంతట ఆతని భార్యను స్త్రీరూపమున ఉన్న హరీని) ఇట్లడిగెను. “అమ్మా మీరెవరు? ఎందులకీటు వచ్చితిరి? మీ ఆచారవ్యవహారములేమి?”

ఆమెకు మహాదేవుడు ఇట్లు తిరిగిపలికెను. “సిద్దు లందరిలోను శ్రేష్ఠుడను నేను. నిర్మలముగా ప్రకాశించేడి యీ బ్రహ్మమయమగు మండలమే నా ఆస్పదము. దానిని నాయందే ధరించియుందును.  

ఇట్లు పలికి, మహాదేవుడు పతివ్రతయగు అరుంధతిని అనుగ్రహించి, బయలు పేడలెను. అంతట వికృత లక్షణములు కలిగి, నగ్నముగా తిరుగుచున్న శంకరునిచూచి, ద్విజులందరు, దండములతో, లోష్టములతో, ముష్టిఘాతములతో కోట్టిరి. మరల ఇట్లు పలికిరి. “దుర్మతీ నీవు నీ లింగమును, పెరికి వేయుము”, అనీ, అంతట మహాయోగిడుగు శంకరుడు 'నా లింగమంధు మికు ద్వేషము కలిగెనేని అట్టులే చేసెదను' అని పలికీ, భగుని నేత్రములు హరించిన భగవంతుడగు శంకరుడు తన లింగమును తానే పెరికివేసెను. ఆ క్షణములోనే, ఆ ఋషులు, బ్రాహ్మణోత్తములు

శంకరుని చూడలేదు. కేశవుని చూడలేదు. లింగమును చూడలేదు. లోకమునకు భయమును సూచించు మూత్రాతములు కూడా కలిగినది. సూర్యుడు ప్రకాశించజాలకపోయెను. భూమికంపించేను. గ్రహములన్నియు కాంతిని కోల్పోయినవి, సముద్రము అల్లకల్లోలమైనదీ. అత్రిపత్నియగు అనసూయ స్వప్నమును కొంచెను. అంతట ఆమె మేల్కాంచి, భయముతో కలవరము చెందిన చూపుగలదై, బ్రాహ్మణులతో యిట్లు చెప్పెను, “సకల జగత్తును తన తేజస్సుతో వెలిగింపచేయుచు, నారాయణుని సాయముతో, శివుడు భిక్షాటన చేయుచుండగా, మా యిండ్లలో కనబడెను. అనసూయ మాటలు వినిన మహరులందరు శంకించినవారై, జగత్ సృష్టికర్తయగు బ్రహ్మదగ్గరకు వెళ్లిరి. అచట బ్రహ్మజ్ఞానులు కలిగి పరిశుద్ధులైన యోగులచే ఉపాసించబడు వానిని, రూపుధరించిన నాల్గు వేదములతో, సావిత్రితో కూడుకొన్నవానినీ, పలు అద్భుతములకు నెలవైన సుందరమైన వేల కాంతుల వలయముతో, జ్ఞాన ఐశ్వర్యాదులతో కూడియున్న ఆసనమున ఆసీనుడగువానిని, తన దివ్య దేహకాంతితో భాసిల్లుపోనిని, దీప్తి వంతమైన కనులు గలవానీని మోమున చిరునవ్వు తళుకొత్తువానీని, మహాబాహుని, వేదమయుడు, అజుడు అయిన చతుర్ముఖునీ ప్రసన్న వదనునీ శుభంకరుని, వేదపురుషుడగు బ్రహ్మను చూచి, భూమిపై పడి శిరస్సులు వంచి ప్రణామము లాచరించి, స్తుతించిరి. అట్టి ఋషులను చూచి, చతుర్మూర్తి చతుర్ముఖుడైన బ్రహ్మ ప్రసన్నుడై, “ముని శ్రేష్ఠులారా మిరాకకు కారణమేమి” అని అడిగెను. ఋషులందరు చేతులు జోడించి, బ్రహ్మకు జరిగిన వృత్తాంతమంతయు తెలిపిరి.

ఋషులు ఇట్లనిరి.

“పవిత్రమైన దారువనమున అతి సుందరుడగు ఒక పురుషుడు నగ్నము? లోకోత్తర సౌందర్యవతియగు భార్యతోకలిసి ప్రవేశించెను. తన సుందర దేహముతో స్త్రీలను, మోహింపజేసెను. వారిపుత్రులను అతని ప్రియులు మోహింపచేసెను.  అంతట మేము పలురకములుగా శపించితిమి. మా శాపములన్నియు విఫలమాయెను. మేము బాగు కోట్టితీమీ, ఆతని లింగమును పడగొట్టితిమి, అంతట భార్యాసహితుడైన యతడు అంతర్ధానము చెందెను. ఆ వెంటనే, సర్వప్రాణి భయంకరములగు ఘోరములగు మహెత్పాతములు సంభవించెను. ఓ పురుషోత్తమా ఈ పురుషుడెవరు? మేము భీతిచెంది యున్నాము. అచ్యుతా నీన్ను శరణువేడుచుస్నోము ఈ ప్రపంచమున జరుగు ప్రతీ చిరు కదలిక నీకు : తేలియును. కావున మమ్ములననుగ్రహించి కాపాడుము”.

ఇట్లు మునిగణము పలుకగా జగత్స్వరూపుడగు పద్మోద్భవుడు, త్రిశూలధారియగు శంకరుని ధ్యానించి, చేతులు జోడించి యిట్లు పలికెను”.

బ్రహ్మ పలికెను.

“ఈ రోజు మీసర్వస్వము నశించినది. పెద్ద కష్టము సంభవించినది. మీ బలము వ్యర్థమైనది, మితపశ్చర్య వ్యర్థమైనది. మోహము చెందిన మీరు పుణ్యసంస్కారములను, నిధులకన్నింటికి ఉత్తమనిధిని పొంది గూడా వృధాచారములతో ఉపేక్షించితిరి. యోగులు, యతులు, తము ప్రయత్నముతో ప్రతినిత్యము కాంక్షించు నిధిని పొందికూడా మీరు ఉపేక్షించిరి, వేతనాదులు పలు యజ్ఞములతో పూజించు మహానిధిని పొందీ మీరు ఉపేక్షించితిరి. నాకు విశ్వేశ్వరత్వము ప్రసాదించిన మహానిధీని చూచి కూడా భాగ్యహీనులైన మీరు ఉపేక్షించితిరి. సకల దివ్య ఐశ్వర్యమును, తనయందు నిక్షిప్తము చేసుకొన్న, పరబ్రహ్మకు సంబంధించిన ఉత్తమనిధిని పొంది వ్యర్థపరచితిరి. మీకు కనబడిన ఆపురుషుడు మహేశ్వరుడగు మహాదేవునిగా తేలీయుడు. ఇతని పరమ పదమును ఎవరూ పొందజాలరు. దేవతలను, ఋషులను, పితృదేవతలను, కాలస్వరూపుడైన మహాదేవుడు, సహసయుగ పర్యంతము ఉండుపోరినికూడ, - ప్రళయకాలమున సంహరింప చేయును. ఇతడొక్కడే తన అద్వితీయమగు తేజస్సుతో సకల ప్రాణులను సృజించును. ఇతడే చక్రమును, వజ్రమును ధరించినవాడు. విష్ణువుతో అభేదముకలవాడు కావున శ్రీవత్సలాంఛితుడు. ఇతడే కృతయుగమున యోగిగా, త్రేతాయుగమున యజ్ఞపురుషునిగా, ద్వాపరమున కాలపురుషునిగా, కలియుగమన ధర్మకేతువుగా వ్యవహరించబడును. రుద్రుని మూడు రూపములే యీ సకల జగమును వ్యాపించియున్నవి. తమోగుణముతో అగ్ని, రజోగుణముతో బ్రహ్మ, సత్త్వగుణముతో విష్ణువుగా వ్యవహరించబడును.

ఇతని మరియొక మూర్తి దిగంబరమూర్తి. ఈ మూర్తినే శివుడందురు. ఇదియే ధృవము. శాశ్వతము. ఈ మూర్తి యందే యోగముతో కూడిన పరబ్రహ్మ నివసించియుండును. ఆ పురుషుని ప్రక్కన అతని భార్యగా మీరు చూచిన స్త్రీమూర్తి సనాతనుడు పరమాత్మయగు శ్రీ మన్నారాయణుడు. ఈ జగత్తంతయు అతని నుండే పుట్టుచున్నది. అతనియందే లయము అగుచున్నది, సకల జగత్తును అతడే మోహింప చేయుచున్నోడు, సకల జగత్తుకు అతడే పరమగతి. అతడే వేయి శిరములు, వేయి నేత్రములు, వేయి పాదములు గలవాడు ఇతను ఏకశృంగధారి, (వరాహము) పరమాత్మ, పురాణపురుషుడు. అక్షరములగు అష్టస్వరూపములు గలవాడు (అష్టాక్షరుడు) ఇతడేహం, చతుర్వేదస్వరూపుడు. ఇతడే చతుర్మూర్తి త్రిమూర్తి. త్రిగుణాత్మకుడు ఏకమూర్తి, ఇంత అని కొలువలేని స్వరూపము గలవాడు. నారాయణునిగా ప్రసిద్ధుడు. మాయతో పలు --రూపములు ధరించువాడు. జలమును తనకధారముగా స్వీకరించువాడు (సోర + అయన ధర్మమును మోక్షమును కోరువారు వివిధ బ్రాహ్మణ మంత్రములతో ఇతనినే స్తుతింతురు. ప్రళయకాలమున ఈ పురుషోత్తముడే సకల ప్రపంచమును ఉపసంహరించి, యోగామృతమును పానము చేసి నివసించు ఉత్తమ స్థానమే శ్రీమహావిష్ణువు పరమపదము. ఇతడు పుట్టడు, పెరుగడు. మరణించడు. సకలజగత్ సృష్టికర్తయితడే ఇతడే అవ్యక్తమగు మూలప్రకృతీయని వేదజ్ఞులు గానము చేయుదురు.

ప్రళయకాలము ముగిసిన తరువాత సకలజగత్తును సృష్టించదలచి, విరాట్పురుషునీ నాభిలో బీజమును నిక్షేపించునది ఈ మహేశ్వరుడే ఆ హిరణ్యగర్భుడు మీ ఎదురుగా ఉన్న నేనే నన్నే చతుర్ముఖుడు, బ్రహ్మ, మహాపురుషుడు, సకల స్థూలజల అధిష్టాతగా తెలియుదురు. ఆ మహేశ్వరుని మాయతో మోహింపబడినవారు నా జనకుని తెలియజాలరు.. నా ఉత్పత్తిమూలము, సకలభూతములకు ఈశ్వరుడు దేవదేవుడైన హరుడగు మహాదేవుడే అనాదియగు యీ మహాదేవుడే, విష్ణువుతో కలిసీ, జగత్తును సృష్టించును, లయించును. సృష్టిలయములతో అతనికి ఏమి పనీయులేదు. అతని కంటే పరమము మరియొకటి లేదు. యోగమాయా స్వరూపుడగు అతడే నాకు పూర్వము వేదముల నీచ్చేను, అతడే మాయతో కూడి జగత్ సృష్టిలయములు చేయును. అమహాదేవునీ తెలిసి, ముక్తికొరకు అతనినే శరణువేడవలెను. ఇట్లు చతుర్ముఖబ్రహ్మ

పలుకగా మరీచి మొదలగు మహారులు దేవదేవుడగు బ్రహ్మకు నమస్కరీంచి, బహు దుఃఖితులై యిట్లు అడుగసాగిరి.

మునులిట్లనిరి.

ఉభయలోకములకు ప్రభువగు బ్రహ్మదేవా శరణార్థులమగు మాకు నీవేరక్షకుడవు. ఆదేవదేవుని, పినాకపాణిని మరల మరొక్కసారి ఎటుల కనుగొన గలము? తెలుపుము.

బ్రహ్మ పలికెను.

మునులారా నేలపై పడిన పరమేశ్వరుని ఏ లింగమును మీరు చూచితిరో, అట్టి లింగాకృతిని శ్రేష్ఠమగు రూపమును నిర్మించి, గౌరవ భావముతో, బ్రహ్మచర్యము నవలంబించి, వైదీక నీయమములు పాటించుచు, భార్యాపుత్రులతో కలిసి పూజించుడు. శివలింగమును స్థాపించి, ఋగ్ యజుస్ సామవేదముల యందలి రుద్రమంత్రములతో, తపము చేయుచు, శతరుద్రీయమును సదాపఠించుచు, పుత్రులతో, బంధువులతో, ఏకాగ్రచిత్తముతో, చేతులు జోడించి పినాకపాణియగు శంకరుని శరణువేడుడు. నియతాత్ములు కానివారు భక్తులు కానివారికి దర్శింపరాని స్వామీ శంకరుని మీరు అపుడు చూడగలుగుదురు. ఆతని దర్శించి అజ్ఞానము, అధార్మిక బుద్ధీ అంతయు నశించును.

అంతట ఋషులందరు అమితతేజశ్శాలియు వరములిచ్చెడివాడగు బ్రహ్మకు నమస్కరించి, సంతుష్టమనస్కులై తిరిగి దేవదారువనమునకు వెళ్లిరి. వారు శంకరుని యథార్థతత్త్వము, రూపము తెలియనివారైనను, రాగమువీడి, మత్సరము వదిలించుకొని, బ్రహ్మ తెలిపిన విధముగా, సాధారణ సమతలముపై, నిర్మించినవేదికలపై, పర్వతముల గుహలలో, నదీ తీరములందు, ఏకాంత సైకతముల, శుభకర ప్రదేశములయందు శివుని ఆరాధింప మొదలిడిరి.

కొందరు నాచు భుజించుచు, కొందరు నీటియందు శయనముద్రతో, కొందరు బాహ్యప్రదేశమున ఆకాశముక్రింద, కొందరు పాదముల బోటన వ్రేలిషైనీలిచి, కొందరు దంతములతో ధాన్యపు గింజలు వలుచుకోనుచు, కొందరు ఫోళ్లపై ధాన్యము కొట్టుకొని తినుచు, దొరికిన శాకముల ఆకులు తినుచు కోందరు, కొందరు స్నానముచేసి సూర్యకిరణములను త్రాగుచు, వృక్షమూలముల నివసించుచు కొందరు, కొందరు శిలాతలముల నిద్రించుచు, మహేశ్వరుని పూజించుచు, కాలము గడుపసాగిరి.

అంతట ప్రపన్నులగువారీ ఆర్తిని తొలగించెడి హరుడు, వృషభధ్వజుడు శంకరభగవానుడు వారిని అనుగ్రహించదలచి, వారిని ప్రబోధించుటకు నిశ్చయించుకొనెను. కృతయుగమున, ఈ హిమాలయ శృంగమున, శుభకరమగు ప్రదేశమున, ప్రసన్నుడైన పరమేశ్వరుడు దేవదారువనమును చేరుకొనెను. అపుడాతడు భస్మము అలదుకొనుటచే తెల్లగా మెరయు శరీరముతో, నగ్నముగా నుండి, వికృత లక్షణములు కలిగి, చేతియందు మండెడు కొరవిని ధరించి, ఎరుపు పసుపు రంగుకన్నులతో నుండెను.

ఒకచోట భయంకరముగా నవ్వును. ఒకచో ఆశ్చర్యము నొందిగానము చేయును. ఒకచో శృంగారరసమును వ్యక్తపరచుచు నృత్యము చేయును. ఒకచో మాటిమాటికి ఏడ్చుచుండును. ఆశ్రమమునకువచ్చి మాటి మాటికి భిక్షాటన గావించుచుండెను. ఇట్లు తనను మాయారూపునిగా కనబరచుచు మహాదేవుడు ఆ వనమునకు వచ్చేను. గిరిసుతయగు పార్వతిని ప్రక్కనీడుకొని పీనాకపాణి వచ్చెను. ఆమెకూడా పూర్వమువలే దేవదారువనమునకు వచ్చేను. ఇట్లు పార్వతీదేవితో వచ్చిన మహాదేవుని చూచిన మునులు శిరసువంచి భూమిమీద ప్రణమిల్లి ఈశ్వరునిస్తుతించు సాగిరి. వివిధ వైదిక మంత్రములతో మహేశ్వరసూక్తముతో కొందరు. అధర్వ మంత్రములతో శతరుద్రీయములతో కొందరు స్తుతించిరి.

దేవాది దేవునకు నమస్కారము. మహాదేవునకు నమస్కారము. త్ర్యంబకునకు ఉత్తమ శూలధారికి నమస్కారము, దిగంబరునకు వికృతు నకు పినాకపాణికి నమస్కారము. నమస్కరించినవారికి ఆశ్రయభూతునకు, ఆశ్రయరహితునకు నమస్కారము. అంతకుని అంతము చేసిన వానికీ సర్వసంహారకునకు నమస్కారము. నృత్యశీలునకు భైరవమాలికి నమస్కారము. అర్ధనారీశ్వరునకు యోగి గురువు నకు నమస్కారము. దాంతునకు శాంతునకు తాపసునకు హరునకు నమస్కారము. సకల భయంకరునకు రుద్రునకు కృత్తివాసునకు నమస్కారము. లేలిపోనునకు శీతీకంఠునకు అఘోరఘోరరూపునకు వామదేవునకు నమస్కారము. కనకనూలునకు దేవీప్రియకరునకు నమస్కారము. గంగా సలిలధారునకు శంభునకు పరమేష్ఠికీ నమస్కారము. యోగాధిపతికి బ్రహ్మాధిపతికి నమస్కారము.

ప్రాణభూతునకు భస్మాంగ రాగునకు నమస్కారము. ఘనవాహునకు దంష్టికి వహ్నిరేతునకు బ్రహ్మశిరోహరునకు కాలరూపికీ నమస్కారము. నీరాకను పోకను మేము తెలియజాలము. విశ్వేశ్వరా మహాదేవా నీ స్వస్వరూపమునకు నమస్కారము. ప్రమధనాధునకు శుభసంపత్ర్పడునకు నమస్కారము. కపాలపాణికి మీఢుష్టమునకు నమస్కారము. కనకలింగునకు పొరీలింగునకు నమస్కారము. వహ్ని అర్కలీంగునకు జ్ఞాన లింగునకు నమస్కారము. భుజగహారునకు కర్ణికారప్రియునకు కీరీటికి కుండలికీ కాలకాలునకు నమస్కారము. వామదేవ మహేశానా. దేవదేవ త్రిలోచనా మోహము వలనమేము చేసిన దానిని క్షమించుడు మీరే మాకు రక్షకులు. నీ చరితము విచిత్రము. రహస్యమును బోధపడనీది. బ్రహ్మాది సకల దేవతలకు తెలియరానీవాడవు. మానవుడు అజ్ఞానముతో కానీ జ్ఞానముతోకాని చేయునదంతయు యోగమాయతో తాము చేయించునది. ఇట్లు సంతుష్టాంతరంగులై మహాదేవునిస్తుతించి నమస్కరించి మేము తమ యథాపూర్వరూపమును చూడగోరుచున్నాము అని పలికిరి.

ఇట్లు వారు చేసిన స్తోత్రమును వీని చంద్రభూషణుడు ఉమాసహితుడగు శంకరుడు తమ పరమరూపమును ప్రదర్శించేను. ఇట్లు పార్వతితో కూడిఉన్న శంకరుని దర్శించి యధాపూర్వకముగా నిలిచి సంతోషించిన మనసుతో నమస్కరించిరి. అంతట మునులందరు మహేశ్వరుని స్తుతించి, భృగు, అంగిర వసిష్ఠ, విశ్వామిత్ర, గౌతమ, అత్రి, సుకేశ, పులస్త్య, పులహ, క్రతు, మరీచి, కశ్యపులు మహాతపస్వీయగు సంవర్తుడు, దేవదేవునికి నమస్కరించి యిట్లు పలికిరి.

దేవదేవేశా నిన్ను కర్మయోగముచే, జ్ఞానయోగముచేగాని,లేదా, ఇతర ఉపాయము ఏ ఉపాయముతో పూజించవలెను నిన్ను పూజించు ఉత్తమ మార్గమేది ఈ లోకమున సేవించదగినది ఏది? వీడువతగినది ఏది?ఈ విషయమును తెలుపుడు.

శివుడు చెప్పెను.

అతి రహస్యము, దుర్బోధము, అయిన ఈ విషయము మీకు చెప్పుచున్నాను. దీనినే మొదలు బ్రహ్మకు చెప్పితిని. పురుషులకు సాధనమగు సాంఖ్యయోగము రెండు విధములుగా నుండును. ఆసక్తిలేని కర్మయోగము, జ్ఞానయోగము, ముక్తిప్రదములు. కేవల యోగముతో పరమపురుషుడు సాక్షాత్కరించడు. జ్ఞాన యోగము మాత్రము అపవర్గము నీయగలదు. మీరు కేవలము కర్మయోగము నాశ్రయించి, జ్ఞానమును విడిచిపెట్టి, ముక్తికొరకు పరిశ్రమించుచున్నారు. కావుననే నేను కేవలము కర్మయోగము నాశ్రయించుపోరికీ మోహమువలన కలుగు అనర్థమును తెలియచేయు టకు, ఇచటీకి వచ్చితిని. కావున మీరు కైవల్యసాధనమైన పరిశుద్ధమైన జ్ఞానమునకు ప్రయత్నించవలెను. తెలియవలయును. వీనవలయును. చూడవలయును. ఆత్మ ఒక్కటే, సర్వవ్యాపీ. విశుద్ధము, జ్ఞాన ఆనందస్వరూపము. నిత్యము ఇది జ్ఞాన నీషుల సిద్ధాంతము. ఇదియే పరమజ్ఞానము. ఇదే పరిశుద్ధమైన మోక్షము. దీనినే కైవల్యమని బ్రహ్మభావమని చెప్పుదురు. ఈ జ్ఞానము నాశ్రయించి, దీనియందు మాత్రమే బుద్దీనిలిపి, ఈ స్వరూపమునే ధ్యానించుచు, సకల జగత్స్వరూపునిగా యతులు నన్నుచూతురు. ఇదియే పరచు జ్ఞానము, నీరంజనము, తెలియదగినవాడను నేనే. శుభప్రదమైన మూర్తీనాదే సిద్దికి చాలా సాధనములు చెప్పబడినను, వాటన్నింటిలో సో జ్ఞానమే ఉత్తమమైనది. జ్ఞానయోగరతులు, శాంతులు, సన్నే శరణము పొందెదరు. వారు ఎపుడు హృదయమున నన్నే ధ్యానము చేయుచుందురు. నాభక్తియందే మనస్సు నిలిపీ, మనోనిగ్రహము కలిగి, సకల పాపములను తొలగించుకొందురు. అటువంటి వారికి సంసార సాగరమును నేనే తొలగింతును.

ఆజ్ఞానులు భస్మధూసరిత శరీరులై, మనోనిగ్రహము కలిగి, ప్రశాంతులై, బ్రహ్మచర్యవ్రతపరాయణులై, దిగంబరముగానుండి, పాశుపత వ్రతమును ఆచరింతురు. ఈ పాశుపత ప్రతము పరమ రహస్యము, సూక్ష్మము, వేదసారము. దీనిని నేనే ముక్తికొరకు పూర్వము ఏర్పరచితిని. లేదా కౌపీనమును ధరించినవాడుగానీ, ఏకవస్త్రధారికానీ కావలయును. వేదాభ్యాసరతుడై, నా తత్త్వమును బాగా ఎరిగి, పశుపతియగు శివుని ధ్యానించవలయును. మోక్షమును కోరువారు ఈ పాశుపత యోగమును సేవించవలయును. వీరు భస్మపూతశరీరులై కామరహితులై రాగమును, భయమును క్రోధమును వదిలిపెట్టి, నాయందే మనసు నిలిపి, నన్నే ఆశ్రయించి యుండవలయును. ఈ పాశుపత యోగముతో చాలామంది పరిశుద్ధులై, నా సారూప్యమును పొందిరి. ఇతరములైన శాస్త్రములు ఈ లోకములో జీవులను మోహింపచేయునవి, వేదపాదములకు విరుద్ధములైనవి చాలా కలవు. మోహింపచేయుటకు పోటినికూడో నేనే చెప్పితిని. వామ మార్గము, వామ పాశుపతము, సోమము, లాకులము, భైరవము, ఇంకా ఇతరములు చాలా కలవు. ఇవన్నియు వేదబాహ్యములుగా చెప్పబడినవి. వీటిని సేవించరాదు. నేను వేదమూర్తినీ. ఇతర శాస్త్రములు తెలిసినవారు, సనాతన వేదమును విడిచినవారు నన్నుతెలియజాలరు. కావున నేను చెప్పిన యీ మార్గమును చక్కగా ప్రతిష్టింపుడు. చక్కగా మహేశ్వరుని పూజింపుడు. త్వరలోనే పరమేశ్వరజ్ఞానము కలుగును. నాయందు విపులమైన భక్తికూడా కలుగుగాక మీరు ధ్యానించిన వెంటనే నేను సాక్షాత్కరించెదను. ఇట్లు పలికి, ఉమాసహితుడైన శంకరుడు అక్కడే అంతర్థానము చెందెను. ఆ ఋషులు కూడా బ్రహ్మచర్యరతులై, శాంతులై జ్ఞానయోగ పరాయణులై, బ్రహ్మవాదులై, మునులందరు కలిసి, దారువనమున శంకరుని పూజించుచుండిరి. అధ్యాత్మ జ్ఞానమునకు సంబంధించిన పలుసిద్ధాంతములను వ్యాపింపచేసిరి. “ఈ ప్రపంచమునకు మూలమేమి? మన ఆత్మయే అన్ని పదార్ధములకు కారణము ఎవరు? ఈశ్వరుడే” ఇట్లు భావించుచు ధ్యానమార్గమును అనుసరించిన ఆ మహరులకు పర్వత రాజపుత్రిక యగు మహాదేవి సాక్షాత్కరించెను.

 ఆ పార్వతీదేవి కోటిసూర్యసమానకాంతిగలది, తేజోరాశితో కూడియున్నదీ, పరిశుద్ధమైన కాంతులతో ఆకాశము నింపుచున్నది, ప్రమాణముల కందనిది, వేలతేజోరాశుల మధ్య నివసించునదగు గిరిజను చూచిన ఆమునులు, అఖిలేశపత్నికి నమస్కరించిరి. ఆమెయే మహేశ్వరుని మూలశక్తీయని వారు తెలియుదురు. ఈ పరమేశపత్ని ఆకాశనామముతో వ్యవహరించబడునది. ఈమెయే మనకు ఆత్మ. ఈమెయే గతి; జ్ఞానులైనవారు ఈమెయందే ఈ సకల ప్రపంచమును ఆత్మను చూచుచుందురు. ఇట్లు దేవిని తెలియునారు ఈ దేవి తేజః పుంజముల మధ్యన సకల జగత్కారణుడగు దేవునికూడా చూడగలరు. అతడే శంభుడు. కవి. ఈశ్వరుడు. రుద్రుడు. బ్రహ్మ, పురాణపురుషుడు; ఇట్లు దేవిని, దేవదేవుని చూచిన ఆమునులు పోరికి నమస్కరించి పరమానందము పొందిరి. అంతట మహాదేవుని అనుగ్రహమువలన జన్మనాశమునకు కారణమైన పరమేశ్వరజ్ఞానము లభించెను. ఈ దేవియే సకల జగత్తుకు ఒకేఒక మూలకారణము. ఈమేయే సర్వ స్వరూపురాలు, సర్వనియామకు రాలు. ఈ మాహేశ్వరిశక్తియే అసోసిద్దము. ఈమెయే పరమాకాశమను పేరుతో అంతరిక్షమున ప్రకాశించుచుండును.ఈమెయందు ఉన్న మహాదేవుడు, పరులకు పరుడు, పరమేష్టి, రుద్రుడు, శివుడు, మహేశ్వర నామముతో ఈ మాయా శక్తిని స్వీకరించి, (ఆశ్రయించి) సకల జగత్తును సృజించును. ఈ మహాదేవుడు అద్వితీయుడు. సర్వప్రాణులలో అంతరాత్మగా దాగి యుండువాడు  మాయను నియమించు కొనుపోడు, స్వీకరించువాడు) సవి కల్పకుడు, నిర్వికల్పకుడు. అతడే దేవికూడా దేవికంటే భిన్నముగా అతడు, అతనికంటే భిన్నముగా దేవియు ఉండజాలరు. ఇదితెలిసినపాడు మోక్షమును పొందును. మునులలో ఈజ్ఞానము కలిగిన వెంటనే, దేవాది దేవుడైన మహాదేవుడు, దేవితో కలిసి అంతర్ధానము చెందెను. వనవాసులగు ఆ మునులు ఎప్పుడు ఆ రుద్రదేవునే ఆరాధించుచుండిరి.

ఇట్లు పూర్వము దేవదారువనమున దేవదేవులనుష్టించిన వృత్తాంతమును, నేను విన్నదానిని మీకు తెలిపితిని. శ్రద్దగా దీనిని వినినవారు సర్వపాప వినిర్ముక్తులగుదురు. శాంతులైన ద్వీజులకు వినిపించినవారు పరమ పదమును పొందెదరు.

ఇది శ్రీ కూర్మపురాణమున షట్ సాహస్రసంహితలో ఉపరి విభాగమున ముప్పది యేడవ అధ్యాయము.