కూర్మ మహా పురాణము
2 – ద్వితీయాధ్యాయము
అధవర్ణాశ్రమ వర్ణనమ్ :
వర్ణాశ్రమ వర్ణనము :
కూర్మస్వామి ఇట్లు చెప్పెను :
ఓ ఋషులారా ! లోకహితకరమైన దేనిని గూర్చి నేను అడుగబడితినో, పూర్వము నాచే ఇంద్రద్యుమ్నునికి చెప్పబడినదగు దానిని చెప్పబోవుచున్నాను మీరందరు వినుడు.
గడచినవి, జరుగుచున్నవి, జరుగబోవునవి అగు చరిత్రలతో విస్తరించబడినది, మనుష్యులకు పుణ్యము నిచ్చునది, మోక్ష ధర్మమును వర్ణించునదీ ఈ పురాణము.
నేను నారాయణుడనబడు దేవుడను. నాకు ముందుగాని, తరువాత గాని ఏమియు లేకుండెను. సర్పశయనము నధిష్టించి దీర్ఘకాలికమైన నిద్ర నవలంబించి ఉంటిని.
రాత్రి గడచిన తరువాత మేలుకొని, మరల సృష్టిని గురించి ఆలోచించుచుంటిని. ఓ మునిశ్రేష్ఠులారా ! అప్పుడు నాకు అకస్మాత్తుగా అనుగ్రహబుద్ధి కలిగినది.
తరువాత చతుర్ముఖుడైన బ్రహ్మ లోకమునకు పీతామహుడైనవాడు జనించెను. అప్పుడొకానొక కారణమువలన, నాకు క్రోధము జనించినది.
ఓ మునిశ్రేష్ఠులారా! అప్పుడక్కడ మహేశ్వరుడు, శూలము చేతియందుకలవాడు, త్రినేత్రుడు, క్రోధస్వరూపుడు అయిన రుద్రుడు తనంతట తాను జన్మించినాడు.
అతడు తేజస్సుతో సూర్యునికి సమానుడై, ముల్లోకాలను దహించుచున్నట్లుండెను. అప్పుడు పద్మములవలే విశాలములైన కన్నులు గల లక్ష్మీదేవి జన్మించెను.
ఆమె చక్కని రూపముకలది, ప్రశాంతమైన ముఖముకలది, సమస్త ప్రాణులను మోహింపజేయునది, స్వచ్ఛమైన నవ్వుకలది, ప్రసన్నురాలు, మహిమలకు స్థానమైనది, మంగళరూపముకలదిగా ఉండెను.
శ్రేష్ఠమైన కాంతితో కూడినది, దివ్యమైన హారముతో ప్రకాశించునది, గొప్పమాయారూపిణి, మూలప్రకృతి అయినది, నాశములేనిది, నారాయణసంబంధము కలది ఆదేవి.
తన కాంతితో ఈ ప్రాంతాన్నినింపుచు నా ప్రక్కన కూర్చుండును. ఆమెను చూచి భగవంతుడైన బ్రహ్మ, లోకపతినైన సోతో ఇట్లనెను.
“ఓ మాధవా! సమస్త ప్రాణులను మోహింప జేయుటకు చక్కనిరూపము కల యీమెను నియమించుము. దానిచేత నాయీసృష్టి పెంపొందును.
ఆవిధముగా చెప్పబడినేను లక్ష్మీదేవిని చూచి నవ్వుచున్నట్లుగా ఇట్లు పలికితిని. “ఓదేవీ! దేవతలు, అసురులు, మనుష్యులతో కూడిన యోసమస్త ప్రపంచమును మోహింపజేసీ సో ఆజ్ఞప్రకారము సంసారములో పడవేయుము. జ్ఞాన యోగములో ఆసక్తికలవారిని, ఇంద్రియ నిగ్రహముకలవారిని, పరబ్రహ్మమందునిష్ఠ కలిగి బ్రహ్మమును గూర్చి బోధించువారిని కోపములేని వారిని, సత్యమందు అభినివేశమున్న వారినీ దూరమునుండి విడిచిపెట్టుము. ధ్యానమగ్నులైనవారినీ, మమకారములేనివారిని, శమస్వభావము కలవారినీ, ధర్మప్రవృత్తి కలవారిని, వేదములసారము తెలిసినవారిని, యజ్ఞము, తపస్సు చేయు బ్రాహ్మణులను దూరము నుండియే వదులుము. వేదములు, వేదాంతముల యొక్క విజ్ఞానముచేత నశింపజేయబడిన సమస్త సందేహములు కలవారిని గొప్పయజ్ఞములు చేయుటయందు శ్రద్దకల బ్రాహ్మణులను దూరము నుండి యే పరిహరించుము. ఎవరైతే జపములతో, హోమములతో దేవదేవుడైన మహేశ్వరుని పూజింతురో వేదాధ్యయనముతో, యాగముతో పూజించువారీని ప్రయత్నపూర్వకముగా విడువుము. భక్తి యోగముతోకూడి, ఈశ్వరుని యందర్పీంచబడిన మనస్సుకలవారిని,
ప్రాణాయామము మొదలగు పోనియందాసక్తులైనవారినీ దూరము నుండి వదిలిపెట్టుము. వారిని మోహింపజేయవద్దని భావము. వేదార్థ మందు ఆసక్తికల మనస్సున్నవారిని, రుద్రజపము చేయుటలో శ్రద్దకలవారినీ, అధర్వశిరమును గూర్చి తెలిసినవారిని, ధర్మము నెరిగిన వారిని విడిచి పెట్టుము. ఎక్కువ మాటలు చెప్పుట ఎందుకు? తమ ధర్మమును చక్కగా పాలించువారినీ, ఈశ్వరుని పూజించుటలో శ్రద్ద కలవారిని నా ఆజ్ఞవలన మోహింపజేయకుము. ఈ విధముగా మహామాయాస్వరూపిణి, విష్ణువునకు ఇష్టురాలు అగు లక్ష్మీదేవి ప్రేరేపించబడినది. ఆమె సో ఆజ్ఞ ప్రకార మాచరించినది. అందువలన లక్ష్మిని పూజించవలెను. ఆమె అధికమైన సంపదను, బలమును, తెలివిని, కీర్తిని, స్వాస్థ్యమును కలిగించును.
పూజింపబడిన ఆభగవంతుని భార్య పైన తెలిపిన ఫలములనిచ్చును కనుక ఆ లక్ష్మిని బాగుగా పూజించవలెను. తరువాత లోకపితామహుడైన బ్రహ్మ తనసృష్టిని కొనసాగించినాడు.
చరాచరములైన భూతములను నాఆజ్ఞచేత బ్రహ్మ సృష్టించినాడు. భృగువు అంగిరసులను, పులస్త్యుని, పులహుని, క్రతువును,
దక్షుని, అత్రి వసిష్ఠులను కూడ అతడు యోగవిద్యచేత సృజించినాడు. ఓ బ్రాహ్మణశ్రేష్ఠులారా! ఈ తొమ్మిది మంది బ్రహ్మయొక్క కుమారులు కనుక బ్రాహ్మణులుగా చెప్పబడుదురు.
వీరందరు బ్రహ్మవాదులే. మరీచిమొదలగు వారైతే సాధనదశలో ఉన్నవారు. ఆ బ్రహ్మ, ముఖము నుండి బ్రాహ్మణులను, భుజముల నుండి క్షత్రియులను సృజించినాడు.
తొడల నుండి వైశ్యులను, పాదముల నుండి శూద్రులను పితామహుడైన బ్రహ్మసృష్టించినాడు. అతడు యజ్ఞకర్మ నిర్వహణకొరకు, శూద్రులు కాక తక్కిన వారిని సృజించెను.
సమస్తదేవతల రక్షణకొరకు వారి నుండి యజ్ఞము నిర్వహించబడి ప్రకాశించెను. ఋక్కులు, యజుస్సులు, సామములు, అధర్వణములు అను వేదభాగములు బ్రహ్మయొక్క సహజమైన రూపము. ఈ శక్తి నిత్యమైనదీ, నాశరహితమైనది, ఆది, అంతములేనిది, దివ్యమైనది అగు వాక్కు పై వేదరూపములో బ్రహ్మచేత ఆవిష్కరింపజేయబడినది.
ఆదికాలములో లోకములోని ప్రవృత్తులన్నియు వేదమయములుగా నుండెను. తరువాత భూమియందున్న ఏయశాస్త్రములున్నవో అవి వేదములనుండీ ఏర్పడినవి.
ధీరుడైనవాడు ఆశాస్త్రములయందు ఆసక్తితో ప్రవర్తించడు. పాషణ్డుడైనవాడు మాత్రమే వానియందు శ్రద్ధవహించును. వేదార్ధము చక్కగా తెలిసిన పూర్వమునులచేత ఏది స్మృతి రూపములో చెప్పబడినదో ఆకార్యము. గొప్పధర్మముగా తెలియదగినది.” ఇతరశాస్త్రములయందు చెప్పబడినదీ అట్టిదికాదు. ఏ స్మృతులు వేదములకు విరుద్ధములో, ఏవైతే విరుద్ధదృష్టి కలిగి ఉండునో అవి అన్నియు కలరహితములు. అవి తమోగుణము ప్రధానముగా కలవిగా చెప్పబడినవి. పూర్వకల్పములో ప్రజలు అన్నీ విధముల బాధల నుండి దూరమైనవారుగా పుట్టియుండిరి.
అప్పటి జనులు నిర్మలమైన మనస్సుకలవారు, తమ ధర్మమును పరిపాలించు వారుగా ఉండిరి. తరువాత క్రమముగా వారిలో రాగము, ద్వేషము మొదలగునవి కలుగసాగినవి.
ఓ మునిశ్రేష్టులారా! అధర్మము తమ ధర్మమునకు విఘాతము కలిగించునది. అందువలన అధర్మపరులకు సహజమైన సిద్ది అధికముగా కలుగజాలదు.
వారీ సిద్ధులు రజోగుణము ప్రధానముగా కలిగిఉండును. అవి భిన్నరీతిలో ఉండును. కాలక్రమమున ఆసిద్దులు సంపూర్ణముగా క్షీణించి పోగా, జీవనోపాధిశాస్త్రమును, కర్మలవలన జనించుహస్తనైపుణ్య కళను తరువాత సృష్టించిరి. అప్పుడు ప్రభువైన బ్రహ్మ ఆసిద్దులకు కర్మల వలన జీవనోపాయ పద్ధతిని కల్పించెను.
పూర్వము స్వాయంభువ మనువు సర్వదృష్టి కలవాడై ధర్మములను బోధించేను. ఓ బ్రాహ్మణులారా! ఆనునువు స్వయముగా ప్రజాపతి అగు బ్రహ్మయొక్క రూపాంతరముగా, అతనిచే సృష్టించబడినాడు.
అతని ముఖము నుండి భృగువు మొదలగు వారు ధర్మములనువిని తరువాత ఇతరులకు చెప్పిరి. యాగములు చేయుట, చేయించుట, ఇతరులకు దానముచేయుట, దానమును స్వీకరించుట,
వేదములను చదువుట, ఇతరులకు బోధించుట అను ఈ ఆరుకర్మలు బ్రాహ్మణునికి కర్తవ్యములుగా విధించబడినవి. దానము చేయుట, వేదాధ్యయనము, యజ్ఞముచేయుట అనునవి క్షత్రియులకు, వైశ్యులకు ధర్మముగా చెప్పబడినవి.
క్షత్రియునకు, అపరాధిని దండించుట, శత్రువులతో యుద్దముచేయుట ధర్మములు. వైశ్యునీకి వ్యవసాయము ధర్మమనీ చెప్పబడినది. బ్రాహ్మణాది ద్వీజులకు శుశ్రూషచేయుటే శూద్రులకు ధర్మాచరణమని తెలియవలెను.
శిల్పకర్మ, పాకయజ్ఞము మొదలగు ధర్మముతో జీవికనుగడుపుకోనుట కూడ శూద్రధర్మము. ఇట్లు వర్ణములను నియమించిన తరువాత ఆశ్రమాలను స్థాపించినాడు.
గృహస్థ, వానప్రస్థ, సన్న్యాస, బ్రహ్మచర్యములనే నాలుగు ఆశ్రమాలను ఏర్పరచినాడు. అగ్నికార్యము, అతిథిపూజ, యజ్ఞాచరణము, దానము, దేవతాపూజ, సంగ్రహముగా ఇది గృహస్థునికి ధర్మము, ఓ మునిశ్రేష్ఠులారా! హెూమము, ఫలమూలాలనుభుజించుట, అధ్యయనము, తపస్సు,
న్యాయముతప్పక సంవిభాగము అనునవి పొనప్రస్థులకు ధర్మములు. భీక్షతో ఆహారసంపాదనము, మౌనమవలంబించుట, ఎక్కువగా ధ్యానము, తపస్సు శ్రేష్ఠమైన జ్ఞానము, వైరాగ్యము అనునవి సన్యాసికి ధర్మములు. భీక్షచేయుట, గురువును సేవించుట, వేదాధ్యయనము. సంధ్యావందనము, ఔపాసనము - ఇవి బ్రహ్మచారుల ధర్మములు. బ్రహ్మచారులకు, వానప్రస్థులకు, సన్యసించినవారికి ఈముగ్గురికి, బ్రహ్మచర్యమనునది సాధారణధర్మమని బ్రహ్మదేవుడు చెప్పినాడు. ఋతుకాలములందు తనభార్యతో సంయోగముపొందుట, ఇతర స్త్రీలకు దూరముగానుండుట. పర్వదినములయందు స్వపత్నీసంయోగముకూడా విడువదగును. తనభార్య గర్భము ధరించినప్పటి నుండి గృహస్థుడు బ్రహ్మచర్యము నవలంబించవలెనని దేవుని ఆజ్ఞ. పొరపాటు లేకదానిని పాటించవలెను.
ఓ బ్రాహ్మణ వర్యులారా! ఆవిధముగా ధర్మపాలనముచేయనివాడు భ్రూణ హత్యచేసినవాడగును. ప్రతిదినము వేదమునభ్యసించుట, శక్తిననుసరించి శ్రాద్ధము, అతిథిపూజ జరుపుట. దేవతలను పూజించుట అనునవి గృహస్థునికి ముఖ్యమైన ధర్మకర్మకార్యములు. మరియు ప్రాతస్సాయంకాలములందు వీధిప్రకారము గార్హపత్యాగ్నితో అగ్నికార్యము జరుపవలెను.
దేశాంతరమునకు వెళ్ళినప్పుడు కాని, లేక భార్యచనిపోయిన కాని గార్హపత్యాగ్నిలో హోమము జరుపవలెను.
బ్రహ్మచారి మొదలగు మూడు ఆశ్రమాల వారికి గృహస్థుడు మూలభూతుడని చెప్పబడును.
అతని నాశ్రయించి తక్కిన వారు బ్రతుకుచున్నారు. అందువలన అతడుశ్రేష్ఠుడు, దములో చెప్పిన ప్రకారము గృహస్థుడు నాలుగాశ్రమాల సమాహార రూపుడని చెప్పవచ్చును.
అందువలన గృహస్థాశ్రమ మొక్కటే ప్రధానముగా ధర్మసాధనమనీ తెలీయదగినది. ధర్మమును విడచిన అర్థకామములను తప్పక పరిత్యజించ వలెను.
సమస్తలోకమునకు విరుద్ధముగా ఉన్న ధర్మమును కూడ ఆచరింపవద్దు, ధర్మము నుండి అర్థము కలుగును. ధర్మము నుండి కామము కూద ఏర్పడును.
మోక్షము కొరకు గూడ ధర్మమే ఉపయుక్తమగును. అందువలన ధర్మము నాశ్రయించవలెను. ధర్మము, అర్ధము, కామము అను మూడు త్రివర్గము, త్రిగుణాత్మకము అని చెప్పబడినది.
ఆ మూడు గుణములు సత్త్వము, రజస్సు, తమస్సు అనునవి. అందువలన ధర్మము నాశ్రయించవలెను. సత్త్వగుణము ధరించినవారు ఊర్ధ్వలోకములకేగుదురు, రజోగుణ వంతులు మధ్యలో నిలుతురు.
నీచమైన తమోగుణము ప్రధానముగా కలవారు అధోలోకములను పొందుదురు. ఎవనియందు ధర్మయుక్తమైన అర్థకామములు నీలిచీ యుండునో అతడు ఈ లోకములో సుఖముగా జీవించి, మరణానంతరము అనంతత్వరూపముక్తిని పొందును. ధర్మము వలన మోక్షము కలుగును. అర్ధము వలన కామము సంభవించును. ఏవం సాధన సాధ్యత్వం చాతుర్విధ్యే ప్రదర్శితమ్ య ఏవం వేద ధర్మార్థకామమోక్షస్య మానవః
ఈ ప్రకారముగా సాధనసాధ్యభావము నాలుగు విధాలుగా చూపించబడినది. ఏమానవుడు ధర్మార్థకామమోక్షముల స్వరూపమును తెలుసు కొనునో, వాని మాహాత్మ్యమును గుర్తించి అనుష్ఠించునో, వాడు మోక్షమును పొందును. అందువలన అర్థమును కామమును వదిలి ధర్మము నాశ్రయించవలెను.
ధర్మము వలన సమస్తము సిద్ధించునని బ్రహ్మజ్ఞానము కలవారు చెప్పుదురు. ధర్మముచేత స్థావర, జంగమరూపమైన సమస్త ప్రపంచము మోయబడుచున్నది.
బ్రాహ్మణ శ్రేష్టులారా! ఇది బ్రాహ్మీశక్తి. దీనికి ఆది, అంతము లేవు. ఈ ధర్మము కర్మమార్గముచేత పొందబడును; జ్ఞానయోగముచేత గూడ లభించును. సందేహము లేదు.
అందువలన జ్ఞానముతో కూడిన కర్మయోగము నాశ్రయించవలెను. వైదీక కర్మజాతము ప్రవృత్తము, నివృత్తము అని రెండు విధములుగా ఉండును.
జ్ఞానపూర్వకమైన కర్మ నివృత్తమనబడును. దానీకంటే ఇతరమైనది ప్రవృత్తకర్మ. నివృత్తకర్మ ననుష్ఠించువాడు సర్వోన్నతమైన స్థానమును పొందును.
అందువలన నివృత్తకర్మ సేవించదగినది. లేనియెడల మరల సంసారములో పడిపోవును. ఓర్పు, ఇంద్రియనిగ్రహము, దయ, దానగుణము, దురాశలేకపోవుట, త్యాగము.
ఋజు స్వభావము, అసూయలేకుండుట, పుణ్యతీర్థములను అనుసరించుట, సత్యవాదిత్వము, సంతోషముగా ఉండుట, వేదములయందు, దైవమునందు నమ్మకము కలిగియుండుట, శ్రద్ద, ఇంద్రియనిగ్రహము, దేవతలను పూజించుట, బ్రాహ్మణులను విశేషముగా గౌరవించుట, హింసచేయకపోవుట, ప్రీయముగా మాటలాడుట, పీసీసోరీ తనములేకుండుట. నాలుగు వర్ణముల వారికి, ఈ పైన తెలిపిన వన్నియు సామూహిక ధర్మముగా మనువు చెప్పినాడు. అనుష్టాన పరులైన బ్రాహ్మణులకు ప్రాజాపత్యము స్థానముగా తెలుపబడినది.
యుద్ధరంగమునుండీ పలాయనము చేయని క్షత్రియులకు ఐంద్రమనుస్థానము, తమధర్మాన్ని అనుసరించి ప్రవర్తించు వైశ్యులకు మారుతస్థానము ఏర్పరచబడినది.
పరిచర్యాక్రియతో వర్తించే శూద్రజాతి వారికి గాంధర్వస్థానము నియమించబడినది. ఊర్ధ్వరేతస్కులైన పదునెనిమిది వేల ఋషులకు, ఏ స్థానము చెప్పబడినదో అదే గురుకుల పోసముచేయు బ్రహ్మచారులకు గూడ వర్తించును. సప్తరులకు ఏ స్థానము నీయమింపబడినదో అదే పోనప్రస్థులకు గూడ వర్తించును.
గృహస్థులకు ప్రాజాపత్యమను స్థానము బ్రహ్మచేత చెప్పబడినది. మనస్సును జయించినవారు, ఊర్థ్వరేతస్కులు అగు సన్న్యాసులకు, దేని నుండి మరల వెనుకకు వచ్చుట ఉండదో అటువంటి హిరణ్యగర్భ సంబంధమైన స్థానము,యోగులకు వ్యోమమను పేరుగల నాశరహితమైన అమృతస్థానము కల్పించబడినది.
అది ఆనందరూపమైన ఈశ్వర సంబంధీస్థానము. ఋషులిట్లు పలికిరి :
దేవతలకు శత్రువులైన రాక్షసులను చంపినవాడా! హిరణ్యాక్షుని వధించిన భగవంతుడవగునారాయణా సోలుగు ఆశ్రమాలు చెప్పబడినవి. యోగులకు మాత్రం ఒక ఆశ్రమము చెప్పబడుచున్నది,
కూర్మస్వామి చెప్పెను :-
అన్నీ కర్మలను విడిచిపెట్టి, నిశ్చలమైన ధ్యానయోగము నవలంబించినవాడు, నిశ్చలమైన యోగనిష్ఠ కలవాడుగా ఎవడు ఉండునో, అతడు సన్యాసి, అయిదవవాడగును. అన్ని ఆశ్రమాలకు రెండు భేదములు వేదములయందు చెప్పబడినవి.
నిష్ఠకలవాడు, వేదమునందు శ్రదకలవాడు అగు బ్రహ్మచారి, శాస్త్రప్రకారము వేదములనధ్యయనముచేసి గృహస్థాశ్రమము స్వీకరించ పలెను.
నైష్ఠికుడగు వాడు, మరణకాల పర్యంతము ఇతరాశ్రమాలపొరి కుపకారము చేయువాడు గృహస్థుడు. అతడు ఉదాసీనుడు, సాధకుడు అని రెండు భేదములు కలిగియుండును.
కుటుంబపోషణ భారమునకు అధీనమైన గృహస్థుడు సాధకుడనబడును. మూడు ఋణములను (దేవ,ఋషి, పితృ తొలగించుకొని భార్య, ధనము మొదవాని యంద పేక్షవదలి; ఒంటరివాడుగా ఎవడు సంచరించునో, అతడు మోక్షాపేక్షకల ఉదాసీనుడనబడును. ఎవడు అడవిలో తపస్సు చేయుచు, దేవతాపూజ, యాగముచేయునో; వేదాధ్యయనమునందు గూడ ఆసక్తికలిగి ఉండునో, అతడు వాన ప్రస్థుడగుముని అని చెప్పబడును. తపస్సుచేత మిక్కిలి కృశించి, ధ్యాననిమగ్నుడుగా ఎవడుండునో. అతడు పొనప్రస్థములో ఉన్న సన్యాసిగా తెలియవలెను. ఎవడు ఎల్లప్పుడు యోగాభ్యాసము నందు శ్రద్ధకలిగి, ఇంద్రియములను జయించి, ఉన్నత పదమును పొందగోరుచుండునో; జ్ఞానముకొరకు జీవించునో, అతడు పరమేష్ఠిసంబంధిఅగు సంన్యాసిగా చెప్పబడుచున్నాడు. ఎవడు ఎల్లప్పుడు తృప్తికలిగి ఆత్మసాక్షాత్కారమంటే ఆసక్తికలిగి ఉండునో,
శ్రేష్ఠమైన జ్ఞానముతో కూడిన అతడు యోగిఅగు సంన్యాసి అని చెప్పబడును. కొందరు జ్ఞానసంస్యాసులు, మరికొందరు వేదసంన్యాసులు ఉందురు.
మరికొందరు కర్మ సంన్యాసులు అని మొత్తము పారమేష్ఠిక సంన్యాసులు మూడు విధములు. యోగి కూడ మూడు విధములు కలవాడని తెలియవలెను. భౌతికగి, సాంఖ్యయోగి; ఆశ్రమయోగి అనీ ఆమూడు భేదాలు చెప్పబడినవి. ఉత్తమమైన యోగము నాశ్రయించిన వాడు ఆశ్రమ యోగి అని తెలియదగును. మొదటి భౌతికయోగియందు ప్రథమభావన, రెండవ సాంఖ్యయోగియందు అక్షరభావన. మూడవయోగి ఆశ్రమియందు అంతిమమైన పారమేశ్వరీభావన చెప్పబడినది. అందువలన ఈనాలుగు ఆశ్రమాలను గూర్చి మీరు తెలుసుకొనుడు.
సమస్తమైన వేదశాస్త్రముల యందు అయిదవ భేదము కనిపించదు. ఈప్రకారముగా వర్షాలను, ఆశ్రమాలను సృష్టించి దేవతలకు దేవుడు, నిర్వికారుడు అయిన భగవంతుడు;
వీశ్వరూపుడైన భగవంతుడు, వివిధ ప్రజలను సృజించుడని దక్షుడు మొదలగు వారితో చెప్పెను. ఓముని శ్రేష్ఠులారా! బ్రహ్మ మాటవలన అతని పుత్రులైన దక్షాదులు దేవతలు, మనుష్యులు మొదలుగా గల ప్రజలను సృష్టించినారు. ఈ ప్రకారము భగవంతుడైన బ్రహ్మ లోక సృష్టికార్యములో నిమగ్నుడైనాడు.
నేను ఈ జగత్సమూహమును కాపాడుచున్నాను. శూలధారియగు శివుడు దీనిని లయకాలములో సంహరించగలడు. బ్రహ్మవిష్ణుమహేశ్వ రులు ముగ్గురు త్రిమూర్తులుగా చెప్పబడినారు.
పరమపురుషుడైన పరమాత్మకు రజస్సు, సత్త్వము, తమస్సు అను గుణముల సంబంధము వలన క్రమముగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఏర్పడిరి. వీరు పరస్పరము అనురాగము కలవారు. ఒకరిపై ఒకరు ఆధారపడి ఉందురు.
పరమేశ్వరరూపులైన ఆ ముగ్గురు క్రీడా రూపముగా ఒకరి కొకరు నమస్కరింతురు. బ్రాహ్మీ, మాహేశ్వరీ, మరియు అక్షరభావన అని;
ఈ మూడు భావనలు రుద్రునియందు ఎల్లప్పుడు ప్రవర్తించును. ఓ బ్రాహ్మణులారా! మొదటిదైన అక్షరభావన నాయందు సర్వదా నిలిచి ఉండును.
రెండవ అక్షరభావన బ్రహ్మదేవునికి వర్తించును. వాస్తవముగా చూచినచో, నేను, మహాదేవుడగు శివుడు భిన్నులముకాము.
సర్వాంతర్యామియైన పరమాత్మ తన యిచ్ఛతో తనను విభజించుకొని ఉన్నాడు. దేవ, రాక్షస, మనుష్యులతో కూడిన మూడులోకాలను సృజించుటకు; ఆ అవ్యక్త పురుషుడు బ్రహ్మరూపమును ధరించినాడు. అందువలన సృష్టికర్త బ్రహ్మ, మహాదేవుడగు శివుడు, జగదీశ్వరుడైన విష్ణువు అనుభేదములు; ఒకే ప్రభువైన పరమపురుషుని యొక్క మూడు మూర్తులు. వారివారి కార్యములను బట్టి రూపభేదము కలిగినది. అందువలన వారు ముగ్గురు సంపూర్ణ ప్రయత్నముతో అధికముగా పూజింపదగినవారు, సమస్కరించదగినవారుకూడ.
మోక్షగామకమైన, నాశరహితమైన స్థానమును శీఘ్రముగా పొందుటకు కోరినచో, వర్ణాశ్రమాలతో కూడిన ధర్మముతో ప్రీతి పూర్వకముగా; జీవించినంతకాలము దీక్షతో హృదయపూర్వకముగా పూజించవలెను. విప్రులారా! నాలుగు ఆశ్రమములవారికి ఈ విధానము శాస్త్రప్రకారము చెప్పబడినది. వైష్ణవము, బ్రాహ్మము, శైవము అని ఆశ్రమములు మూడు కలవు. ఆయాదేవుల చిహ్నములను ధరించుచు, వారిభక్తుల యందభిమానము కలవాడై నియతముగా; ఆదేవతలను ధ్యానించవలేను, వేదాంత విద్యయందు శ్రద్ధకలవారై పూజించవలెను. అందరు భక్తులకు గూడ శివుని లింగము చాలా శ్రేష్టమైనది.
తెల్లని భస్మముతో నొసటియందు మూడురేఖలను ధరించవలేను. ఎవడు భగవంతుడగు నారాయణు నాశ్రయించిపరమపదమును కొరునో;
అతడు ఎల్లప్పుడు నుదుటియందు గంధోదకముతో శూలమును ధరించవలెను. ఎవరైతే లోకసృష్టికి మూలభూతుడైన పరమేష్టియగు బ్రహ్మ నాశ్రయింతురో వారు తమలలాటము నందు ఎల్లప్పుడు తిలకము ధరించవలెను అప్పుడు సమస్త భూతములకాదీ భూతుడు, జన్మలేనివాడు, కాలస్వరూపుడు అగు ఈ భగవంతుడు ధరింపబడినపొడగును.
పైభాగము, అధోభాగములయొక్క సంబంధమువలన, మూడు రేఖలను ధరించుటవలన, బ్రహ్మవిష్ణుశివస్వరూపము, త్రిగుణాత్మకమైన ఆ ప్రధాన తత్త్వము, శూలమును ధరించుటవలన ధరింపబడినదిగానే అగుచున్నది. సందేహములేదు. బ్రహ్మతేజస్సుతో నిండినది, తెల్లనిది అగు సూర్యునియొక్క ఈ మండలము ఏదికలదో, తిలకమును ధరించుటవలన, ఆ ఈశ్వర సంబంధిస్థానము ధరించబడినదిగానే అగుచున్నది. అందువలన త్రిశూలచిహ్నము, మంగళకరమైన తిలకముకూడ తప్పక ధరించవలేను.
అది భక్తుల కాయుష్యమును గూడ కలిగించును. పై మూడురకముల భక్తులకు కూడా శాస్త్రప్రకారము అగ్నియందు హోమము, జపము, దానము అవశ్యకర్తవ్యములు.
ఇంద్రియములను జయించినవాడై, శాంతుడై, మనోనిగ్రహము కలిగి, క్రోధమును జయించి, వర్ణాశ్రమముల పద్దతిని తెలిసినవాడై, సావధానుడై దేవతలను జీవితాంతము వరకు సేవించవలెను.
అట్లు చేసినచో నిశ్చలమైన తన ప్రాప్యస్థానమును అచిరకాలములోనే పొందగలడు.
శ్రీ కూర్మపురాణములో వర్ణాశ్రమవర్ణనమను రెండవ అధ్యాయము సమాప్తము.
