కూర్మ మహా పురాణము
23వ అధ్యాయము
వ్యాస మహర్షి చెప్పెను:-
సపిండుల విషయమున జనన మరణములలో ఆశౌచము పది దినములని పండితులు చెప్పేదరు. ఈ ఆశౌచమున నిత్య కమ్య కర్మలను చేయరాదు. స్వాధ్యాయమును మనస్సులో తలచరాదు. అగ్నికార్యమునకై పవిత్రులను క్రోధరహితులను భూదేవులను బ్రాహ్మణులను నియమించవలయును. శుష్కిన్నమును లేదా ఫలములతో వైతానాగ్నిలో హవనము గావించవలయును. ఆశౌచ గ్రస్తులను ఇతరులు స్పృశించరాదు. పోరి నుండి ఏ వస్తువులను తీసుకొనరాదు. నాలుగు లేదా ఐదవ దినమున స్పర్శ చెప్పబడినది. సపిండులను స్పృశించుట దోషము కాదు. కానీ పుట్టిన శిశువును, కన్నతల్లిని మాత్రము దశదినముల వరకు స్పృశించరాదు.
జాతో శాచమున వేదమును అధ్యయనమును చేయువాడు, యజ్ఞమును చేయువాడు, వేదజ్ఞుడగు తండ్రి స్నానము చేసిన వెంటనే స్పృశించ దగిన పోరగుదురు. తల్లిని పది రోజుల తరువాత స్పృశించదగును. వేదాధ్యయనము అగ్నిహోత్రాది కర్మలు లేని నిర్గుణునికి జాతా శౌచము పది దినములు చెప్పబడినది. స్మార్తాగ్నీ కలవారు ఏక గుణునికీ నాలుగు దినములు ఆశౌచము చెప్పబడినది. స్మార్తాగ్ని వేదాధ్యయనము కల ద్విగుణీకి మూడు దినములు, స్మార్తాగ్ని వేదాధ్యయనముతోపాటు త్రేతాగ్ని కల త్రిగుణునికీ ఒకే దీనము జాతా శౌచము చెప్పబడినది. పది దినముల తరువాత చక్కగా అధ్యయనము హోమమును చేయదగును, ఏకగునీయగు ద్వీజునీ. నాలుగు దీనముల తరువాత స్పృశించవచ్చునని మను ప్రజాపతి చెప్పెను. శ్రాత స్మార్త కర్మల నాచరించనిపోనికీ, మహారోగికి, మూర్ఖునికి, ఇష్టానుసారి ఆచారము గలవానికి ఆశాచము మరణాంత ముండును. అనగా అట్టివాడు జీవితాంతము అస్పృశ్యుడే అని తాత్పర్యము. కేశ సంస్కారము జరిగి ఉపనయనముకన్నా ముందు మరణించినచో మూడు దినములు, ఉపనయన సంస్కారము తరువాత మరణించినచో దశరాత్రము ఆశౌచముండును.
రెండు సంవత్సరముల వయస్సులోపు మరణించినచో తల్లిదండ్రులకు మూడు దినముల ఆశౌచముండును. వేదాధ్యయ నాగ్నిహోత్రాదులు లేనివాడు మరణించినచో మూడు దినములు ఆశౌచముండును. దంతములు రాక మునుపు మరణించినచో తల్లిదండ్రులకు ఒక దినము ఆశౌచము. తల్లిదండ్రులు నిర్గుణులైనచో, దంతములు కలిగిన తరువాత మరణించినచో మూడు దినములు ఆశౌచము. దంత జననము నుండి చౌలము లోపు మృతి చెందిన సపిండులకు ఏకరాత్రము, ఉపనయనము వరకు మూడు రాత్రములు. పుట్టిన వెంటనే మరణించినచో తండ్రికి తల్లికి ఆశౌచముండును కాని తండ్రిని స్పృశించవచ్చును. తల్లి అస్పృశ్యురాలు. సపిండులు లేదా సోదరులకు పది దినముల లోపు మరణించినచో స్నానమాత్రముననే శుద్ధి. పది దినముల తరువాత మరణించినచో నిర్గుణుడగుచో ఒకరాత్రి ఆశౌచము.
దంతములు కలిగినతరువాత మరణించినచో నీర్ణుణులగు సపిండులకు ఒకరోత్రము, చౌలము తరువాత త్రిరాత్రికము దంతములు కలుగకముందు మరణించినచో నీర్ణుణులగు సపిండులకు ఏకత్రమ శౌచము. ఉపనయనము జరుగక ముందు మరణించినచో గుణులగు సపిండులకు స్నానమాత్ర శుద్ది. ఉపనయనము తరువాత అగుచో వైషమ్యముండును. ఆరు నెలలలోపు స్త్రీలకు గర్భస్రావము జరిగినచో స్త్రీలకు ఎన్ని నెలల గర్భమో అన్ని దినములు ఆశౌచముండును. ఆరు నెలల తరువాత గర్బ పాతమగుచో 12 దినములు ఆశౌచముండును. స పిండులకు స్నానముతో శుద్ధి జరుగును.
గర్భస్రావముకాని అత్యంత నిర్గుణుడగు సపిండుడు మరణించిననూ ఒకదినము యధేషాచరణము కలవారిస్త్రీకి గర్భస్రావము జరుగుచో త్రిరాత్రో శాచము ఒక జాతాశౌచమున మరియొక జాతాశౌచము, మృతాశౌచమున మరియొకమతాశాచము వచ్చినచో మొదటి ఆశౌచము ఎన్నిదినములు మిగిలియుండునో అన్ని దీనములతోనే శుద్ధి యగును. ఒక వేళ మొదటి అశౌచము ఓదినము మిగిలియున్నచో త్రిరాత్రా శాచముండును మరణాశౌచమున జననాశౌచము జననాశౌచమున మరణాశౌచము సంభవించినచో మరణాశౌచము తరువాతనే శుద్ధి జరుగును. మొదటి ఆశౌచము గురుతరమగుచో దానితరువాతనే శుద్ధియగును దేశాంతర విషయము జాతాశౌచము మృతాశౌచము వార్త తెలిసినచో ఆశౌచముఎన్నిదినములు మిగులునో అన్నీ దినవములతరువాత శుద్ది జరుగును ఒక సంవత్సరములోపు మృతాశౌచ వార్త తెలిసినచో మూడు దినములు ఆ శౌచము యుండును. సంవత్సరము తరువాత తెలిసినచో అశౌచము ఎన్నిదినములు మిగులునో అన్నీ దినములతరువాత శుద్ధి జరుగును. ఒక సంవత్సరములోపు మృతశాచ వార్త తెలిసినచో మూడు దినములు ఆ శాము యుండును. సంవత్సరము తరువాత తెలిసినచో స్నాన మాత్రముతో శుద్ధి జరుగును. వేదాంత శాస్త్ర పరిజ్ఞానము కలవాడు, గురుకులములో నివసించుచు. అధ్యయన శీలుడు, అగ్నిహోత్రి, వృత్తి హీనుడు వీరికి అన్ని అవస్థలలో వెంటనే శుద్ది లభించును. పాణిగ్రహణము కాని స్త్రీలు మరణించినచో సపిండులకు మూడు రాత్రులు. ఆశౌచముండును. వివాహమైన తరువాత మరణించినచో భర్తకులము వారికీ, భర్తకు మాత్రం ఆశౌచముండును. వాగ్దానమునకు పూర్వము కన్యమరణించినచో ఒకదినము మాత్రమే ఆశౌచముండును. రెండు సంవత్సరములలోపు వయసుగల కన్య మరణించినచో స్నానముతోనే శుద్ధీ విధించబడినది. దంతములు రాకమునుపు మరణించినచో సోదరులకు స్నానముతో శుద్ధీ, చౌలము వరకు మరణించినచో ఒక దినముతో శుద్దీ కన్యాదానములోపు మరణించినచో మూడు దినములు, ఆ తరువాత దశరాత్రము చెప్పబడినది.
తల్లియొక్కతండ్రి మరణించిన మూడు దినములు, సమానోదకులు మరణించిననూ పుట్టిననూ త్రి రాత్రా శౌచము. మేనల్లుడు, మేనమామ, మేనత్త, పినతల్లి ఇట్లు యోని సంబంధము గల వారీ విషయమున ఒకటిన్నర దినము, బంధువులు మరణించిననూ ఒకటిన్నర దినమే ఆశౌచము. గురువు కాని సహాధ్యాయికానీ మృతి చెందిన ఒక దీనము, తాను నివసించు దేశము రాజు మరణించినచో ఒకపూట ఆశాచము. వివాహమైన పుత్రిక తన ఇంటిలో మరణించినచో తండ్రికి మూడు దీనములు, పూర్వము ఇతరుల భార్యగా ఉండి ఇప్పుడు తన భార్యగా అయిన స్త్రీ కాని అతని పుత్రుడు కాని కృతక పుత్రుడు కానీ మరణించిన మూడు దినములు, ఆచార్యుడు మరణించిననూ, తన భార్య ఇతరుల భార్య అయిన తరువాత మరణించిననూ మూడు దినములు ఆశౌచముండును. ఆచార్య పత్ని, ఆచార్య పుత్రుడు ఒక దినము, ఉపాధ్యాయుడు కాని స్వగ్రామములోనీ త్రోత్రియుడు కాని మరణించిననూ మూడు దినములు, తన ఇంటిలో నుండు ఇతరులు మరణించిన ఒక దినము ఆశౌచము చెప్పబడినది. పిల్లనిచ్చిన అత్తకాని మామ కానీ మరణించిన త్రిరాత్రము, తన ఇంటిలోనున్న సగోత్రుడు మృతి చెందిన స్నాన మాత్రమున శుద్ది. బ్రాహ్మణునికి పది దినములలో క్షత్రియునికి 12 దీనములలో వైశ్యునికి 15 దినములకు శూద్రునికీ ఒక నెలలో శుద్ధి కలుగును. బ్రాహ్మణునికి క్షత్రియ వైశ్య శూద్ర స్త్రీల యందు పుట్టిన బంధువుల మృతీలో బ్రాహ్మణునికి పది దినములలో శుద్ది కలుగును. ఇట్లే క్షత్రీయ శూద్ర వైశ్యులకు తమకంటే హీనవర్ణ స్త్రీల యందు పుట్టిన బంధువుల మృతిలో ఆయా వర్ణమునకు విధించబడిన విధిగా శుద్ధి చెప్పుకొనవలయును.
అందరూ ఉత్తర వర్ణమునకు విధించబడిన ఆశౌచమును పాటింతురు. కాని తన జాతిస్త్రీ యందు కలిగిన వారి విషయమున మాత్రము తన వర్ణాశౌచమునే పాటించవలయును. శూద్రస పిండ మృత్యువు జన్మలో క్షత్రియ బ్రాహ్మణులకు క్రమముగా 6,3,1 రాత్రి ఆశౌచ ముండును. వైశ్యస పిండునీ జనన మరణములలో శూద్ర క్షత్రియ బ్రాహ్మణులకు 15 దినములు 6 దినములు నదీసములు ఆశౌచము చెప్పబడినది. క్షత్రియ స పిండుని మృతిలో శూద్రవైశ్య బ్రాహ్మణులకు 6, 10 దినములు ఆశౌచము ఉండును. బ్రాహ్మణ సపిండుని జన్మ మరణములలో శూద్ర వైశ్య క్షత్రియులకు దశ దినములలో శుద్దీని బ్రహ్మతెలిపెను. సపిండుడుకాని విప్రుని మృతిలో అతనికి బంధువువలె ప్రేతకార్యమును చేసి భోజనమును నీవాసమును చేసినవారు దశరాత్రము ఆశౌచము కలిగియుందురు. చనిపోయిన పోగి భోజనము చేసిన వారికి మూడు దినములు ఆశౌచము. అన్నము తినక ఆ ఇంటిలో నీవసించినచో ఒక దినము ఆశౌచముండును. సమానోదకులు బంధువులు మరణించినచో శవవాహనము చేసిన పదిదినములు అశౌచముండును. సపిండునికి కూడా దశాహాశౌచము. ప్రలోభముతో అంత్య సంస్కారము ఆచరించినచో బ్రాహ్మణునికి పది దీనములు క్షత్రియునికి 12 దినములు వైశ్యునికీ 15 దినములు శూద్రునికి నెల ఆశాచముండును. లేదా అందరికి 6 దీసములు లేదా మూడు. దినములలో శుద్ధి అనీ చెప్పబడును.
అనాథ నిర్థనుడగు బ్రాహ్మణునికీ దహన సంస్కారము చేసిన బ్రాహ్మణులు మొదలగువారు స్నానము చేసి నెయ్యి తిని శుద్ధులగుదురు. తక్కువ జాతివారు అధిక జాతీవానిని, అధిక జాతివారు తక్కువ జాతి వాని శవమును స్నేహముతో స్పృశించినచో ఆ జాతి నియమానుసారము శౌచము లభించును. మరణించిన విప్రుని ఇష్ట పూర్తిగా శవయాత్రలో పాల్గొనినచో సచేలముగా స్నాన మాచరించి అగ్నినీ స్పృశించి ఘృతప్రాశనముతో శుద్ధి కలుగును. విప్రశవయాత్రలో పాల్గొనిన క్షత్రియునికి ఒక దినము, వైశ్యునికి రెండు దీనములు శూద్రునికి మూడు దినములు ఆశౌచము చెప్పబడినది. ఆశౌచము తీరిన తరువాత నూరు ప్రాణాయామములు చేయవలయును. శూద్రుని మృతిలో అస్థిసంచయనము కాక మునుపు అతని బంధువులతో కలిసి బ్రాహ్మణుడు డోదించినచో అతనికి మూడుదినములు ఆశౌచముండును, అస్థి సంచయనము తరువాత రోదించిన ఒక దినముండును. అస్థి సంచయనముకన్నముందు క్షత్రియ వైశ్యులు విలపించినచో ఒకదినము ఆశౌచము, అస్థి సంచయనము తరువాతైనచో ఒకపూట ఆశౌచముండును. అస్థి సంచయనము తరువాత బ్రాహ్మణుడు విలపించినచో సచేల స్నానముతో శుద్ధి కలుగును, ఆశౌచము కల వారితో కలిసి భోజనము శయునాదులు కావించిన వారెవరైనా అనగా బంధువులు కానీ ఇతరులుకొని పది దినముల తరువాత శుద్ది పొందెదరు. ఆశౌచము కలవారీ అన్నము ఒక మారు తిన్న వారి ఆశౌచ దీనసంఖ్య పూరైన తరువాత స్నానముతో శుద్ధి కలుగును. దుర్భిక్షాది బాధలలో ఆశౌచుల ఇంటిలో ఎన్ని దినములు భుజించునో అన్ని దినములు ఆశౌచముండును. తరుపొత ప్రాయశ్చిత్తముతో శుద్ది పొందును.
అగ్నిహోత్రి యగు ద్విజునకు దాహకాలము నుండి ఆశౌచము ప్రారంభమగును. సపిండుల మరణము జన్మమున కూడా. ఆశౌచమును పాటించవలయును సపిండత్వము ఏడవ అంతరమున తొలగును. తన వంశ మూల పురుషుని పేరు తెలియనిచో సమానోదకత్వము తొలగి పోవును. తండ్రి తాత ముత్తాత ఈ ముగ్గురు లేప భాగము అగుదురు. ఏడవ అంతరము వరకు సపిండత ఉండును. వివాహము కానీ స్త్రీకి అతని తండ్రి నుండి ఏడు అంతరముల వరకు సాండ్యము వివాహమైనచో భర్త నుండి ఏడు తరముల వరకు సాపిండ్యమును బ్రహ్మ చెప్పెను, ఒక పురుషునీ ద్వారా భిన్న జాతుల స్త్రీల యందు కలిగిన సంతానమునకు మూడు తరముల వరకు సాపిండ్యముండును.
వడ్రంగి, శిల్పి, వైద్యులు, దాసి, దాసులు, దాత, వ్రతపరాయణులు, నియమపాలకుడు, బ్రహ్మజ్ఞాని, బ్రహ్మచారి, యజ్ఞ కర్త ప్రతీ. ఎవరి మృతిలోనైననూ స్నానమాత్రముతో శుద్దులగుదురు. అభిషిక్తుడగు రాజు, అన్నదానముతో ప్రాములు కాపాడువాడు కూడా స్నానమాత్ర శుద్ధులు. యజ్ఞమున, వివాహసమయమున, దేవ పూజలో దుర్భిక్షమున, ఉపద్రవములలో కూడా స్నాన మాత్ర శుద్ధి చెప్పబడినది. క్షత్రియులకు బ్రాహ్మణులకు సామాన్య యుద్ధములో పరస్పర కలహములలో మరణీంచిన వారికి, విద్యుత్ ఘాతముతో సర్పవేధతో మరణించిననూ స్నాన మాత్రమున శుద్ధి చెప్పబడినది. అగ్న్యాది పతనము వలన, మరు భూమీలో, దుర్గమ మార్గములో అకాల మృత్యు వశమున మరణించిననూ బ్రాహ్మణుని కోరకు మరణించిన, సన్యాసి మరణించిననూ స్నానమాత్ర శుద్ధి విధించబడినది.
అగ్ని విషాదులతో ఆత్మహత్య చేసుకొనిన వారికి దహన సంస్కారము తర్పణాదులు ఆశౌచము అవసరము లేదు. ప్రమాద వశమున అగ్గదుల వలన మరణించిన పోరికి దహన తర్పణాదులు ఆశౌచముండును. కుమారుడు పుట్టిన దినముననే లోభిత్వమును విడిచి సువర్ణ ధాన్యగో వస్త్రతీల అన్నగుడ ఘృతాదులను దానము గావించవలయును. ఆశాచుల ఇంటి నుండి అత్యవసర పరిస్థితిలో ఫలములు, పుష్పములు శాకములు, లవణము, కట్టెలు, నీరు, పెరుగు, నెయ్యి, నూనే, మందు పాలు, శుష్టాన్నమును ఎపుడైనా గ్రహించవచ్చును; ఆహితాగ్నికి దహన సంస్కారము. మూడర్నులచే చేయవలయును. అనాహితాగ్నికి గృహ్యాగ్నితో, ఇతరులకు లౌకికాగ్నితో దహన సంస్కారము చేయవలయును. ఒకవేళ మృత కళేబరము లభించనిచో మోదుగు కట్టెలతో ప్రతికృతిని చేసి శ్రద్దతో సపిండులు దాహాదుల నాచరించవలయును. బ్రహ్మచర్య వ్రతము జీవన పర్యంతము అనుష్టించు వారికీ, యతులకు, బ్రహ్మచారులకు, పతితునికి మరణము సంభవించిన ఆశౌచము లేదని పండితులు చెప్పిరి. పతితులకు దాహము అంత్యేష్టి అస్థి సంచయాదులు ఉండవు. అశ్రుపాతము పిండాదికములు శ్రాద్ధాదికములను కూడా చేయవలసిన పని లేదు. బంధువులందరి విషయమున నియమపూర్వకముగా పదిదినములు నామగోత్రములనుచ్చరించుచు. స్నానము చేసి తడి వస్త్రముతో బంధువు లందరు ప్రాతఃకాలము సాయంకాలము ఒకసారి ఉదకమును విడువవలయును. అట్లే చనిపోయినవానికి ప్రతిదినము ఒకమారు పిండ ప్రదానము గావించవలయును. నాలుగవ దినము నుండి గృహద్వారమున బ్రాహ్మణ భోజనము గావించవలయును.
రెండవరోజు బంధువులతో సహా అందరూ క్షుర కర్మ గావించుకొనవలయును. నాలుగవరోజు బంధువులతో కలిసి అస్థి సంచయనము గావించవలయును. అస్థి సంచయనము కంటే ముందు శ్రద్ధతో పవిత్రులగు బ్రాహ్మణులను బేసి సంఖ్యతో భుజింప చేయవలయును. 5వ దినమున 9వ దినమున 11వ దినమున కూడా బేసి సంఖ్యతో బ్రాహ్మణులను భుజింప చేయవలయును. దీనిని నవ శ్రాద్ద మందురు. ప్రేమ కొరకు 11వ దినమున 12వ దినమున లేదా ఏదో యొక పవిత్ర దీనమున శ్రద్దా పూర్వకముగా శ్రాద్ధము నాచరించవలయును. ఈ శ్రాద్ధమున ఒక పవిత్రము ఒక అర్షము ఒక పిండ పాత్ర ఉండును. ఇట్లు ప్రతినెల చనిపోయిన దినమున ఒక సంవత్సరము వరకు శ్రాద్ధము సాచరించ వలయును. సంవత్సరము నిండిన తరువాత సపిండీకరణ శ్రాద్దము చేయవలయును. పిత, పీతామహ, ప్ర పితామహ వృద్ద ప్రపితామహులకు నాలుగుపాత్రలు వేయవలయును. పితృపాత్రలో ప్రేతపాత్ర అర్యముంచవలయును. “యే సమానా?” అను రెండు మంత్రములతో పీతా మహాదుల పిండములలో ప్రేత పిండమును కలుపవలయును. సపిండీకరణశ్రాద్ధము దేవ పూర్వము అనగా దేవ శ్రాద్ధము తరువాత సపిండీకరణ శ్రాద్ధము చేయవలయును, సపిండీకరణ శ్రాద్దము మొదట పితరులను ఆవాహన గోవించిన తరువాత ప్రేమను ఆవాహన చేయవలయును. సపిండీకరణము చేయబడిన ప్రేతలకు మరల వీడిగా శ్రాద్ధ ప్రక్రియ ఉండదు. సపిండీకరణము చేయబడిన ప్రేమకు మరల విడిగా శ్రాద్ధము గావించినవాడు పితృఘాతి యగును. తండ్రి చనిపోయినపుడు పుత్రుడు ఒక సంవత్సరము పిండ ప్రదానము చేయవలయును, ప్రతిదినము ప్రేత ధర్మానుసారముగా ఉదక కుంభమును అన్నదానమును గావించవలయును. ప్రతి సంవత్సరము పార్వణ విధానముతో శ్రాద్దము నోచరించ వలయును. ఇది సనాతన విధి. తల్లిదండ్రులకు పుత్రులు పిండ ప్రదానాదికము నాచరించవలయును. పుత్రులు లేనిచో భార్య చేయవలయును. భార్యలేనిచో సహోదరులు చేయవలయును. వీరెవరు చేయలేరు అధవా చేయరు అనుభావము ఉన్నచో తాను బ్రతికుండగానే సకల దోసోదీకములను శ్రాద్ధ విధిని శ్రద్దగా ఆచరించుకొనవలయును.
ఇట్లు గృహస్థుల క్రీయా విధి చెప్పబడినది. స్త్రీలకు భర్తృశుశ్రూష కంటే ఇతర విధి చెప్పబడలేదు. భగవంతుని యందు మనసును లగ్నము చేసి స్వధర్మముల సోచరించువాడు వేదవేత్తలు చెప్పిన పరమస్థానమును పొందును.
ఇది శ్రీ కూర్మపురాణమున షట్సాహస్రి సంహితలో ఉపరివిభాగమున 23వ అధ్యాయము.
