పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
79 - యయాతినా త్వన్మనోరధాన్పూరయిష్యామితి ప్రతిజ్ఞాం కృత్వాతయా సహ గాంధర్వవివాహేన వరణమ్
విశాలోవాచ - విశాల పలికెను.
వరానన అయిన దేవయాని, శర్మిష్ట మీ భార్యలు. వారిలో సౌభాగ్యమును చూచితిమి. మరొక చోట లేదు. అట్టి నీవు ఎట్లు ఈమె కార్యమును చేసెదవు. సపత్నీభావముతో ఈమెకు భర్తగానుందువు. నీవు భూమిపై చందన వృక్షమువలె సర్పములతో నున్నావు. మహాచన్దన వృక్షము సర్పములచే బుట్టియున్నట్లుగా నీవు సపత్నీ అను మహాసర్పములతో కూడియున్నావు. అగ్నిలో ప్రవేశించుట, పర్వతశిఖరములనుండి దూకుట వరము. రూపము తేజస్సుతో కూడియున్న సపత్నీసహితుడైన ప్రియుడు శ్రేష్ఠుడు కాజాలడు. అతను సపత్నీ విషసంయుతుడు కదా. కావున తాము గుణసాగరులైననూ మా చెలి నిన్ను అంగీకరించుట లేదు.
రాజోవాచ - రాజు పలికెను.
అశ్రుబినుమత్యువాచ - అశ్రుబిన్దుమతి పలికెను.
రాజోవాచ - రాజు పలికెను.
నాకు దేవయానితో పనిలేదు. శర్మిష్ఠతో పనిలేదు. నా కోశము సత్త్వము ధర్మముతో కూడియున్నది. అంతా నీదిగా చూడుము. అనగా అశ్రుబిందుమతి ఇట్లు పలికెను. “మహారాజా! రాజ్యమును నీ శరీరమును నేనే అనుభవించుదానను కావలయును. నేను ఏది చెప్పిననూ దానిని తాము తప్పక చేయవలయును. ఇది నీకు సమ్మతి అయినచో మీ చేతినిమ్ము. ధర్మవత్సలా! నీ కరము బహుధర్మములను చేసినది. ఉత్తమ లక్షణములతో కూడియున్నది. అనగా రాజు ఇట్లు పలికెను. 'వరవర్ణినీ! నీవు కాక ఇంకొక భార్యను తెలియను. రాజ్యమును సకలభూమండలమును నా శరీరమును నా కోశమును చార్వజ్జీ అనుభవించుము. ఈ నా హస్తమును ఇచ్చుచున్నాను. నీవు పలికినదానిని తప్పక చేసెదను.” అనగా అశ్రుబిందుమతి ఇట్లు పలికెను. ఇటైనచో మహానుభావా! నీకు భార్యనయ్యెదను.' ఈ మాటలను వినిన రాజేంద్రుడు ఆనందముతో కనులు విప్పారెను. యయాతి మహారాజు గాంధర్వవివాహముతో మన్మధుని పుత్రికను అశ్రుబిన్దుమతిని పరిణయమాడెను. ఆ మహారాజు అశ్రుబిన్దుమతితో సాగరతీరములందు, వనములందు, ఉపవనములందు, అందమైన పర్వతములందు, నదులలో ఆ సుందరాంగితో రాజరాజేస్తుడు యౌవనముతో రమించసాగెను. అట్లు ఆ యౌవనవతితో రమించుచున్న యయాతి మహారాజునకు ఇరవై వేల సంవత్సరములు గడిచినవి.
వి ఘ్నరువాచ - విష్ణువు పలికెను.
సుకర్మోవాచ - సుకర్మ పలికెను.
అశ్రుబిందుమత్యువాచ - అశ్రుబిందుమతి పలికెను.
రాజోవాచ - రాజు పలికెను.
ఇట్లు అశ్రుబిందుమతిచే మోహించబడిన యయాతిమహారాజు ఇంద్రుని కొరకు మన్మధునివలన మోహించబడెను. ఇట్లు యయాతి మహారాజు ఆమె మోహముతో కామముతో లలితరతముతో పవలు రాత్రి తెలియకపాయెను. కామకన్య మోహితుడైయుండెను. ఒకసారి కాముని పుత్రిక మోహముచెందిన యయాతి మహారాజును మదించి నమ్రుడై వశము చెందినవానిని చారులోచన ఇట్లు పలికెను. “ఇపుడు నేను గర్భవతిని. నా కోరికను తీర్చవలయును. మహారాజా! అశ్వమేధయాగమును చేయుము” అని అనగా రాజిట్లు పలికెను. ‘మహానుభావురాలా! అట్లే కానిమ్ము. నీకు ప్రియమును చేతును.' అని రాజ్యభోగమున స్పృహలేని ఉత్తమపుత్రుని పిలిచెను. పిలువగా వచ్చిన పుత్రుడు భక్తితో శిరము వంచి చేతులు జోడించి నమస్కరించెను. భక్తితో తలవంచి అశ్రుబిన్దుమతీ పాదములకు నమస్కరించెను. నన్నెందుకు పిలిచితిరి. ఆజ్ఞాపింపుడు. నేను వచ్చితిని. నీకు దాసుడను. నమస్కరించుచున్నాను. ఏమి చేయవలయును?
రాజోవాచ - రాజు పలికెను.
సుకర్మోవాచ - సుకర్మ పలికెను.
పుత్రా! అశ్వమేధ యజ్ఞమునకు సంభారమును చేయుము. బ్రాహ్మణులను, పవిత్రులైన ఋత్విక్కులను, సామంతరాజులను పిలువుము. ఇట్లు మహారాజు పలుకగా పరమధార్మికుడైన పూరువు రాజు చెప్పినది చెప్పినట్లు చేసెను. యయాతి మహారాజు తాను కన్యతో దీక్షను స్వీకరించెను. అశ్వమేధయజ్ఞవాటమున అనేక దానములను చేసెను. బ్రాహ్మణులకు భూరిదానమును చేసెను. యయాతి మహారాజు విశేషించి దీనులకు దానములు చేసెను. యజ్ఞము ముగిసిన తరువాత మహారాజు ఆ వరాననతో ఇట్లు పలికెను. బాలా! ఇంకా నీకే ప్రియమును చేయవలయునో తెలుపుము. దేవీ! దానినంతయు నేను సాధ్యాసాధ్యములతో నిమిత్తము లేకుండగా చేసెదను.ఆ రాజు ఇట్లు పలుకగా ఆమెమరల రాజుతో ఇట్లు పలికెను. ఇపుడు నాకు కోరిక కలిగెను. నా కోరికను తీర్చుము. ఇంద్రలోకమును బ్రహ్మలోకమును శివలోకమును అట్లే విష్ణులోకమును చూడగోరుచున్నాను. నేను నీకు ప్రియురాలినైనచో మహారాజా! నాకు చూపుము. ఇట్లు ఆమె పలుకగా మహారాజు ఆమెతో మరల ఇట్లు పలికెను. బాగు బాగు! సుందరీ! పుణ్యమునే పలుకుచున్నావు. స్వీస్వభావముతో చాపల్యముతో ఉత్సుకతతో నీవు పలికినది అసాధ్యమని నాకు తోచుచున్నది. పుణ్యదానములతో యజ్ఞముతో తపస్సుతో మాత్రమే సాధ్యము. లేనిచో సాధ్యము కాదు. నీవు పుణ్యమిశ్రితమైన అసాధ్యమును పలికితివి. మానవుడు మర్త్యలోకమునుండి ఈ శరీరముతో ఏ పుత్రుడూ నేటివరకు స్వర్గమునకు వెళ్ళినట్లు నేను చూడలేదు. కావున వరారోహా! నీవు నాకు చెప్పినది అసాధ్యము. ఇదికాక ఇంకేదైననూ నీకు ప్రియమును చేసెదను. ప్రియురాలా! నాకది తెలుపుము.
దేవ్యువాచ - దేవి పలికెను.
మహారాజా! ఇతర మానవులకిది అసాధ్యమే. ఇందులో సందేహము లేదు. కాని మీకిది సాధ్యమే. నేను ముమ్మాటికీ నిజమే చెప్పుచున్నాను. తపస్సుచే యశస్సుతో క్షాత్రధర్మములతో దానములచే యజ్ఞములచే మీలాంటివారు ఇతరులు లేరు. ఈ మర్త్యలోకములో ఇట్టివారు మీరొక్కరే. క్షాత్రము బలము చక్కని తేజస్సు మీలో అన్నీ ప్రతిష్టించబడియున్నవి. కావున నహుషాత్మజ! ఇట్లు నా ప్రియమును చేయవలయును.
ఇది శ్రీ పాద్మపురాణమున రెండవదియగు భూమిఖండమున వేనోపాఖ్యానమున మాతాపితృతీర్థ వర్ణనమున యయాతి చరితమను డెబ్బది తొమ్మిద - అధ్యాయము.
