పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

64 - మాతాపితృ తీర్థ మాహాత్త్యే నహుషస్య యయాతేశ్చ చరిత్ర వర్ణనమ్

పిప్పల ఉవాచ - పిప్పలుడు పలికెను.

కుండలాత్మజా! తండ్రి అనుగ్రహముతో యదువు ఉత్తమ సుఖమును ఎట్లు అనుభవించెనో నాకు విస్తరముగా చెప్పుము. రురువు పాపప్రభావమును ఎట్లు అనుభవించుచున్నాడు? ఇదంతయూ నాకు విస్తరముగా తెలుపుము.

సుకర్మోవాచ - సుకర్మ పలికెను.

పవిత్రుడైన నహుషుని చరితమును, మహానుభావుడైన యయాతి చరితమును పాపనాశనమును చెప్పెదను వినుడు. నహుష మహారాజు చంద్రవంశములో పుట్టినవాడు. సాటిలేని అనేక దానధర్మములను చేసెను. నూరు అశ్వమేధములను నూరు వాజపేయములను ఇతరములను చాలా విధములైన యజ్ఞములను చేసెను. తన పుణ్యముతో తన పుత్రుని ధర్మగు పేతుని యయాతిని రాజును చేసి ఇన్గలోకమును చేరెను. యయాతి మహారాజు సత్యసంపన్నుడు ధర్మపరాక్రముడు మహామతి అయినవానిని రాజును చేసి తన ఇంద్రపదవిని పొందెను. సత్యసంపన్నుడైన యయాతి ప్రజలను ధర్మముగా పరిపాలించుచు ఆయా ప్రజాకార్యములను స్వయముగానే చూచుచుండెను. అనుత్తమ ధర్మములను వినుచు యజ్ఞములను స్వయముగా ఆచరించెను. యజ్ఞములను తీర్థయాత్రలను పుణ్యకరములైన దానములను చేసెను. సత్యధర్మములతో రాజ్యమును చేసెను. 80 వేల సంవత్సరములు చక్కగా రాజ్యమును పరిపాలించసాగెను. ఆ సమయములో యయాతి వంటి బలవీర్యపరాక్రమములుగల నలుగురు పుత్రులు కలిగిరి. వారి పేర్లు చెప్పెదను. ఏకాగ్రబుద్దితో వినుము. యయాతి జ్యేష్ఠపుత్రుడు రురువు అను మహాబలుడు. రెండవవాడు పూరువు. మూడవవాడు కురువు. ధర్మాత్ముడైన యదువు నాలుగవవాడు. ఇట్లు మహానుభావుడైన యయాతికి నలువురు పుత్రులు తేజస్సుతో పౌరుషముతో తండ్రికి సాటివచ్చు పరాక్రమము కలవారు. ఇట్లు యయాతి ధర్మముగా రాజ్యపాలన గావించెను. ఆ యయాతి కీర్తి యశస్సు మూడు లోకములలో వ్యాపించెను.

విష్ణురువాచ - విష్ణువు పలికెను.

ఒకసారి బ్రాహ్మణోత్తముడైన నారదుడు బ్రహ్మనందనుడు ఇంద్రుని చూచుటకు ఇంద్రలోకమునకు వెళ్ళెను. అపుడు ఇంద్రుడు అగ్నివంటి తేజస్సుగల బ్రాహ్మణుడు సర్వజ్ఞుడు జ్ఞానపండితుడైన నారదుడు వచ్చుచున్నవానిని చూచెను. మధుపర్కాదులతో పూజించి భక్తితో శిరసును వంచి పవిత్రమైన ఆసనమున కూర్చుండబెట్టి మునిపుంగవుని కుశలప్రశ్నలడిగిరి.

ఇంద్ర ఉవాచ - ఇంద్రుడు పలికెను.

నారద ఉవాచ - నారదుడు పలికెను.

ఇంద్ర ఉవాచ - ఇంద్రుడు పలికెను.

'నారదా! ఎక్కడనుండి తమ రాక? ఎందుకు రాక? మహామునీ! నీకు ఏ ప్రియమును చేయవలయును' అనగా నారదుడు ఇట్లు పలికెను. 'దేవరాజా! నీవు అంత చేసితివి. భక్తితో మాట్లాడితివి. మహాప్రాజ్ఞా! సంతోషించితిని. నీ ప్రశ్నకు సమాధానమును చేప్పెదను. ఇపుడు నీ మందిరమునకు భూలోకమునుండి వచ్చితిని. నహుష పుత్రుని చూచి నిన్ను చూచుటకు వచ్చితిని. అపుడు ఇంద్రుడిట్లు పలికెను. 'భూమండలమున సత్యధర్మములతో ఏ రాజు పాలించుచున్నాడు? అన్ని ధర్మములు కలవాడు, శాస్త్రములను చదివినవాడు, జ్ఞానము కలవాడు గుణములు గలవాడు, వేదములు తెలిసిన బ్రాహ్మణులకు ప్రియుడు బ్రాహ్మణులందు ప్రీతికలవాడు, శూరుడు, యజ్ఞములు చేయువారు దాత చక్కని భక్తికల రాజెవ్వరు?' అని అడిగెను.

నారద ఉవాచ - నారదుడు పలికెను.

ఈ గుణములతో కూడియున్నవాడు నహుషుని పుత్రుడు బలవంతుడు అతని సత్యముతో వీర్యముతో అన్ని లోకములు ప్రతిష్టించబడినవి. నహుషుని పుత్రుడైన యయాతి భూలోకమున మీవంటివాడు. మీరు స్వర్గమున అతను భూలోకమున ఐశ్వర్యమును పెంచువారిగా ఉన్నారు. తండ్రి కంటే శ్రేష్ఠుడు. నూరు అశ్వమేధములను, నూరు వాజపేయములను యయాతి మహారాజుగావించెను. అతను భక్తితో చాలా దానములను చేసెను. వేలు లక్షలు కోట్లు ఆవులను దానము చేసెను. అట్లే లక్షల కోట్ల హోమములను గావించెను. ఎన్నో భూమిదానములు, ఇతర దానములను బ్రాహ్మణులకు అతను చేసెను. అతను అన్ని కర్మల స్వరూపము, ధర్మపరిపాలనము. నహుషుని పుత్రుడైన యయాతి ఇట్టి గుణములు కలవాడు. స్వర్గములో తాము చేయుచున్నట్లు యయాతి మహారాజు 80 వేల సంవత్సరములు రాజ్యపరిపాలనమును గావించెను.

సుకర్మోవాచ - సుకర్మ పలికెను.

మునీశ్వరుడైన నారదునివలన ఈ విషయమును వినిన దేవేన్దుడు మేధావి చక్కగా ఆలోచించి యయాతి ధర్మముగా పరిపాలించుచున్నాడని విని భీతిచెందెను. పూర్వము నహుష చక్రవర్తి నూరు యజ్ఞముల ప్రభావముతో ఇంద్రపదమును పొంది దేవరాజాయెను. శచీదేవి బుద్ధి ప్రభావముతో నహుషుడు పదవీభ్రష్టుడాయెను. ఈ యయాతి కూడా అట్టివాడే. తండ్రితో సమానమైన పరాక్రమము కలవాడు. తప్పక ఇంద్రపదవిని పొందును. ఇందులో సందేహము లేదు. ఏదో ఒక ఉపాయముతో యయాతిని ఇచటికి తీసుకొని వచ్చెదను. యయాతికి భయపడిన ఇంద్రుడు ఇట్లు ఆలోచించసాగెను. యయాతి మహారాజు వలని భయముతో యయాతి మహారాజును తీసుకొని వచ్చుటకు దూతను పంపెను. సర్వకామ సమన్వితమైన నహుషుని విమానమును సారధి మాతలితో పంపెను. నహుషాత్మజుడైన యయాతి ఉన్నచోటునకు మాతలి వెడలి సభలో ఇంద్రునివలె శోభించుచున్న యయాతిని చూచి మాతలి సత్యభూషణుడైన యయాతితో నేను దేవరాజైన ఇంద్రుని సారధిని, మాతలిని. 'రాజా! నా మాటను వినుడు. దేవరాజైన ఇంద్రుడు పంపగా నీ వద్దకు వచ్చితిని దేవరాజు చెప్పినదంతయూ మీరు చేయవలయును. ఇపుడు తాము ఇంద్రలోకమునకు రావలయును.

మహాతేజస్వి అయిన ఇలరాజు తన పుత్రునికి రాజ్యమును అప్పగించి ఉత్తమమైన అన్యేష్టిని ఆచరించి స్వర్గమున విరాజిల్లుచున్నాడు. మహాపరాక్రమవంతుడైన పురూరవుడు, మహామనస్వి అయిన విప్రచిత్తి శిబి స్వర్గములోనే ఉన్నాడు. మనువు ఇక్ష్వాకు మహారాజు, మేధావియైన సగర చక్రవర్తి, మీ నాన్నగారైన నహుషచక్రవర్తి, కృతజ్ఞుడైన ఋతవీర్యుడు, శంతనుడు, భరతుడు, యవనాశ్వుడు, నరేశ్వరుడైన కార్యవీర్యుడు చాలా యజ్ఞములనాచరించి స్వర్గమున ఆనందించుచున్నారు. ఇతర రాజులు కూడా యజ్ఞకర్మతత్పరులైన వారందరు స్వర్గమున ఇంద్రునితో ఆనందించుచున్నారు. ఇక తాము సర్వధర్మజ్ఞులు, సర్వధర్మములలో నున్నవాడవు. కావున మహారాజా! స్వర్గమున ఇంద్రునితో కలిసి ఆనందించుము.

యయాతి రువాచ - యయాతి పలికెను.

మాతలి రువాచ - మాతలి పలికెను.

యయాతిరువాచ - యయాతి పలికెను.

మాతలి రువాచ - మాతలి పలికెను.

యయాతిరువాచ - యయాతి పలికెను.

‘మీరు ఇంద్రుడు నన్ను స్వర్గమునకు రమ్మని అర్థించునంతటి పుణ్యమును నేనేమి చేసితిని?' అని అడుగగా మాతలి ఇట్లు పలికెను. 'రాజా! తాము 80 వేల సంవత్సరములు యజ్ఞములచే దానపుణ్యాది కర్మలను సాధించితిరి. మహారాజా! మీరాచరించిన కర్మలచే స్వర్గమునకు వెళ్ళుడు. దేవరాజైన ఇంద్రునితో మైత్రిని చేయుడు. స్వర్గమునకు వెళ్ళుడు. పాంచభౌతికశమును భూమిపై విడిచి దివ్యరూపమును పొంది మనసు కోరిన భోగములను పొందుడు. భూమిపై చేయబడిన యజ్ఞదాన తపములు స్వర్గభోగములను అనుభవించమని ప్రార్థించుచున్నవి.” అనగా యయాతి ఇట్లు పలికెను.

‘సుకృతదుష్కృతములను సాధించిన శరీరమును విడిచి తాను సంపాదించిన లోకములకెందుకు వెళ్ళవలయును' అని ప్రశ్నించగా మాతలి ఇట్లు బదులు పలుకుచున్నాడు. 'పాంచభౌతికశరీరమును సంపాదించిన చోటనే విడిచి దివ్యలోకములకు దివ్యశరీరముతో వెళ్ళవలయును. పాపములను, పుణ్యములను సాధించు ఇతర మానవులు కూడా ఆచరించిన శరీరమును విడిచి అధోలోకములకు ఊర్థ్వలోకములకు వెళ్ళేదరు.” అనగా యయాతి మరల ఇట్లు పలికెను. 'మాతలీ పాంచభౌతిక శరీరముతో నరులు సుకృతదుష్కృతములను సంపాదించియే ఊర్థ్వ అధో లోకములకు వెళ్ళేదరు కదా! భూమిలో కాయమును విడుచుటలో విశేషమేమిటి? పాపపుణ్య ప్రభావము వలన కాయము పతనమగును. మానవలోకమున ఈ విషయము ప్రత్యక్షముగా కనపడుచున్నది. ఇందులో పాపమెక్కువో పుణ్యమెక్కువో ఆ విశేషము కనపడుటలేదు. సత్యాధర్మాదికర్మలను చేసిన శరీరమును ఆ శరీరముతో సంపాదించిన పాపపుణ్యములను అనుభవించుటకు ఆ శరీరమును ఎందుకు విడిచిపెట్టవలయును? ఆత్మ కాయము ఈ రెండు మిత్రులు కదా! మిత్రుడైన శరీరమును విడిచి ఆత్మ నిశ్చింతగా ఎట్లు వెళ్ళగలదు?

మాతలిరువాచ - మాతలి పలికెను.

యయాతిరువాచ - యయాతి పలికెను,

మాతలి రువాచ - మాతలి పలికెను.

రాజా! నీవు నిజమును చెప్పితివి. ఆత్మకాయమును విడిచి వెళ్ళును. శరీరముతో ఆత్మకు ఎట్టి సంబంధము లేదు. ఈ శరీరము పంచభూతముల రూపము. సంధులతో సడలుచుండును. ముసలితనముతో పీడించబడుచున్నది. వ్యాధులచే దూషితమగుచున్నది. చాలా దోషములతో భంగపడియున్నది. కావుననే ఇక్కడ ఉండుటను కోరుకోజాలదు. ఆకులమై వ్యాకులమై జీవుడు విడిచివెళ్ళును. సత్యముతో, ధర్మములతో పుణ్యములతో దానములతో నియమములతో సంయమముతో అశ్వమేధాది యజ్ఞములతో తీర్ధములతో సంయమనములతో చక్కని పుణ్యములతో సుకృతములతో జరా రాగు పాతకములతో జరవచ్చి శరీరము కరిగిపోవును. అనగా యయాతి ఇట్లు అడిగెను. ‘జర ఎందువలన పుట్టినది? జర ఎందుకు కాయమును బాధించుచున్నది? నాకీ విషయమును విస్తరముగా తెలుపుము' అనగా మాతలి ఇట్లు బదులు చెప్పెను.

“నీకు జరాకారణమును వివరించెదను. ఈ శరీరమున జర ఎందుకు పుట్టుచున్నదో తెలిపెదను. ఈ శరీరము పంచభూతాత్మకము. శబ్దస్పర్శరూపరసగంధములను అయిదు విషయములనాశ్రయించియుండును. అట్టి కాయమును ఆత్మ విడిచినచో ఆ కాయము దాహముచేయబడుచున్నది. అగ్నిచే దహింపబడినపుడు కాయము, కాయములోని తైలముతో మండుచుండును. ఆ మంటనుండి పొగవచ్చును. పొగవలన మేఘములు, మేఘముల వలన జలము, జలమునుండి భూమి ఏర్పడును. ఆ భూమి మరల స్త్రీ రజమును విడుచునట్లు జలమును విడుచును. ఆ భూమినుండి గంధము, గంధమునుండి రసము, రసమునుండి అన్నము, అన్నమునుండి శుక్రము, శుక్రమునుండి కాయము పుట్టును. ఈ కాయము భూరూపము. భూమి గంధమును సృజించినట్లు రసముతో సంచరించును.

అట్లే అంతటా కాయము కూడా రసాధారముగా సంచరించును. దానినుండి గంధమేర్పడును. గంధమునుండి మరల రసమేర్పడును. ఆ రసమునుండి మహావహ్ని ఏర్పడును. ఇచట దృష్టాన్తమును చూడుము. కాష్ఠమునుండి పుట్టిన వహ్ని కాష్ఠమును ప్రకాశింపచేయునట్లు కాయమధ్యము నుండి రసమునుండి అగ్గి అట్లే పుట్టును. అట్లు పుట్టిన అగ్ని అచటనే సంచరించును. కాయమును పోషించుచుండును. రసము అధికముగానున్నచో జీవుడు ప్రశాంతముగానుండును. అట్లు సంచరించుచున్న అగ్ని ఆకలిగా మారును. ఆ తీవ్రమైన ఆకలి నీటితో అన్నమును కోరును. అట్లు అన్నమును, నీరును పొందును. అపుడు ఆ అగ్ని అన్నమును జీర్ణింపచేసి రక్తముగా పరిణమింపచేయును. అదే వీర్యముగా మారును. దానినుండియే యక్ష్మరోగము సంభవించును. ఇది సకల కాయమును నశింపచేయును. రసము అధికమైనచో అగ్ని శాంతించును. రసముచే పీడించబడుచో జ్వరరూపముగా మారును. మెడను, పృష్టమును, కటిని, పాయును అన్ని సంధులలో నిరోధించి కాయమున అగ్ని నిలుచును. ఆ యగ్ని అధికముగా సంచరించుచు కాయమును నిర్వహింపచేయును. రసము బంధించబడును. ఆ బంధమే బలమగును. బలాతిరేకముతో వీర్యము మర్మస్థానములను చలింపచేయును. దానివలననే కామము పుట్టును. ఇదియే శల్యముగా పీడించును. దానినే కామాగ్ని అందురు. ఇదియే బలమును నశింపచేయును. మైధున ప్రసంగముతో శరీరమునకు వినాశత్వమును కలిగించును. కామాగ్నిచే పీడించబడినవారు స్త్రీని ఆశ్రయించును. మైధున ప్రసంగముతో కామకర్శితుడై మూర్ఛచెందును.

అట్లు మూర్చచెందినందున కాయము తేజోహీనమగును. బలహాని జరుగును. బలహీనుడైనచో దుర్భలుడై అగ్నిచే ప్రేరేపించబడును. అట్లు ప్రేరేపించబడిన వహ్ని శరీరమున శుక్ర శోణితములను ప్రచరింపచేయును. శుక్రశోణితములు నశించినందున శూన్యదేహుడగును. అపుడు వాయువు ప్రచండముగా దారుణాకృతిగా మారును. అపుడు వివర్ణుడు దుఃఖసంతప్తుడు, శూన్యబుద్ధి యగును. ఇదివరకు చూచినవారి లేదా వినినవారి చిత్తమున సంచరించుచుండును. చిత్తమార్గము ఆశాపాశలోలుపమైనపుడు కాయమున తృప్తి కలుగదు. ఆ నారిని ధ్యానించునపుడు మధ్యలో విరూపము, సురూపము ఏర్పడును. ఇట్లు శోణితము మాంసము క్షీణించుటవలన కామబలహీనుడైనపుడు కామవహ్నిచే నశించబడినపుడు శరీరము వడలిపోవును. దానివలన కాముకుడు త్వరగా వృద్దుడగును. తాను చూచిన, విన్న వారితో సురతమును ఆలోచించుచుండగా అతని తేజస్సు హానిచెందును. అపుడు కాయము నాశరూపమును చెందును. మరల అగ్ని పుట్టి జరారూపముగా మారును. ప్రాణులకు క్షయరూపముగా దారుణమైన జ్వరమేర్పడును. స్థావరజఱమములరూపములన్నియూ జ్వరముతో పీడించబడి చాలాపీడతో ప్రపీడితుడై వారందరూ నాశమును చెందుదురు. ఇదియంతయూ నీకు చెప్పితిని. ఇంకా వేరే ఏది చెప్పవలయును. ఇట్లు పలుకగా మహారాజు మాతలితో ఇట్లు పలికెను.

            ఇది శ్రీ పాద్మపురాణమున రెండవదైన భూమిఖండమున వేనోపాఖ్యానమున మాతాపితృతీర్ధకథనమున అరువది నాలుగ - అధ్యాయము.