పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

27 - అధ్యాయము

లోకాధిపతియగు ఆ ప్రభువు వేన తనయుడగు పృథును సర్వరాజ్యాధిపతిగా అభిషేకించేను. ఈ పృథుచక్రవర్తి మహాబాహువు, దేవతలకు ఇంద్రునివలె విరాజిల్లుచుండెను. తరువాత బ్రహ్మ క్రమముగా అన్ని రాజ్యముల విషయమును విచారించి సైన ఆధిపత్యమును వారికీయసాగెను. బ్రాహ్మణులకు వృక్షములకు, గ్రహములకు, నక్షత్రములకు చంద్రుని రాజుగార్మములకు ధర్మయజ్ఞములకు పుణ్యములకు పుణ్యతేజములకు జలములకు తీర్ధములకు వరుణుని రాజుగా చేసెను. లందరికి కుబేరుని రాజును చేసెను. ఆదిత్యులందరికి మహాప్రాజ్ఞుడగు విష్ణువును జనహితమును కోరి అధిపతిగా స్వధర్మజ్ఞుడగు దక్షప్రజాపతిని ప్రజాపతులకు అధిపతిగా చేసెను. దైత్యులకు దానవులకు విష్ణు తేజస్సుతో కూడియున్నను. పితృరాజ్యమున (పితృదేవతలకు) సూర్యపుత్రుడగు యముని రాజును చేసెను. యక్షరాక్షస భూతములకు యోగినులందరికి మహాత్ములకు వేతాలులకు కంకాలులకు కూష్మాండులకు రాజులకు అందరికీ శూలపాణియగు

అన్ని పర్వతములకు మహాగిరియైన హిమవంతుని రాజుగా చేసెను. నదులకు తటాకములకు, బావులకు కుండములకు కూపములకు సముద్రుని అధిపతిగా చేసెను. పరమపుణ్యమగు గంధర్వుల రాజ్యమున గంధర్వులందరికి చిత్రరథుని రాజుగా చేసెను. పవిత్రమగు పరాక్రమముగల నాగులకు వాసుకిని సర్పములకు తక్షకుని రాజుగా చేసెను. గజములకు ఐరావతమును, అశ్వములకు ఉచ్చైశ్రవమును, పక్షులకు గరుడుని, మృగములకు సింహమును, గోవులకు వృషభమును, వనస్పతులకు జువ్విని రాజునుగా చేసెను. ఇట్లు అన్ని రాజ్యములకు రాజును స్థాపించి తరువాత దిక్పాలులను స్థాపించెను.

వైరాజపుత్రుడగు సుధన్వుని పూర్వదిక్కునకు రాజుగా, కర్దమపుత్రుడగు శంఖపదుని దక్షిణదిక్కునకు వరుణ ప్రజాపతి పుత్రుడగు పుష్కరుని పశ్చిమదిక్కునకు నలకూబరుని ఉత్తరదిక్కునకు రాజుగా అభిషేకించెను. ఇట్లు మహాతేజోవంతులను ఆయా దిక్కులకు రాజుగా అభిషేకించెను. వారందరూ బ్రహ్మ ఆజ్ఞతో పట్టణాలతో కూడిన సప్తద్వీపములను ఇప్పటికి ధర్మబద్ధముగా పాలించుచుండిరి.

ఇట్లు మహానుభావుడగు పృథుమహారాజు అభిషేకించబడి రాజసూయాది మహాయాగములను అనుష్టించెను. పృథుచక్రవర్తి పరమపవిత్రము దేవతలకు పుణ్యమును హితమును కోరు చాక్షుషమన్వంతరమున రాజుగా నియమించబడెను. తరువాత వైవస్వత మనువునకే రాజ్యమును నిర్దేశించెను. నీవు నన్ను జాగ్రత్తగా సేవించినచో మహానుభావుడగు పృథుచరితమును విస్తరముగా వివరించగలను. ఇదియే రాజ్యాధికార వివరణము. ఇది గొప్ప పుణ్యప్రదముగా అన్ని పురాణములలో నిశ్చయింపబడినది. కీర్తించబడినది. ఇది పుణ్యప్రదము కీర్తిప్రదము, ఆయుష్యప్రదము స్వర్గప్రదము, శుభప్రదము. ధన్యము, పుత్రులను అభివృద్దిని ఇచ్చునది. దీనిని వినినవారికి అశ్వమేధఫలము కలుగును.