పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
54 - సుకలా గృహే రతికన్దర్ప ప్రవేశః
విష్ణురువాచ - విష్ణువు పలికెను.
సుకలాదేవి ఇట్లు పలుకగా ఆ దూతి ఇంద్రునివద్దకు వెళ్ళి సుకల చెప్పినదంతా సంగ్రహముగా వివరించినది. ఆ మాటలనుచక్కగా అర్థము చేసుకొనిన ఇంద్రుడు సుకల చెప్పిన మాటలను సత్యధర్మసమన్వితముగా, సాహసముగా, ధైర్యముగా, జ్ఞానయుతముగా పలికినదిగా అర్ధము చేసుకొనెను. 'ఈ భూమిపై స్త్రీగా ఉండి ఎవరు ఇట్టి మాటలు పలుకుదురు. యోగరూపము చక్కగా, పొందికగా ఉన్నది. న్యాయజలముచే చక్కగా కడుగబడినది. ఈ సుకల పరమపవిత్రురాలు. మహానుభావురాలు. సత్యస్వరూపురాలు. ఇందులో ఏ మాత్రము సంశయము లేదు. ఈ స్త్రీ సకల లోకత్రయము, భారమును భరించగల సమర్ధురాలు.' ఇట్లు ఇంద్రుడు ఆలోచించి నిశ్చయించి మన్మధునితో ఇట్లు పలికెను. ఆ కృకల ప్రియురాలి వద్దకు నీతో కలిసి వెళ్ళేదను. ఆ మాటలను వినిన మన్మధుడు బలగర్వితుడై ఇంద్రునితో ఇట్లు పలికెను. ఆ పతివ్రత ఉన్న చోటునకు తాము వెళ్ళుడు. నేను వెళ్ళి ఆ పతివ్రత యొక్క మానము, వీర్యము, బలము, ధైర్యము, పతివ్రతమును నశింపచేతును.”
ఇట్లు పలికిన మన్మధుని మాటలను వినిన ఇంద్రుడు ఇట్లు పలికెను. 'మన్మధా! జాగ్రత్తగా వినుము. వ్యర్థముగా ఎక్కువగా మాటలాడకుము. ఆ సుకల దృఢమైనది. సత్యవీర్యములతో ధర్మకర్మలతో సుస్థిరురాలు. ఈ సకల జయింపరానిది. ఇచట నీ పురుష ప్రయత్నము ఫలించదు.' ఇట్లు పలికిన ఇంద్రుని పలుకులను వినిన మన్మధుడు కోపించినవాడై ఇట్లు పలికెను. 'నేను ఋషుల, దేవతల బలమును నశింపచేసితిని. ఇక మీరు చెప్పుడు ఈమె బలము నా ముందెంత? మీరు చూచుచుండగా ఆ స్త్రీని నశింపచేతును.
అగ్ని తేజస్సును చూచి వెన్న కరుగునట్లు నా రూపముతో తేజస్సుతో ఈమెను ద్రవింపచేతును. తాము అక్కడకు వెళ్ళుడు. ఇపుడు అచట గొప్ప కార్యమును నిశ్చయముగా చేయవలయును. మూడు లోకములను నశింపచేయు నా తేజస్సును ఎందుకు నిందించుచున్నావు?
విష్ణురువాచ - శ్రీమహావిష్ణువు పలికెను.
మన్మధుని వాక్యమును వినిన ఇంద్రుడు మన్మధా! ఇది నీకు అసాధ్యమని తలచుచున్నాను. నీవు ధైర్యమును అవలంబించి ఎంతో పుణ్యమును ఆచరించినది పుణ్యదేహ స్వయముగా పుణ్య అయిన అసాధ్యగా తలచుచున్నాను. ఇపుడు నీ పౌరుషమును, ఉగ్రవీర్యమును చూచెదను. ధనుస్సును ధరించిన నీవు బయలుదేరుము అని పలికి అతనితో రతితో, దూతితో అటకు వెళ్ళేను. ఒంటరిగా నున్నది. గొప్ప పుణ్యములు చేసియున్నది. తన ఇంటిలో తానున్నది. భర్త పాదముల ధ్యానములో నిలిచియున్నది. మంచి యోగ నిర్వికల్ప సమాధిలో చిత్తమును లగ్నము చేసి ఇతరమును ధ్యానించనట్లుగా నున్నది. అత్యద్భుతమైన రూపము. అనన్తమైన తేజస్సు కలిగియున్నది. కావున ఇంద్రునికి మోహమును కలిగించినది. మీనకేతనుడైన మన్మధుడు, ఇంద్రుడు నీలాంచితమైన భోగయుతమైన ఆమెను దర్శించిరి. సుకల కూడా చక్కని విలాసముకల మహాపురుషుని కామభావముతో సంచరించుచున్నవానిని వైశ్యుని భార్య చూచి అతను సరూపము, గుణము కలవాడు కాడని తలచెను. తామరాకుమీదనున్న నీటిబిందువు ముత్యపు కీర్తిని పొందును. అట్లే సత్యముతో కూడిన స్వభావము కూడా రాణించును. ఇట్లు ఆ పతివ్రతా స్వభావము రాణించుచున్నదని ఇంద్రుడు తలచెను. ఇతనే దూతిని నా వద్దకు పంపియున్నాడు. ఆ దూతి ఇతనిని గుణజ్ఞుడని చెప్పినది. ఇతను తన విలాసస్వభావమును, తన స్వరూపమును పలు విధములుగా నాకు చూపును. నా విషయమున కాలము బలీయమైనది. గుణవంతుడైన నా భర్త తీర్థయాత్రకు వెళ్ళెను. నాయందు ప్రీతితో ఉన్నవాడు నేను లేకుండగా ఎట్లు జీవించగలడు. సత్యమను పాషాణభారముతో మర్దించబడును కూడా. నా ప్రియుడు మంచిబుద్ధి కలవాడు గాన నా భావమును స్వీకరించి బ్రతుకును. నా కాయము చేష్టా విహీనము, మృతకల్పముగా నున్నది.
దేహము యొక్క సంతానము గ్రామప్రజలు వికారమను కర్మను స్వీకరించి నశించిరి. నాకంటే అధికునిచే కూడా చక్కని మన్మధుడు ఊర్థ్వశోభను అధికశోభను కూర్చుకొనియున్నాడు. బలవంతుడు హర్షయుక్తుడు మృతుడై చూపుతో ప్రయత్నించునట్లు నన్ను అనుభవించు కోరికకల ఇతనితో అద్భుతముగా మాటలాడెదను. ఇట్లు ఆలోచించి ఆ మహాసాధ్వి సత్యమను త్రాడుచే దృఢముగా కట్టుబడిన చిత్తము కలదై అతని అభిప్రాయమును నియమముగా తెలుసుకొనుటకు తన ఇంటి లోనికి ప్రవేశించెను.
ఇది శ్రీ పాద్మపురాణమున రెండవదైన భూమిఖండమున వేనోపాఖ్యానమున సుకలాచరితమున యాబది నాలుగ - అధ్యాయము.
