వరాహ మహా పురాణము
అధ్యాయము - 133
శ్రీవరాహ దేవుడు:
శృణు తత్త్వేన మే భూమి కథ్యమానం మయానఘే,
పురీషం ముచ్యతే యస్తు మమ కర్మ సమాచరన్.
శ్రీవరాహ దేవుడు:
భూమీ! నా అర్చనము చేయుచు మలమును విసర్జించు దోషమును గూర్చి నేను చెప్పుచున్న దానిని వినుము.
దివ్యం వర్షసహస్రం తు రౌరవే నరకే వసేత్,
పురీషం భక్షయేత్ తత్ర మహాదుఃఖ సమన్వితః.
అట్టి వాడు రౌరవ నరకమున దేవతల వేయి యేండ్లు మలము తినుచు మహా దుఃఖము ననుభవించును.
ప్రాయశ్చిత్తం వదా మ్యత్ర యేన ముచ్యేత కిల్బిషాత్,
మమకర్మ పరిభ్రష్టో విహతేనాన్తరాత్మన.
చెడిన బుద్ధితో నా ధర్మము నుండి పరిభ్రష్టు డైనవాడు పాపము నుండి విడివడు ప్రాయశ్చిత్తమును చెప్పెదను. వినుము.
ఏకాం జలమయీం శయ్యా మేకమాకాశ శాయనమ్,
ఏవం కృత్వా విధానం తు సోపరాధాత్ ప్రముచ్యతే.
నీటిలో ఒక దినము, బయలున ఒక దినము నిద్రించి ఈ అపరాధము వలన విడుదల పొందును.
ఏతత్ తే కథితం భద్రే పురీషం యః సముత్పృజేత్,
మద్భక్తేషు విశాలాక్షి అపరాధ వినిశ్చయః.
పూజా విధాన సమయమున మలము విసర్జించు నా భక్తుల అపరాధమును, ప్రాయశ్చిత్తమును నీకు తెలియ జెప్పితిని.