వరాహ మహా పురాణము
అధ్యాయము - 105
హోత:
దధిధేనో ర్మహారాజ విధానం శృణు సాంప్రతమ్.
హోత:
రాజా! ఇప్పుడు దధిధేనువు విధానమును వినుము.
అనులిప్తే మహాభాగే గోమయేన నరాధిప.
గోచర్మమాత్రం తు పునః పుష్పప్రకరసంయుతమ్,
కుశై రాస్తీర్య వసుధాం కృష్ణాజినకుశోత్తరామ్.
ఆవు పేడతో అలికిన నేలపై గోచర్మ మంత కొలతతో పూవులతో పాటుగా దర్భలు పరచి లేడి చర్మమును దర్భా సనమును ఉంచ వలయును.
దధికుంభం సుసంస్థాప్య సప్తధాన్యస్య చోపరి,
చతుర్ధాంశేన వత్సంతు సౌవర్ణముఖ సంయుతమ్.
ఏడు విధములగు ధాన్యములపై పెరుగు కుండను చక్కగా నిలుప వలయును. నాలుగవ వంతుతో బంగారు మొగము గల దూడను చేయ వలయును.
ఆచ్ఛాద్య వస్త్రయుగ్మేన పుష్పగన్దైస్తు పూజితామ్,
బ్రాహ్మణాయ కులీనాయ సాధువృత్తాయ ధీమతే,
క్షమాదమశమోపేతే తాదృశాయ ప్రదాపయేత్.
వస్త్రముల జంటతో కప్పి పూవులతో గంధముతో పూజించి, మంచి కులము, చక్కని నడవడి, బుద్ధి, ఓర్పు, అంతరింద్రియ బహి రింద్రియముల నిగ్రహము కల బ్రాహ్మణునకు దానమీ వలయును.
పుచ్ఛదేశోపవిష్టస్తు ముద్రికా కర్ణమాత్రకైః,
పాదుకోపానహౌ ఛత్రం దత్వా మన్త్ర మిమం పఠేత్,
దధిక్రామితి మన్త్రేణ దధిధేనుం ప్రదాపయేత్.
తోక దగ్గరగా కూర్చుండి ఉంగరమును కుండలము లను పాదుకలను, గొడుగును సమర్పించి “దధిక్రామ్” మొదలగు మంత్రమును పఠించుచు దధి ధేవును సమర్పింప వలయును.
ఏవం దధిమయీం ధేనుం దత్వా రాజర్షిసత్తమ,
ఏకాహారో దినం తిష్ఠేద్ దధ్నా చ నృపనందన.
ఇట్లు దధి ధేనువును దాన మొసగి ఒక పూట పెరుగు భోజనముతో గడుప వలయును.
యజమానో వసేద్ రాజంస్త్రిరాత్రంచ ద్విజోత్తమః,
దీయమానాం ప్రపశ్యన్తి తే యాన్తి పరమం పదమ్.
యజమానుడు ఒక దినమును, పుచ్చుకొన్న బ్రాహ్మణుడు మూడు రాత్రుల వరకును ఇట్లు పెరుగు భోజనముతో గడుప వలయును. ఇచ్చు చుండగా చూచిన వారును పరమ పదమున కరుగుదురు.
దశపూర్వాన్ దశపరా నాత్మానం చైకవింశకమ్,
విష్ణులోకం మవాప్నోతి యావదాభూతసంప్లవమ్,
దాతా చ దాపకశ్చైవ తే యాన్తి పరమాం గతిమ్.
వెనుక పది తరముల వారును, ముందు పది తరముల వారును తనతో పాటు మొత్త మిరువది యొక్క తరముల వారు ప్రళయ కాల పర్యంతము విష్ణు లోకమును పొందుదురు. దాతయు, ఇప్పించు వాడును పరమగతి కరుగుదురు.
యత్ర దధివహా సద్యో యత్ర పాయసకర్దమాః,
మునయో ఋషయః సిద్ధా స్తత్ర గచ్ఛన్తి ధేనుదాః.
పెరుగు నదులు, పాయసపు పంకములు కల చోటికి, మునులు, ఋషులు, సిద్ధులు ఉండు తావునకీ ధేను దానము చేసిన వారరు గుదురు.
య ఇదం శ్రావయేద్ భక్త్యా శృణుయాద్ వాపి మానవః,
సోశ్వమేధఫలం ప్రాప్య విష్ణులోకం స గచ్ఛతి.
దీనిని వినిపించు వాడును, విను వాడును అశ్వమేధ యాగ ఫలమును పొంది విష్ణు లోకమున కరుగును.