వరాహ మహా పురాణము
అధ్యాయము - 67
భద్రాశ్వుడు:
భగవన్ సితకృష్ణే ద్వే యే తే జగతి సత్తమ,
స్త్రియౌ బభూవతుః కే ద్వే సితా కృష్ణా చ కాశుభా.
కస్యాసౌ పురుషో బ్రహ్మన్ పాపకః సప్తధాభవత్,
కోసౌ ద్వాదశధా విప్ర ద్విదేహః షట్‌శిరాఃప్రభుః.
దంపత్యశ్చ ద్విజశ్రేష్ఠ కృతసూర్యోదయా దలమ్,
కస్మాదే తజ్జగదిదం వితతం ద్విజసత్తమ.
భద్రాశ్వుడు:
ఉత్తముడా! తెల్లని నల్లని స్త్రీలు ఇరువురున్నారని అందురు. వారెవరు? అందు పవిత్ర యెవ్వరు? నలుపు తెలుపుల ఇంతి ఎవరు? ఈ పాపకుడు ఏడుగా నయ్యెనట! అతడెవరు? పండ్రెండు విధముగా, రెండు దేహములతో, ఆరు శిరస్సులతో ఉండెడు ఆ పురుషు డెవ్వడు? సూర్యోదయము మొదలుకొని వారు దంపతులుగా నుందురట. ఎవని వలన ఈ జగత్తంతయు పెంపొందినది?
అగస్త్యుడు:
సితకృష్ణే స్త్రియౌ యేతే తేభగిన్యౌ ప్రకీర్తితే,
సత్యాసత్యే ద్వివర్ణా చ నారీ రాత్రి రుదాహృతా.
అగస్త్యుడు:
ఆ నల్లని తెల్లని స్త్రీలు అక్క చెల్లెండ్రు, సత్య, అసత్య అనువారు. రెండు రంగుల పడతి రాత్రి.
యః పుమాన్ సప్తధా జాత ఏకో భూత్వా నరేశ్వర,
స సముద్ర స్తు విజ్ఞేయః సప్తధైకో వ్యవస్ధితః.
ఒక్కడై ఏడు రూపములు పొందిన ఆ పురుషుడు సముద్రుడు అని తెలియ దగును. ఏడు రూపములు పొందియు ఒక్కడై యున్నాడు.
యోసౌ ద్వాదశధా రాజన్ ద్విదేహః షట్‌శిరాః ప్రభుః,
సంవత్సరః సవిజ్ఞేయః శరీరౌ ద్వే గతీ స్మృతే,
ఋతవః షట్ చ వక్త్రాణి ఏష సంవత్సరః స్మృతః
పండ్రెండుగా నయి రెండు దేహములు, ఆరు శిరస్సులు గల ఆ ప్రభువు సంవత్సర పురుషుడు, రెండు దేహములు రెండు ఆయనములు. ఆరు తలలు ఆరు ఋతువులు. ఇతడే సంవత్సర పురుషుడు.
దంపత్యం తదహోరాత్రం సూర్యాచంద్రమసౌ తతః,
తతో జగత్ సముత్తస్థౌ దేవస్యాస్య నృపోత్తమ.
ఆ ఆలు మగలు రాత్రి పగలు అనునవి. అవి చంద్రుడు సూర్యుడు అనువాని రూపమున నుండును. ఆ పరమేశ్వరుని వలన జగత్తు ఏర్పడినది.
స విష్ణుః పరమో దేవో విజ్ఞేయో నృపసత్తమ,
న చ వేదక్రియాహీనః పశ్యతే పరమేశ్వరమ్.
ఆ పరమ దైవము విష్ణువని తెలియ నగును. వేద సంబంధ మగు క్రియలు లేని వానికి ఆ పరమేశ్వరుడు కానరాడు.