అధ్యాయము - 80

రుద్రుడు:

అథదక్షిణ దిగ్వ్యవస్థితాః పర్వత ద్రోణ్యః సిద్ధాచరితాః

కీర్త్యన్తే. శిశిర పతఙ్గయో ర్మధ్యే శుక్లభూమి

స్త్రియా ముక్తలతాగలితపాదపమ్‌.

రుద్రుడు:

ఇటుపై దక్షిణ దిక్కున నెలకొన్న పర్వతముల మైదానములను గూర్చి చెప్పెదను. శిశిర పతంగముల నడుమ తెల్లని భూమి కలదు. అందు తీగలు చెట్లు కానరావు.

ఇక్షుక్షేపే చ శిఖరే పాదపై రుపశోభితమ్‌,

ఉదుంబరవనం రమ్యం పక్షి సంఘనిషేవితమ్‌.

ఇక్షుక్షేపమను శిఖరమున చక్కని చెట్లతో ఒప్పారునదియు, పక్షుల మూకలు నివసించు నదియునగు అందమైన ఉదుంబర వనము కలదు. (ఉదుంబరము = మేడిచెట్టు)

ఫలితం తద్వనం భాతి మహాకూర్మోపమైః ఫలైః,

తద్వనం దేవయోన్యోష్టౌ సేవన్తే సర్వదైవ హి.

పెద్ద తాబేళ్ల వంటి పండ్లతో ఆ వన మంతయు విరుగ బూచి నట్లుండును. దేవ యోనులు ఎనిమిది జాతుల వారు ఎల్లవేళల ఆ వనము నాశ్రయించి యుందురు.

తత్ర ప్రసన్నస్వాదు సలిలా బహూదకా నద్యోవహన్తి.

తత్రా శ్రయో భగవతః కర్దమస్య ప్రజాపతేః. నానాముని

జనాకీర్ణ స్తచ్చ శతయోజన మేకం పరిమండలం వనంచ.

అచట ప్రసన్నములు రుచి కలవి అగు జలములు గల నదులు ఎక్కవ నీరు కలవియై ప్రవహించు చుండును. అచట పూజ్యుడగు కర్దమ ప్రజాపతి ఆశ్రమము కలదు. పెక్కండ్రు ముని జనులతో నిండిన ఆ ఆశ్రమము నూరు యోజనముల వైశాల్యము కలది. మరియు అచట మండలా కారము గల వన మొకటి కలదు.

తథాచ తామ్రాభస్య శైలస్య పతంగస్య చాన్తరే

యోజన విస్తీర్ణం ద్విగుణాయతం బాలార్కసదృశ రాజీవ

పుండరీకైః సమంతతః సహస్రపత్రై రవిరలై రలంకృతం

మహత్‌ సరోనేకసిద్ధ గంధర్వా ధ్యుషితమ్‌. తస్య చ

మధ్యే మహాశిఖరః శతయోజనాయామ స్త్రింశ

ద్యోజనవిస్తీర్ణోనేకధాతు రత్నభూషిత స్తస్య చోపరి

మహతీ రథ్యా రత్న ప్రకారతోరణా.

అట్లే తామ్రాభము పతంగము అను పర్వతముల నడుమ నూరు యోజనముల వెడల్పు, దానికి రెట్టింపు పొడవు కలదియు, బాల సూర్యుని వంటివి, అన్ని వైపుల దట్టముగా నున్నవి యగు నూరు రేకుల పద్మములతో ఒప్పారెడు గొప్ప సరస్సు కలదు. దాని దగ్గర పెక్కండ్రు సిద్ధులు గంధర్వులు నివసించు చుందురు. దాని నడుమ ఒక మహా శిఖరము నూరు యోజనముల పొడవు, ముప్పది యోజనముల విస్తీర్ణము కలది కలదు. దానిపై రత్నమయములగు తోరణములు గల పెద్ద బాట ఉన్నది.

తస్యాం మహద్‌ విద్యాధరపురమ్‌. తత్రపులోమనామా

విద్యాధరరాజః శతసహస్రపరీవారః.

దాని యందు విద్యాధర పురము పెద్దది కలదు. అందు పులోముడను విద్యాధర రాజు నూరువేల పరివారముతో నుండును.

తథా చ విశాఖాచలేంద్రస్య శ్వేతస్య చాన్తరే సరః

తస్య చ పూర్వతీరే మహదామ్రవనం కనకసంకాశైః ఫలై

రతిసుగన్ధిభిః మహాకుంభమాత్రైః సర్వతశ్చితమ్‌. దేవ

గంధర్వాదయశ్చ తత్ర నివసన్తి.

అట్లే విశాఖ, శ్వేతము అను కొండల నడుమ ఒక సరస్సు కలదు. దాని తూర్పు ఒడ్డున పెద్ద మామిడి తోట కలదు. బంగారు వన్నెయు, మంచి వాసనయు, పెద్ద కుండలంతటి ప్రమాణమును గల పండ్లతో అది నిండి యుండును. దేవతలు, గంధర్వులు మొదలగు వారు అందు నివసింతురు.

సుమూలస్యాచలేన్ద్రస్య వసుధారస్య చాన్తరే త్రింశ

ద్యోజన విస్తీర్ణే పంచాశద్యోజనాయతే.

బిల్వస్థలీనామ. తత్రఫలాని విద్రుమసంకాశాని

తైశ్చ పతద్భిః స్థలమృత్తికా క్లిన్నా. తాంచ స్థలీం

సుగుహ్యకాదయః సేవన్తే బిల్వఫలాశినః.

సుమూలము, వసుధారము అను కొండల నడుమ ప్రదేశము ముప్పది యోజనముల వెడల్పు, ఏబది యోజనముల పొడవు కలది. అందు బిల్వస్థలి యను వనము కలదు. దాని ఫలము పవడముల వన్నెతో నుండును. అవి రాలి పడుచుండగా అచటి మట్టి అంతయు తడితడిగా అగుచుండును. ఆ తావునందు ఆ మారేడు పండ్లను తిను సుగుహ్యకాదులు నివసింతురు.

తథా చ వసుధార రత్నధారయో రన్తరే త్రింశ

ద్యోజనవిస్తీర్ణం శతయోజన మాయతం

సుగంధికింశుకవనం సదాకుసుమం యస్య గన్ధేన వాస్యతే

యోజన శతమ్‌. తత్ర సిద్ధా ధ్యుషితం జలోపేతం చ.

తత్ర చాదిత్యస్య దేవస్య మహదాయతనమ్‌.

సమాసేమాసే చ భగవా నవతరతి సూర్యః ప్రజాపతిః.

కాలజనకం దేవాదయో నమస్యన్తి.

వసుధార రత్నధార గిరుల నడుమ ముప్పది యోజనముల వెడల్పు, నూరు యోజనముల పొడవు గల సువాసనతో నిండిన కింశుక వనము కలదు. (కింశుకము = మోదుగుచెట్టు.) అది ఎల్లవేళల పూచు చుండును. దాని సువాసన నూరు యోజనముల వరకు వ్యాపించును. అందు సిద్ధులు నివసింతురు. మంచి నీరందుండును. నెల నెలకు సూర్య ప్రజాపతి అక్కడ దిగు చుండును. కాలమునకు జనకుడగు ఆతనిని దేవతలు మొదలగు వారు నమస్కరించు చుందురు.

తథాచ పంచకూటస్య కైలాసస్య చాన్తరే సహస్రయోజ

నాయామం విస్తీర్ణం శతయోజనం హంసపాండురం క్షుద్రసత్వై

రనా ధృష్యం స్వర్గసోపాన మివ భూమండలమ్‌.

పంచ కూటము కైలాసము అనుకొండల నడుమ వేయి యోజనముల పొడవు నూరు యోజనముల వెడల్పు గలదియు, హంసలతో తెల్లనైనదియు, నీచ మృగములు చొర రానిదియు స్వర్గమునకు మెట్టు వంటిదియునగు భూమండలము కలదు.

అథ పశ్చిమదిగ్భాగే వ్యవస్థితా గిరిద్రోణ్యః కీర్త్యన్తే.

ఇక పడమటి దిక్కు నందలి పర్వత ప్రాంతములను చెప్పెదను.

సుపార్శ్వ శిఖిశైలయో ర్మధ్యే సమన్తాద్‌ యోజన

శతమేకం భౌమశిలాతలం నిత్యతప్తం

దుఃస్పర్శమ్‌. తస్యమధ్యే త్రింశద్యోజన విస్తీర్ణం మండలం

వహ్నిస్థానమ్‌. సచ సర్వకాల మనింధనో

భగవాన్‌ లోక క్షయకారీ సంవర్తకో జ్వలతే.

సుపార్శ్వము, శిఖి అను కొండల నడుమ నూరు యోజనముల పాషాణమయము, ఎల్లప్పుడు కాలుచుండు నట్టిది, తాక రానిది అగు భూభాగము కలదు. దాని నడుమ ముప్పది యోజనముల వైశాల్యము గల మండలము కలదు. అది అగ్ని స్థానము. అచట నన్నింటిని క్షయము చేయు సంవర్తకుడను అగ్ని దేవుడు మండు చుండును.

అన్తరే చ శైలవరయోః కుముదాంజనయోః శత

యోజనవిస్తీర్ణామాతులుంగస్థలీ సర్వసత్వానా మగమ్యా.

పీతవర్ణైః ఫలై రావృతా సతీ సా స్థలీ శోభతే. తత్ర చ

పుణ్యో హ్రదః సిద్ధై రుపేతః. బృహస్పతే స్త ద్వనమ్‌.

కుముదము, అంజనము అను దొడ్డ పర్వతముల నడుమ నూరు యోజనముల విస్తీర్ణము గల మాతులుంగ వనము కలదు. (మాతులుంగము = మాదీఫలము) ఎల్ల జంతువులకును అది చొరశక్యము కానిది. పసుపు పచ్చని పండ్లతో నిండి ఆ తావు విరాజిల్లు చుండును. అందు సిద్ధులకు నెలవగు పుణ్యమగు సరస్సు కలదు. ఆ వనము బృహ స్పతిది.

తథా చశైలయోః పింజరగౌరయో రన్తరేణ సరోద్రోణీ

హ్యనేకశత యోజనాయతా మహద్భిశ్చ

షట్పదోద్ఘుష్టైః కుముదై రుపశోభితా. తత్ర చ

భగవతో విష్ణోః పరమేశ్వరస్యాయతనమ్‌.

మరియు పింజర గౌరగిరుల మధ్య ఒక జల ప్రదేశము కలదు. పెక్కు వందల ఆమడల పొడవైనది. పెద్దపెద్ద తుమ్మెదలు రొద చేసెడు కలువలతో ఒప్పారు చుండును. అది పరమేశ్వరుడగు విష్ణువు స్థానము.

తథా చ శుక్లపాండురయో రపి మహాగిర్యోరన్తరే

త్రింశద్యోజన విస్తీర్ణో నవత్యాయత ఏకః శిలోద్దేశో వృక్ష

వివర్జితః. తత్ర నిష్పఙ్కా దీర్ఘికా సవృక్షా చ స్థలపద్మినీ

అనేక జాతీయైశ్చ పద్మైః శోభితా. తస్యాశ్చ మధ్యే

పఞ్చయోజనప్రమాణో మహాన్యగ్రోధవృక్షః. తస్మిం

శ్చంద్రశేఖరోమాపతి ర్నీలవాసాశ్చ దేవో

నివసతి యక్షాదిభి రీడ్యమానః.

అట్లే శుక్లము పాండురము అను పెద్ద కొండల మధ్య ముప్పది యోజముల వెడల్పు, తొంబది యోజనముల పొడవు కల ఒక రాతి ప్రదేశము చెట్లు లేనిది కలదు. అందొక చోట బురద లేని దిగుడు బావి, కొన్ని చెట్లు కలది యున్నది. దాని సమీపమున పెక్కు జాతులకు సంబంధించిన మెట్ట తామరల తీగ పద్మములతో అలరారు చుండును. దాని నడుమ అయిదు యోజనముల వైశాల్యము గల పెద్ద రావి చెట్టు కలదు. అందు ఉమాపతి, నీలవర్ణపు వస్త్రము తాల్చిన వాడు అగు చంద్రశేఖరుడు యక్షాదులు స్తుతించు చుండగా నివసించును.

సహస్రశిఖరస్య గిరేః కుముదస్య చాన్తరే పఞ్చాశ

ద్యోజనాయామం వింశద్యోజనవిస్తృత మిక్షుక్షేపోచ్చ శిఖర

మనేకపక్షిసేవీతమ్‌. అనేక వృక్షఫలై ర్మధురస్రవై రుపశోభి

తమ్‌. తత్ర చేన్ద్రస్య మహానాశ్రయో దివ్యాభిప్రాయ నిర్మితః.

సహస్ర శిఖరము, కుముదము అనుకొండల నడుమ ఏబది ఆమడల పొడవు, ఇరువది ఆమడల వెడల్పు గల ఇక్షుక్షేపమను ఎత్తైన శిఖరము కలదు. పెక్కు విధములైన పక్షు లందుండును. పెక్కు తీరుల చెట్ల ఫలములు తీయని రసములను జాలువార్చు చుండును. అచట ఇంద్రుని ఆశ్రమము దివ్య భావములతో కూడినది కలదు.

తథా శంఖకూటఋషభయో ర్మధ్యే పురుషస్థలీ

రమ్యానేక గుణానేక యోజనాయతా

బిల్వప్రమాణౖః కంకోలకైః సుగన్ధిభి రుపేతా.

తత్ర పురుషకర సోన్మత్తా నాగాద్యాః ప్రతివసన్తి.

మరియు, శంఖకూటము, ఋషభము అను గిరుల మధ్య ‘పురుషస్థలి’ అను తావు కలదు. గొప్ప గుణములు అనేక యోజనములు విస్తారము కలది. మారేడు పండ్లంతటి కంకోలక ఫలములు మంచి వాసన కలవి అందుండును. పున్నాగ పుష్పముల రసముతో ఉన్మత్తములగు మహా సర్పము లందుండును.

తథా కపిఞ్జలనాగశైలయో రన్తరే ద్విశత

యోజన మాయామ విస్తీర్ణా శతయోజనస్థలీ

నానావనవిభూషితా ద్రాక్షఖర్జూర ఖండై రుపేతా

అనేక వృక్షవల్లీభి రనేకైశ్చ సరోభి రుపేతా సా స్థలీ.

అట్లే కపింజలము నాగము అను కొండల నడుమ, రెండు వందల యోజముల పొడవు వెడల్పులు గల ‘శతయోజన స్థలి’ కలదు. అందు పెక్కు తోటలు, ద్రాక్ష, ఖర్జూరములతో అలరారి యున్నవి. పెక్కుచెట్లు, తీగలు, సరస్సులు ఆతావున నున్నవి.

తథా చ పుష్కరమహామేఘయో రన్తరే షష్టి యోజన

విస్తీర్ణా శతాయామా పాణితలప్రఖ్యా మహతీ స్థలీ

వృక్షవీరుధవివర్జితా. తస్యాశ్చ పార్శ్వే చత్వారి మహావనాని

సరాంసి చానేక యోజనానామ్‌. దశ పఞ్చసప్త తథాష్టౌ

త్రింశద్‌ వింశతి యోజనానామ్‌ స్థల్యోద్రోణ్యశ్చ. తత్ర

కాశ్చిన్మహాఘోరాః పర్వతకుక్షయః.

అట్లే పుష్కరము, మహా మేఘము అను పర్వతముల నడుమ అరువది ఆమడల వెడల్పు, నూరామడల పొడవు గల ‘పాణితల’ మను పెద్ద మైదానము కలదు. అందు చెట్లు చేమలు ఉండవు. దాని ప్రక్క నాలుగు పెద్ద వనములు, పెక్కు యోజనముల విస్తృతి గల సరస్సులు కలవు. పది, అయిదు, ఎనిమిది, ముప్పది, ఇరువది యోజనముల ప్రమాణము కల భూములు, మైదానములు కలవు. అందు కొన్ని మహా ఘోరములగు గుహలును ఉన్నవి.