అధ్యాయము - 86

అథ తృతీయం కుశద్వీపం శృణుత. కుశద్వీపేన

క్షీరోదః పరివృతః శాకద్వీపస్య విస్తారద్‌ ద్విగుణేన.

తత్రాపి సప్త కులపర్వతాః సర్వే చ ద్వినామానః.

తద్‌ యథాకుముదవిద్రేమేతి సోచ్యతే.

ఉన్నతో హేమపర్వతః సైవ. బలాహకో ద్యుతిమాన్‌ సైవ.

తథాద్రోణః సైవపుష్పవాన్‌. కంకశ్చ పర్వతః సైవ కుశేశయః.

తథా షష్ఠో మహిషనామా స ఏవ హరి రిత్యుచ్యతే. తత్రాగ్ని ర్వసతి.

సప్తమస్తు కకుద్మాన్‌ నామ సైవ మందరః కీర్త్యతే.

ఇత్యేతే పర్వతాః కుశద్వీపే వ్యవస్థితాః.

ఇటుపై మూడవ దగు కుశ ద్వీపమును గూర్చి వినుడు. కుశ ద్వీపమును చుట్టి పాల నీరు కలదు. ఇది శాక ద్వీపమునకు రెండింతలుగా ఉన్నది. అందును ఏడు కుల పర్వతములు కలవు. అన్నింటికి రెండేసి పేర్లు. ఎట్లనగా కుముదము దానినే విద్రుమ మనియు నందురు. ఉన్నతము హేమ పర్వతము. బలాహకమే ద్యుతి మంతము. ద్రోణమే పుష్పవంతము, కంకమే కుశేశయము. ఆరవదియగు మహిషమునే హరియనియు నందురు. అందు అగ్ని నివసించును. ఏడవది కకుద్మంతము. మందర మనియు దానికి పేరు. ఇవి కుశ ద్వీపమున గల కుల పర్వతములు.

ఏతేషాం వర్షభేదో భవతి ద్వినామ సంఙ్ఞః.

కుముదస్య శ్వేత ముద్భిదం తదేవ కీర్త్యతే.

ఉన్నతస్య లోహితం వేణుమండలం తదేవ భవతి.

వలాహకస్య జీమూతం తదేవ రథాకార ఇతి.

ద్రోణస్య హరితం తదేవ బలాధనం భవతి.

కంకస్యాపి కకుద్మాన్‌నామ.

వృత్తిమత్‌ తదేవ మానసం మహిషస్య ప్రభాకరమ్‌.

కకుద్మతః కపిలం తదేవ సంఖ్యాతం నామ. ఇత్యేతాని వర్షాణి.

వీనికి దేహముల భేదము కూడ రెండేసి పేర్లతో ఏర్పడు చున్నది. కుముద పర్వతమునకు సంబంధించినది శ్వేతము. దానికే ఉద్భిదము అనియు పేరు. ఉన్నతమునకు చెందినది లోహితము. అదే వేణు మండలము. వలాహమునకు దేశము జీమూతము. దానినే రథా కారమనియు అందురు. ద్రోణ పర్వతమునకు చెందిన హరిత దేశమే బలాధానమును అగును. కంక పర్వత దేశము కకుద్మంతము. అదియే వృత్తి మంతము. మహిషమునకు మానసము. అదియే ప్రభాకరము. కకుద్మంతమునకు కపిలము దేశము. దానిని సంఖ్యాత మనియు నందురు. ఇది దేశములు.

తత్ర ద్వినామ్న్యో నద్యః. ప్రతపా ప్రవేశాసైవోచ్యతే.

ద్వితీయా శివా యశోదా సాచ భవతి.

తృతీయా పిత్రా నామ సైవ కృష్ణా భణ్యతే.

చతుర్థీ హ్రాదినీ సైవ చంద్రా నిగద్యతే.

విద్యుతా చ పఞ్చమీ సైవ ధృతిః. ఏతాః ప్రధానాః.

శేషా క్షుద్రనద్యః ఇత్యేష కుశద్వీపస్య సంనివేశః.

అందు రెండు పేర్లు గల నదు లున్నవి. ప్రతప మొదటిది అదియే ప్రవేశ. శివ రెండవది అదియే యశోద. పిత్ర మూడవది. అదియే కృష్ణ. హ్రాదిని నాల్గవది. అదియే చంద్ర. విద్యుత అయిదవది. అదియే శుక్ల. వర్ష ఆరవది. అదియే విభావరి. మహతి ఏడవది. అదియేధృతి. ఇవి ప్రధాన నదులు. తక్కినవి చిన్న నదులు. ఇది కుశ ద్వీపము నిర్మాణము.

శాకద్వీపో ద్విగుణః సంనివిష్టశ్చ కథితః తస్య చ మధ్యే మహాకుశస్తంబః.

ఏష చ కుశద్వీపో దధిమండో దేనావృతః క్షీరోదద్వి గుణేన.

కుశ ద్వీపము వైశాల్యములో నిర్మాణములో శాక ద్వీపమునకు రెట్టింపని చెప్పితిమి. దాని నడుమ పెద్ద విశాలమగు దర్భల తోటకలదు. ఈ కుశ ద్వీపము చుట్టును క్షీర సముద్రమునకు రెండింతలుగా ఉన్న పెరుగు సముద్రము కలదు.