అధ్యాయము - 132

శ్రీవరాహ దేవుడు:

స్పృశ్యమానోథ మాం భూమి వాతకర్మ ప్రముఞ్చతి,

పురీష సదృశం వాయుం వాయు పీడితమానసః.

మక్షికా పఞ్చవర్షాణి త్రయోవర్షాణి మూషకః,

శ్వా చైవ త్రీణి వర్షాణి కూర్మో వై జాయతే నవ.

శ్రీవరాహ దేవుడు:

భూదేవీ! నన్ను తాకుచు మలము వంటి అపాన వాయువును వదులు వాడు, వాయువుచే పీడింప బడిన మనస్సు కవలవాడై అయిదేండ్లు ఈగయై, మూడేండ్లు ఎలుకయై, మూడేండ్లు కుక్కయై, తొమ్మిదేండ్లు తాబేలై పుట్టును.

ఏష వై తాపనం దేవి మోహనం మమ సాంప్రతమ్‌,

యో వై శాస్త్రం విజానాతి మమ కర్మ పరాయణః,

శ్రుత్వా వాక్యం హృషీకేశం ప్రత్యువాచ వసుంధరా.

ఈ పాపమునకు ఇది నేను విధించెడు శిక్ష. ఈ తప్పు చేసిన వాడు శాస్త్ర మెరిగిన వాడు, నా భక్తు డైనను ఇదియే అతనికి శిక్ష.

ధరణి:

అతులం కర్మ కృత్త్వైవ తవ కర్మ పరాయణః,

తేషాం దేవ సుఖార్థాయ విశుద్ధిం వక్తు మర్హసి.

ధరణి:

నీ భక్తులు సరికాని పనిచేసి పరిశుద్ధి నెట్లు పొందుదురు? అట్టి వారి సుఖము కొఱకు దీనిని నిన్నడుగు చున్నాను.

శ్రీవరాహ దేవుడు:

శృణు కార్త్స్నే మే దేవి కథ్యమానం మయానఘే,

అపరాధ మిమం కృత్వా సంతరేద్‌ యేన కర్మణా.

శ్రీవరాహ దేవుడు:

దేవీ! పుణ్యురాలా! ఏ పని చేసి ఈ దోషము నుండి దాటుదురో దానిని మొత్తముగా చెప్పు చున్నాను. వినుము.

యావకేన దినత్రీణి నక్తేన చ పునస్త్రయః,

కర్మ చైవం తతః కృత్వా స చ యే నా పరాధ్యతి,

సర్వసఙ్గం పరిత్యజ్య మమ లోకాయ గచ్ఛతి.

అలసందల పిండితో మూడు దినములు, రాత్రి భోజనముతో మూడు దినములు కడపి ప్రాయశ్చిత్తము చేసికొను వాడు నాకు దోషము చేయని వాడు అగును. అన్ని అంటులను వదలివైచి నా లోకమున కరుగును.

ఏతత్‌ తే కథితం భద్రే మరుత్కర్మాపరాధినమ్‌,

దోషం చైవ గుణం చైవ యత్‌ త్వయా పరిపృచ్ఛితమ్‌.

మంచిదానా! మల వాయువునకు సంబంధించి అపరాధము చేసిన వాని దోషమును, ప్రాయశ్చిత్తము వలన కలుగు గుణమును నీకు చెప్పితిని.