లింగ మహా పురాణము
46 - శివలింగ స్థాపన ప్రాముఖ్యము
“నీ వలన జీవఛ్ఛాద్ధ విధానమును తెలిసికొనినాము. ఇఁక సమస్త దేవతా ప్రతిష్ఠఁగూర్చి వినవలెనను కుతూహలము కలిగినది. నీవు సర్వార్థ పరిజ్ఞానము గలవాడవు; శివభక్తుడవు; వేదవ్యాసుని ప్రతిరూపము అగువాడవు; వ్యాసశిష్యులలో ప్రముఖుడగు వైశంపాయనునితో సమానుడవు;” అని శౌనకాదులు ప్రశ్నించి మిన్నకుండగా - ఆకాశవాణి-
శ్లో॥ సర్వం లింగమయం లోకం సర్వం లింగే ప్రతిష్ఠితం । తస్మా త్సర్వం పరిత్యజ్య - స్థాపయేత్ పూజయేచ్చ తత్ ॥
“ప్రపంచ మంతయు శివలింగ మయమగుటచే శివలింగమునందు చరాచర జగత్తంతయు ఆధార పడియున్నది. అందువలన ఇతర దేవతాప్రతిష్ట ను పేక్షించి శివలింగమును ప్రతిష్ఠించి పూజించుచుండవలెను.”
“శివలింగ స్థాపనము అను ఖడ్గముతో బ్రహ్మాండమును భేదించి - పరమ పదమును చేరఁగలుగుదురు” బ్రహ్మవిష్ణు ఇంద్ర వరుణ కుబేరులు తదితర దేవతలందరును శివలింగములను ప్రతిష్ఠించియే తమ తమ పదవులయందు ముఖ్యులుగా విలసిల్లుచున్నవారు.
“గాన హరిబ్రహ్మాది ప్రతిష్ఠయందు ఆసక్తి లేనివారై శివలింగమును మాత్రము -సలక్షణమైన మందిరములో ప్రతిష్ఠించినచో - సర్వదేవతా ప్రతిష్ఠా ఫలమును పొందుదురు.” అని పలికినందున - మునులందరు శివనిష్ఠచే శివ ప్రతిష్ఠా మనస్కులైరి.
ఇట్లు సూతుఁడు ప్రవచించి విరమించెను.
ఇయ్యది “శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (46)వ యధ్యాయము.
Summary of chapter 154 of the Linga Mahā Purana is as follows:
The historical account of Sage Agastya is narrated, detailing his intense penance, deep devotion to Śiva, and great exploits across the southern realms of Bhāratavarsha. Through the divine grace of Mahādeva, Sage Agastya humbled the Vindhya mountains, drank the ocean to assist the devas, and established numerous sacred Śiva shrines.