లింగ మహా పురాణము
101 - పార్వతీ దేవి తపించుట, శంకరుడు మన్మథుని దహించుటయు
“సతీదేవి మేనకా హిమవంతులకు నెట్లు పుత్రిక యయ్యెనని శౌనికాదులడుగగా సూతుడు దిగువవిధము వాక్రుచ్చెను.
జగదంబ స్వేచ్ఛతోడనే మేనకాదేవి యొక్క శరీరములో ప్రవేశించి జన్మింపగా హిమవంతుఁడు జాతకర్మాది సంస్కారములఁజేయించి.
“పార్వతి” యను నామకరణముఁ గావించెను. పార్వతీ దేవి అల్లారుముద్దుగా పెరుగుచు వేదవేదాంగముల నభ్యసించి పన్నెండు ఏండ్ల ప్రాయము రాగానే అడవిలో పరమేశ్వరు నుద్దేశించి తపస్సునొనర్చుచుండగా - అమ్మవారి సహోదరి మరియొక తోబుట్టువు నిరువురు పార్వతీ తపస్సులో పాలుగొనిరి.
ఇట్లు పార్వతి తపించుచుండగా పరిసర ప్రాంతవాసులగు మునులందరు సమీపించి సర్వలోక మహేశ్వరి యొక్క అకుంఠిత దీక్షను ప్రశంసించుచుండిరి.
పార్వతీదేవి యొక్క తపస్సునకు మహేశ్వరుఁడు ప్రసన్నుఁడు కాగోరెను. అదే సమయమున తారకాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుఁడు నను ముగ్గురి పితామహుడగు తారకాసురుడు తపస్సుచే బ్రహ్మదేవుని మెప్పించి “శివుపుత్రుడు దక్క నితరులచే వధింపబడకుండునట్లు వరమును పొంది - అతుల బలసంపన్నుడునై చరాచర ప్రపంచమునంతయు లోబఱచుకొని ఇం ద్రా ద్యమరుల నోడించి విష్ణువుతో దివారాత్రములునె యెడతెఱిపి లేకుండ దివ్యసహస్ర వర్షములు పోరాడి చివరన - రథముతో స శ్రీహరిని శతయోజన దూరము పాదదోలినందున కేశవుడు పరాజితుడై వెడలిపోయెను.
తారకాసురుఁడు దానవ సహజమైన బలమున కంటె నూరురెట్లు ఎక్కువ శక్తి--
విధాత యొసగిన వరము వలన గలవాడై తమను నిరంతరము బాధించుచున్నందున దేవేంద్రుఁడు వేసారి దేవతలను వెంటనిడుకొని తమ ఆచార్యుఁడైన అంగీరస్సును (బృహస్పతిని) చేరినవాడై “భగువానుడా! తారకుడను దానవేంద్రుని బలపరాక్రమములకు తాళలేక పంజరమున పక్షులవలె మేరుగుహలో దాగియున్నాము. మా వజ్రాధ్యాయుధ ములన్నియు వానియందు కుంఠితములైనవి. విష్ణుభగవానుడు గూడ వానితో పెక్కేండ్లు పోరాడి ఓడిపోయినవాడు.” అని నివేదింపగా బృహస్పతి బ్రహ్మదేవుని సమీపించి దేవతల యిడుములను దైత్యుల ఆర్భాటమును నివేదించెను.
అంత ప్రణతార్తిహరుడైన బ్రహ్మదేవుఁడు కరుణతో ‘సురాచార్యా! మీ కష్టమును గుర్తించి తారకాసురుఁడు మరణించుటకు వలయు నుపాయమును చెప్పుచున్నాను. ఆలకింపుడు!
సతీదేవి దక్షుని నిందించి స్వదేహమును యోగాగ్నియందు త్యజించినదై హైమవతిగా జన్మించినది. అట్టి పార్వతీ దేవిపై శంకరుని మనస్సు దొరలునట్లు చేయుఁడు!
వారిరువురి శరీరసంబంధము వలన “ఆరు ముఖములు, పండ్రెండ్రు చేతులు గల స్కందుడు జన్మించి శక్తిని కేలఁబూనును. ఆతనికి - సేనాని, పావకి, స్వాహేయుడు, కార్తికేయుడు, గాంగేయుడు, శరవణభవుడు, ఇత్యాది నామాంతరము లుండును. మరియు కుమారుడు. దేవసైన్యాధిపతియై బాల్యముననే తార కాసురుని సంహరించి యమరులకు మేలు నొనగూర్చును.”
ఇట్లు ప్రవచించిన బ్రహ్మదేవునకు బృహస్పతి యమరులందరును నమస్కరించి మేరు శిఖరముఁజేరిన పిదప మన్మథుని స్మరింపగా నాతండు తన ధర్మపత్నియగు రతీదేవితోడను చెలికాడైన వసంతుని తోడ నేతెంచి ఆచార్యా! నన్ను తలచుకొనుటకు కారణంబేమిటి ? నేనేమి చేయవలెను ? అని ప్రశ్నించెను. అంత బృహస్పతి “మకరధ్వజా! పరమేశ్వరుడు పార్వతీ దేవిని ప్రేమించు నట్లు చేయుము! “అని నుడువగా మన్మథుడు శంకరుని సన్నిధానముఁజేరి పుష్పబాణములను ప్రయోగించెను. అంత మహేశ్వరుడు నవ్వుచు మూడవ కన్నుతో భీకరముగ మదనుని చూడగా ఆ నేత్రమునుండి బయలు వెడలిన అగ్నిజ్వాల మన్మథుని కాల్చివేసినందున రతీదేవి దీనురాలై బహువిధముల విలపించెను. అంత ఫాలాక్షుడు కృపతో “రతీ ! రాబోవు ద్వాపర యుగమున భృగుమహర్షి యొక్క శాపమువలన - నారాయణుడు లోక కల్యాణమునకై దేవకీవసుదేవుల కుమారుడై శ్రీకృష్ణుడు బఱగును. అప్పుడు మదనుడు శ్రీకృష్ణుని తనయుఁడైన ప్రద్యమ్నుడుగా జన్మింది. నీకు భర్త యుగును.” అని యను గ్రహింపగా రతీదేవి శివ ప్రణతయై మన్మథు ననంగునిగా స్వీకరించి నిజ నివాసమునకు జనెను,
ఇయ్యధి
“శివ విజ్ఞాన వేదిక యను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచమున (101) వ అధ్యాయము.
Summary of chapter 101 of the Linga Mahā Purana is as follows:
The narrative describes Madanadāha, detailing how the devas sent Kāmadeva, the god of love, to disrupt the intense penance of Parameśvara Śiva in order to facilitate the birth of a divine commander to slay Tārakāsura. When Kāma cast his floral arrows at Mahādeva, Prabhu Śiva opened His third eye of divine wrath, instantly reducing Kāmadeva to ashes, demonstrating the utter vanity of worldly desire before transcendent spiritual absorption.