లింగ మహా పురాణము
71 - త్రిపురదైత్య వృత్తాంతము
సంగ్రహముగా విస్తరముగాను ఆది సృష్టిని ప్రభోధించితిని. మహేశ్వరుడు పశుపతిగా, బ్రహ్మాది దేవతలు పశువులుగా నెల్లు వ్యవహరింపబడిరి ? త్రిపురాసురుల వృత్తాంతమును పూర్వము సంగ్రహముగా వినినాము. ప్రస్తుతము విస్తరించి చెప్పుమని శౌనకాదులు ప్రశ్నింపగా సూతుడు చెప్పదొడగెను.
తారకాసురుని కుమారస్వామి వధింపగా నాతని పుత్రులు- విద్యున్మాలి, తారకాక్షుఁడు, కమలాక్షుఁడు నను ముగ్గురు ఉగ్రమైన నియమము నవలంబించి తపస్సు చేయుచు తమ శరీరములను పుష్మింపజేసికొనిరి.
అంత తననుద్దేశించి తపించినందున బ్రహ్మదేవుఁడు ప్రసన్నుడై పరముల నడుగుడని వచింపగా నాచైత్యులు ప్రపంచములో గల ప్రాణులండలిచే వధింపబడ కుండుటను యాచించిరి. త్రిపురాసుకులారా ! సర్వామరత్వము ఏరికిని లభింపదు. ఇంక ఏదేని వరమును కోరుకొనుడని విధాత వక్కాణింపగా నవ్వారు పరస్పరము ఆలోచించుకొని బ్రహ్మదేవునకు నమస్కరించియు, “దేవా! ముగ్గురము మూడు పట్టణముల నధిష్ఠించి ప్రపంచమున సంచరించెదము. వేయి వత్సరములు గడచిన తరువాత- రః పురత్రయమును ఒకచో చేర్చి- ఒకే బాణముతో మమ్ము వధించు మహాపురుషుడు మాకు మృత్యువు కావలెను.” అని యడిగిరి.
చతుర్ముఖుఁడు- అట్లే యగుగాక! అని వరంబొసగి నిజనివాసమగు సత్యలోకముఁ జేరెను. మయుఁడు బ్రహ్మాదిష్టుడై తన ప్రభావముతో పురత్రయమును ఆకాశ సంచారముగా నిర్మింపనొక్కొక పత్తనము శతయోజన విస్తీర్ణముగా శతయోజన దీర్ఘముగాను సమానస్థలము గలదై యుండెను.
తారకాక్షునకు సువర్ణమయము; కమలాక్షునకు రజత (వెండి) మయము; విచున్మాలికి ఆయసంబు (ఇనుపకట్టుడము) గలదియు నగు పట్టణములు - లభింపగా ఆ పురత్రయమునందు ముల్లోకములయందలి దైత్యులు ప్రవేశించి స్థిరనివాసము నేర్పరచుకొనియు నిర్భయులై యుండిరి. నగరత్రయము లోకత్రయమువలె కనుపడుచుండెను. కల్పవృక్షములు గజములు అశ్వములు ఎత్తైన సాధములు మణితోరణములు సూర్యమండలము (బోలిన విమానములు మహోన్నతములైన గోపురములు దివ్య తరుణులు గంధర్వులు సిద్ధచారణులు చిత్ర విచిత్రములు విశ్వతోముఖంబులు నగు రథములు వాపీ కూప తటాకములు క్రీడా (విహార) స్థానములు శివాలయములు వేదశాస్త్ర విద్యాభ్యాసభవనములును మయ బ్రహ్మమహిమవలన పురత్రయము నందు నెలకొనియుండెను.
మునిపుంగవులారా ! పురత్రయమున స్త్రీలందరు పతివ్రతలై యుండిరి.
శ్లో॥ కృత్యాంపి సుమహత్ పాపమపాపైః శంకరార్చనాత్ ॥ శ్లో॥ మహాదేవేతరం త్యక్త్యా - దేవం తస్యార్చనే స్థితైః ॥
“గొప్ప చురితము నొనర్చియు శివారాధనము వలన పాపరహితులై- 6 ( మహాదేవుని కంటే నితరదైపమును విడనాడి మహేశ్వరుని పూజించుటయందే ఏకాగ్రనిష్ఠ గలిగిన వారునై త్రిపురదైత్యాచులుండిరి.
మరియు వారు విశాల వక్షస్సు, ఉన్నత భుజములు, సర్వాయుధధరత్వము, ఆకలి దప్పి లేకుండుటయు, దావాగ్ని (బోలిన చూపులు, శాంతి, క్రోధము, పొట్టిదనము, మఱుగుజ్జుతన (కుజ్జత్వము, నీలోత్పలదళకాంతి, నీలములైన ముంగురులు, మేఘగంభీర కంఠస్వరంబు గలిగియుండిరి.
మయబ్రహ్మ-- వారందరిని రక్షించుచుండెను. వారందరు శస్త్రాస్త్ర విద్యనభ్యసించి యుద్ధము నందు ఆసక్తి గలిగియుండిరి. శివుని చరణకమలముల నర్చించుటచే అతులిత పరాక్రమము గలవారై రవితో వాయువుతో దేవేంద్రునితోడను సమానమైన ప్రభావము గలవారునై దేవతలను పీడించుచు పురత్రయమున నిశ్చింతగా నుండిరి. దేవేంద్రాద్యమరులు “ దావాగ్నిచే వృక్షముల వలె పురత్రయ జ్వాలతో దహింపబడుచున్నందున నట్టి బాధకు తాళలేనివారై దేవేశ్వరుడగు శ్రీహరిఁ జేరి ప్రణమిల్లియు తమ దురవస్థను నివేదింపగా నారాయణుడు - కొంతతడవు ఆలోచించి యజ్ఞపురుషుని స్మరించెను.
అంతా నా యజ్ఞపురుషునకు దేవతలు నమస్కరింపగా శ్రీహరి “దివిషదులారా! ఈ యజ్ఞపురుషు నాశ్రయించి “ఉపసత్” అను యాగముతో పురత్రయవినాశమునకై లోక కల్యాణార్థమున్ను పరమేశ్వరు నారాధింపుడు!” అని నుడివినంతనే అమరులు సంతోషించి సింహనాదము నొనర్చియు యథేశ్వరుడైన మాధవుని అనేక విధముల నుతించిరి.
అంత పుండరీకాక్షుఁడు ప్రసన్నుఁడై దిగువ విధము వక్కాణించెను.
శ్లో॥ హత్వాచగ్వాచ భూతాని- భుక్త్వా చాన్యాయతో లిపి వా । యజేద్యది మహాదేవ మపాపో నాత్ర సంశయః II
“ప్రాణులను చంపినను దహించినను అన్యాయార్జితముతో సుఖము ననుభవించినను మహాదేవు నర్చించునెడల పట్టివాడు పరహింసాది పాపములను పోగొట్టుకొనును. ఇవ్విషయమున సంశయింప నవసరము లేదు.
పుణ్యాత్ములను సంహరింపవలదు. త్రిపురాసురులు దుర్మదులై దేవమానవాది లోకమును పీడించుచున్నందున పాపాత్ములని చెప్పవచ్చును. కాని వారు శివపూజాతత్పరులగుటఁజేసి వధింప నర్హులు కారని తెలిసికొనుడు! మరియు నిట్లు ప్రవచించెను.
శ్లో॥ కోహం బ్రహ్మాజి థవా దేవా-దైత్యా దేవారిసూదనాః । మునయ శ్చ మహాత్మానః ప్రసాదేన వినా ప్రభోః ॥
“శివానుగ్రహము లేనిది నేను త్రిపురవధ కై సంసిద్ధుఁడను కాజాలను. బ్రహ్మదేవుడు, ఇంద్రాది దేవతలును తత్సంహారమును చేయలేరు. త్రిపురాసురులైతేనో దేవానాం అరయః = శత్రవో భూత్వా- సూదనాః “అమరులను హింసించుచున్నవారు. ఇవ్విషయమై మహాత్ములగు మునులు నేమియు నొనర్పఁజాలరు.”
“విశ్వేశ్వరుఁడు, విశ్వాధారుఁడు, విశ్వామరేశ్వరుడు, పరాత్పరుఁడు, నిత్యుఁడు, ప్రాణులందరికీ ఇహపర సుఖములను కలుగఁజేయువాడు నగు మహేశ్వరుఁడు వంద్యుఁడై లీలావిలాసముగా దేవతలు దైత్యులు అను విభాగమును ఆది సృష్టిలో నేర్పరచెను. ఇదియును గాక శివలింగము నర్చించియే దేవతలు ఆమరులైరి. బ్రహ్మదేవుఁడు సృష్టికర్త యయ్యెను. నేను జగద్రక్షకుడ నైతిని. అట్టి పరమేశ్వరు నారాధింపనిచో నేరికిని కార్యము సిద్ధింపదు గదా! మనమందరము శివ లింగార్చనబలముతో త్రిపురాసురులను సంహరింపవలసి యున్నది. దైత్యులు ధర్మాత్ములై శ్రాతస్మార్తకర్మనాచరించుచు బలిషులై యున్నవారు. ఐనను యజ్ఞముతో పరమేశ్వరు నారాధించి శివలింగము నర్చించియు దైత్యులనోడించుటకు ప్రయత్నించెదము గాక !
తారకాక్ష కమలాక్ష విద్మున్మాలుల యొక్క పురత్రయము మయునిచే రక్షింపఁబడుచు స్ఫటికకాంతి గలదై అపాయములేనిదై యున్నది. అట్టి త్రిపురములను దహించుటకు త్రిణేత్రుడైన మహేశ్వరుడు దక్క ఇతరుడెవడు సమర్ధుఁడు కాడని తోచుచున్నది.
సూత ఉవాచ-
ఇట్లు శ్రీహరి వచించి “ఉపసద” మను యజ్ఞముతో పరమేశ్వరు నారాధింపగా వేలకొలది భూతములుదయించెను.
అయ్యవి శూలములను శక్తులను గదలను కత్తులను శిలలను నానావిధ ఆయుధములను హస్తముల యందు ధరించి పలురకముల వేషములు గలవై-కాలాగ్నిని ప్రళయ రుద్రుని బోలినవియునై యుండెను.
అంత శ్రీహరి భూతములకు నమస్కరించి “ త్రిపురాసుర పట్టణములను ఛేదించి దహించి ఏతెంచిన తరువాత మీరు ఎటునుండి బయలుదేరినారో ఆ ప్రదేశమునకు వెళ్లవచ్చును” అని విన్నవింపగా నా భూతములు శ్రీహరికి ప్రణమిల్లి త్రిపురములఁజేరి “ అగ్నిలో మిడుత పులుగుల వలె నశించినవి. అందువలన వేలకొలది చైత్యులు, సంతోషస్వాంతులైనాట్యము నొనర్చియు పరమేశ్వరుని వివిధరీతులలో బ్రార్ధించిరి గాన దేవతలు క్షణకాలములోనే పరాజితులై జనార్టను నాశ్రయించి తమ ఇక్కట్టును మొఱపెట్టుకొనగా శ్రీహరి మహేశ్వరానుగ్రహబలమున దేవహితమును సాధింపవలెనని నిశ్చయించుకొనెను.
త్రిపురనివాసులగు దైత్యులు ధర్మాత్ములగుటచే లోకపీడనపాపము లేనివారై అవధ్యులుగా నున్నవారని మాధవుఁడు గుర్తించి “మహాపాపాత్ములైనను శివుని పూజించుచున్నచో (ఉదకబిందువులు తామరాకు నంటునట్లు) దురితములను పటాపంచలు చేయజాలుదురు. శివారాధనముతో సుఖభోగము అవశ్యము లభించును. గాన దైత్యులు శివలింగార్చన పరులై అపాయములను తప్పించుకొని యోగక్షేమములు కలిగి యున్నవారు.” అని నారాయణుడు ఆలోచించి “నా మాయాబలముతో వీరి శివారాధనాది పుణ్యములకు విఘ్నమును కల్పించెద” నని సంకల్పించెను.
ఇట్లు తన సంకల్పము సఫలమగులుకు ఒకానొక పురుషుని పుట్టించి ప్రత్యక్ష జ్ఞానము ముఖ్యముగా గలదియు సర్వసమ్మోహనంబు నగు శాస్త్రమును పదునారు (16) లక్షల శ్లోకములలో రచించి పురుషనకు ఉపదేశించెను.
అయ్యది శ్రాతస్మార్త విరుద్ధమై వర్ణాశ్రమములు లేనిదై ఈ లోకముననే స్వర్గనరకములను నిరూపించునదియునై యుండెను.
“త్రిపురాసురులను మోహింపఁజేయుటకు వెళ్లుము!” అని శ్రీహరియాదేశింప- నాతఁడు, పురత్రయముఁ బ్రవేశింపగా త్రిపురవాసులగు దైత్యులనేకులు నా పురుషనొద్ద దీక్షఁబరిగ్రహించిరి. మాధవాజ్ఞననుసరించి నారదమహర్షి - పురుషునకు ప్రథమ శిష్యుఁడయ్యెను.
పురుషుఁడు శాక్యముని యను పేరు గలిగిన వాడై శిష్యప్రశిష్యులతో పరివేష్టింపఁబడినవాడునై వ్యభిచారముతో సుఖమునొదవజేయునట్టి స్త్రీ ప్రవర్తనము నుపదేశించి నందున తరుణులందరు భర్తల నుపేడించి సరపురుషసంగమముచే సభ్యః సుఖము కబడయుచుండిరి,
శ్లో॥ స్త్రీణాంచన సిలొ బంధుః -- సఖా మిత్రం చ బాంధవః । భరా ఏవనం : కృత్యాలు సుముహూన్ పాలయా భర్తుః ప్రేమసంయుతా । ప్రాప్నుయా సుమం స్వర్గం నరకం చ విపర్యయాత్ ॥
“స్త్రీలకు - భర్తలే తల్లి, తండ్రి, సోదరుఁడు, సఖుఁడు, మిత్రుఁడు (ద్రోహచింత లేనివాడు) చుట్టంబునగును. ఇంటించమాత్రము సంశయము లేదు”.
“కఠినవాక్కు, పరోపకారము, అసూయ, భ్రూణహత్య, శిశుహత్య, మాతా పితృద్వేషము, సోదరవైరము, బంఘచ్వేషము మొదలగు మహాపాపముల నొనర్చియైనను భర్తను మనోవాక్కాయములతో సేవించు యువతి - ఉత్తమపుణ్యలోకము నొందును. పతివిరుద్ధ ప్రవర్తనముతో నరకమునఁ బ్రవేశించును.”
ఇట్లు ధర్మశాస్త్రము ఘోషించుచున్నను త్రిపురచైత్యరసుణులు నివారింపనలవిగాని విష్ణుమాయచే మోహితలై పాల ప్రత్యమును విడనాడిరి.
పూర్వకాలములు కొంత పనితలు ఆలశ్యము మొదలగు ధర్మములను విస్తరించే ఎల్లకాలము తమ భర్తలను సేవించనందున జగతూ జ్యులైన దేవతల నారాధించినందువలనను స్వర్ణముఁజేరి ఆనందించుచున్నవారు. ఈ విధములగు ప్రబోధములను చైత్య స్త్రీలు పెడచెవిఁబెట్టి స్వేచ్ఛా విహారిణులై3.
శాక్యమున ప్రబోధమెట్టెనగా?
యాచించువారి మనోరమము నీడేర్చని జన్మగలవారి తోడనే భూభాగము సంభవించును. కాని సముద్రములలో పర్వతములతో నడుముల తోడను నేల- బరువు గలది కాదు. శరీరము పడిగా నశించునది, అర్థసచంయములు శాశ్వతములు కావు. ఇత్యాది నీతులు గలిగిన శాక్యముని కృత ప్రజోధమునకు చైత్యులు బోసగులుచే చేవదేవుడగు సదాశిపు నారాధించులుఁ జేసి సంభవించిన శ్రేయోలక్ష్మి లంతరించుటయు, అలక్ష్మీదేవి ప్రవేశించుటయు విష్ణు మాయాబలమున నేర్పడెను.
చైత్యులనేకులకు సవ్వాలి పత్నులకును మాయావేషధారియగు నారసుడు దీక్ష నొసగెను. అందువలన నా గురుశిష్యులను పురు ఎట్టి తొండు లేనివాడై సుఖాసీనులునై యుండు, మరియు పురత్రయమున శ్రాత స్మార్త సదాచారము నశించి పాషండ (నాస్తిక) ప్రవర్తనము పెంపొంచెను. మహేశ్వరునియందు భక్తి సన్నగిలెను. శివ లింగార్చనము లోపించెను. పాతి ప్రత్యధర్మము అడుగంచెను. మురాచారము చెరిగాను,
అంత, శ్రీహరి భక్త తార్థుడనైతే “నని లోలోన సంతసించి అమరులతో కూడ సర్వజ్ఞుఁడు పురుషోత్తముడు నను మహేశ్వరు నారాధించే దిగువ విధము నుతించెను.
శ్లో। మహేశ్వరాయ దేవాయ నమస్తే పరమాత్మనే । నారాయణాయ శర్వాయ- బ్రహ్మణే బ్రహ్మరూపిణే ॥ శాశ్వతాయ హ్యనంతాయ ఆవ్యక్తాయ చ తే నమః ॥
“సృష్టికర్తయగు బ్రహ్మదేవుఁడు, జగద్రక్షకుఁడగు నారాయణుఁడు. సంహార కర్తయగు రుద్రుడును నీవేను; స్వయంప్రకాశమానుడవై జీవాత్మ నంతర్యామిగా పరమాత్మవై యుండువాడవు! పరబ్రహ్మమనఁ బడునట్టి, భక్తి లేనివారికి గోచకుడు కానట్టి మహేశ్వరునకు నమస్కారము
సూత ఉవాచ –
ఇల్లు విష్ణు భగవానుడు మహేశ్వరుని ప్రశంసించి సాష్టాంగ ప్రణామంబు నొనర్చియు ఉదకమునందు నిలువబడి రుద్రాధ్యాయమును పర్యాయములు జపించెను. ఇంద్రాది దేవతలందరును –
మహాదేవ మనిర్దేశ్యం సర్వజం త్వా మనామయం । విశ్వరూపం విరూపాక్షం- సదాశివ మనామయమ్ ॥
ఇత్యాది పదునైదు (15) శ్లోకములతో పరమేశ్వరుని సుతించిరి. నమకచమకముల (డు ద్రాధ్యాయము) ను గూడ నసంఖ్యాకముగా పఠించిరి.
అందువలన పరమేశ్వరుఁడు సంతసించి పార్వతీదేవిని సంప్రదించియు సందికేశ్వరునిపై చేయి సునిచి - చిరునగువుతో, గంభీరమైన వాక్కుతోడ నమకులఁ గాంచుచుసురేశ్వరులారా! దేవకార్యమును గుర్తించితిని. విష్ణుమూర్తి యొక్క మాయాబలము, నారదుని చేపితంబు విదితములైనవి త్రిపుర దైత్యలు అధర్మనిష్టులైనారు గాన వారిని జయించి త్రిపురములను వహించెదను. అని నుడివిన వెనువెంటనే ఆమతులు మహేశ్వరునివేనోళ్ళ బొగడిరి మరియు పార్వతీదేవి లీలా కమలముతో శంకరుని స్పృశించి యిట్లు సంభాషించెను.
రవికాంతితో శోభించు షణ్ముఖుఁడు ఆడుకొనుచున్నవాడు. వాని మేనునిండ బంగారు సొమ్ములు అలరారుచున్నవి. కల్పము కపుష్పమాలిక కంఠమునందు వ్రేలాడుచున్నది. వెంట్రుకలు ముంగురులు నొసట ముడ్డుఁగొలుపుచున్నవి. పూర్ణచంద్రనిభములగు ముక్తాహారములు కటిసూత్రములుగా శోభించుచున్నవి. కస్తూరీ కుంకును తిలకము భస్మరేఖలు ఫాలప్రదేశమునందు రాణించుచున్నవి. కమలబృండమువలె నున్న ముఖషలు, ముంగు కవళికను గమనింపుడు!
సప్తమార్శకలు గంగాదేవియు స్వాహాజేవియు పద్మ సత్పుతములగు దీనినేత్రములకు కాటుక నలచులు ఎంతో మనోహరములుగా కన్పట్టుచున్నవి. ఇట్టి అనుపమాన లావణ్య రాశియగు కుమారు నవలోకింపుడు !
జగడంబ ఇట్లు పంపగా - మహేశ్వముఁడు స్కందునివదనారవించుమును ముద్దాడుకొని వానిని కౌగలించుకొనియు చైత్యశ స్త్రహస్యమానులై బాధపడునట్టే చేవేం బాచులను పేక్షించి బాలుడా! ఆడుము! “అని వచింపగానే భక్తార్తిహరుఁడగు ‘హరాత్మజుడు లీలానాల్యుముఁజేయుచుండగా ప్రమథగణాధిపతులు, త్రిలోకీ నివాసులగు భక్తులు, ఇంద్రాది దేవతలు, నాగజాతులు, నందరు ఆడుచు సాడుచున్నందున అమ్మవారు మాతృగణంబు ఆనందించిరి. అంతరిక్షదేవతలు పుష్పములఁగుడిపించిరి. గంఫర్సకిన్నరులు సంగీతముల (బాడుచుండిరి. పార్వతీపరమేశ్వరులు అమృతముఁడ్రాగి పుత్రవాత్సల్యమున నృత్యమునొనర్చుచుండిరి.
అంత పరమేశ్వరుఁడు పార్వతీదేవితో, షణ్ముఖునితోడను, నందికేశ్వరుని తోడను దివ్యభవనములో ప్రవేశింపగా-హరి బ్రహ్మాది దేవతలు భవనమహాద్వారము ముందున్నవారై కొద్దిగా పరితపించుచు- ఇదియేమి ? ఇదియేమి ? యనుచు ఒకరినొకరు గాంచుచు “మనము అభాగ్యుల మైతిమి. దైత్యులే భాగ్యవంతులైరి. త్రిపురాసురులు అనన్య భక్తితో గావించిన శివపూజనము యొక్క ఫలము కాబోలు నని చింతించుచుండగా- కుంభోదరుడు అను గణేంద్రుఁడు చండముతో దండించినందున నమరులలో కొందరు హాహాకారము (జేయుచు భయసంభ్రాంతులై పారిపోయిరి. మునులును నేలఁబడిరి. మరికొందరు హృదయములో ప్రణవఘటిత పంచాక్షర మహామంత్రమును స్మరించినందున ప్రసన్నుడైన పార్వతీపతి యొక్క సమ్మతిని నందికేశ్వరుడు వృషారూఢుడై అమరుల సమక్షమునకేతెంచెను.
త్రిశూలమును కేలఁబూనిమందార పుష్పమాలికను మెడఁదాల్చియు మకరకుండలములను ధరించి రత్నకంకణములను ముంజేతులఁదొడిగియు గదను పట్టుకొనియు జటాజూటముతో నందికేశ్వరుడు శోభించుచుండెను.
కుంభోదరుఁడు నందికేశ్వరు నవలోకించి శిరస్సు వంచి నమస్కరించెను. విశాలమైన తెల్లని గొడుగు నందికేశ్వరుని ప్రీత్యర్ధము దేవాంగనలచే పట్టుకొనబడెను. గొడుగు క్రించనుండుముక్తాహారము ఆకాశగంగానది బోలినదైయుండెను.
దేవేంద్రాజ్ఞప్తులై దేవదుందుభులను ఖేచరులు మ్రోగించుచుండగా మునిపుంగవులు వైదిక పౌరాణికస్తోత్రములను చదువుచుండిరి. పైనుండి కురిసిన పుష్పములు వృషభముపై నక్షత్రముల వలె నగుపడుచుండెను. ఆకాశప్రదేశమంతయు పుష్పములతో నిండి చూడసొంపుగా నుండెను.
అట్టి నందికేశ్వరుఁగాంచి దేవతలు –
శ్లో॥ నమస్తే శివభక్తాయ-రుద్రజాప్యరతాయ చ । శివభకార్తి నాశాయ యోగినాం పతయే నమః ॥
ఇత్యాది శ్లోకములతో ప్రార్థింపగా నందికేశ్వరుడు ప్రసన్నుఁడై అమరులారా ! రథమును సారథిని ధనుస్సును బాణమును సిద్ధపలచి పురత్రయవినాశమునకై కడంగుడు !” అని ప్రవచించెను.
బ్రహ్మదేవుఁడు, అమరులును సంప్రదించుకొనినవారై చతుర్దశభువన సారముతో సువర్ణ రథమును విశ్వకర్మతో నిర్మింపఁజేసిరి. రథచక్రాదులను వివరింపగల నని సూతుడు విశ్రాంతికై విరమించెను.
ఇయ్యది “ శీవ విజ్ఞాన వీచిక’’ అను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (71)వ అధ్యాయము.
Summary of chapter 71 of the Linga Mahā Purana is as follows:
Nandīśvara, the supreme attendant of Mahādeva, delivers a profound discourse detailing the subtle secrets of Śiva worship, the nature of cosmic time, and the supreme efficacy of sacred vows. Nandīśvara reveals that no spiritual attainment is higher than direct devotion to Śiva, encouraging all seekers to take refuge in the divine feet of Parameśvara.