లింగ మహా పురాణము
82 - సర్వపాపహరమగు వ్యపోహనస్తవము
“విశేషేణ అపోహ్యతే పాపం దూరీక్రియతే అనే నేతి వ్యపోహనః”
“దీని చేత పాపము మిక్కిలి (అనగా సంచిత ఆగామిదురితమంతయు) పోగొట్టబడును గాన వ్యపోహనస్తవ మనబడునని నిర్వచనము.”
సూత ఉవాచ-సూతముని చెప్ప దొడఁగెను.
శ్లో॥ వ్యపోహనస్తవం వక్ష్యే- సర్వసిద్ధి ప్రదం శుభం । నందిన శ్చ ముఖా ఛ్ఛృత్వా కుమారేణ మహాత్మనా ॥
శ్లో॥ వ్యాసాయ కథితం తస్మాత్ బహుమానేన వై మయా ॥
బ్రహ్మ దేవుని వలన స్వీకరించి నందికేశ్వరుఁడు పఠించుచుండగా వినిన కుమార స్వామిచే వేదవ్యాసునకు నిర్వచింపబడినదియు, వేదవ్యాసునకు ప్రాధేయపడి నేను సంపాదించినదియు సర్వసిద్ధిప్రదము, శుభ కరంబు నగు వ్యపోహనము అను శివునుద్దేశించిన స్తవమును చెప్పుచున్నాను. సావధానులై ఆకర్ణింపుఁడు! మంగళాచరణము.
శ్లో॥ నమః శివాయ శుద్ధాయ నిర్మలాయ యశస్వినే । దుష్టాంతకాయ సర్వాయ భవాయ పరమాత్మనే ॥
ఐహిక ఆముష్మిక శ్రేయఃప్రదాత, శుద్ధసత్త్వగుణసంపన్నుఁడు, ఆణవ మాయికకార్మిక ములములు లేనివాడు, లోకవేదప్రగీత కీర్తి గలవాడు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములను నిర్నిమిత్తముగా లోకమును బాధించు దుష్టశత్రువులను సంహరించువాడు, సమస్త జగదంతర్యామియు, జగత్ర్సష్టయు, జీవాత్మ నంతర్యామియు నగు శివునకు నమస్కారము. (స్తవ ప్రారంభమున సమస్కారాత్మకమగు మంగళాచరణము ఈ శ్లోకములో కలదు.)
సదాశివ ప్రార్ధనము
శ్లో॥ పంచవక్త్రో దశభుజో- హ్యక్షపంచదశై ర్యుతః । శుద్ధస్ఫటిక సంకాశః సర్వాభరణభూషితః ॥ శ్లో॥ సర్వజ్ఞః సర్వగః శాంతః సర్వోపరి సుసంస్థితః । పద్మాసనస్థః సోమేశః - పాప మాశు వ్యపోహతు ॥ శ్లో॥ ఈశానః పురుష శైవ అఘోర స్యద్య ఏవ చ । వామదేవ శ్చ భగవాన్ - పాప మాసు వ్యపోహతు ॥
సర్వోపరి = బ్రహ్మవిష్ణు గణేశ కుమార అంబికాలోకములపై గల శివలోకమున,సుసంస్థితః = స్థిరముగా నుండువాడు;
“ఉమాదేవితో కూడియుండు ఈశ్వరుడు సోమేశుడు” “ అక్షపంచడశైర్యుతః = పదియైదు (15) కన్నులు గలవాడు” “సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానములనబడు ఐదు ముఖములు గలవాడు పంచవక్త్రుడు”. “ పై పేరులతో విడివిడిగా పంచ బ్రహ్మావతారములు గలవాడని. “ఈశానః పురుషవ” ఇత్యాది శ్లోకమునకు అర్థము.
శివావతార ప్రార్ధనము శ్లో॥ అనంతః సర్వవిద్యాశః సర్వజ్ఞః సర్వదః ప్రభుః ॥ శివధ్యానైకసంపన్నః - సమే పాపం వ్యపోహతు ॥
“విద్యేశ్వరులందరికి అధిపతియైన అనంతుడు అను శివావతారము శివధ్యానమునే ముఖ్యముగా గావించువాడగులుచే నాపాపమును పోగొట్టుగాక !”
శ్లో॥ సూక్ష్మః సురాసురేశానో విశ్వేశో గణపూజితః । శివధ్యానైక సంపన్న: సమే పాపం వ్యపోహతు ॥
‘‘సూక్ష్మడు శివావతారమేను.”
శ్లో॥ శివోత్తమోమహాపూజ్య:- శివధ్యానపరాయణః । సర్వగః సర్వదః శాంత: - సమే పాపం వ్యపోహతు ॥ శ్లో॥ ‘త్రిమూర్తి ర్భగవానీశః శివభక్తిప్రబోధకః । శివధ్యానైక సంపన్నః సమే పాపం వ్యపోహతు ॥ శ్లో॥ శ్రీకంఠః శ్రీపతిః శ్రీమాన్ శివధ్యానరత స్సదా । శివార్చనరతః శ్రీమాన్ -సమే పాపం వ్యపోహతు ॥
“శివోత్తముడు, ఏకాక్షుడు, త్రిమూర్తి, శ్రీకంఠుడు, శిఖండి ననువారును శివావతార ములేను”
దేవీ ప్రార్ధనము
శ్లో॥ త్రైలోక్యనమితా దేవీ- సోల్కాకారా పురాతనీ । దాక్షాయణీ మహాదేవీ- గౌరీ హైమవతీ శుభా ॥ శ్లో॥ ఏక పర్ణా గ్రజా సౌమ్యా తథావై చైకపాటలా । అపర్ణా వరదా దేవీ - భక్తత్రాణపరాయణా ॥ శ్లో॥ ఉమాఽ సురహరా సాక్షాత్ - కౌశికీ వా కపర్దినీ । ఖట్వాంగధారిణీ దివ్యా- కరాగ్రతరుపల్లవా ॥ శ్లో॥ నైగమేయాదిభి ర్దివ్యై- శ్చతుర్భిః పుత్రకై ర్వృతా ।
శ్లో॥ మేనాయా నందినీ దేవీ వారిజా వారిజేక్షణా । అంబా యా వీతశోకస్య నందిన శ్చ మహాత్మనః ॥ శ్లో॥ శుభావత్యాః సఖీ శాంతా పంచచూడా వరప్రదా । స్పష్ట్యంర్ధం సర్వభూతానాం ప్రకృతిత్వం గతాఽవ్యయా ॥ శ్లో॥ త్రయోవింశతి స్తత్త్యై - ర్మహదాడ్యై ర్విజృంభితా । లక్ష్మ్యాది శక్తిభి ర్నిత్యం - నమితా నందనందినీ ॥ శ్లో॥ మనోన్మనీ మహాదేవీ - మాయావీ మండనప్రియా । మాయయాయా జగత్సర్వం- బ్రహ్మాద్యం సచరాచరమ్ ॥ శ్లో॥ క్షోభిణీమోహినీ నిత్యం- యోగినాం హృది సంస్థితా । ఏకానేకస్థితాలోకే ఇందీవరనిభేక్షణా ॥ శ్లో॥ భక్త్యా పరమాయా నిత్యం- సర్వదేవై రబిష్ణుతా । గణేంద్రాంభోజ గర్భేంద్ర-యమ విత్తేశపూర్వకైః ॥ శ్లో॥ సంస్తులా జననీ తేషాం- సర్వోపద్రవ నాశినీ । భక్తానామార్తిహా భవ్యా- భవభావవినాశినీ ॥ శ్లో॥ భుక్తిముక్తిప్రదా దివ్యా - భక్తానామ ప్రయత్నతః । సామేసాక్షాస్మహాదేవి- పాపమాశు వ్యపోహతు ॥
సోల్కాకారా = మెరుపుతో సరిచూగు ఆకారము గలది; కరా గ్రతను పల్లవా - శివపూజనార్థము కోమల బిల్వదళములు కరాగ్రమందు కలది; వీతశోకస్య నందిన: అంబా = దుఃఖరహితుఁడైన నందికి జనని; శుభావత్యాః సఖీ -- శుభావరియను చెలికత్తెకు ప్రియముఁగొలుపునది; చాక్షాయణి, గౌరి,
ఏకపర్ల, ఏకపాలుల, ఆపర్ల, ఉమ, కానికి, వారిజు, పంచచూడ, నందినందిని. మనోన్మని, మాయావి, ఇత్యాది నామధేయములు గల జగదంబాదేవి- నా పాపమును పోగొట్టుగాక!
చండీశ్వర ప్రార్ధనము
శ్లో॥ చండ: సర్వగణేశానో-ముఖా చ్ఛంభో ర్వినిర్గతః । శివార్చన రతః శ్రీమాన్-సమే పాపం వ్యపోహతు ॥
నందికేశ్వర ప్రార్ధనము
శ్లో॥ శాలంకాయనపుత్రస్తు- హలమార్గోష్ఠితః ప్రభుః । జామాతా మరుతాం దేవః - సర్వభూతమహేశ్వరః ॥ శ్లో॥ సర్వగః సర్వదృక్ శర్వః సర్వేశసదృశః ప్రభుః । సనారాయణకై ర్దేవైః సేంద్రచంద్రదివాకరైః ॥ శ్లో॥ సిద్ధైశ్చ యక్ష గంధర్వై - ర్భూతై ర్భూతవినాయకైః । ఉరగై ఋషిభి శ్చైవ - బ్రహ్మణా చమహాత్మనా ॥ శ్లో॥ స్తుత స్రైలోక్యనాథస్య-మునే రంతఃపులే స్థితః । సర్వదా పూజితః సర్పై-ర్పందీ పాపం వ్యపోహ తు ॥ శ్లో॥ మహాకాయో మహాతేజా-మహాదేవ పరాయణం । శివార్చనరతః శ్రీమా సుయకా ప్రాణ నాయకః ॥
గణేశ ప్రార్ధనము
శ్లో॥ మేరుమంచర కైలాస-తలు కూలు ప్రభే చనః । ఐరావతాదిభిర్దివ్యై-ర్చిగ్గజై శ్చ సుపూజితః ॥ శ్లో॥ సప్తపాతాలపాద శ్చ- సప్తద్వీపోరుజంఘకః । సప్తార్లవాంకుశ శ్చైవ - సర్వతీర్థోదరః శివః ॥ శ్లో॥ ఆకాశదేహో దిగ్బాహుః - సోమసూర్యాగ్నిలోచనః । హతాసుర మహావృక్షో - బ్రహ్మవిద్యామహోత్కటః ॥ శ్లో॥ బ్రహాద్యాధోరణైర్దివ్యై -ర్యోగపాశసమన్వితైః । బద్ధో హృత్ పుండరీకాఖ్యే -స్తంభేవృత్తిం నిరుద్ధ్య చ ॥ శ్లో॥ నాగేంద్రవక్త్రో యః సాక్షాత్ - గణకోటిశతై ర్వృతః । శివధ్యానైకసంపన్న:- సమే పాపం వ్యపో హతు ॥
మేరు పర్వత మంచరాద్రి కైలాసభూధరముల యొక్క చయయలయంచలి కొమ్ములను భేధకమువాడు: ఇరా.. తాటి దివ్య దిగ్గజములతో పూజింపఁబడు పొడు; సప్తపాతాళములు పాదములుగా గలవాడు; సప్త ద్వీపములు తొడలు పిక్కలుగా గలవాడు; సప్తసము ప్రములు అంకుశముగా గలవాడు; సమస్తపుణ్యతీర్థములు కడుపులో గలవాడు; ఆకాశపు శరముగాను దిశలు చేతులుగాను సూర్యచంద్రాగ్నులు నేత్రములు గాను గలవాడు అసురులు అను మహావృక్షములను నరుకువాడు; బ్రహ్మవిద్యచే గొప్పగా రాణించువాడు; మావటివారుగా బ్రహ్మాదులడే తమ చిత్తవృత్తిని నిరోధించి- ధ్యానము అను పాశముతో హృత్పుండరీకము అనుస్తంభమునకు కట్టివేయు బడినవాడు; గజేంద్రవదనుఁడు; శతకోటిగణములతో కూడినవాడు; శివధ్యానైకసంపన్నుఁడు నగు వినాయకుఁడు - నా పాపమును పోగొట్టుగాక!
భృంగీశ్వర ప్రార్ధనము
శ్లో॥ భృంగీశః పింగళాక్షో ఽసౌ- భసితాశస్తు దేహయుక్ । శివార్చనరతః శ్రీమాస్-సమే పాపం వ్యపోహతు ॥
(భసితాశః - భస్మను తినువాడని యర్థము)
కుమారస్వామి ప్రార్ధనము
శ్లో॥ చతుర్బిస్తనుభి ర్నిత్యం సర్వాసురసిబర్హణః । స్కందః శక్తిధరః శాంతః - సేనాని: శిఖవాహనః ॥ దేవ సేనాపతి: శ్రీమాన్ సమే పాపం వ్యపోహతు ।
రేలుగడ్డియందు జాలిపడిన స్కందరూపముతో, శక్తి యను ఆయుధమును ధరించిన రూపముతోడను, దేవతా సైన్యాధిపత్యము గల రూపముతోడను, నెమలి నెక్కెన రూపముతోడ నసురులఁదును మూడువాడు - గాన-నాలుగు శరీరములు గలవాడు కుమారస్వామియని యర్థము.
అష్టమూర్తి ప్రార్ధనము
శ్లో॥ భవః శర్వస్తథేశానో - రుద్రః పశుపతి స్తథా ॥ ఉగ్రో భీమో మహాదేవః శివార్చనరతా స్సదా । శ్లో॥ ఏతా: పాపం వ్యపోహంతు -మూర్తయః పరమేష్ఠినః ॥
ఏకాదశరుద్ర ప్రార్ధనము
శ్లో॥ మహాదేవః శివోరుద్రః- శంకరో నీలలోహితః । ఈశానో విజయో భీమో - దేవదేవో భవోద్భవః ॥ శ్లో॥ కపాలీశ శ్చ విజ్ఞేయోమ రుద్రా రుద్రాoశసంభవాః । శివ ప్రణామసంపన్నా- వ్యపోహంతు మలం మమ ॥
ద్వాదశాదిత్య ప్రార్ధనము
శ్లో॥ వికర్తనో వివస్వాంశ్చ-మార్తండో భాస్కరో రవిః । లోక ప్రకాశక శ్చైవ- లోకసాక్ష్మీ త్రివి క్రమః ॥ శ్లో॥ ఆదిత్య శతథా సూర్య- శాంశుమాంశ్చ దివాకరః । ఏతేవై ద్వాదశాదిత్యా-వ్యసోహంతు మలం మము ॥
ఆకాశాది అష్టమూర్తి,న ప్రార్ధనము
శ్లో॥ గగనం స్పర్శనం తేజో రస శ్చ పృథివీ తథా । చంద్రసూర్యస్తథాఽత్మాచ తనపః శివభావితాః ॥ శ్లో॥ పాపం వ్యపోహంతు మమ భయం నిర్నాశయంతు మే ।
దశదిక్పాలక ప్రార్ధనము
శ్లో॥ వాసవః పావక శ్చైవ-యమో నిఋతి రేవ చ । వరుణో వాయు సోమౌచ- ఈశానో భగవాన్ రి: ॥ పితా మహశ్చ భగవాన్ - శివధ్యానపరాయణాః ॥ శ్లో॥ ఏతే పాపం వ్యపోహతు మనసా కర్మణా కృతం ।
(ఊర్ఘ్య దిశాధిపతి శ్రీహరియనియు, అధోదీశాధిపతి బ్రహ్మదేవుడనియు తెలియవలెను.)
వాయ్వాది ప్రార్ధనము
శ్లో॥ సభస్వా స్పర్శనో వాయు రనిలో మారుత స్తథా ॥ ప్రాణః ప్రాణేశ జీవేశా-మారుతః శివభావితాః । శివార్చనరతా స్సర్వే-వ్యపోహంతు మలం మూమ ॥
అష్టచారణ ప్రార్ధనము
శ్లో॥ ఖేదరో వసుదారశ్చ - బ్రహ్మేశో బ్రహ్మధీస్తథా । సుషేణ: శాశ్వతః పుష్టః సుపుష్టశ్చ మహాబలః ॥ శ్లో॥ ఏతే వై శంభోః పూజాయాఽ భావితాః।
వ్యపోహంతు మలం సర్వం పాపం చైవ యాకృతమ్మ్ ॥
(మనస్సునందు నెలకొనినది-మలమనియు, వాక్కాయ ముః- పాపమనియు వివేకము)
సిద్ధ ప్రార్ధనము
శ్లో॥ మంత్రజ్జో మంత్రవిత్ ప్రాజ్ఞో మంత్రరాట్ సిద్ధపూ। సి ద్ధవత్పరమః సిద్ధు:- సర్వసిద్ధిప్రదాయినః ॥ వ్యపోహంతు మలం సర్వే- సిద్ధి: శివ పదార్చకాః।
(మంత్రరాట్ = సప్తకోటి మహామం త్రాధిరాజునగు ప్రణవ షక్షరశివమంత్రము)
యక్షేశ ప్రార్ధనము
శ్లో॥ యక్షోయక్షేశ ధనదో - జృంభకో మణిభద్రకః । పూర్ణభద్రేశ్వరో మాలీ- శితికుండలి రేవ చ ॥ శ్లో॥ నరేంద్రశ్చైవ యక్షేశా-వ్యపోహంతు మలం చుము ॥
(మలమనగా - పాపమని విశ్వనిఘంటువు)
మహానాగ ప్రార్ధనము
శ్లో॥ అనంతః కులిక శ్చైవ వాసుకి స్తక్షక స్తథా । కర్కోటకో మహాపద్మః శంఖపాలో మహాబలః ॥ శ్లో॥ శివ ప్రణామసంపన్నాః శివదేహప్రభూషణా :। మమ పాపం వ్యపోహంతు విషం స్థాపరజంగమమ్ ॥
కిన్నర ప్రార్ధనము
శ్లో॥ వీణాజ్ఞః కిన్నర శ్చైవ - సురసేనః ప్రమర్దనః । అతీశయః స ప్రయోగీ- గీతజ్ఞోవ కిన్నరాః॥ శ్లో॥ శివ ప్రణామసంపన్న వ్యపోహంతుమలం మమ।
విద్యాధర ప్రార్ధనము
శ్లో॥ విద్యాధరశ్చ విబుధో-విద్యారాశి ర్విచాంవరః । విబుద్ధో విబుధః శ్రీమాన్- కృతజ్ఞ శ్చ మహాయశా:॥ శ్లో॥ ఏతే విద్యాధరాః సర్వే- శివధ్యాన పరాయణాః । వ్యసోహంతు మలం ఘోరం-మహాదేవప్రసాచతః ॥
అసుర ప్రార్ధనము
శ్లో॥ వామదేవో మహాజంభః- కాలనేమి ర్మహాబలః ॥ సుగ్రీవో మర్దక శ్చైవ పింగలో దేవమర్దనః । శ్లో॥ ప్రహ్రాదశ్చాష్యను హ్రాదః సంహ్రాదః కిల భాష్కలః ॥ జంభః కుంభ శ్చమాయావీ- కార్తవీర్యః కృతంజయః । శ్లో॥ ఏతేఽ సురా మహాత్మానో- మహాదేవ పూయణాః ॥ వ్యపోహంతు భయం ఘోర-మాసురం భావమేవ చ ।
గరుత్మత్ ప్రార్ధనము
శ్లో॥ గముత్మా ఖగతి శ్చైవ - పక్షిరాట్ నాగమర్దనః ॥ శ్లో॥ నాగశత్రు ర్హిరణ్యాంగో వైనతేయః ప్రభంజనః । నాగాశీర్వషనాశ శ్చ విష్ణువాహన ఏవ చ ॥ శ్లో॥ ఏతే హిరణ్యవర్ణాభా - గరుఢా వాతరంహసః । నానాఽ భరణ సంపన్నా వ్యపోహంతు మలం మమ ॥
ఋషి ప్రార్ధనము
శ్లో॥ అగస్త్య శ్చ వసిష్ఠ శ్చ లంగిరా భృగురేవ చ । కాశ్యపో నారద శ్చై వై దధీచ శ్చ్యవన స్తథా ॥ శ్లో॥ ఉపమన్యుస్తథాఽన్యే చ ఋషయః శివభావితాః । శివార్చనరతాః సర్వే వ్యపోహంతు మలం మమ ॥
పితృ ప్రార్ధనము
శ్లో॥ పితరః పితామహాశ్చ తథైవ ప్రపితామహా: । అగ్ని ష్వాత్తా బర్లిషద స్తథా పాతామహాదయః ॥ శ్లో॥ వ్యపోహంతు భయం పాపం శివధ్యానపరాయణాః ।
మాతృ ప్రార్ధనము
శ్లో॥ లక్ష్మీ శ్చ ధరణీ చైవ - గాయత్రీ చ సరస్వతీ । దుర్గా ఉషా శచీ జ్యేష్ఠా - మాతరః సురపూజితాః ॥ దేవానాం మా తరశ్చైవ గణానాం మాతర స్తథా ॥ శ్లో॥ భూతనాం మాతర: సర్వా యత్ర యా గణమాతరః । ప్రసాడా ద్దేవదేవస్య వ్యపోహంతు మలం మమ ।
అప్సరః ప్రార్ధనము
శ్లో॥ ఊర్వశి మేనకా చైవ- రంభా రతి తెలోత్తమాః । సుముఖీ దుర్ముఖీ చైవ - కాముఖీ కామ వర్ధనీ ॥ శ్లో॥ తథాఽన్యాః సర్వలోకేషు దివ్యాశ్చాప్సరసస్తథా । శివాయ తాండవం నిత్యం - కుర్వంత్యో ఽరీవ భావితాః ॥ శ్లో॥ దేవ్యః శివార్చనరతా-వ్యపోహంతు మలం మమ ।
నవగ్రహ ప్రార్ధనము
అర్కః సోమోఽగారక శ్చ- బుధశ్చైవ బృహస్పతిః ॥ శ్లో॥ శుక్రః శనైశ్చర శ్చైవ- రాహుః కేతు స్తథైవ చ । వ్యపోహంతు భయం ఘోరం - గ్రహపీడాం శివార్చకాః ॥
ద్వాదశరాశి ప్రార్ధనము
శ్లో॥ మేషో వృషోఽథ మిథున - స్తథా కర్కటకః శుభః । సింహ శ్చ కన్యా విపులా -- తులా వై వృశ్చిక స్తథా ॥ శ్లో॥ ధను శ్చ మకర శ్చైవ కుంభో మీన స్తథైవ చ । రాశయో ద్వాదశ హ్యేతే శివపూజాపరాయణాః॥ శ్లో॥ వ్యపోహంతు భయం పాపం ప్రసాదాత్ పరమేష్ఠినః ।
నక్షత్ర ప్రార్ధనము
అశ్వినీ భరణీ చైవ కృత్తికా రోహిణీ తథా ॥ శ్లో॥ శ్రీమన్మృగశిరా శ్చార్ద్ర పునర్వసు పుష్య సార్పకాః । మఘావై పూర్వఫల్గున్య ఉత్తరాఫల్గునీ తథా ॥ శ్లో॥ హస్త శ్చిత్ర స్తథా స్వాతీ విశాఖా చానురాధికా । జేష్ఠా మూలం మహాభాగా పూర్వాషాఢా తథైవ చ॥
శ్లో॥ ఉత్తరాషాఢికా చైవ శ్రవణం చ శ్రవిష్ఠికా । శతభిషక్ పూర్వభద్రాచతథా ప్రోష్ఠపదా చవై ॥ శ్లో॥ పౌర్ణం చ దేవ్యః సతతం వ్యపోహంతు మలం మమ ।
ప్రమథ గణప్రార్ధనము
జ్వరః కుంభోదన - శంకుకర్ణో మహాబలం: ॥ శ్లో॥ మహార్ణః ప్రభాత శ్చ మహాభూతప్రమర్దనః । శ్యేనజి చ్చివదోతశ్చ ప్రమథాః ప్రీతివర్ధనాః॥ శ్లో॥ కోటికోటి శతైశ్చైవ భూతానాం మాతరః సదా । వ్యపోహంతు భయం పాపం మహాదేవ ప్రసాదతః ॥
వృషేంద్ర ప్రార్ధనము
శ్లో॥ శివధ్యానైక సంపన్నో హిమరాడంబుసన్నిభః । కుందేందు సదృశాకారః కుంభ కుందేందు భూషణః ॥ శ్లో॥ బడబానల శత్రు ర్య - బడబాముఖ భేచనః । చతుష్పాభ సమాయుక్తః క్షీరోద ఇవ పాండురః ॥ శ్లో॥ రుద్రలోకే స్థితో నిత్యం రుద్రైః సార్ధం గణేశ్వరైః । వృషేంద్రో విశ్వ ధృక్ దేవో విశ్వస్య జగతః పితా ॥ శ్లో॥ వృతో నందాదిబి ర్నిత్యం మాతృభి ర్మఖమర్దనః । శివార్చనరతో నిత్యం సమే పాపం వ్యపోహతు ॥
“కుంభము ఆసు పుష్పముతో, మొల్లపుష్పములతోడను, చంద్రకాంతి తోడ నలంకరింపడిన వృషేంద్రము - కుంభకుందేందు భూషణ మనబఱగును”. “దక్షయజ్ఞద్వంసములో శ్రీ వీరభద్రస్వామికి సహకరించినది మఖమర్ధన మసఁ బడును.”
గంగా ప్రార్ధనముపంచ గోప్రార్ధనమున్ను
శ్లో॥ గంగా మాతా జగన్మాతా రుద్రలోకే వ్యవస్థితా । శివభక్తా తు యా నందా సా మే పాపం వ్యపోహతు ॥ శ్లో॥ భద్రా భద్రపదా దేవీ శివలోకే వ్యవస్థితా । మాతా గవాం మహాభాగా సామే పాపం వ్యపోహతు ॥ శ్లో॥ సురభిః సర్వతో భద్రా సర్వపాపప్రణాశినీ । రుద్రపూజారతా నిత్యం సామే పాపం వ్యపోహతు శ్లో॥ సుశీలా శీలసంపన్నా శ్రీ ప్రదా శివభావితా । శివలోకే స్థితా నిత్యం సామే పాపం వ్యపోహతు ।
కాలభైరవ ప్రార్ధనము
శ్లో॥ వేదశాస్త్రార్థ తత్త్వజ్ఞః సర్వకార్యాభిచింతకః । సమస్త గుణ సంపన్నః సర్వదేవేశ్వరాత్మజః ॥ శ్లో॥ జ్యేష్ఠః సర్వేశ్వరః సౌమ్యో మహావిష్ణుతనుః స్వయం । ఆర్యః సేనాపతిః సాక్షాత్ గహనో మఖమర్దనః ॥ శ్లో॥ ఐరావత గజారూఢః కృష్ణకుంచిత మూర్ధజు । కృష్ణాంగో రక్తనయనః శశిపన్నగభూషణః ॥ శ్లో॥ భూతైః ప్రేతైః పిశాచైశ్చ కూష్మాండై శ్చ సమావృతః । శివార్చనరత స్సాక్షాత్ సమే పాపం వ్యపోహతు ॥
మాతృకా ప్రార్ధనము
శ్లో॥ బ్రహ్మాణీ చైవ మాహేశీ కౌమారీ వైష్ణవీ తథా । వారాహీ చైవమాహేంద్రీ చాముండా 22గ్నేయికీ తథా ॥ శ్లో॥ ఏతా వైమాతర స్సర్వాః సర్వలోక ప్రపూజితాః । యోగినీభి ర్మహాపాపం వ్యసోహంతు సమాహితా:॥
వీరభద్ర ప్రార్చనము
శ్లో॥ వీరభద్రో మహాతేజా హిమ కుండేండు సన్నిభః । రుద్రస్య తనయో రౌద్రః శూలాసక్త మహాకరః ॥ శ్లో॥ సహస్రబాహుః సర్వజ్ఞః సర్వాయుధధరః స్వయం । త్రేతాఽగ్నినయనో దేవ స్త్రైలో క్యాభయచః ప్రభుః ॥ శ్లో॥ మాతౄణాం రక్షకో నిత్యం మహావృషభవాహనః । త్రైలోక్యసమితః శ్రీమాన్ శివ పాచార్చనే రతః ॥ శ్లో॥ యజ్ఞస్య చ శిరశ్ఛేత్తా పూష్ణో దంత నినాశనః । వహ్నేర్హస్తహరః సాక్షాత్ భగనేత్రనిపాతనః ॥ శ్లో॥ పాదాంగుష్ఠేన సోమాంగ పేషకః ప్రభుసంజ్ఞకః । ఉపేంద్రేంద్రయమాదీనాం దేవానా మంగతక్షకః ॥ శ్లో॥ సరస్వత్యా మహాదేవ్యా నాసికోష్ఠావకర్తనః । గణేశ్వరో యః సేనాని: సమే పాపం వ్యపోహతు ॥
మహాలక్ష్మీ ప్రార్ధనము
శ్లో॥ జ్యేష్ఠా వరిష్ఠా వరదా వరాభరణ భూషితా । మహాలక్ష్మీర్జగన్మాతా సా మే పాపం వ్యపోహతు ।
మహామాయా ప్రార్థనము
శ్లో॥ మహామోహామహాభాగా మహాభూతగణై ర్వృతా । శివార్చనరతా నిత్యం సా మే పాపం వ్యపోహతు ॥
లక్ష్మీ ప్రార్ధనము
శ్లో॥ లక్ష్మీః సర్వగుణోపేతా సర్వలక్షణ సంయుతా । సర్వదా సర్వగా దేవీ సా మే పాపం వ్యపోహతు ॥
దుర్గాదేవీ ప్రార్ధనము
శ్లో॥ సింహారూఢా మహాదేవి పార్వత్యాస్తనయాఽవ్యయా । విష్ణో ర్నిద్రామహామాయా వైష్ణనీ సురపూజితా ॥ శ్లో॥ త్రినేత్రా వరదా దేవీ మహిషాసురమర్దినీ । శివార్చనరతా దుర్గా సామే పాపం వ్య పోహతు ॥
అనేక రుద్ర ప్రార్ధనము
శ్లో॥ బ్రహ్మాండధారకా రుద్రాః సర్వలోకప్రపూజతా: । సత్యా శ్చ మానసాః పుత్రావ్యపోహంతు భయం మమ ॥
భూత ప్రేత పిశాచ ప్రార్ధసము
శ్లో॥ భూతాః ప్రేతాః పిశాచా శ్చ కూష్మాండగణనాయకాః । కూష్మాండకా శ్చ మే పాపం వ్యపోహంతు సమాహితాః ॥
ఫలశ్రుతి
ఈ స్తోత్రముతో పరమేశ్వరు బ్రార్ధించి సమస్తమును ముగింపవలెను. ముగించుత ఱి ప్రతి మాసమున తల వంచి నేలపై మ్రొక్కులిడవలెను.
దీనిని చదివినవాడు వినినవాడును పాపముల నన్నిటిని పోగొట్టుకొని ప్రారబ్ధాంతమున కైలాసమున నివసించును. ఇదియునుంగాక కన్యార్థి యగువాడు యోగ్యురాలైన కన్యను; విజయముఁ గోరువాడు ఎదురులేని గెలుపును; అర్థ కాముడు తఱగని ధనమును పుత్రార్థియగువాడు మంచికొడుకులను; విద్య గోరువాడు ఉన్నత విద్యోత్తీర్ణతను; సుఖభోగము నపేక్షించువాడు-గృహారామకళత్ర క్షేత్ర సంపద్భోగమును పొందును. మరియు ఏమేమి కావలెనో దానిదానిని సాధింపఁగలుగును. దేవతా ప్రియుండగును.
ఎవని గురించి దీనిని చదువుదురో వానికి వాతపిత్తాది సంభవములగు రోగములు నశించును. అకాల మరణంబు సంఘటింపదు. సర్పాది విషజంతు భాదయునుండదు.
సమస్తపుణ్యతీర్థస్నానఫలము, సర్పయజ్ఞాచరణఫలము, సమస్తదానఫలంబు, సర్వవ్రత కరణ ఫలంబు ఈ వ్యపోహనస్తవ పఠన శ్రవణముల వలన కోటిరెట్లు అధికముగా సమకూరును.
గో బ్రహ్మ హత్యాది మహాపాపములు నశించును గాన శివానుగ్రహపాత్రుడగును. ప్రతిదినము శుచియై స్థిరాసనుడై భస్మరుద్రాక్షధారియునై నిత్యకర్మానుష్ఠానానంతరము కనీసము మండలము (40 రోజులు) శతావర్తనములుగా దీనిని చదివినను వినినను శరీరబాధలన్నియు సమసిపోవుటే గాక వాకశుద్ధి, మనస్సమాధానంబు చేకురును.
ఇట్లు వక్కాణించి విశ్రాంతికై సూతుడు విరమించెను.
ఇయ్యది “శివ విజ్ఞాన వీచిక” యను శాంకరీయ
ఆంధ్రానువాడ ప్రవచనమున (82)వ అధ్యాయము.
Summary of chapter 82 of the Linga Mahā Purana is as follows:
This chapter presents the sacred Vyapohanastava, a powerful hymn of purification recited to cleanse physical, mental, and subtle sins. The hymn invokes the various divine forms, weapons, attendants, and energies of Bhagavān Śiva to remove negative influences, protect against evil forces, and bestow pure spiritual illumination upon the practitioner.