లింగ మహా పురాణము
96 - నృసింహ వీరభద్రసంవాదము, వీరభద్రవిజయమున్ను
“విశ్వసంహారకుఁడైన మహాదేవుడు శరభురూపము (దాల్చి గావించిన వృత్తాంతమును పూర్తిగా విశదీకరింపుము!” అని శౌసనాదులు ప్రశ్నింపగా సూతుడు చెప్పదొడంగెను.
దేవతలు ప్రార్ధించగానే మహేశ్వరుఁడు వీరభద్రస్వామిని స్మరింపగా - మహాప్రళయ భయంకర రూపముతో ప్రమథగ్రణా గ్రేసరుడై అట్టహాసముఁజేయుచు నృసింహునివంటి ఉగ్రరూపములు గలయట్టి కోట్లు కొలచి గణములు - ఉడుచు పాడుచుండగా బ్రహ్మాదులను బంతుల వలె ఎగురవేయు సామర్థ్యము కలిగి తనను చుట్టుముట్టియుండగాను ప్రత్యక్షమైన వీరభద్రేశ్వరుఁడు ప్రళయాగ్ని జ్వాలలు ప్రకాశించు నేత్రత్రయము, శస్త్రధారణము, జటాజూటము నందు బాలచంద్రుఁడు, రెండు బాలచంద్ర రేఖలఁబోలిన తీక్ష్ణములైన కోఱలు, ఇంద్రధనుస్సుతో సరిడూగు కనుబొమలు, దిక్కులను పిక్కటిలఁజేయు ప్రచండమైన హుంకారము, నీల మేఘములతో కాటుక తోడను పోల్చదగిన భయంకర కేశములును.
అఖండములైన చేతులతో త్రిశూలమును త్రిప్పుటయు గలవాడై ‘‘దేవా! నన్ను తలచుకొనుటకు గతంబేమి? ఆజ్ఞాపించి నన్న గ్రహించుము!” అని విన్నవించెను.
అంత భగవానుఁడు “వీరభద్రా! దేవతలకు ప్రస్తుతము భయము వాటిల్లినది. నృసింహ స్వామియొక్క క్రోధాగ్ని ప్రజ్వలించుచున్నది. దానిని శమింపజేయుటకు ముందు శాంతవచనములతో గారవించి చూడుము ! నీ సాంత్వనమును నిరాకరించినచో నా శక్తి సామర్ధ్యములను స్మరించి సూక్ష్మమును సూక్ష్మముతో స్థూలమును స్థూలముతో సంహరించియు నృసింహుని ముఖమును చర్మను తెమ్ము!” అని యాజ్ఞాపించెను.
ఇట్లు శివాజ్ఞఁబడసి వీరభద్రుడు ప్రశాంతరూపమున నృసింహుని వడిగా చేరి దిగువ విధము ప్రజోధించెను. మరియు తండ్రి కొమరుని వలె గారవించుచు సంభాషించెను.
“భగవానుడా! జగత్కల్యాణము కొరకు నవతరించితివి; పరమేశ్వరుడు చరాచర రక్షణమునకై నిన్ను నియోగించెను. పూర్వము మత్స్యావతారుడవై ఏకార్ణవమున తోకతో ప్రాణసముదాయము ద్రిప్పితివి; తాబేలు (కూర్మ) రూపముతో ప్రపంచమును మోయుచున్నావు; వరాహరూపముతో భూమిని లేవనెత్తితివి; ఈ నరసింహరూపముతో హిరణ్యకశిపుని వధించితివి; వామనుడవై భూనభోంఽ తరాళములలో వ్యాపించి బలిచక్రవర్తిని బంధించితివి; నీవే ప్రాణులందరి యుత్పత్తిస్థానమై జీవాత్మలను నియమించువాడవై యున్నావు; ఎప్పుడెప్పుడు లోకమునకు దుఃఖము కలుగునో అప్పుడప్పుడు నీవవతరించి సుఖమును కలుగజేయుచుందువు; శివపరాయణులలో నీ కంటె గొప్పవాడు, నీతో సమానుడును లేడని చెప్పవచ్చును. నీవు వేదోక్త ధర్మమార్గమును ప్రవర్తింపజేయువాడవు. నీవు అవతరించిన ప్రయోజనము దైత్య సంహారముతో ముగిసినది. గాన నీ అత్యంత భయంకర రూపమును చాలించుము ! ఇల్లు వీరభద్రస్వామి నృసింహుని శాంతవచనములతో సంప్రదించినను నృసింహస్వామి పూర్వాధిక క్రోధము గలవాడై ప్రజ్వలించు (మండిపడు) చు దిగు విధము సంభాషించెను.
“వీరభద్రా ! నీవు హితవచనములను చాలించి నీవు వచ్చిన చోటనకు పదిలముగా వెళ్లుము! ఈ చరాచరజగత్తునంతయు సంహరించెదను. నా శాసనమే అంతలు ప్రవర్తించును. నన్ను శిక్షించువాడు లేడు. నా యను గ్రహముతో సమస్తము అవధులు కలిగియున్నది. సమస్త శక్తులను నేనే ప్రవర్తింప జేయుచు నివారించుచుందును. విభూతి గల ప్రతి వస్తువు నా తేజస్సుచే విజృంభించుచున్నది. పరమార్థవిదులు నన్నే పరతత్త్వముగా భావించుచుందురు. బ్రహ్మేంద్రాదులు నా యంశగలవారై నందుననే సమర్థులగుచున్నవారు. పూర్వము చతుర్ముఖుడు నా నాభికమలము నుండి జన్మింపగా నాతని లలాలుమునుండి రుద్రభగవానుఁడు ఆవిర్భవించెను. బ్రహ్మదేవుడు రజోగుణభరితుడు కాగా రుద్రుఁడు తామసుడుఁగా వఱులెను. నేనే జీవకోటి నంతయు ప్రేరేపించువాడను. నాకంటె నధికమైన దైవము లేదని గుర్తింపుము ! విశ్వాదికుడను, స్వతంత్రుడను, కర్తను, హర్తను అఖిలేశ్వరుడను. నా ప్రభావమును కనుగొననేరికి తఱమగును ? గాన నన్ను శరణ్యునిగా ప్రార్థించి ఆరాలుము లేని వాడవై వెళ్లుము ! ఈ చెప్పిన దంతయు పరమార్థమని గుర్తించుము ! నేనే మహేశ్వరుడను, కాలము, కాలవినాశహేతువునై లోకములను సంహరింప నుద్యుక్తుడనైతిని. మృత్యువునకు మృత్యువును; వీరభద్రా! నాయండతోడనే అమరులు సుఖపడుచున్నారని భావింపుము!”
శ్రీహరి గర్వముతో పలికిన మాలులు విని - వీరభద్రస్వామి ప్రహసించి పెదవులు కదిలించుచు నిట్లు వక్కాణించెను.
“పినాకధనుర్ధారి యగు పరమేశ్వరుడే సర్వసంహర్త యని తెలియదా? నీచే జగత్తు సంహరింపబఁడు నను విషయము అసద్వాదమగును. నీ యవతారములన్నిటిలో ఏది మిగిలినది ? అందువలన నీవు కథాశేషుడవు అనఁగా నామమావశిష్టుడవైతివి. ఇట్లే నీవు ప్రలపించునెడ సంహార దక్షుడగు మహేశ్వరుఁడీ క్షణములోనే నిన్ను తుదముట్టించును.
“నా పాత్రుడు రుద్రుడు” అను నీమాటకు ప్రత్యుత్తరము నిడుచున్నాను.
శ్లో ॥ప్రకృతి స్త్వం పుమా రుద్రస్త్వయి వీర్యం సమాహితం । త్పన్నాభి పంకజా జాతః పంచవక్త్రః పితామహః ॥
“ప్రకృతియగు నీయంచు పురుషుడైన రుద్రుడు - తన సిస్పక్ష (సృష్టిజేయునిచ్ఛ) యను బీజమును నెలకొలుపగా నీ నాభికమలము నుండి ఐదు ముఖములు గల బ్రహ్మదేవుడు ఉదయించెను.
ఆ సిదప పితామహుడు జగత్సృష్టి పెంపొందులుకై ఉగ్రమైన తపస్సుఁజేయుచు తన లలాటమునందు శివుని ధ్యానింపగా నీలలోహిత రుద్రుడై ఆవిర్భవించెను. అయ్యది శంకరునకు న్యూనత కాజాలదు.
నేను మహాభయంకరస్వరూపుడైన నీలలోహిత రుద్రుని యంశ మగువాడను. ‘‘మొదలు అనునయించి నీమాట పాటింపనిచో నా శక్తి సామర్థ్యములతో నృసింహుని సంహరింపుము!’ అని నన్ను రుద్రుడు ఆజ్ఞాపించెను.
ఆది శక్తి యొక్క ఒకానొక కళ గల వాడవై హిరణ్యకశిపుని వధింపగలిగితివి. అందువలన అహంకారివై ప్రలపించుచున్నావు; నీవంటివారికి చేయు ఉపకారము - అపకారముగా పరిణమించినది. నృసింహా ! మహేశ్వరుడు నీవలన జన్మించిన వాడని భావింపకుము!
వస్తుతః నీవు స్రష్టవు సంహర్తవు స్వతంత్రుడువు కావు. కుమ్మరి గీరయందు మట్టి పాత్రను వలె పరమేశ్వరుడు తన శక్తియను యంత్రము నందు నిన్ను త్రిప్పుచుండును.
నీ కూర్మావతారమున కపాలముఁగైకొని తన కంఠహారములో చేర్చుకొనినదెవరు? వరాహావతారమున కోఱను పెకల్చి ధరించిన దెవరు ? విషక్సేన రూపము గల నిన్ను త్రిశూలాగ్రమున కాల్చిన దెవరు? యజ్ఞస్వరూపుఁడవైన నీ శిరస్సును దక్షయజ్ఞమున ఛేదించినదెవరు? నీ కుమారుడైన బ్రహ్మదేవుని ఐదవ శిరస్సును భైరవరూపమున ద్రుంచినదెవరు? క్షుప దధీచ సంగ్రామమున దధీచి మహామునిచే పరాజితుఁజేయించిన దెవరు? సుదర్శన చక్రమును నీకు ప్రసాదించి దుష్ట శిక్షణము నొనర్పుమనినదెవరు? రుద్రుడు లోకముల నన్నిటి నుపసంహరించిన తఱి నిద్రపరవశుడవై సముద్రమున పరుండిన నీవు సాత్త్వికుడ వెల్లగుచువు ? నీవు మొదలుకొని గడ్డిపఱకవరకు గల ప్రపంచమంతయు శివ శక్తిచే వ్యాపింపఁబడి యున్నది. నీవు అగ్నియు శివతేజోమహిమను చూడ నలవిగాని వారైతిరి.
స్థూలదృష్టిగలవారందరు పరమపదము విష్ణువుదని భ్రమపడుచుందురు. సూక్ష్మదృష్టిగలవారు “పంచమిని ర్దేశము బలవత్తర” మను మీమాంసా న్యాయమున విష్ణువున కన్న (వైకుంఠము కంటె) నుత్కృష్టమైనది - శివపద (స్వరూప) మని భావించుచుందురు.
అదితీదేవికి వామనరూపముతో దేవేంద్రునకు జయంతునిగా అగ్నికి కార్తికేయునిగా, యమునకు నారాయణుఁడుగా, వరుణునకు భృగువుగా, చంద్రుని కళంకము గల ఉదరమున బుధునిగా జన్మించినంతమాత్రమున నీవు పరమేశ్వరుఁడవగుదువా ?
కాలము నీవు కాగా కాలకాలుఁడు మహేశ్వరుఁడగును. గాన శివుని కరతో యమునకు మృత్యుపగుడువని చెప్పవచ్చును.
మేరు పర్వతము ధనుస్సుగా గలవాడు, వీరులనందరిని మించినవాడు, క్షయము లేనివాడు, విక్రమము గలవాడు, విశ్వాధికుఁడు, ప్రభువు. జ్వరమును హరించువాడు, భయంకరుఁడు,మృగాకారముతో పక్షిగా నుండువాడు, హిరణ్మయుడు, జగత్తు నంతయు శాసించువాడును నీవు గాని చతుర్ముఖుడు గాని కాజాలరు.
ఇట్టిడంతయు బాగుగా ఆలోచించుకొని ఉగ్రరూపమును చాలించుము ! లేనిచో వజ్రాయుఛమువలె మహేశ్వరుని క్రోధరూపమగు మృత్యువు నీపై పడును.”
ఇట్లు వీరభద్రస్వామి చెప్పగానే నృసింహస్వామి క్రోధోదగ్రుడై పెద్దగా అఱచుచు వీరభద్రుని పట్టుకొనుటకు తల పెట్ట అంతలోనే శత్రుభయంకరము, ఆకాశమువరకు వ్యాపించునది, ఎవరికి నెదురు తాకులకు నలవిగానది శివతేజస్సముచ్భూతంబునగు శరభ పక్షి రూపమును వీరభద్రుఁడు ధరించి సాక్షాత్కరించెను.
శరభపక్షి రూపము - హిరణ్మయము, సౌమ్యము, సౌరము, ఆగ్నేయము, మెరుపుఁ బోలినదియు, చంద్రసన్నిభంబు కానిదై ఉపమానము లేనిదియునై యుండెను. అట్టితఱి తేజస్సులన్నియు శరభలేజస్సునందు లీనములగుచుండెను. మొదట శరభనృసింహరూపములు అస్పష్టములై పిదప స్పష్టములుగా గోచరించుచుండెను. శరభషక్షి రూపము రుద్రతుల్యమై క్రోధవికారము గలదిగా కనుపడుచుండెను.
అప్పుడు దేవతలు జయజయధ్వానములఁజేయుచుండగా శరభము సంహారరుద్రనిఁబోలినదిగా పరిణమించెను. మరియు
సహస్రబాహువులు, జడలు, చంద్రార్ధకృతశేఖరత్వంబు గలిగి - సగము మృగశరీరముతో, రెక్కలతో, ముక్కుతో, అతితీక్ష్ణములగు పొడుగాటి కోఱలతోడ, వజ్రతుల్యనఖాయుధముల తోడను విరాజిల్లుచుండెను.
మరియు కంతమున నలుపువన్నె, దీర్ఘబాహువులు, నాలుగు పాదములు, ప్రళయకాలమేఘధ్వని నంటి కంఠస్వరము, ఒకే వేళ ప్రజ్వలించు ప్రళయాగ్నిజ్వాలలు నిండిన నేత్రత్రయము. విశదములైన కోరలు, క్రింది పెదవియు గల శరభము హుంకారముఁజేయుచుండెను.
నృసింహస్వామి శరభరూపముఁగాంచినంతమాత్రమున తన బలమును పరాక్రమమును గోలుపోయి సూర్యునిముండు ఖద్యోత (మిడుగురుపుఱుగు)ము వలె వెలవెలఁ బోయెను.
శరభేశ్వరుఁడు - రెక్కలతో నృసింహుని నాభిని పాదములను పట్టుకొని తోకతో బాహువులను బంధించి ఱొమ్ముపై చేతులతో కొట్టుచు ఆకసము పైకెగయుచుండగా దేవతలు మహర్షులును శరభేశ్వరుని వెంబడించుచుండిరి. గరుత్మంతుఁడు సర్పమునువలె శరభేశ్వరుఁడు నృసింహస్వామిని లేపుచు లేపుచును, పడవేయుచు పడవేయుచును - ఎగురవేయుచు ఎగురవేయుచున్నతఱి రెక్కల దెబ్బలతో బాధపడుచున్న శ్రీహరి నపహరించు హరు నమరులందరు నమోవాకములతో పొగడుచుండిరి.
అట్టితఱి నృసింహుఁడు పరవశుఁడు దీనవక్త్రుడునై అంజలిఁఘటించియు పరమేశ్వరుని మనోహరాక్షరములు గల అష్టోత్తరశత (108) నామములతో స్తుతించెను. ఆ నామములు రుద్రాధ్యాయగత శివనామములవలె నమోంఽతములై తత్సమాన ఫలప్రదములుగా భావింపఁదగినవి.
శ్లో ॥నమో రుద్రాయ శర్వాయ మహాగ్రాసాయ విష్ణవే ॥
“రుత్ = ప్రణవరూపఃశబ్దః, తేన అంతకాలే కాశ్యాముపజేశేన; రాతి = స్వరూపం దదాతీతి; రుద్రః; రుత్ అనగా ప్రణవశబ్దమును కాశీ క్షేత్రమున ప్రాణులకు మరణకాలమున నుపదేశించి తన రూపము నొసఁగువాడు. రుద్రుఁడు” అను నిర్వచనము ఇఁట గ్రాహ్యము (చూడుడు ! అహోబలరుద్రభాష్యమును) మహా గ్రాసాయ = మహా ప్రళయకాలమున చరాచరజగత్తును కబళముగా భక్షించు రుద్రుని కొరకు నమస్కారము.
“ ఇందు “యస్య బ్రహ్మచ క్షత్రంచ ఉభే భవత ఓదనః” ఇత్యాది కఠవల్లీవాక్యము ఉపబృంహితమైనది.”
శ్లో ॥ సమ ఉగ్రాయ భీమాయ నమః క్రోధాయమన్యవే । నమో భవాయ శర్వాయ శంకరాయ శివాయ తే ॥
భక్తులు కానివారిని హింసించు క్రోధముగలవాడు. ఉగ్రుఁడనఁబడును అధర్మము నాచరించువానిఁగూర్చి కోపము గల వాడు - క్రోధమగును.
వైదిక క్రతు రూపమున నుండువాడు మన్యువు; లోక కంటకులఁగూడ నవ్వారి భక్తిచే ప్రసన్నుఁడై ముకులఁజేయువాడు - శర్వుడు.
శ్లో ॥కాలకాలాయ కాలాయ మహాకాలాయ మృత్యవే । వీరాయ వీరభద్రాయ క్షయద్వీరాయ శూలినే ॥
అపరిమితమైన కాలము గలవాడు మహాకాలుడు; తన భక్తులైన శ్రీరామాదులను విక్రమింపఁజేయువాడు వీరుడు; వీరులకు కల్యాణము నొనగూర్చువాడు వీరభద్రుడు; తనను స్మరించినంత మాత్రమున భక్తుల పాపమును పోగొట్టువాడు క్షయద్వీరుడు; (రుద్రాభాష్యమున శ్రీవిద్యారణ్యలు.)
శ్లో ॥ మహాదేవాయ మహతే పశూనాం పతయే నమః । ఏకాయ నీలకంఠాయ శ్రీకంఠాయ పినాకినే ॥
శ్రీదేవి తన సన్నిధానమున గలవాడు శ్రీకంఠుఁడు, “కంఠో గలే సన్నిధానే” ఇతి విశ్వః
శ్లో ॥నమోఽనంతాయ సూక్ష్మాయ నమస్తే మృత్యుమన్యవే । పరాయ పరమేశాయ పరాత్పరతరాయతే ॥
మృత్యువు (యముని) నందు క్రోధము గలవాడు మృత్యుమన్యువు; సమస్తమును పాలించువాడు పరుఁడు; మోక్షశ్రీకి అధిపతియగువాడు పరమేశుఁడు; విష్ణువునకంటె శ్రేష్ఠుడు పరాత్పరతురుఁడు;
శ్లో ॥పరాత్పరాయ విశ్వాయ నమస్తే విశ్వమూర్తయే । నమో విష్ణుకళ త్రాయ విష్ణుక్షేత్రాయ భానవే ॥
ఉత్తమ పురుషుఁడగువాడు పరాత్పరుఁడు; విష్ణుమూర్తి భార్యగా గలవాడు విష్ణుకళత్రుఁడు; “దారుకావనమున ప్రవేశించు మహేశ్వరుని శ్రీహరి స్త్రీ వేషముతో ననుసరించె” నని కూర్మమహాపురాణము నందు వ్రాయఁబడినది.
శ్లో॥ కైవర్తాయ కిరాతాయ మహావ్యాధాయ శాశ్వతే । భైరవాయ శరణ్యాయ మహాభైరవరూపిణే ॥
సంసార సముద్రము నుండి తరింపఁజేయువాడు కైవర్తుడు; మృగరూపముతో బ్రహ్మదేవుని బాణప్రహారమున శిక్షించువాడు మహావ్యాధుఁడు; భయంకరమైన ధ్వని గలవాడు భైరవుడు, కాలభైరవుని ప్రశంసించువాడు మహాభైరవరూపి;
శ్లో॥ నమో నృసింహసంహార్ర్తే కాముకాలపురారయే । మహాపాశౌఘ సంహర్ర్తే విష్ణుమాయాంతకారిణే ॥ శ్లో॥ త్ర్యంబకాయ త్ర్యక్షరాయ - శిపివిష్టాయ మీఢుషే। మృత్యుంజయాయ శర్వాయ - సర్వజ్ఞాయ మఖారయే ॥
భూతభవిష్యద్వర్తమాన కొలత్రయమున వినాశము లేనివాడు త్ర్యక్షరుఁడు; శిషయనగా విష్ణువు పశువులు నగుడుకు. అవ్వానిలో ప్రవేశించియుండువాడు - శివిష్ణుఁడు; భక్తుల కామితములను వర్షించువాడు మీఢుడు; శబ్దసమూహమునంతయు నొకేసారి గుర్తించువాడు శర్వుఁడు;
శ్లో॥ మఖేశాయ వరేణ్యాయ నమస్తే వహ్నిరూపిణే । మహాఘ్రాణాయ జిహ్వాయ ప్రాణాపాన ప్రవర్తినే ॥ శ్లో॥ త్రిగుణాయ త్రిశూలాయ గుణాతీతాయ యోగినే ।
సత్త్వ రజ స్తమోగుణములను సంబంధింపజేయువాడు త్రిశూలుఁడు;
శ్లో॥ సంసారాయ ప్రవాహాయ మహాయంత్రప్రవర్తినే ॥
కర్మఫలమును విశ్లేషించి కలుగఁజేయువాడు - ప్రవాహఁడు; జగత్సృష్టిస్థితిలయములుగల గొప్పచక్రమును ప్రవర్తింప జేయువాడు మహాయంత్ర ప్రవర్తకుడు.
శ్లో॥ నమశ్చంద్రాగ్నిసూర్యాయ ముక్తివైచిత్ర్య హేతవే । వరదాయావతారాయ సర్వకారణహేతవే ॥
దాంభికులను పడగొట్టువాడు అవతారుఁడు; సర్వకారణులగు బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరులకు జనకుఁడగువాడు సర్వకారణ హేతువు; “బ్రహ్మ విష్ణురుద్రేంద్రాః సంప్రసూయంతే కారణం కారణానాం ఇత్యాది శ్రుతి ఇందుకు ఆధారము.
శ్లో॥ కపాలినే కరాలాయ పతయే పుణ్యకీర్తయే । అమోఘాయాగ్నినేత్రాయ లకులీశాయ శంభవే ॥
ఆదిశేషుఁడు కరకంకణముగా గలవాడుకరాలుఁడు; ఏదేనొకవిధముగా స్మరించినను ఫలము సఁగువాడు అమోఘుఁడు; లకులీశుఁడుగా అవతరించినవాడు లకులీశుఁడు;
భీషక్తమాయ ముండాయ చండినే యోగరూపిణే । మేఘవాహాయ దేవాయ పార్వతీ పతయే నమః ॥
మేఘరూపుఁడగు విష్ణువు వాహనముగా గలవాడు మేఘవాహుఁడు
శ్లో ॥ అవ్యక్తాయ విశోకాయ స్థికాయ స్థిరభన్వినే । స్థాణవే కృత్తివాసాయ నమః పంచార్టహేతవే ॥
ముఖఃమును తొలగించువాడు విశోకుడు; శబ్దస్పర్శరూపర సగంధములు లను ఐదు గుణములను సరిగా ప్రవర్తింపజేయువాడు పంచార్ధ హేతువన (బడును.
శ్లో॥ వరదాయైక పాదాయ సమశ్చం ద్రార్థమౌలినే । నమస్తేఽధ్వరరాజాయ వయసాం పతయే నమః ॥
మాయాకృత జ్ఞాన ప్రతిజంధములను నిరాకరించువాడు - వరదుడు; అర్ధనారీశ్వరుఁడగుటచే ఒకే కాలు గలవాడు ఏకపాదుఁడు; యజ్ఞాధిపతియగువాడు అధ్వరరాజు, “ఆ వో రాజాన మధ్వరస్య రుద్రమ్” అను శ్రుతివాక్యము ఇలు ఉదాహార్యమైనది.
పక్షులకు ప్రభువైన శరభమగువాడు వయసాం పతి యనఁబఱుగును.
శ్లో॥ యోగీశ్వరాయ నిత్యాయ సత్యాయ పరమేష్ఠినే । సర్వాత్మనే సమస్తుభ్యం - నమః సర్వేశ్వరాయ తే ॥
“సర్వేశ్వరా ! నీకు ఒకసారి, రెండు తడవలు, మూడు నాలుగు ఐదు పది పర్యాయములు, సహస్ర అపరిమిత అనంతములుగా నమస్కారములను సమర్పించుచున్నాను. నమోనమః, నమోనమోనమః” అని నృసింహస్వామి శరభేశ్వరుని విధేయుఁడై విన మ్రుడునై, ప్రార్థించెను.
మరియు
“నాకు అత్యహంకారముతో లవివేకము ఆవహించు ప్రతి సమయమునందును నీవే అట్టి యవహరమును పోగొట్టుచుండుము!” అని విన్న వించి శాంతచిత్తుఁడు కాగా “విష్ణో జీవితాంతము పరాజయమును చూఱగొంటివి” అని వీరభద్రస్వామి వచించెను,
అంత వీరభద్రుఁడు నృసింహుని మొండెమును విడదీసి - ఎముకలలో నుండు ముఖమును పరిగ్రహించెను. “స్వామీ ! నీ కతాక్షవీక్షణముచే మేమందరము . “మేఘముతో వృక్షము వలె , జీవించితిమి” అని బ్రహ్మములు నుతించిరి. మరియు నిట్లు సుడివరి.
“ఎవని భయము వలన అగ్ని ప్రజ్వలించుచున్నదో, సూర్యుఁడు సకాలమున ఉచయించుచున్నాడో, వాయువు వీచుచున్నదో, మృత్యువు ప్రాణులను సంహరించులుకు పరుగిడుచున్నదో, వాడే నీవని భావించుచున్నాము.
నీ మహిమను గుర్తింప మేమెంత వారము ? ఏకాదశరుద్ర స్వరూపమున నుండు వాడవు; నిన్ను ధ్యానింపనేకాగ్రచిత్తము గల మాకు ఎప్పుడును నీవిషయమై సందేహము కలుగుకుండుగాక ! హరి బ్రహ్మేంద్ర చంద్రాదులగు ప్రముఖుల మందరము నీవలననే జన్మించితిమి. సూర్యచంద్రాద్యిష్ట మూర్తులతో జగత్తును ప్రవర్తింపఁజేయు వాడవు. మమ్ము రక్షించువాడవు నీవేను అనియు ప్రార్థింపగా వీరభద్రస్వామి “సుకలారా ! ఉదకములో నుదకము వలె పాలలో పాలవలె ఘృతము నంచు ఘృతము వలె విష్ణువు శివునిలో లీనమైనవాడు.” అని భావించి సాయండు గల భక్తి పరిపూర్ణమగులుకు ఈ నృసింహస్వామి నారాధింప వలసియుండును.” అని ప్రవచించి యంతర్థానముఁజెందెను.
అప్పటి నుండి శంకరుఁడు నృసింహుని చర్మమును కప్పుకొని ముఖమును ముండమాలికా మధ్యమణిగా ధరించుచుండెను. శరభరూపమును వీరభద్రుఁడు చాలించిన తరువాత దేవతలందరు ఈ ఆఖ్యానమును తలచు కొనుచు ఆశ్చర్యముతో నేత్రములఁదెఱిచినవారై తమతమ నెలవులకు జనియు సుఖంబుండిరి.
ఈ శ్రేష్ఠమైన కథావృత్తాంతము పుణ్యప్రదము వేద సమ్మితంబునై యున్నది. దీనిని చదివినను వినినను దుఃఖములన్నియు నశించును. జన్మసార్థకంబగును. కీర్తి పెంపొందును. ఆరోగ్యము చేకూరును. ఆయుష్యము పెరుగును. శరీరము పుష్టి గలదగును. విఘ్నములన్నియు శమించును. వ్యాధులన్నియు తొలగును. అపమృత్యువులు దూరమగును. ఏతత్పతనముగాని శ్రవణము గాని సర్వారిష్టములను శాంతింపఁజేయును. శతృవును లొంగఁదీయును. మనోవ్యాధులను మటుమాయము (జేయును. దుఃస్వప్నఫలితములను దూరముఁజేయును. భూతప్రేత పిశాచబాధలను నివారించును. విషబాధలను క్షీణింపఁజేయును. పుత్రపౌత్రాది వంశవృద్ధి నొచవఁజేయును. శివధ్యాస యోగమును సిద్ధింపఁజేయును.
శివమహిమజ్ఞానమును ప్రకాశింపజేయును. శివలోకసాధము యెక్క మెట్టునందడుగిడఁజేయును. వాంచితార్థ ప్రాప్తికి ముఖ్యసాధనమై విష్ణుమాయా ప్రభావమును తగ్గించుటే గాక దేవతాపరమార్ధ జ్ఞాపకంబునై యున్నది.
పరమేశ్వరుని శరభరూపము స్థిత ప్రజ్ఞు డె ఉత్సాహము గల శివ భక్తుల చేతనే వినడగి యున్నది. శివోత్సవములన్నిటియందు చతుర్దశిని అష్టమినాడును శివ ప్రతిష్ఠాకాలముల యంచును దీనిని చదివినచో శివుడు ప్రసన్నుఁడగును. చోరభయమున, సింహవ్యాఘ్రభీతిని, సర్పభయమున, రాజోపద్రవమున, భూకంప దవాగ్ని ప్రభృతికములగు ఆపదలయందును శివభక్తుఁడగువాడు, దృఢ చిత్తముతో దీనిని చదివినను వినినను ప్రారబ్ధాంతమున రుద్రస్వరూపుఁడై శివుని సేవించుచుండును. ఇయ్యది “శివ విజ్ఞాన వీచిక” యను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (96)వలథ్యాయము.
Summary of chapter 96 of the Linga Mahā Purana is as follows:
Following the pacification of Nṛsiṃha, this chapter contains an exalted prayer offered by Bhagavān Vishṇu, Bhagavān Brahmā, and devas to Parameśvara Śiva. The divine assembly praised Mahādeva as the supreme protector who intervenes during extreme cosmic crises to pacify divine wrath, maintain balance, and protect all creation.