లింగ మహా పురాణము
19 - సూర్యమండలమున శివుని పూజించు విధానము
నందికేశ్వరుఁడు చెప్ప (దొడఁగెను.
సనత్కుమారా!
రుద్రాధ్యాయ ప్రార్థనతో ప్రసన్నుఁడైన పరమేశ్వరునకు ప్రణమిల్లి - సంతుష్ట స్వాంతులై “భగవానుఁడా! ద్విజులు ఎట్లు నిన్ను పూజింపవలెను? ఎచ్చోట నిన్నారాధింపవలెను? ఎవరికి నిన్నర్చించుట యందధికారము కలదు? అని ప్రశ్నింపగా నీలలోహితుఁడు గంభీర వాక్కుతో దిగువ విధము నిర్వచించెను.
అట్టితరి సదాశివుఁడు రవిమండలమున ఉమాసహితుఁడు, విద్యుత్ కోటిసమప్రభుఁడు, అష్టబాహువు, చతుర్వక్త్రుడు, ద్వాదశనేత్రుఁడు, అర్ధనారీశ్వరుఁడు, జటాముకుటధారి, సర్వాభరణసంయుక్తుఁడు, రక్త మాల్యధారి, రక్తగంధానులేపనుఁడు, రక్తవస్త్రధారిగా దేవతలకు మునులకు నగుపడుచుండెను. మరియు నా మహాదేవుఁడు సృష్టిస్థితి లయకారుడుగా నుండెను. ఆ దేవదేవుని పూర్వముఖము - తత్పురుషాఖ్యమై ప్రసన్నముగాను; దక్షిణ ముఖము - అఘోరాఖ్యమై నీలాంజనవర్ణము గలదై కోఱలతో వెరుపు గొలుపునదై మంటల వరుసలతో కూడినదియునై జలధారిగాను; ఉత్తరముఖము-వామదేవాఖ్యమై పగడపు వన్నెగలదై ప్రసన్నముగాను; పశ్చిమ ముఖము - సద్యోజాతాఖ్యమై ముక్తాహార భూషితముగా తిలకోజ్జ్వలముగాను గోచరించెను.
రవిమండల విరాజమానుఁడగు సదాశివుని ముందు సూర్యుఁడు దక్షిణభాగమున భానువు ఉత్తరమున రవియు- కుడివైపున బ్రహ్మదేవుఁడు-ఎడమవైపున విష్ణుమూర్తియు నుండిరి. ఋగ్యజుః సామవేదక్రమముగ బ్రహ్మవిష్ణు మహేశ్వరాత్మకుడగు సదాశివుడు ... ధర్మజ్ఞానాసనముపై బ్రహ్మాసనో పవిష్టుడై చంద్ర కుజ బుధ గురు శుక్ర శనిగ్రహములు పరివేష్టించి యుండగా రవిమండలమున శోభించుచుండెను.
సూర్యుఁడు శివుఁడు గాను; చంద్రుఁడు ఉమాదేవిగాను సూర్యచంద్రాత్మకుఁడుగా నుండు దేవదేవుని అమరులు మునులును గాంచిన వారై “నమఃశివాయ రుద్రాయ’’ ఇత్యాది శ్లోకములతో ప్రార్థించిరి.
సూర్యాత్మక శివస్తుతి
శ్లో॥ నమఃశివాయ రుద్రాయ - కద్రుద్రాయ ప్రచేతసే ।
మీఢుష్టమాయ సర్వాయ - శిపివిష్టాయ రంహసే ॥
శ్లో॥ ప్రభూతే విమలే సారే - హ్యాధారే పరమే సుఖే ।
సవశక్త్యావృతం దేవం - పద్మస్థం భాస్కరం ప్రభుమ్ ॥
శ్లో॥ ఆదిత్యం భాస్కరం భానుం - రవిం దేవం దివాకరం ।
ఉమాం ప్రభాం తధా ప్రజ్ఞాం - సంధ్యాం సావిత్రికా మపి ॥
శ్లో॥విస్తారా ముత్తరాం దేవీం బోధనీం ప్రణమామ్యహం ।
ఆ ప్యాయనీం చ వరదాం బ్రహ్మాణం కేశవం హరమ్ ॥
శ్లో॥ సోమాదిబృందం చ యథాక్రమేణ - సంపూజ్య మంత్రై ర్విహిత ।
క్రమేణ! స్మరామి దేవం రవిమండలస్థం సదాశివం శంకర మాదిదేవమ్ ॥
శ్లో॥ ఇంద్రాది దేవాంశ్చ తథేశ్వరాంశ్చ - నారాయణం పద్మజ మాదిదేవం ।
ప్రాగాద్య ధోర్ధ్వం చ యథాక్రమేణ వజ్రాదిపద్మం చ తథా స్మరామి ।
శ్లో॥సిందూరవర్ణాయ సమండలాయ సువర్ణ వజ్రాభరణాయ తుభ్యం ।
పద్మాభనేత్రాయ సపంకజాయ బ్రహ్మేంద్ర నారాయణకారణాయ ॥
శ్లో॥రథం చ సప్తాశ్వమనూరు వీరం - గణం తథాసప్తవిధం క్రమేణ ।
ఋతుప్రవాహేణ చ వాలఖిల్యా స్మరామి మందేహ గణక్షయంచ ॥
శ్లో॥హుత్వా తిలాద్యైరివిధైస్తథాఽ గ్నౌ - పునః సమాప్యైవ తథైవ సర్వం ।
ఉద్వాస్య హృత్పంకజ మధ్య సంస్థం - స్మరామి బింబం తవ దేవ దేవ ॥
శ్లో॥ స్మరామి బింబాని యథాక్రమేణ - రక్తాని పద్మామల లోచనాని ।
పద్మం చసవ్యే వరదం చ వామే - కరే తథా భూషితభూషణాని ॥
శ్లో॥ దంష్ట్రాకరాళం తవ దివ్య వక్త్రం - విద్యుత్ ప్రభం దైత్య భయంకరం చ ।
స్మరామి రక్షా ఽభిరతం ద్విజానాం - మందేహరగణ భర్త్సనంద ॥
శ్లో॥సోమం సితం భుమిజ మగ్నిపర్ణం చామీకరాభం బుధ మిందుసూనుం ।
బృహస్పతిం కాంచన సన్నికాశం శుక్రం సితంకృష్ణతరం చమందమ్ ॥
శ్లో॥స్మరామి సవ్య మభయం-వామ మూరుగతం వరం ।
సర్వేషాం మంద పర్యంతం మహాదేవం చ భాస్కరమ్ ॥
శ్లో॥పూర్ణేందు వర్ణేన చ పుష్పగంధ - ప్రస్థేన తోయేన శుభేన పూర్ణం ।
పాత్రం దృఢం తామ్రమయం ప్రకల్ప్య దాస్యే తవార్ఘ్యం భగవ ప్రసీద॥
రవిమండలమున ఉదయ మధ్యాహ్న సాయంకాలముల యందు శివు నర్చించి రాగిపళ్లెరము నందు పుష్పగంధ కుంకుమాక్షతలతో నర్ఘ్యము నొసగియు ప్రార్థించువారికి ప్రారబ్ధాంతమున శివసాయుజ్యము లభించునని సూతుడు శౌనకాదులకు వక్కాణించి విరమించెను.
ఇయ్యది “శివ విజ్ఞాన వీచిక“ అను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (19)వ యధ్యాయము.
Summary of chapter 127 of the Linga Mahā Purana is as follows:
The narrative details Dānaphala, cataloging the specific karmic rewards and heavenly realms attained through various acts of charity. The text reassures seekers that even small offerings like water, food, lamps, and footwear given to poor pilgrims or holy devotees with pure faith are multiplied a thousandfold by the grace of Prabhu Śiva.