లింగ మహా పురాణము
69 - కృష్ణభగవానుడు - యదువంశములో నవతరించుట
సాత్వతునకు భజనుఁడు, దేవావృధుఁడు, అంధకుఁడు వృష్టి నను నలుగురు కుమారులు కాగా భజనుఁడు సృంజయియందు అయుతాయువు, శతాయువు, బలవంతుఁడు, హర్షకృత్తునను నలుగురిని కనెను. వారిలో దేవావృధుఁడు- సర్వగుణ సంపన్నుఁడైన కుమారుఁడు కావలెనని- తపస్సు చేయగా బభ్రువు అను కుమారుఁడు జన్మించెను.
“దేవావృధుడు అమరులతో సమానుడనియు, బభ్రువు-మానవులలో ఉత్తముడనియు “ పురాణజ్ఞులు కీర్తించిరి.
బభ్రువు యొక్క వంశమునందు భోజులనువారు ఉదయింపగా గాంధారి, మాద్రి యను రమణులు సొత్త్వతుని నాలుగవ కుమారుఁడైన వృష్టికి భార్యలైరి. గాంధారి సుమిత్రుని; మాద్రి దేవమీఢుషుని, అనమిత్రుని, శినిని కనిరి.
అనమిత్రునకు నిఘ్నుఁడు; నిఘ్నునకు ప్రసేనుఁడు, సత్రాజిత్తు నను ఇరువురు కుమారులు కాగా సత్రాజిత్తునకు మిత్రుఁడైన సూర్యభగవానుడు శ్యమంతకమణి నొసగెను. అయ్యది- సర్వ రత్న శ్రేష్ఠముగా భూలోకమున పరిగణింపబడుచుండెడిది. ఇట్లుండగా సత్రాజిత్తు ప్రసేనునితో కూడ అడవికి వేటకై వెళ్లగా భయంకరమైన సింహము వారిరువురిని సంహరించెను.
శినికి సత్యవాక్కు; సత్య వాక్కునకు సత్యకుఁడు; సత్యకునకు సాత్యకి, యుయుధానుడును; యుయుధానునకు అసంగుడు; అసంగునకు కుణి; కుణికి యుగంధరుఁడు నను కుమారులు సంభవించిరి. వీరందరు శైనేయులనఁబడిరి.
మాద్రపుత్రునకు వార్షి, యుధాజితుఁడు, శ్వఫల్కుఁడు, నను ముగ్గురు కుమారులు కాగా శ్వఫల్కుఁడు లోకత్రయ మునకు హితము గొలుపుచున్నందున-శ్వఫల్క మహారాజు ఉండు దేశమున వ్యాధిభయము, కరువు భయంబు లేకుండెను. శ్వఫల్కుఁడు కాశీ రాజపుత్రిక యగు గాందినిని వివాహ మాడెను. గాందిని-తల్లికడుపులో పెక్కు వత్సరములుండగా త్వరలో జన్మించు” మని జనకుఁడు ప్రశ్నింపగా మూడు వత్సరముల వరకు ప్రతిదినము ఒక మంచి ఆవును బ్రాహ్మణునకు సమర్పింతువేని నేనీ గర్భము నుండి బయలుపడుదు” నని వచింప కాశీ రాజు అట్లే చేయుదునని యంగీకరించి 1080 గోదానముల నొనర్చెను.
శ్వఫల్కుఁడు గాందినియందు దాత, శూరుఁడు, యజ్ఞకర్త, అతిథి ప్రియుఁడు నగు అక్రూరుని అక్రూరుడు శివుని పుత్రిక యగు రశ్నను భార్యగా స్వీకరించి ఆమె యందు ఉపమన్యువు మాగుర్వతుఁడు, గిరిరక్షుఁడు, ఉపేక్షుఁడు, శత్రుఘ్నుడు, ధర్మభృత్తు, ధృష్టధర్ముడు, గోధనుడు, వరుడు, ఆవాహుడు, ప్రతివాహుడు నను పదనొకండు తనయులను, సుధారయను పుత్రిక బడయుటే గాక ఉగ్రసేని యను భార్య యందు దేవవంతుఁడు, ఉపదేవుడు నను ఇరువురు పుత్రులను జన్మింపఁజేసెను.
గాంధారీపుత్రుఁడైన సుమిత్రునకు చిత్రకుడు సంభవింపగా చిత్రకునకు శ్రీవిష్ణ- శ్రవణయను భార్యలయందు విప్పడువు, పృథువు, అశ్వ గ్రీవుఁడు, సుబాహువు సుధాసూకుఁడు, గవేక్షణుఁడు, అరిష్టనేమి, అశ్వుఁడు, ధర్ముఁడు, ధర్మభృత్తు, సుభూమి, బహుభూమీయను పన్నెండుగురు కుమారులు జన్మించిరి.
సాత్వతుని తృతీయ పుత్రుఁడగు అంధకునకు కాశ్యపుత్రికయందు కుకురుఁడు, భజమానుఁడు, శుచి, కంబలబిస్సు నను నలుగురు కుమారులు ఉదయించిరి.
కుకురునకు వృష్టి; వృష్టికి శూరుఁడు, శూరునకు కపోతరోముఁడు, కపోతరోమునకు విలోమకుఁడు; విలోమకునకు తుంబరుగంధర్వమిత్రుడగు నలుడు; నలునకు అభిజిత్తు. అభిజిత్తునకు పునర్వసువు; కుమారులు కాగా. అభిజిత్తు పుత్రప్రాప్తికై అశ్వమేధయజ్ఞము నొనర్చినతటి యజ్ఞకుండ మధ్యనుండి ఆవిర్భవించిన పునర్వసువు సర్వజ్ఞుఁడు దాత యజ్ఞకర్తగా నుండెను. పునర్వసువునకు ఆహుకుఁడు, ఆహుకియను ఇరువురు కుమారులు సంభవింపగా ఆహుకునకు కాశ్యపుత్రికయందు డేవకుడు, ఉగ్రసేనుడు నను పుత్రద్వయము జన్మించెను. దేవకునకు దేవవంతుఁడు, ఉపదేవుఁడు, సుదేవుఁడు, దేవరక్షితుఁడు నను నలుగురు కుమారులు, మరియు-వృషదేవ-ఉపదేవ - దేవరక్షిత, “ దేవ, శాంతిదేవ, సహదేవ, దేవకియను ఏడుగురు కుమారైలు సంభవించిరి. ఈ ఏడుగురిలో కి సర్వవిధసులక్షణములతో మిన్నయైయుండెను. ఉగ్రసేనుని తొమ్మండ్రు కుమారులలో కంసుడు పెద్దవాడైయుండెను. ఆ తొమ్మండు గురి యొక్క పుత్రులు పౌత్రులును నూర్లకొలది, వేల కొలదియు జన్మించిరి.
దేవకుఁడు తన ఏడుగురు కుమార్తెలను వసుదేవునకు వివాహవిధిని భార్యలుగా సమర్పింప వసుదేవుని ధర్మపత్నులందరు దేవతలచేతను సత్కరింపదగినవారు, మానవులచే నమస్కరింపబడువారు, పతి వ్రతలుగా నుండిరి. వసుదేవునకు రోహిణి యను నామె గూడ భార్య కాగా ఆమెయందు బలరాముడు జన్మించెను. దేవకీ గర్భములు ఆరు కంసునిచే వధింపబడగా వసుదేవుడు దేవకియందు శ్రీకృష్ణుని జన్మింపఁజేసెను.
శ్రీ కృష్ణుఁడు శ్రీహరి యవతార మగుటచే పరమాత్మగాను, బలరాముఁడు ఆదిశేషుని యవతారమగుటచే భగవంతుడుగాను ప్రజలచే భావింపఁబడుచుండిరి.
భృగశాపచ్చలేనైవ-మానయక్ మానుషీం తనుం । బభూవ తస్యాం దేవక్యాం వాసుదేవ్ జనార్దనః ॥
జనార్దనుఁడనఁ బజఁగు మహావిష్ణువు భృగుమహర్షి యొక్క శాపము అను మిషతోడనే మానవశరీరమును సంభావించుచు దేవకీయందు వసుదేవుని వలన జన్మించి వాసుదేవుడని పిలువంబడెను.
శ్లో॥ ఉమాదేహసముద్భూతా యోగనిద్రాచకౌశికీ । నియోగా దైవదేవస్య’-యశోదాతనయా హ్యభూత్ ॥ శ్లో॥సా చైవ ప్రకృతి: సాక్షా- త్సర్వదేవనమస్కృతా పురుషో భగవా కృష్ణో ధర్మమోక్షఫలప్రదః ॥
“ఉమాదేవి యొక్క దివ్యశరీరమునుండి ఉద్భవించినది, విష్ణువు యొక్క యోగనిద్రయు, సర్వదేవ నమస్కృతయు నగు ప్రకృతి (ఆది శక్తి) మహాదేవుని శాసనము ననుసరించి యశోదాదేవికి కుమార్తెయై జన్మించెను. యశోదాపుత్రిక ప్రకృతి కాగా భగవానుడగు శ్రీకృష్ణుడు పురుషుడనబఱుగుచు తనలో శివు నుపాసించువారికి ధర్మార్థకామ మోక్షములను సిద్ధింపజేయువాడుగ నుండెను.
బుద్ధిబలము గల వసుదేవుఁడు యశోదకొమార్తెను స్వీకరించి తన కుమారులగు బలరామ శ్రీకృష్ణులను యశోదకు నందునకు రక్షణార్ధమై ఈయగా వారిరువురు- శివానుగ్రహమువలన యశోద నొద్ద సురక్షితులుగా పెరుగుచుండిరి.
“వీరు యాదవులకు సర్వవిధశుభుముల నొనఁగూర్చువారు, దేవకీ తనయుడగు శ్రీ కృష్ణుడు విష్ణ్వంశ సంభూతుడగుటచే మన శత్రువులందరిని సంహరించును.” అని వసుదేవుడు యశోదానందుల కెఱిగించెను.
అంత వసుదేవుఁడు యశోద యొక్క బాలికను ‘ ఇదియే అష్టమశిశువు” అని కంసునకు చూపగా కంసా! దేవకి యొక్క - అష్టమగర్భమే నీకు మృత్యువు నాపాదించును నీ ప్రాణమును కాపాడు కొనుము! నీకు మృత్యువు సమీపించినది.” అని ఆకాశవాణి పలికెను.
ఇంక శ్రీకృష్ణుఁడు- బాల్యముననే తన ప్రభావమున కంసుని వధించుటే గాక దేవ బ్రాహ్మణ హింసకులందరిని సంహరించి లోకకల్యాణము నొసఁగూర్చెను. ఇట్టి శ్రీకృష్ణునకు ప్రద్యుమ్నుఁడు మొదలగు కుమారులు కృష్ణునితో సమానులు కాగా వారిలో చారుదేష్ణాదులగు పుత్రులు బలవంతులై శత్రుసంహారకులుగ నుండిరి.
పదునారువేల నూర్గురు (16100) కృష్ణ భార్యలు కాగా వారిలో రుక్మిణీదేవి పెద్ద భార్యయై కృష్ణ ప్రియురాలుగా నుండెను.
తయా ద్వాదశవర్షాణి - కృషేనా క్లిష్ట కర్మణా । ఉష్యతా వాయుభక్షేణ - పుత్రార్ధం పూజితో హరః ॥
సుఖప్రదములగు కార్యములను చేయునట్టి శ్రీకృష్ణ భగవానుఁడు రుక్మిణీ దేవితో గూడ పన్నెండేండ్లు గాలి మాత్రము పీల్చుచు పుత్రసంతానమునకై పరమేశ్వరు నారాధించెను. అందువలన శివుడు ప్రసన్నుఁడై చారుదేష్ణుఁడు, సుచారువు, చారువేషుఁడు, యశోధరుఁడు, చారుశ్రవస్సు, చారు యశస్కుఁడు, ప్రద్యుమ్నుఁడు, సాంబేశ్వరుడు నను ఎనమండుగురు కుమారుల నొసఁగెను. వీరందరు శ్రీకృష్ణునకు రుక్మిణియందు జన్మించినందున శ్రీకృష్ణ భార్యలలో నొకర్తెయగు జాంబవతి పుండరీకాక్షా! నాకును దేవేంద్రతుల్యుఁడగు పుత్రుఁడు కలుగునట్లు పరమేశ్వరుని ప్రార్ధించుము!” అని వేడుకొనెను.
అంత వాసుదేవుఁడు జాంబవతీ ప్రార్థ. నాలకించి వ్యాఘ్రపాదపుత్రుఁడగు ఉపమన్యు మహర్షి యొక్క ఆశ్రమమునకుఁజనినవాడై మహర్షి గారికి అభివాదముఁజేసి ఆతని వలన భస్మరుద్రాక్ష మంత్రధారణాత్మకమగు పాశుపత దీక్షఁబరిగ్రహించియు వెంట్రుకలు తీయించుకొని. ఘృతాక్తుఁడునై ముంజగడ్డి మొలత్రాడు (గట్టుకొని. ఊర్ధ్వబాహుపై పాదాంగుష్టాగ్రమునందు మాత్రము నిలువబడి ఫలములు ఉదకము, వాయువు అను వానిని మాత్రము భుజించుచు ప్రణవ షడక్షర మహామంత్రమును జపించుచు
తపసా తస్య సంతుష్టో దదౌ రుద్రో బహూక్ వరాన్। సాంబం జాంబవతీ పుత్రం కృష్ణాయ చమహాత్మనే “
ఆరునెలలు తన నారాధించినందువలన శివుఁడు సంతోషించి శ్రీకృష్ణునకు అనేక వరముల నొసఁగుటే గాక జాంబవతియందు అను పమాన తనయుడు కలుగు నట్లు అనుగ్రహించెను.
అంత కొంతకాలమునకు జాంబవతీదేవి శ్రీ కృష్ణుని వలన సాంబుడు అను కుమారుఁగని నదై “అదితిదేవి ఆదిత్యుని బడసినట్లు“ అమందానండము నొందెను. తరువాత శివ శాపఫలముగా శ్రీకృష్ణుడు బాణాసురుని సహస్రహస్తములను ఛేదించెను. మరియు బలరాముని సహాయముతో అనేక దుష్టదైత్యులను వధించెను. ఊర్వచక్రుడు అను బ్రాహ్మణుని వరమువలన నరకాసురుని సంహరించి 16100 దేవతారమణులను పరిగ్రహించి వారియందు రతి సుఖము ననుభవించెను. వీరే శ్రీకృష్ణ భార్యలుగా ఇంచు పేర్కొనఁబడిరి.
బ్రాహ్మణశాపము లను సముతో యాడవకులమును నశింపఁజేసి - ‘ప్రభాసక్షేత్రముననూరు వత్సరములుండగా విశ్వామిత్రుడు, కణ్యుఁడు, నారదుఁడు, దుర్వాసుఁడు సను వారి శాపోపశాప వచస్సులు సార్ధములగులుకు శ్రీకృష్ణుడు మనుష్య శరీరమును బోయవాని బాణ ప్రహారము నిమిత్తముగా ఏడనాడెను. మరియు బోయవానికి స్వర్గము సిపించెను.
అష్టావక్రుని శాపవశాత్తు కృష్ణుని భార్యలగు రుక్మణ్యాదులు. కృష్ణునితో గూడ అగ్ని బ్రవేశించిరి. బలరాముడుగూడ మానవహమును విసర్జించి ఆదిశేషుఁడై వైకుంఠము (జేరెను. లేవలీ దేవి బలరామునితో కూడ అగ్ని ప్రవేశించినపై భర్త లోకమునకేగెను.
శ్రీకృష్ణునకు బలరామునకు యడవులందరికి పాండవ మధ్యముఁడగు అర్జునుడు సిష్టాడులు తటస్థింపనందున కందమూల ఫలములతోడనే ఆపరకర్మనొనర్చి యుధిరాది సోదరులతో ద్రౌపది తోడను మహా ప్రస్థానమున స్వర్గము జేరెను.
ఇవ్విధము శ్రీకృష్ణుని ఆవిర్భావము - నిర్యాణంబు సంగ్రహముగా చెప్పితిని. చంద్రవంశీయుల చరితము - ఇంతవరకు ముగిసినది. దీనిని చడువువారు, వినువారును, వినుపించువారును ప్రారబ్దాంతమున పరమపడముఁజేరుదులు. అని సూతమహర్షి, శౌనకాది మునులకు ప్రజోధించి. ఏకాంతకై ఎలమంచెను.
ఇయ్యది “అపు విజ్ఞాన వీచిక” - అను శాంకరీయ ఫ్రానువాడు ప్రవచనమున (69) వ అధ్యాయము.
Summary of chapter 69 of the Linga Mahā Purana is as follows:
This chapter presents Somavaṃśānukīrtana, glorifying the divine advent and exploits of Bhagavān Śrī Kṛshṇa, the partial incarnation of Bhagavān Vishṇu born in the Yadu dynasty. The narrative details Kṛshṇa's birth, His childhood divine plays in Vṛndāvana, the destruction of demonic forces like Kaṃsa, and His profound devotion to Parameśvara Śiva from whom He obtained invincible boons and divine children like Sāmba.