లింగ మహా పురాణము
34 - మహాదానములలో ఆరవదైన గణేశదానమును ప్రతిపాదించుట
ఎనిమిది దిసలయందు అష్టదిక్పాలురు మధ్యన గణపతి విగ్రహము ఉండునట్లు యథాశక్తి బంగారముతో చేయించి - అష్ట దిక్కులలో ఎనిమిది కుండములను మధ్యన ప్రధానకుండమును నిర్మించి - వానిలో దిక్పాలక మంత్రములతో - ప్రధానకుండమున గణేశమంత్రముతోడను హవనము నొనర్పవలెను.
ఈ ప్రక్రియకు ఎనమండు గురు బ్రాహ్మణుల నొక కన్యక నెన్నుకొనవలెను. అష్టదిక్పాలక మూర్తులను గణపతి విగ్రహమును యథావిధి పూజించి - బ్రాహ్మణులకు దానముఁజేయవలెను.
ఇట్లు అష్టదిక్పాలక పరివేష్టితుడగు గణపతిని దానము నొనర్చిన వానికి - జన్మ జన్మాంతరార్జిత పాపములన్నియు నశించును.
ఇయ్యది “శివ విజ్ఞాన వీచిక “ అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (34)వ యధ్యాయము.
Summary of chapter 142 of the Linga Mahā Purana is as follows:
This chapter outlines various divine Lilās and cosmic manifestations assumed by Parameśvara Śiva throughout human history to establish righteousness, protect sages, and humble arrogant cosmic beings. The narrative highlights that every divine descent of Śiva is driven purely by boundless compassion for seeking souls.