లింగ మహా పురాణము
7 - సప్త మాధ్యాయము
శౌనకాదుల ప్రశ్నకు సమాధానమును సూతుడు చెప్పదొడగెను. పూర్వము బ్రహ్మదేవుఁడువసిష్ఠమహర్షికి చెప్పిన విధమెట్టిదనగా?
నారాయణుని మనో వాక్కాయములతో స్మరించువారు. ‘‘ఓం నమో నారాయణాయ” అను అష్టాక్షరమంత్రమును గురువునొద్ద స్వీకరించి జపించవలెను.
జాగ్రద్దశయందని భోజనపానీయ స్వీకారమునందు గమనశయనాదుల యందును నారాయణా నామమును స్మరించుచుండవలెను. ఇతర దేవతా మంత్రములకంటె విష్ణుభగవానుని అష్టాక్షర మంత్రమే శ్రేష్ఠమైనది. దీనిని నియమనిష్ఠలతో జపించువారు. జీవితాంతమున వైకుంఠముఁ జెందుదురు. ద్వాదశాక్షర విష్ణుమంత్రమును “ఓం నమో భగవతే వాసుదేవాయ” అని సృష్టి ప్రారంభమున జపించితిని.
పూర్వము ఒకానొక బ్రాహ్మణుఁడు తపోమహిమవలన స్వధర్మపత్నియందు కనిన కుమారునకు జాతకర్మాది ఉపనయనాంతము సంస్కారములఁ గావించి వేదము నభ్యసింపఁజేయదలపగా బాలుని నాలుక తిరుగనందున మిగుల వగచి రెండవ ఆమెను పరిణయమాడినవాడై అనేక పుత్రులఁగనినందున ప్రథమ పత్ని దుఃఖించుచు “నీ సవతితల్లి కుమారులు వేదవేదాంగ పారగులై జననిని సంతోషపెట్టు చున్న వారు. నీవు “వాసుదేవ “ అని మాత్రము పలుకుచున్నావు. దౌర్భాగ్యురాలనగు నా కడుపున జన్మించి జడుడవైతివి. ఐతరేయా! ఇట్టి నిన్నుగురించి జీవించుటకంటే మరణించులుయే మిన్న
యని తోచుచున్నది.“ అని వచింపగా బాలుఁడు ఆటనుండి బయలుదేరి ఒకానొక యజ్ఞవాటికఁజేరగా ఋత్విజులుచ్చరించు మంత్రములు స్తంభించినందున ఐతరేయుడు “వాసుదేవ “ అను వాక్కు నుచ్చరింపగానే వైదిక మంత్రములు ఋత్విజుల ముఖముల నుండి బహిర్గతములగుటయే గాక ఐతరేయుని నోట షడంగ సంపన్నములగు వేదములు ఉచ్చరింపఁబడుచుండెను. అందువలన యాజ్ఞికులందరు సంతోషించి ధనాదులతో ఐతరేయుని సత్కరించిరి. మరియు
“వాసుదేవ” శబ్దములో ఇంతటి మహిమ గలదని గుర్తించిరి. ఇట్టిశుభసందర్భమున ఖేదరులైన సిద్ధచారణులు ఆకసము నుండి పుష్పములను ఇతరేయునపై కురిపించిరి.
ఇట్లు ఇతరేయు యజ్ఞమును ముగింపుఁజేసి జననికి నమస్కరించియు తన జీవితమును సార్థకమొనర్చుకొని ప్రారబ్యాంతమున విష్ణులోకముఁజేరి ఆనందించెను.
ఇట్టి ద్వాదశాక్షర మంత్రమును ప్రతి దినము జపించువాడు పాపాత్ముఁడైనను ముక్తుఁడగును. స్వధర్మ పరాయణులై నుంచి ఆ మనిపుంగువా - దివ్యమైన పరమపదముఁజేరుదుకని వేరు చెప్పనేల? అని సూతుడు విరమించెను.
Summary of chapter 115 of the Linga Mahā Purana is as follows:
The text details Bhasmamāhātmya, glorifying the divine origin and supreme purifying potency of sacred Bhasma. It is narrated how holy ash is the burnt essence of sacrificial fires and cosmic elements, representing the ultimate reality that remains after all worldly illusion is dissolved by Śiva's fire of wisdom, capable of burning away the heaviest karmic transgressions of human beings.