లింగ మహా పురాణము
8 - అష్టమాధ్యాయము
శ్లో॥ మంత్రః షడక్షతో విప్రాః! సర్మ వేదార్థ సంజయః ।
యశ్చోంనమః శివాయేతి మంత్రః సర్వార్థసాధకః ॥
“శౌనకాది విప్రులారా! సర్వవేదార్థ సారమగు “ఓం నమః శివాయ” అను షడక్షరమం త్రము ఐహిక ఆముష్మిక ప్రయోజనములను సాధించునదని తెలియుడు!”
“శివతరాయ” “మయస్కరాయ” అను పంచాక్షరమంత్రములు సర్వార్థసాధకములేను. “నమస్తే శంకరాయ” అను సప్తాక్షరమంత్రంబు శివ ప్రీత్యర్థము జపింపఁదగినది.
బ్రహ్మదేవుడు, విష్ణు భగవానుడు, దేవేంద్రాద్యమరులందరు ముసులు నీ మంత్రములతోడనే పరమేశ్వరుని ధ్యానించుచున్నవారు. దీనిని జపించినచో ‘బ్రహ్మహత్యాది పంచమహాపాపములు నశించును.
పూర్వము మహావిష్ణువు మేఘమై ఈశ్వరుని మోయుచుండగా పరమేశ్వరుని భారమును సహింపజాలక తపస్సు తో మహేశ్వరుని మెప్పించి అసమాన బలముగల వాడయ్యెను. అందువలన ఆ కల్పమునకు “మేఘవామూనము”. అను పేరు ఏర్పడగా అట్టి కల్పమున ఒకానొక త్రేతాయుగమునందలి “దుంధుమూకుడు” అను బ్రాహ్మణుఁడు సహజవైరాగ్యము గలవాడైనను భార్యయగు విశల్యచే ప్రేరేపింపఁబడి కామమోహముచే ఆమావాస్యనాడు పగలు భార్యయందు యథేచ్ఛగా రతి సుఖము
ననుభవించినందున విశల్య గర్భవతియై అతికష్టముగా ప్రసవించినదై కుమారుని కనెను.
అందువలన ధుంధుమూకున తనయుఁడు దుర్మార్గుడు కాగా మిత్రావరుణులను
ఋషులేతెంచి “బృహస్పతి యొక్క అనుగ్రహముతో నీకుమారుడు శివభకుఁడై తరించును.చింతింపకుము! “ అని వచించిరి.
ధౌంధుమూకుఁడు (ధుంధుమూకుని పుత్రుఁడు) ఒకానొక శూద్రస్త్రీని ప్రేమించి
ఆమెయందు రతిసుఖములఁబడయుచు మద్యమును త్రాగుచు మాంసమును భక్షించుచుండెను.
తరువాత కొంతకాలమునకు పూర్వ సుకృతవశమున రుద్రాధ్యాయ జాపకుఁడగు బృహస్పతి నాశ్రయించి పాశుపతవ్రతమును తదంగమైన షడక్షర మహామంత్రమునా దేవాచార్యునివలన పరిగ్రహించి - అక్షరలక్షగా జపించుటయేగాక భస్మరుద్రాక్షాది ధారణాత్మకమగు పాశుపత వ్రతమును పన్నెండు నెలలు ఆచరించెను.
ధౌంధుమూకుఁడు ప్రారబ్దాంతమున మరణించి యమలోకము జేరగా – యమధర్మరాజు - అతనిని గౌరవించి నమస్కరించెను. పాశుపతవ్రత మహిమచే షడక్షర మంత్ర ప్రభావము వలనను ధౌంధుమూకుని జననీ జనకులు, భార్య, బంధువులును నరకములలో నుండి ఉద్ధరింపబడి దివ్యరూపధారులై ధౌంధుమూకుని వెంట విమానములలో కైలాసనివాసము గలవారైరి. ధౌండు మూకుఁడు కైలాసమున గాణపత్యము నంది రుద్రప్రియుడు కాగలిగెను.
అష్టాక్షరము ద్వాదశాక్షరంబునగు విష్ణు మంత్రము కన్న షడక్షర శివమంత్రము కోటిరెట్లు అధికఫలము నొసగునట్టిది.
ఈ యధ్యాయమును పఠించువాడు, వినువాడు, వినుపించువాడును శివావాసమగు పరమపదము (జెంది సుఖించును.
Summary of chapter 116 of the Linga Mahā Purana is as follows:
This chapter provides explicit ritual instructions for the gathering, preparation, and application of Bhasma upon the human body, known as Bhasmadāraṇa or Tripuṇḍra. Nandi outlines the sacred mantras from the Yajurveda to be recited while applying three horizontal lines of ash across the forehead and limbs, declaring that wearing Tripuṇḍra protects the practitioner from evil spirits, disease, and premature death while marking them as a true devotee of Mahādeva.