లింగ మహా పురాణము
9 - పాశుపత వ్రత నిరూపణము
శౌనకాది మునులు “బ్రహ్మదేవుఁడు శ్రీకృష్ణుభవానుఁడు, దేవతలున్ను పాశుపత వ్రతము నాచరించిరి గదా! ధౌంధుమూకుఁడు పతితుడైనను ఈ వ్రతము నాచరించి ముక్తుఁడై నాడు గదా! పరమేశ్వరుడు పశుపతి యెట్లయ్యెను? పశువులెవరు? పాశము లెట్టివి? వివరించి చెప్పుము!“ అని ప్రశ్నంపగా సూతపౌరాణికుఁడు దిగువవిధము ప్రత్యుత్తరించెను.
పూర్వము రుద్రశాపమువలన పొందిన ఒంటె బడలిని రుద్రునియొక్క ప్రసాదమువలన విసర్జించి మరుదేశమునుండి యేతెంచిన సనత్కుమారుడు- బ్రహ్మదేవు నాజ్ఞతో మేరుశిఖర పృష్ఠభాగమున నందికేశ్వరుని వలన శివషడక్షర మహామంత్రము అను పరావిద్యఁబడసినవాడై పాశుపత వ్రత విధానముఁ గూర్చి ప్రశ్నింపగా నందికేశ్వరుఁడు ప్రవచించినదంతయు వేదవ్యాసమహర్షి విని నాకు ప్రబోధించినట్లుచెప్పుచున్నాను. మీరు మహేశ్వరునకు అభినందనము నిడి ఆలకింపుఁడు!
శ్లో॥బ్రహ్మాద్యాః స్థావరాంతాశ్చ దేవదేవస్య ధీమతః ॥
పశవః పరికీర్త్యంతే సంసారవశవర్తిన: ।
శ్లో॥ తేషాం పతిత్వాద్భగవా రుద్రః పశుపతిః స్మృతః ॥
అనాదినిధనో ధాతా భగవా శంభురవ్యయః ।
శ్లో॥ మాయాపాశేన బధ్నాతి పశువత్ పరమేశ్వరః ॥
సఏవమోచక స్తేషాం జ్ఞానయోగేన సేవితః ।
అవిద్యాపాశబద్ధానాం నాన్యోమోచక ఇష్యతే ॥
పరిపూర్ణ జ్ఞానసంపన్నుఁడు దేవదేవుఁడు నగు పరమేశ్వరునకు సంసారవశవర్తులగు బ్రహ్మాది స్థావరాంత ప్రాణులు పశువులుగా పరిగణింపబడదురు. రుద్రభగవానుఁడు బ్రహ్మాదుల యొక్క ప్రభువగుటచే పశుపతి యనఁబఱగును.
ఆదిమధ్యాంతములు లేనివాడు, సర్వరక్షకుఁడు, అవ్యయుఁడు నగు శంభుభగ హౌనుఁడు - బ్రహ్మాదులను మాయాపాశముతో పశువులను వలె బంధించును. ఆతఁడే ఉపాసనాత్మక జ్ఞానయోగముచే సేవింపఁబడినవాడై మాయాపాశబద్ధులగు బ్రహ్మాదులను పాశముల నుండి విడిపించువాడు. అల్పజ్ఞానమనఁదగు పాశముచే కట్టబడిన జీవాత్మలను పాశనిర్ముక్తులఁజేయు సామర్థ్యము మరియొక దేవునకు లేదని తెలియవలెను.
చతుర్వింశతి తత్త్వములు పాశములనఁబడును. అవి యేవనగా?
ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, పంచతన్మాత్రలు, (ఒకదానిలో
మరియొకటి కలియ పంచభూతములు) శబ్ద స్పర్శరూప రస గంధములైదు, మనో బుద్ధిచిత్తా హంకారములు (వెఱసి ఇరువది నాలుగు) పాశములనఁబడును. పాశములనుండి విడుదల యగుటుకై మొదట శివునందు సాధారణమైన భక్తి యవసరము. అట్టె శివభక్తి ఏకాగ్రమైనచో “శివ ఏకో ధ్యేయః” శివంకరః సర్వమన్యత్ పరిథ్యజ్య” అను శ్రుతి ననుసరించి శివధ్యానము త్వరలో నలవడును గాన పాశవిచ్ఛిత్తి యగును. పాశములు విడిబడినంతనే నిజరూపము (పూర్వము శివేచ్ఛచే గోలుపోయినది)
ఆవిర్భవించును గాన సచ్చిదానందమయ శివానంద రసాస్వాదమున శివమ్యయుడగుటేగాక ప్రపంచమును శివమయముగా చూడఁగలుగును. అట్టితరి శివేతరము గానరానందున సృష్ట్యాది వ్యాపార లంపటత్వము చేకూరదు.
పరమేశ్వరుని భస్మరుద్రాక్షాది ధారణాత్మక పాశుపత వ్రతాచరణముతో ప్రసన్నుఁజేసికొనిన పుణ్యాత్ములకే శివునందు అనన్య భక్తి సంభవించును. భజధాతువు నుండి ఏర్పడు భక్తి శబ్దమునకు శివుని సేవించుటయని యర్థము.
శివు నారాధించులుకు సూక్ష్మపంచాక్షరి యనఁదగు ప్రణవముతో కూడిన “నమః శివాయ” అను స్థూలపంచాక్ష ర్యనుసంధానము ముఖ్యసాధనముకాగా శివ సదాశివ మహేశ్వరరుద్రాది శబ్దములలో నోంకారము శ్రేష్ఠమైనదిగా భావింపదగి యున్నది.
ప్రణవము వాచకము కాగా వాచ్యుడైన పరమేశ్వరుని ఉమాసహాయత్యాది లక్షణవిశిష్టునిగా నీలకంఠునిగా ప్రశాంతునిగాను ధ్యానించి “శివోహం” అని ధ్యానింసవలసియుండును. “శివోఽహం” లో శివ శబ్దము తచ్చబ్ధవాచ్యముగా “సః” - అగునుగాన “సోఽహం” అను హంసగాయత్రి ఇమిడియున్నది.
ఓంకారము అను దీపమును వెలిగించి - దహరాకాశములో దాగియుండు శివు నన్వేషించి దర్శింపవలెను. అనేక శాస్త్రపాండిత్యము అను అంధకారమును ప్రణవ దీప కాంతితో తొలగించు కొనవలెను.
ఇట్లు ఆచరించినవారు సమస్తభయవర్జితులై శివసాయుజ్యము నొందుదురని సూతుఁడు శౌనకాదులకు నిర్వచించి విశ్రాంతికై విరమించెను.
ఇయ్యది “శివ విజ్ఞాన వీచిక” యను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (9)వయభ్యాయము.
Summary of chapter 117 of the Linga Mahā Purana is as follows:
The narrative presents Nityapūjāvidhi, outlining the systematic daily worship protocol for householders and ascetics dedicated to Prabhu Śiva. The text details morning purification, Ācamana, breath control, consecration of worship materials, invocation of Mahādeva into the Śiva Liṅga, and offering of ritual water, lights, incense, and sacred food offerings with focused devotion.