లింగ మహా పురాణము
33 - మహాదానపంచమమగు కల్ప వృక్షదానమును నిరూపించుట
కల్పవృక్షాకారమును - అనేకశాఖలు, శాఖా గ్రములయందు ముత్తెముల హారములు, పైభాగమున మరకతమణులు, పగడములు చిగురుగాను, పద్మరాగమణులు ఫలములుగాను, నీలరత్నము మూలముగాను, వజ్రము స్కంధము (చెట్టుబోదె) గాను, వైడూర్యము వృక్షాగ్రముగాను, పుష్పరాగము వృక్షముస్తకముగాను, యథాశక్తి సువర్ణముతో - చేయించవలెను. చంద్రకాంతమణితో లేక స్ఫటికముతో వృక్షమును నెలకొలుపుటకు వేదికను నిర్మింపవలెను. చెట్టు ఎత్తు జానెడు, కొమ్మలు ఎనిమిది యుండవలెను.
వృక్షమూలమున - లోకపాలురతో కూడ - శివలింగము నర్చింపవలెను. లోకపాలురను పూజింపవలెను. జప హోమాదులను ప్రణవషడక్షర మహామంత్రముతో నాచరించి - వృక్షమును పరమేశ్వరునకు నివేదించియు భస్మ రుద్రాక్ష మంత్ర లింగధారులగు బ్రాహ్మణులకు అథవా శివయోగియైన ఆచార్యునకు సమర్పించినచో - మరుసటి జన్మమున చక్రవర్తియగును.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (33)వ ధ్యాయము.
Summary of chapter 141 of the Linga Mahā Purana is as follows:
The text recounts how the holy sage Śilāda performed rigorous austerities without eating food for thousands of years to obtain a son not born of a mortal womb. Gratified by his intense devotion, Supreme Śiva Himself emerged from the sacrificial fire as Nandi, filling Śilāda's home with divine joy and supreme spiritual illumination.