లింగ మహా పురాణము
35 - మహాదానములలో ఏడవదగు సువర్ణగోదానమును నిరూపించుట
మంచి డెక్కల పై వజ్రములు, కొమ్ములపై పద్మరాగమణులు, కనుబొమల నడుమ ముత్తెము, స్తనములయందు వైడూర్యములు, తోకపై నీలమణియు, దంతములపై పుష్పరాగములు నుండునట్లు గోరూపమును సువర్ణముతో చేయించి ఆవుదూడఁగూడ బంగారముతో నిర్మించియు మండలమునందు - మగదూడతో కూడ గోవును స్థాపించి -నూతన వస్త్రద్వయముతో చుట్టియు గాయత్రీ మంత్రముతో నారాధించి - ఘృతాదులతో శివలింగము నభిషేకించి పూజింపవలెను.
సమిధలు ఘృతము చరువు అనువానితో గాయత్రీమంత్రము నుచ్చరించుచు హవనమును జయాదులు స్విష్టకృత్తు పూర్ణాహుతి వరకు నొనర్చియు శివునకు నివేదించి - ఆచార్యునకు లేక సద్రాహ్మణునకు సమర్పించినచో శివానుగ్రహ మవశ్యము ప్రాప్తించును. ఇయ్యది “శివ విజ్ఞాన వీచిక ‘ అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (35)వ యధ్యాయము.
Summary of chapter 143 of the Linga Mahā Purana is as follows:
The narrative records the historical account of King Dasharatha of Ayodhyā, detailing his devout worship of Sūryadeva and Prabhu Śiva to overcome his karmic afflictions and obtain noble progeny. Through divine grace invoked by intense Śiva worship and Vedic sacrifices, King Dasharatha was blessed with four divine sons led by Bhagavān Śrī Rāma.