53 - రుద్రహవన సహిత మృత్యుంజయ మంత్రవిధానము

బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులాచరింపఁదగిన - మృత్యుంజయ మంత్రానుష్ఠానమునకు అంగముగా రుద్రాధ్యాయముతో లక్ష ఆహుతులను ప్రజ్వలితాగ్నియందు ఘృతమును వ్రేల్చవలెను.

నెయ్యితో కూడిన తిలలతో గాని, కమలములతో గాని, ఘృతగోక్షీర మిశ్రమగు గఱికలో గాని, తేనెతో గాని, ఘృతసహిత చరువుతో గాని క్షీరాన్నముతో గాని హవనము నొనర్చినచో కాలమృత్యువు దూరమై దీర్ఘా యుష్యము చేకూరును.

ఇయ్యది

“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ

ఆంధ్రానువాద ప్రవచనమున (53)వ  యధ్యాయము.