లింగ మహా పురాణము
37 - మహాదానములలో తొమ్మిదవ తిలధేను దానమును నిరూపించుట
మండపమునందు పశ్చిమమున శివలింగమును పూజించి శివలింగము ముందు నేల నడుమ కమలమును ముగ్గుతో వేసియు సూతన వస్త్రములతో పద్మము నాచ్ఛాదించి - దానిపై బంగారు తామరను గంధ పుష్పాదులతో నర్చించియు - పద్మమునకు ఉత్తరభాగమున పడునొకండు గురు బ్రాహ్మణులను గంధ పుష్పాడులలో కుండల అంగుళీయకాది ప్రదానముతో సత్కరించియు బ్రాహ్మణుల ముందు ఏకాదశవస్త్రములను పఱచి వానిలో తిలలను రాసులుగా నునిచి - తిలరాసుల మధ్యన బంగారు ఆవును పూజించియు - కంచుగిన్నెలు చెరుకుగడలు అనువానితో సహ తిలరాశులను సువర్ణ ధేనువును ఏకాదశరుద్రులు అనుభావనతో ఏకాదశ బ్రాహ్మణులలోని ఆచార్యునకు సువర్ణధేనవును, మిగత బ్రాహ్మణులకు తిలరాశులను దక్షిణతో సహ సమర్పించవలెను.
ఇట్టి తిలధేను దానము వలన - ముఖ్యముగా రాజునకు స్వరాష్ట్రమున గోవృషభాది పశుసంపద - పెంపొందుటయే గాక - సుభిక్షము నెలకొని యుండును. తదితరులు కదితరులాచరించినను శ్రేయోభాజనులగుదురు.
ఇయ్యది “శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాడ ప్రవచనమున (37)వ యధ్యాయము.
Summary of chapter 145 of the Linga Mahā Purana is as follows:
The narrative details the numerous holy bathing ghāṭs, sacred wells, and Liṅga shrines scattered across Kāshī, including Maṇikarṇikā, Dashāshvamedha, and Kālavhairava. The text explains that performing daily ablutions and ancestral rites in these sacred waters cleanses all karmic impurities and bestows divine merits.