లింగ మహా పురాణము
11 - ఉమామహేశ్వర విభూతిని శివలింగార్చన మహిమను ప్రవచించుట.
“పార్వతీ పరమేశ్వరుల యొక్క విభూతులను వివరింపు” మని సనత్కుమారుఁడు ప్రశ్నింపగా నందికేశ్వరుఁడు చెప్పినట్లు సూతుఁడు శౌనకాదులకు దిగువవిధము వక్కాణించెను.
శివుఁడు పరమాత్మ కాగా పార్వతి శక్తి యగును.
ఈశ్వరుఁడు శివుఁడుమాయ గౌరీదేవి; పురుషుఁడు శంకరుఁడు ప్రకృతి గౌరీదేవి; అర్థము శంభువు వాక్కు రుద్రాణి; దివసము పరమేశ్వరుఁడు రాత్రి పార్వతి; యజ్ఞము మహాదేవుడు దక్షిణ పరమేశ్వరి; ఆకాశము శంకరుఁడు పృథివి శాంకరి; సముద్రము రుద్రుఁడు చెలియలకట్టు రుద్రాణి; వృక్షము త్రిశూలపాణి లత జగదంబ; బ్రహ్మదేవుడు హరుడు సావిత్రి శంకరార్ధాంగి; విష్ణువు మహేశ్వరుడు లక్ష్మీదేవి భవాని; దేవేంద్రుఁడుమహాదేవుఁడు శచీదేవి శైలజ; అగ్నిరుద్రుఁడు స్వాహాదేవి శర్వాణి; యముఁడు త్రినేత్రుఁడు యమపత్నిగిరిజాదేవి; వరుణుఁడు రుద్రభగవానుఁడు వరుణపత్నిగౌరీదేవి; వాయువు బాలేందుశేఖరుఁడు వాయుపత్ని ఉమాదేవి; కుబేరుఁడు చంద్రశేఖరుఁడు తత్పత్నియగు బుద్ధి - హైమవతి; చంద్రుడు చంద్రమౌళి రోహిణి రుద్రాణి; సూర్యుడు శివుడు సువర్చల ఉమాదేవి; షణ్ముఖుఁడు త్రిపురాంతకుఁడు దేవసేన గిరిజాదేవి; దక్షప్రజాపతి మహేశ్వరుఁడు ప్రసూతి సతీదేవి; మనువు శంభుఁడు శతరూప భవాని; రుచి మహాదేవుడు ఆకూతి భవాని; భృగుమహర్షి మహేశ్వరుడు ఖ్యాతి మహేశ్వరి; మరీచి రుద్ర భగవానుఁడు సంభూతి రుద్రాణి; శుక్రుడు పరమేశ్వరుఁడు; రుచిర భవాని; అంగిరస్సు గంగాధరుఁడు స్మృతి ఉమాదేవి; పులస్త్యుఁడు చంద్రశేఖరుఁడు ప్రీతి మహేశ్వరి; పులహుఁడు త్రిపురారి దయ కాలకాలుని పత్ని; క్రతువు దక్షయజ్ఞ ధ్వంసి సన్నతి సతీదేవి; అత్రి త్రినేత్రుఁడు అనసూయ ఉమాదేవి; వసిష్ఠుడు మహేశ్వరుడు ఊర్జ పార్వతి; ఇట్లు స్త్రీ పురుషదంపతలు ఉమామహేశ్వరాంశ గలవారసయు; పురుషులందరు శంకరాంశ సంజాతులనియు; స్త్రీలందరు పార్వత్యంశసంజాతలసేయు; పుంలింగవాచ్యులందరు శివాంశ గలవారనియు, స్త్రీ లింగవాద్యులందరు శక్త్యంశ గలవారనియు; పదార్థశక్తులన్నియు, గౌరీ స్వరూపలనియు; పదార్థములు శివ స్వరూపములనియు తెలియవలెను.
అగ్నియందు పెక్కు మిణుగురుల వలె శివుని యందు ఉత్మవైవిధ్యము ఏర్పడును, దేహములన్నియు గౌరీ రూపములు కాగా దేహధారి ప్రాణులందరు శివరూపములగును. శ్రావ్యము గౌరి కాగా శ్రోత శంకరుడగును.
ఇంద్రియ విషయముల ననుభవించు పురుషుఁడు విశ్వనాథుఁడు కాగా శబ్దస్పర్శాది విషయములు ఉమాదేవియగును. స్వజింపదగిన వస్తు జాతము శాంకరి కాగా సృజించువాడు శంకరుడగును. వృశ్యమంతయు భువనేశ్వరి కాగా ద్రష్ట పరమేశ్వరుఁడగును. రసజాతము (రుచ్యమంతము) వాసన చూడదగినదియు పార్వతీదేవి కాగా రుచిని కలిగించువాడు, వాసన చూచువాడును మహేశ్వరుఁడగును. మంతవ్యము మహాదేవి కొగోమంత మహాదేవుడగును. తెలిసికొనదగిన వస్తువులన్నియు భవాని కాగా తెలియువాడు చంద్రశేఖరుఁడగును.
శ్లో॥ పీఠాకృతి రుమాదేవి - లింగరూపశ్చ శంకరః ।
ప్రతిష్ఠాప్య ప్రయత్నేన పూజయంతి సురాసురాః ॥
శివలింగపీఠము (అనగా పానవట్టము) శక్తి యనియు, పైపిండము శివుఁడనియు గుర్తించి సురాసురులు శక్తి శివాత్మకమగు శివలింగమును ప్రతిష్ఠించి పూజించుచున్నవారు. స్సర్గము నుండి పాతాళము వరకు గల ఆవరణాష్టకము జ్ఞేయముగా ఉమా రూపంబనియు , జ్ఞాతమహేశ్వరుఁడనియు, క్షేత్రము పార్వతీ దేవి కాగా క్షేత్రజ్ఞుఁడు పరమేశ్వరుఁడనియు తెలియవలెను,
తాను తన ప్రజలు శివలింగమును విడనాడి ఇతర దేవతల నారాధించినచో లజ్జి రాజు ప్రజలును గౌరవనరకము నొందుదురు. రాజు శివభక్తుడు గొక అన్యదేవతా భక్తుడగు నెడ “ తరుణి పతిని పరిహరించి పరపురుషుని ప్రేమించినట్లు” దుఃఖభాజును డగును.
బ్రహ్మాది దేవతలు, మాంధాతాది క్షత్రియులు, మానవోత్తములు, మునివర్యులు, తదితర పుణ్యాత్ములందరును శివలింగము నర్చించుచున్నవారు. శ్రీమహావిష్ణువు శ్రీరాముఁడై రావణుని వధించి బ్రహ్మహత్యా పాపనివారణార్థము సముద్రతీరమున విధియుక్తముగా శివలింగమును ప్రతిష్ఠించెను.
వేలకొలది పాపములను నూర్లకొలది బ్రహ్మహత్యల నొనర్చినవాడైనను త్రికరణ శుద్ధిగా శివలింగమును పూజించినచో పాపనిర్ముక్తుఁడగును. చతుర్దశ భువనాత్మకమగు బ్రహ్మాండము శివలింగమునందే ఆధారపడియున్నది గాని శాశ్వతస్థానమున పేక్షించువాడు శివలింగము నాజన్మాంతము ప్రత్యహ మర్చించుచుండవలెను.
శక్తి శివులు సమస్త జగదాల్మకులై ఇహపరభోగములను మోక్షసంపద నొసఁగువారగుబడి నా ఆదిదంపతులను శివలింగమునండు పూజింపపలెను. నమస్కరింపవలెను ప్రార్థింపవలెను.
ఇట్లు సనత్కునూరునకు నందికేశ్వరుడు ప్రవచించినట్లు సూతుడు శౌనకాదులకు
వక్కణించి విరమించెను.
ఇయ్యది “శివ విజ్ఞాన వీచిక” యను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (11)వయభ్యాయము.
Summary of chapter 119 of the Linga Mahā Purana is as follows:
The text glorifies the sacred Bilva tree, describing it as the very embodiment of Mother Pārvatī and Prabhu Śiva. The narrative reveals that worshipping a Śiva Liṅga with trifoliate Bilva leaves removes the accumulated sins of three lifetimes, and residing or performing penance under a Bilva tree bestows spiritual merits equivalent to visiting all holy tīrthas across Bhāratavarsha.