లింగ మహా పురాణము
46 - భూలోక గత సప్త ద్వీపాది నిరూపణము
సూతుఁడు చెప్పఁదొడఁగెను.
నదులలో పర్వతములతో కూడి యుండు పృథివి - ఏడు ద్వీపములు సప్తసముద్రంబులు కలదగును. జంబూ - ప్లక్ష - శాల్మలి - కుశ - క్రొంచ - శాక - పుష్కరాఖ్యలతో సప్తద్వీపములు వ్వవహరింపఁబడును. ఈ ఏడు ద్వీపములందును సాంబసదాశివుడు నానారూపములతో గణములతో కూడినవాడై నివసించుచుండును.
ఉప్పురసము, చెరుకు రసము, మధురసము, ఘృతము, దధి, (పెరుగు) పాలు, రుచికర మధురజలము అను వానితో సప్తసముద్రములు నిండియుండును. ఈ సముద్రములన్నిటిలో శివుడు తరంగము (అల)లు అను భుజములతో రసరూపముగా క్రీడించుచుండును.
శ్రీహరి పాల సంద్రమున శివ ధ్యానముఁజేయుచు యోగనిద్రఁ జెందుచు మేలు కొనిన తఱి జగత్తంతయు మేలుకొనును. శయనించిన వేళ చరాచరమంతయు స్తంభించును. పరమేశ్వరా Milk rail trio hi a H #m 2 PETAA W శృతిలయముల (జేయుచుండును. సుషేణులను వారు శంఖ చక్ర గదాధరుడగు నారాయణుని సేవించుచుందురు. సనక సనందన సనాతనులు, వాలఖిల్యులు, సిద్ధులు, మిత్రావరుణులును శ్రీహరి నుపాసించుచుందురు. ఇక నీ సప్త ద్వీపముల యందు అనేక శిఖరములు సముద్రమువరకు వ్యాపించు వైశాల్యంబు గల గిరులు గుహలతో కూడ విలసిల్లుచు భూధరంబులనఁ బఱగుచును పరమేశ్వరుని వలన లభించిన సామర్థ్యము గలవై యుండును.
స్వాయంభువ మన్వంతరమునందు ప్రియవ్రతుని కుమారులు పదుగురుండిరి,
ఆగ్నీధ్రుఁడు, అగ్నిబాహువు, మేధ, మేధాతిథి, వసువు, వపుష్మంతుఁడు, జ్యోతిష్మంతుఁడు, ద్యుతి మంతుఁడు, హవ్యుఁడు, సవనుఁడు ననుసవి ప్రియవ్రత తనయుల నామధేయములు.
ఆగ్నీధ్రుని జంబూద్వీపమునకు; మేధాతిథిని ప్లక్ష ద్వీపమునకు; వపుష్మంతుని శాల్మలి ద్వీపమునకు, జ్యోతిష్మంతుని కుశద్వీపమునకు; ద్యుతిమంతుని క్రౌంచద్వీపమునకు; హవ్యుని శాక ద్వీపమునకు; సవనుని పుష్కరద్వీపమునకు అధిపతులుగా ప్రియవ్రతుఁడొనర్చిను.
పుష్కరద్వీపమునందు సవనునకు మహావీతుఁడు, ఘాతకి యను ఇరువురు కుమారులు కలుగగా మహనీతుని పేరుతో పుష్కరద్వీపమున - మహావీతము అను వర్షమేర్పడెను.
ఘాతకుని పేరుతో ఘాతకి యను ఖండము సంభవించెను. శాకద్వీప ప్రభువగు హవ్యుడు - “జలదుఁడు, కుమారుఁడు, సుకుమారుఁడు, మణీచకుఁడు, కుసుమోత్తరుఁడు, మోదాకి’ మహాద్రుముఁడు” నను ఏడుగురు కుమారులను కనగా జలదుని పేరుతో జలదము; కుమారుని పేరుతో కౌమారము; సుకుమారుని పేరుతో సుకుమారము; మణీచకుని పేరుతో మణీచకము; కుసుమోత్తరుని పేరుతో కుసుమోత్తరము; మోదాకి యొక్క కుసుమోత్తరము; మోదాకి యొక్క పేరుతో మోదకము; మహాద్రుమున పేరుతో మహా ద్రుమము అను నామధేయములతో ఏడు వర్షములు ఏర్పడినవి.
క్రౌంచ ద్వీప ప్రభువగు ద్యుతిమంతుని- కుశల, మనుగ, ఉష్ణ, పీవర, అంధకారక, ముని, దుంధుభి నామధేయులైన ఏడుగురు కుమారులు తమ పేరులతో ఏడు ప్రదేశములను క్రౌంచ ద్వీపమునందు ఏర్పరచిరి. కుశ ద్వీపమునందు ఉద్భిదుఁడు, వేణుమంతుఁడు, ద్వైరథుఁడు, లవణుఁడు, ధృతి, ప్రభాకరుఁడు, కపిలుఁడు నను ఏడుగురు తమ పేరులతో ఏడువర్షములను విభజించిరి. శాల్మల ద్వీప ప్రభువులు, వపుష్మంతుని కుమారులునగు శ్వేత - హరిత - జీమూత - రోహిత - వైద్యుత - మానస - సుప్రభ - నామధేయులు ఏడుగురు తమ పేరులతో ఏడు ప్రదేశముల నేర్పరచిరి.
ప్లక్షద్వీపము యొక్క ప్రభువులు, మేధాతిథి పుత్రులు నగు శాంత భయాది నామధేయులు ఏడు వర్షములను ప్లక్షద్వీపమునందేర్పరచి వర్ణాశ్రమాచార సంపన్నులగు ప్రజలను నివసింపజేసిరి. ప్లక్షద్వీపము మొదలగు ఐదు ద్వీపముల యందు వర్ణాశ్రమ ధర్మము ఆచరింపబడుచుండును.
సుఖము - దీర్ఘాయుష్యము - సౌందర్యము - బలము - ధర్మము - ఈ ఐదు ద్వీపములలో సమానములుగ ప్రజలకు నుండును. వీనియందు జనులు మహేశ్వరుని భక్తి శ్రద్ధలతో నారాధించుచు శివభావము అను అమృతముతో నిండియుందురు.
ఇయ్యది “శివ విజ్ఞాన వీచిక ‘ అను శాంకరీయ ఆంధ్రానువాడ ప్రవచనమున (46) నలబది యారవ అధ్యాయము.
Summary of chapter 46 of the Linga Mahā Purana is as follows:
Sūta Romaharshaṇa outlines the cosmic layout of the seven major continents or Dvīpas—Jambū, Plaksha, Śālmali, Kuśa, Krauñca, Śāka, and Pushkara—surrounded by seven concentric oceans. The chapter describes the noble rulers, pristine rivers, sacred mountain ranges, and spiritual practices observed by the virtuous inhabitants of each island continent under divine law.