లింగ మహా పురాణము
25 - స్నాన విధి నిరూపణము
శివలింగమూర్తియగు మహేశ్వరు నేవిధముగా పూజింపవలెను? అని శౌనకాది మహర్షులు ప్రశ్నింపగా సూతమహాముని దిగువవిధము వక్కాణించెను.
కైలాసపర్వతము యొక్క మహోన్నత శిఖరమున - దివ్యమణిమయ భవనమునందు రత్న సింహాసనముపై పరమేశ్వరుఁడు - తన తొడమీద పార్వతీదేవిని కూర్చుండ జేసి ఆనందములో నుండగా దేవి “లింగార్చన విధానము జెప్పు” మని వినయముతో ప్రశ్నింపగా మహేశ్వరుడు సంభాషింప నద్దానినంతయు నందికేశ్వరుఁడు విని బ్రహ్మమానస పుత్రుఁడగు సనత్కుమారునకు ఉపదేశించెను. సనత్కుమారుని వలన మేదసమ్మతముగు రింగార్చనవిధాసమును ఆలకించిన వ్యాసుఁడు చెప్పుగా నేను వింటిని.
లింగార్చనమునకు చేయవలసిన స్నానవిధానమును చెప్పుచున్నాను. అది యెట్లనగా?
స్నానము - వారుణము, ఆగ్నేయము, మాంత్రికము నని మూడు విధములు గలడగును. మనోభావము దుష్టమగునెడల మహా నదులలో కొలనులయందు చెరువులలోను ఆజన్మాంతము స్నానము జేసినను విభూతిని మేనునిండ పూసికొనినను పరిశుద్ధి కలుగదు. ముకుళించిన మానసకమలము భక్తి శ్రద్ధాసమన్వితమగు జ్ఞానము అను సూర్యునితో వికసించినచో భావము పరిశుద్ధమగును. ఇంక బాహ్యస్నానము (గు విధానము నవధరింపుడు!
స్నానోదకమునందు దర్భలు చేర్చి పాదములను కడిగికొని ఆచమించియు ఒడలిమైలను స్నానోదకముతో పోనాడి - మట్టి, ఆవు పేడ, నువ్వులు, అనువానిని ఒంటికి రాచుకొనియు ఉదకమును శరీరముపైన పోసికొనవలెను. పిదప శుభ్రమైన వస్త్రము గట్టుకొని రెండవసారి స్నానము నొనర్చి ఆ వస్త్రమును విడిచి మరియొక శుభ్రవస్త్రమును ధరించియు మూడవ స్నానము జేయుతఱి ఉచకమును వరుణదేవు నావాహించి మానసికముగా వరుణుని పూజించి మహేశ్వరుని ధ్యానించియు మూడవ స్నానము నొనర్ప వలెను. పవమాన సూక్తములను, నమక చమకాదులను స్నానము (జేయునపుడు, పఠింపవలెను. తన శిరస్సుపై జలధారల నభిషేకింప cజేసికొనవలెను.
స్నానానంతరము మరియొక పొడిబట్టఁగట్టుకొని పరిశుభ్రమైన స్థలమునందాసీనుడై దర్భోదకమును ముమ్మారు పుచ్చుకొని - జలములోని సూక్ష్మజంతువులను హింసించిన పాపము శమించుటకై ఉదకసన్నిధిని మూడు ప్రదక్షణముల నొనర్చియు స్నానవిధానమును ముగింపవలెను.
ఉదకముతో వారుణము, భస్మతో ఆగ్నేయము సద్యోజాతాది పంచబ్రహ్మ మంత్రములతో శివ షడక్షరీ మహామంత్రము తోడను మాంత్రికంబునగు స్నానము సంఘటించును.
ఇట్లు బాహ్యాభ్యంతర స్నానవిధానమును సంగ్రహముగా చెప్పితినని సూతుఁడు విరమించెను.
ఇయ్యది - “శివవిజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (25) ఇరువదియైదవ అధ్యాయము.
Summary of chapter 25 of the Linga Mahā Purana is as follows:
The chapter details the precise daily purification rituals, snānavidhi, and ācamana procedures essential for spiritual practitioners before engaging in divine worship. It outlines how bathing in holy rivers while chanting sacred mantras purifies the physical, subtle, and causal bodies, preparing the devotee to receive divine grace during Liṅga worship.