లింగ మహా పురాణము
68 - యదువంశాను వర్ణనము
సూతఉవాచ - సూతుఁడు చెప్పదొడఁగెను.
యయాతి కుమారులలో జ్యేష్ఠుడైన యదువునకు సహస్రజిత్తు, క్రోష్టువు, నీలోజకుడు, లఘువు, మరియొకనితో ఐదుగురు కుమారులైరి. సహస్రజిత్తునకు శతజిత్తు; శతజిత్తునకు హైహయుఁడు, హయుఁడు, వేణుహయుఁడు నను ముగ్గురు పుత్రులు సంభవించిరి. హైహయునకు ధర్ముఁడు; ధర్మునకు- ధర్మనేతృడు; ధర్మనేత్రునకు కీర్తి; కీర్తికి-సంజయుడు; సంజయునకు మహిష్మంతుడు; మహిష్మంతునకు భద్రశ్రేణ్యుఁడు; భద్రశ్రేణ్యునకు దుర్ధముఁడు; దుర్ధమునకు ధనకుఁడు; ధనకునకు- కృతవీర్యుఁడు, కృతాగ్ని, కృతవర్మ, కృతౌజస్కుఁడునను నలుగురు కుమారులు జన్మించిరి. కృతౌజస్కునకు కార్తవీర్యార్ధుడనువాడు సహస్రహస్తములతో జన్మించి. సప్తద్వీపాధిపతి యాయెను. కార్తవీర్యార్జునుని విష్ణ్యంశసంభూతుడగు పరశురాముడు సంహరించెను. కార్త వీర్యార్జునుని పుత్ర శతములో శూరుడు, శూరసేనుడు, ధృష్టుఁడు, కృష్ణుఁడు, జయధ్వజుఁడు నను ఐదుగురు ముఖ్యులుగా నుండిరి.
జయధ్వజుఁడు అవంతిదేశమునకు ప్రభువు కాగా జయధ్వజునకు తాలజంఘుఁడు అను కుమారుఁడు సంభవించెను. తాల జంఘుని నూర్గురు కుమారులలో పెద్దవాడుగా వీతిసూత్పఁడుండెను. వృషుఁడు మొదలగు 99 గురు తాలజంఘుని కుమారులేను. వృషునకు మధువు; మధువునకు పుత్రశతము సంభవించెను. తత్పుత్రశతములో వృష్ఠియనువాడు ముఖ్యడయ్యెను. వృష్టిసంతానము వారేయులనియు. మధువు యొక్క సంతానము-మాధవులనియు, యదువు యొక్క సంతానము యాదవులనియు, హైహయుని సంతానము. హైహయులనియు పేర్కొనఁబడిరి.
హైహయుని పుత్రులు- వీతిహోత్రులనియు, హర్యాతులనియు, భోజులనియు, అవంతులనియు, శూరసేనులనియు ఐదువిధములుగా విభజింపఁబడిరి. శూరుఁడు, శూరసేనుడు, వృషుడు, కృష్ణుడు, జయధ్వజుడు నను ఐదుగురు హైహయపుత్రగణములలో ముఖ్యులుగా నుండిరి. శూరసేనునకు శూరుఁడు, శూరవీరుఁడు, శూరసేనుడు ననువారు కుమారులై సమస్తదేశాదిపతులుగ నుండిరి. వీతిహోత్రునకు ఆనర్తుడు, కృష్ణునకు-దుర్జయుఁడు మొదలగు ముగ్గురు కుమారులు సంభవించిరి.
క్రోష్ణువు యొక్క వంశమునందు విష్ణ్వంశతో కృష్ణుఁడు జన్మించెను. క్రోష్టువునకు వృజినీవంతుఁడు, వృజినీవంతునకు స్వాతి; స్వాతికి కుశంకుఁడు; కుమారులైరి. కుశంకుఁడు సంతాన ప్రాప్తికై అనేకయజ్ఞములతో పరమేశ్వరు నారాధింపగా. ఆతనికి శివానుగ్రహముతో చిత్రరథుడు అను పుత్రుడు జన్మించెను. చిత్రరథునకు చైత్రరథుడు, చైత్రరథునకు శశబిందువు కుమారులు కాగా- శశబిందువు చక్రవర్తిగా నుండెను. శశబిందువునకు కలిగిన వేలకొలది కుమారులలో గల అనంతకునకు-యజుఁడు; యజ్ఞునకు ధృతి; ధృతికి ఉశనస్సు కుమారులైరి. ఉశనస్సు నూరు అశ్వమేధయజ్ఞముల నొనర్చెను. ఉశనస్సునకు సీతేషువు; సితేషువునకు మరుతుడు; మరుతునకు కంబలబిస్సు; కంబలబర్దస్సునకు-మరువు; మరువునకు - రుక్మకవచుడు కుమారులు కాగా రుక్మకవచుడు ధనుర్బాణ కవచధారులగు వీరుల ననేకులను సంహరించి గొప్ప రాజ్యసంపదనొందుటయే గాక ధర్మాత్ముడై తా జేసిన అశ్వమేధయాగములో బుత్విజులకు పృథివిని యజ్ఞదక్షిణగా సమర్పించెను.
రుక్మకవచునకు పరావృతుఁడు; పరావృతునకు - రుకేషువు, పృథురుక్ముఁడు, జ్యామఘుఁడు, పరిఘుఁడు, హరియను ఐదుగురు కుమారులు జన్మింపగా పరావృతుఁడు పరిఘుని హరిని విదేహ దేశములయందు జేసెను రుక్మేషువు రాజ్యాధికారి గాను పృథురుక్కుడు రుక్ష్మేషువునకు తోడుగా నుండిరి. జ్యామఘుడు-విరాగుడై ఒకానొక ఆశ్రమమునందు ప్రశాంతుఁడై కొంతకాలము నివసించిమరల బ్రాహ్మణ ప్రబోధితుడై నర్మదాతీరమునగల ఋక్షవంతమను--పర్వతముపై భార్యతో కూడ నివసించెను. జ్యామఘుని ధర్మపత్ని, శీలసంపన్నయునగు శైబ్య-ఉగ్రమైన తపస్సు చేసినదైవయో ధికురాలైనను విదర్భుడు ఆను కుమారు (గనినది. విదర్భునకు- ‘క్రథుడు, కైశికుడు, రోమపాదుడు నను ముగ్గరు పుత్రులు జన్మించిరి.
రోమపాదునకు బభ్రువు, బభ్రువునకు సుధృతి; సుధృతికి కైశికుఁడు; కైశికునకు చైద్యాన్వయుఁడు నను కుమారులు సంభవించిరి.
విదర్భునకు- క్రథుఁడు; క్రథునకు కుంతి; కుంతికి వృతుఁడు; వృతునకు రణధృష్ణుఁడు; రణధృష్ణునకు నిధృతి; నిధృతికి దశార్జుఁడు; దశార్జునకు-వ్యాప్తుఁడు; వ్యాప్తునకు జీమూతుడు; జీమూతునకు వికృతి; వికృతికి భీమరథుడు; భీమరథునకు నవరథుడు, నవరథునకు దృఢరథుడు; దృఢరథునకు శకుని; శకునికి కరంభుడు; కరంభునకు దేవరాతుడు; దేవరాతునకు దేవారాతి; దేవారాతికి దేవక్షత్రుడు, దేవక్ష త్రునకు మధువు; మధువునకు కురువంశకుడు, కురు వంశకునకు అనువు; అనువునకు పురుత్వతుడు; పురుత్వతునకు భద్రవతీయందు అంశువు, అంశువునకు సత్త్వుడు; సత్త్యునకు సొత్త్వతుడు అను కుమారులు సంభవించిరి.
ఇట్లు జ్యామఘుని వంశము పేర్కొనబడినది. దీనిని పఠించువాడు, వినువాడును జీవితములోనే స్వర్గసుఖము ననుభవించుచు రాజ్యాధికారులగుదురు.
ఇయ్యది “ శివ విజ్ఞాన వీచిక ‘ అను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (68)వ అధ్యాయము.
Summary of chapter 68 of the Linga Mahā Purana is as follows:
Sūta Romaharshaṇa details Vaṃśānuvarṇana, tracing the royal lineage of King Jyāmagha and his righteous descendants in the Lunar dynasty. The chapter highlights the extraordinary devotion, chastity, and righteous conduct of Queen Śaibyā, illustrating how moral purity and Śiva grace restored prosperity and noble heirship to the royal kingdom.