లింగ మహా పురాణము
36 - మహాదానాష్టమ మగు లక్ష్మీదానమును వివరించుట
మహదైశ్వర్యదాయకముగు లక్ష్మిదానమును వివరించుచున్నానని సనత్కుమారుడు చెప్పదొడగెను.
యథాశక్తి సువర్ణముతో - సర్వవిధ ఆభరణసంపన్నురాలుగా లక్ష్మీదేవి మూర్తిని, లక్ష్మీదేవికి కుడి భాగమున విష్ణు విగ్రహమును చేయించి - పీఠముపై వెండిపళ్లెరములో నునిచి శ్రీ సూక్తముతో లక్ష్మీదేవిని; విష్ణుగాయత్రితో శ్రీహరిని యథావిధి పూజించియు సమిధలతో నెయ్యితోడను వేరువేరుగా హసనము నొనర్చి యజమానునకు లక్ష్మీదేవిని విష్ణువి గ్రహమును చూపెట్టి యాతనితో ఆచార్యుడు సాష్టాంగ నమస్కారమును చేయించి - పూర్వము వలె శివలింగము నభిషేకించి పూజింపవలెను. ఆ పిదప ఆచార్యునకు లేక - గురువునకు సువర్ణ లక్ష్మీ విష్ణు విగ్రహములను సమర్పించవలెను. మరియు అందరిని భోజనతాంబూలాదులతో సత్కరింపవలెను.
ఇట్లు చేసినచో ఆర్జిత ధనమంతయు స్థిరపడును. తరతరాలనుండి ఉన్న స్థిరచరాస్తి యనుభుక్తంబు నగును.
ఇయ్యది “శిన విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాను ప్రవచనమున (36)వ యధ్యాయము.
Summary of chapter 144 of the Linga Mahā Purana is as follows:
This chapter glorifies the holy city of Kāshī or Vārāṇasī, describing it as the eternal abode of Parameśvara Śiva that rests upon the tip of His divine trident, completely untouched by cosmic dissolution. Nandi reveals that dying within the sacred borders of Kāshī guarantees immediate spiritual liberation for any living creature.