లింగ మహా పురాణము
24 - తంత్రోక్త శివపూజా విధానము
పసుపుతో కూడిన వేడినీటితో - శివలింగమును పీఠముతో సహ శోధించి - గంధ హిరణ్య మంత్ర జలముతో రుద్రాధ్యాయమును పఠించుచు – నీలరుద్రత్వరితరుద్ర పంచ బ్రహ్మమంత్రాడులతో “నవఃశివాయ” మంత్రముతోడ నభిషేకింపవలెను.
అభిషేక సమయమున శివలింగశిరస్సునండు పుష్పమునుగాని బిల్వడళమును గాని యుంచవలెను. శివలింగ మస్తకము శూన్యము కారాడని దిగువ శ్లోకము నొక్కి వక్కణించినది.
శ్లో॥ యస్య రాష్ట్రే తు లింగస్య మస్తకం శూన్య లక్షణం ।
తస్యాలక్ష్మీ ర్మహారోగో - దుర్భిక్షం వాహనక్షయః ॥
“ఎవని రాష్ట్రమునందు శివలింగము శూన్యమస్తకముగ నుండునో, అట్టి రాజునకు - దారిద్ర్యము, మహారోగము, దుర్భిక్షము (కఱువు) గజాశ్వాది వాహనక్షయంబు సంభవించును.”
అందువలన రాజు - తన రాష్ట్రములో గల శివాలయముల యందలి శివలింగములు శూన్యమస్తకములు కారాదని ప్రజలను శాసింపవలెను. ఒకవేళ అట్లు శాసింపనిచో రాష్ట్రము ప్రజలును కాలక్రమమున క్షీణింతురు.
అభిషేకానంతరము - ఆర్ఘ్యము నొసగి - శుభ్రవస్త్రముతో తుడిచియు “ఓం నమః శివాయ” మూలమంత్రము నుచ్చరించుచు వస్త్రమును శ్రీ గంధమును శుభ్రాక్షతలను నలంకారాదులను ధూపదీపాచమునీయ నైవేద్యములను సమర్పించి - మంగళ నీరాజనమును శివలింగ మధ్యన లింగము క్రిందను చూపియు మంత్రపుష్పమును సమర్పింపవలెను.
పూజా ప్రారంభమున గణాధిపతిని పూజించినయెడల - శివారాధనము నిర్విఘ్నముగా సంపూర్ణమగును. గురువును కూడ నర్చింపవలెను.
యః శివం పూజయే దేవం - లింగే వా స్థండిలేపి వా
స యాతి శివసాయుజ్యం - వర్షమాత్రేణ కర్మణా ॥
“శివలింగమునందు గాని స్థండిలస్థాపితాగ్నియందుగాని పూర్వోక్త విధానమున శివమూర్తి నొకసంవత్సరము పూజించువాడు - శివసాయుజ్యము నొందును. శివలింగము నారునెలలు పూజించినచో శివసాయుజ్యము లభించునని - మరియొక నిర్వచనము.
పూజాంతమున శివలింగపీఠమునకు ఏడు తడవలు - ప్రదక్షిణముజేసి - సాష్టాంగముగ నమస్కరింపవలెను.
ప్రదక్షిణమున నొక్కొక అడుగు వలన శత అశ్వమేధయ ఫలము చేకూరును. ఇట్లు నిత్యము సావధానముగా శివునర్చించినచో భోగార్థికి భోగము; రాజ్యార్థికి రాజ్యము; పుత్రార్ధికి తనయుఁడు; రోగవిమోచనార్థికి వ్యాధినివృత్తియు; సమస్తవాంఛిత సిద్ధియు సమకూరును.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (24)వ యధ్యాయము.
Summary of chapter 132 of the Linga Mahā Purana is as follows:
This chapter expounds upon Bhūtashuddhi, the esoteric yogic process of purifying the five gross elements—earth, water, fire, air, and ether—within the practitioner's subtle body. Through specific seed mantras and breath regulation, the worshipper dissolves physical consciousness into pure Śiva consciousness, preparing the body to become a living temple of Mahādeva.