లింగ మహా పురాణము
45 - జీవచ్ఛ్రాద్ద నిరూపణము
సూతుఁడు - శౌనకాదుల జిజ్ఞాసననుసరించి జీవచ్ఛ్రాద్ధము (బ్రతికియుండగా తనను గురించి తాను శ్రాద్ధముఁజేయుట)ను దిగువ విధము వివరించెను.
పూర్వము బ్రహ్మదేవుఁడు - వసిష్ఠమహర్షికి - శుక్రాచార్యునకును ఇదే విషయమును చెప్పెను.
పర్వతమునండు గాని - నదీతీరమునఁగాని - అరణ్యములో గాని - గుడియందు గాని - గృహమునఁగాని - మరణము సమీపించిన తటి - జీవచ్ఛ్రాద్ధము (గావించుకొనినచో జీవించుచుండగానే ముక్తుఁడగును. కర్మిష్ఠియైనను నిత్యనైమిత్తికాది కర్మలఁజేయనివాడైనను కేవలజ్ఞానియైన నజ్ఞానియైనను సదాచారసంపన్నుడైనను దురాచారపరుడైనను బ్రాహ్మణుడైనను క్షత్రియుడైనను వైశ్యుడైనను యోగియైనను దీని నాచరించినయెడల - జీవన్ముక్తుఁడగును.
నేలపై సికతా స్థండిలమున లేక మూరెడు వెడల్పు పొడవు లోతు గల కుండమునందు - లేక కేవలము మట్టి తిన్నెయందు గోమయాదులను చల్లి - అగ్నిని రగుల్కొల్పియు - అగ్నిముఖాదుల నొనర్చి - సమిచ్చర్పాదులతో హవనముఁజేయవలెను.
హవనమంత్రములు- 14 “ఓం భూః బ్రహ్మణే నమః” 15 “ఓంభూః బ్రహ్మణే స్వాహా” 16 “ఓం భువః విష్ణవే నమః” 17 “ఓంభువః విష్ణవే స్వాహా” 18 “ఓం స్వః రుద్రాయ నమః” 19 “ఓం స్వః రుద్రాయ స్వాహా” 20 “ఓం మహః ఈశ్వరాయ నమః” 21 “ఓంమహః ఈశ్వరాయ స్వాహా” 22 “ఓంజనః ప్రకృతయే నమః” 23 “ఓం జనః ప్రకృతయే స్వాహా” 24 “ఓం తపః ముద్గలాయ నమః” 25 “ఓం తపః ముద్గలాయ స్వాహా” 26 “ఓం ఋతం పురుషాయ నమః” 27 “ఓం ఋతం పురుషాయ స్వాహా” 28 “ఓం సత్యం శివాయ నమః” 29 “ఓం సత్యం శివాయ స్వాహా” 30 “ఓం శర్వ ధరాం మే గోపాయ ఘ్రాణే గంధం శర్వాయ దేవాయ భూర్నమః” 31 “ఓం శర్వధరాం మే గోపాయ ఘ్రాణే గంధం శర్వాయ భూః స్వాహా” 32 “ఓం శర్వ ధరంమే గోపాఘ్రాణే గంధం శర్వస్య దేవస్య పత్న్యైభూ ర్నమః” 33 “ఓం శర్వధరాం మే గోపాయ ఘ్రాణే గంధం శర్వపత్న్నై భూః స్వాహా” 34 “ఓం భవ జలం మే గోపాయ జిహ్వాయాం రసం భవాయ దేవాయ భువో నమః” 35 “ఓం భవ జలం మే గోపాయ జిహ్వాయాం రసం భవాయ దేవాయ భువః స్వాహా“ 36 “ఓం భవ జలం మే గోపాయ జిహ్వాయాం రసం భవస్య దేవస్య పత్న్యైభువో నమః” 37 “ఓం భవ జలం మే గోపాయ జిహ్వాయాం రసం భవస్య పత్న్యై భువః స్వాహా” 38 “ఓం రుద్రాగ్నిం మే గోపాయ నేత్రే రూపం రుద్రాయ దేవాయ స్వరోం నమః” 39 “ఓం రుద్రాగ్నిం మే గోపాయ నేత్రే రూపం రుద్రాయ దేవా (దేవస్య) యస్వః స్వాహా” 40 “ఓం రుద్రాగ్నిం మే గోపాయ నేత్రే రూపం రుద్రస్య సత్న్యై స్వరోం నమః” 41 “ఓం రుద్రాగ్నిం మే గోపాయ నేత్రరూపం రుద్రస్య దేవస్య పత్న్యై స్వః స్వాహాః” 42 “ఓం ఉగ్ర వాయుం మే గోపాయ త్వచి స్పర్శం ఉగ్రాయ దేవాయ మహ ర్నమః” 43 “ఓం ఉగ్ర వాయుం మే గోపాయ త్వచి స్పర్శ ముగ్రాయ దేవాయ మహః స్వాహా” 44 “ఓం ఉగ్ర వాయుం మే గోపాయ త్వచి స్పర్శ ముగ్రస్య దేవస్య పత్న్యై మహరోం నమః” 45 “ఓం ఉగ్రవాయుం మే గోపాయ త్వచి స్వర్శ ముగ్రస్య దేవస్య పత్న్యై మహః స్వాహా” 46 “ఓం భీమ సుషిరం మే గోపాయ శ్రోత్రే శబ్దం భీమాయ దేవాయ జనో నమః” 47 “ఓం భీమ సుషీరం మే గోపాయ శ్రోత్రే శబ్దం భీమాయ దేవాయ జనః స్వాహా” 48 “ఓం భీమ సుషిరం మే గోపాయ శ్రోత్రే శబ్దం భీమస్య పత్న్యై జనో నవ” 49 “ఓం భీమసుషిరం మే గోపాయ శ్రోత్రే శబ్దం భీమస్య దేవస్య పత్న్యై జనః స్వాహా” 50 “ఓం ఈశ రజోమే గోపాయ ద్రవ్యే తృష్ణా మీశాయ దేవాయ తపోనమః” 51 “ఓం ఈశ రజోమే గోపాయ ద్రవ్యే తృష్ణా మీశాయ దేవాయ తపః స్వాహా” 52 “ఓం ఈశ రజో మే గోపాయ ద్రవ్యే తృష్ణా మీశస్య పత్న్యై తపో నమః” 53 “ఓం ఈశ రజోమే గోపాయ ద్రవ్యే తృష్ణా మీశస్య పత్న్యై తపః స్వాహా“ 54 “ఓం మహాదేవ సత్యం మే గోపాయ శ్రద్ధాం ధర్మే మహాదేవాయ ఋతం నమః“ 55 “ఓం మహాదేవ సత్యం మే గోపాయ శ్రద్ధాం ధర్మే మహాదేవాయ ఋతం స్వాహా“ 56 “ఓం మహాదేవ సత్యం మే గోపాయ శ్రద్ధాం ధర్మే మహాదేవస్య పత్న్యై ఋతం నమః“ 57 “ఓం మహాదేవ సత్యం మే గోపాయ శ్రద్ధాం ధర్మే మహాదేవస్య పత్న్యై ఋతం స్వాహా” 58 “ఓం పశుపతే పాశం మే గోపాయ భోక్తృత్వభోగ్యం పశుపతయే దేవాయ సత్యం నమః“ 59 “ఓం పశుపతే పాశం మే గోపాయ భోక్తృత్వభోగ్యం పశుపతయే దేవాయ సత్యం స్వాహా” 60 “ఓం పశుపతే పాశం మే గోపాయ భోక్తృత్వభోగ్యం పశుపతేర్దేవస్య పత్న్యై సత్యం నమః” 61 “ఓం పశుపతే పాశం మే గోపాయ భోక్తృత్వభోగ్యం పశుపతేర్దేవస్య పత్న్యై సత్యం స్వాహా“ 62 “ఓం శివాయ నమః” 63 “ఓం శివాయ సత్యం స్వాహా“
ఇట్లు బ్రహ్మదేవుఁడు మొదలుకొని శివుని వరకు గలపై మంత్రముల నుచ్చరించుచు హవనమును - సహస్ర; పంచశత, అష్టోత్తర శతసంఖ్యలలో నేదే నొక సంఖ్యగా గావించి - 108 పర్యాయములు ఘృతము తోడనే విరజాహోమము నాచరింపవలెను.
73 “ఓం ప్రాణే నివిష్టోఽ మృతం జుహోమి - శివో మా విశా ప్రదాహాయ“ 74 “ఓం ప్రాణాధిపతయే రుద్రాయ వృషాంకాయ స్వాహా”
75 “ఓం భూః స్వాహా” 76 “ఓం భువః స్వాహా“ 77 “ఓం స్వఃస్వాహా“ 78 “ఓం భూర్భువః స్వః స్వాహ “
ఇట్లు ఆరుదినములాచరించి ఏడవనాడు శ్రాద్ధార్హులైన శివయోగులకు భోజనము నిడీ - శర్వా దృష్ట దేవతలుగా భావించి – వారికి - నూతన వస్త్రములను సువర్ణాభరణములను వాహనములను శయనములను కాంస్యపాత్రాదికమును - బంగారముతో గాని వెండితో గాని నిర్మింపబడిన ధేనువులను - తిలలు భూమిని -మహాదక్షిణతో సహ సమర్పించియు - ఋత్విగాది సహస్ర బ్రాహ్మణులకు భోజనమును భోజనదక్షిణలను సమర్పించవలెను. భస్మరుద్రాక్ష మంత్ర శివలింగధారియగు ఒకానొక శివయోగికి అన్నపానీయ వస్త్ర తాంబూలాదుల నొసగుట - సహస్ర బ్రాహ్మణ భోజన ఫలప్రదాయకమగు నని ఇందు రహస్యము.
ఈ కార్యము సంపూర్ణముగుటకు శివునకు మూడు దినములు మహాన్నరాశిని నివేదించి శివభక్తులైన పేదలకు పంచిపెట్టవలెను.
జీవఛ్చాద్ధకర్త - మరణించిన పిదప - పుత్రాదులు కర్మఁజేసినను చేయకున్నను - ముక్తుఁడగును. అట్టివాడు నిత్యనైమిత్తిక కర్మల నాచరింపవచ్చును. లేదా వానిని త్యజించినను దోషములేదు.
దాయాదులు సన్నిహిత బంధువులు మరణించినచో - ఆశౌచము ఉండదు. మరణవార్త వినగానే స్నానము నొనర్చి భస్మఁధరించినంత మాత్రమున పునీతుఁడగును. మరియు పితరులు నరక దుఃఖ నిర్ముక్తులగుదురు.
జీవఛ్ఛాద్ధకర్త మరణించిన వేళ -
‘‘కాలంగతే ద్విజే భూమౌ ఖనేచ్చెవ తదంగకం“
“భూమియందే నాతని శరీరమును స్థాపించవలెను. కాల్చఁగూడదు.”
అను లింగమహాపురాణ నిర్ఘోషము కేవల కర్మిష్ఠులకు క్లర్ణకఠోరమైనది. మృతునకు పుత్రాడులు అంత్యేష్టిని చేసినను, చేయకున్నను దుర్గతి సంభవింపదు. జీవఛ్ఛాద్ధానంతరము పుత్రుడు జన్మించినచో కుమారుడు జనకునకు నంత్యకర్మ జేయునెడ - బ్రహ్మవిదుండగును. సన్నిహిత బంధు వర్గము స్వర్గగామి యగును.
“బ్రహ్మ దేవుఁడు - సనత్కుమారునకు - సనత్కుమారుఁడు వేదవ్యాసునకు ప్రవచించిన నీ యంశమును - గురుకృపతో స్వీకరించి మీకు విశదపలచితిని.” అని సూతుఁడు మధ్యాహ్నవిశ్రాంతికై విరమించెను.
ఇయ్యది “శివ విజ్ఞాన వీచిక’’ అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (45)వ యధ్యాయము.
Summary of chapter 153 of the Linga Mahā Purana is as follows:
The narrative glorifies Bhakti Yoga as the most direct, accessible, and sweet path to reach Parameśvara Śiva in Kali Yuga. The text emphasizes that intense, loving devotion to Mahādeva transcends rigid intellectual scholarly achievements, opening the gates of liberation to all seeking souls regardless of social background.