లింగ మహా పురాణము
90 - యతి ప్రాయశ్చిత్త నిరూపణము
పాపము - మానసిక వాచిక కాయికములుగా త్రివిధంబగును. జగత్తంతయ త్రివిధ పాపముతో ఆవరింపఁబడియండును. జీవితములో ప్రతిదినము క్షణ (నాలుగు నిమిషముల) కాలమైనను శివధ్యానయోగము నభ్యసించినచో శుభము కలుగును. కామ్యకర్మనాచరించుటయను అజ్ఞానమును - నిష్కామ కర్మాచరణమువలన కలుగు చిత్తశుద్ధితో శివుని ధ్యానించులుయను జ్ఞానముతో పారఁదోలి ఈశ్వరభావము నొండవలెను. పరబ్రహ్మమును పరబ్రహ్మ యొక్క మాయావిలాసమును పరిశీలించి తురీయమగు శివస్వరూపము గలవాడు కావలెను.
కామవికారముచే స్త్రీ సంగమము జేసినచో - ప్రాణాయామపురస్సరముగ సొంతపనవ్రతము అను ప్రాయశ్చిత్తము నొనద్చుకొనవలెను.
సాంతపనమనఁగా ?
గోమూత్రము గోమయము (ఆవుపేడ) ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి అనువానిని మాత్రము పుచ్చుకొని ఒక రేయింబగలు ఉపవాసము జేయుట;
ఏకభుక్తము, నక్తము, అయాచితము, ఉపవాసము అనువాలో నేడే నొకదానిని మూడు దినము లాచరించుట ప్రాజాపత్యము అను ప్రాయశ్చిత్తమగును.
సన్న్యాసికి స్త్రీ ప్రసంగము భయంకరుగులుఁజేసి పరిహరింపఁదగినది. సాంతపన ప్రాజాపత్యాది ప్రాయశ్చిత్తములు అలపిఁగానిచో - ప్రాణాయామశతము నొనర్చి అహోరాత్రోపవాసము జేయవలెను.
ధర్మాత్ముఁడైన యతి దుర్వాదమును చేయరాడు. అతిసంకటమునండైనను దొంగతనము పనికిరాదు. యతికి దొంగతనమును మించిన పాపము మరియొకటి లేదు. హింస గూడ విహితము కాదు. హింసను దొంగతనముఁ జేసిన యతి పశ్చాత్తపుఁడైనచో చాంద్రాయణమను ప్రాయశ్చిత్తము నాచరింప వలసియుండును. సన్న్యాసి - పశువులను కీటములను హింసించినచో కృచ్ఛ్రము లేక అతి కృచ్చ్రము అను ప్రాయశ్చిత్తముల నొసర్చుకొనవలెను. తరుణి నవలోకించిన తఱి ఇంద్రియ దౌర్బల్యమువలన రేతస్సు స్టలితమైనచో పదునారు ప్రాణాయామముల జేయవలెను. పగలు ఇంద్రియ స్థల సమగునెడ మూడు దినములుపవసింపవలెను. ప్రతిదినము ఒకే ఇంటివారి అన్నము, అపక్వాహారము, మధుమాంసములున్ను యతులు స్వీకరింపఁదగినవి కావు.
సన్న్యాసి - సుమును మృత్తికను సమానములుగా చూచుచు - భిక్షాలునముతో జీవింపవలెను. ఇట్లు జాగరూకుఁడై ప్రవర్తించు యతి శివధ్యాన పరిపూర్ణుడై పునరావృత్తి లేనట్టి - శాశ్వతమైన స్థాన (పరశివలోక)ము జేరి బ్రహ్మానందము ననుభవించును.
ఇయ్యది “వ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (90) అధ్యాయము.
Summary of chapter 90 of the Linga Mahā Purana is as follows:
This chapter describes Yatiprāyashcitta, detailing specific expiatory rites and spiritual purifications for ascetics and renunciates who commit accidental errors or transgressions in their vows. The text outlines penances, fasting, mantra japa, and deep meditation upon Mahādeva to restore complete spiritual purity and monastic discipline.