లింగ మహా పురాణము
12 - వామదేవ తచ్ఛిష్య సముద్భవము
ముప్పదియవ కల్పము రక్తమని చెప్పఁబడును. ఆ కల్పమున బ్రహ్మదేవుఁడు రక్తవర్ణము (ఎరుపు వన్నె) గలవాడై - పుత్రుఁబడయఁగోరి- పరమేశ్వరుఁ బ్రార్ధింపగా గొప్ప తేజస్సు గల నొక కుమారుఁడు ప్రాదుర్భవించెను.
ఆ మహాపురుషుఁడు రక్త వర్ణము గల భూషణములఁదాల్చి ఎరపు పన్నె గల వస్త్రములను పుష్పమాలికలను ధరించి ఎర్రని కన్నులు గలవాడుగ నుండెను. అట్టి కుమారుని గాంచి నమస్కరించియు వామదేవునిగా గుర్తించి పరబ్రహ్మముగా చతుర్ముఖుఁడు ధ్యానింపగా మహేశ్వరుఁడు ప్రసన్నుఁడై “పితామహా! పుత్రకాముడవై నన్ను ప్రార్థించితివి గాన వామదేవుఁడనై సాక్షాత్కరించాలిని. “వామదేవాయ నమః” ఇత్యాది మంత్రమును నీవు నన్ను లోకనిర్మాతగా జపించినందున నిట్లే ప్రతి కల్పమునందును శివధ్యాన బలమున పరమేశ్వరునిగా దర్శింపగలుగుదువు! “ అని యనుగ్రహించెను. ఆ పిమ్మలు నలుగురు కుమారులు విజుఁడు, విబాహువు, విశోకుఁడు, విశ్వభావసుఁడు ననువారు బ్రహ్మవర్చస్సు గలవారై రక్తాంబర ధారులునై ప్రాదుర్భవించిరి.
మరియు వామదేవుని శిష్యులై వామదేవుని పూజా జపధ్యానములతో నారాధించుచుండిరి. వేయి దివ్యసంవత్సరములు గడచిన తరువాత వారు మహేశ్వరుని చెంత ముక్తులై యుందురు. తమ జీవిత కాలమున శివధర్మములను భక్తులకు ప్రభోధించుచు లోకకల్యాణము నొనగూర్చువారుగ నుండిరి.
ఇంకనెవరైన భక్తులు వామదేవు నారాధించినచో పునరావృత్తి రహితమైన మహాకైలాసముఁజేరి శాశ్వత శివ సాయుజ్యముఁజెందుచురు.
వామశ్చాసౌ దేవశ్చ వామదేవః
సుందరుఁడైన దేవుఁడు వామదేవుఁడనఁబఱుగును.
ఇయ్యది “శివ విజ్ఞాన వీచిక’ అను శాంకరీయ ఆం ధ్రానువాచ ప్రవచనమున (12) పన్నెండవ యధ్యాయము.
Summary of chapter 12 of the Linga Mahā Purana is as follows:
This chapter extols Vāmadeva, the second divine face of Mahādeva, associated with the northern direction, red complexioned splendor, and the sustaining power of cosmic preservation. The narrative describes how Vāmadeva revealed Himself during the Raktakalpa to grant boons to Brahmā and instruct the cosmic sages in the eternal principles of devotion, righteous conduct, and profound meditation upon Śiva.