లింగ మహా పురాణము
48 - సర్వదేవతా ప్రతిష్ఠాని నిరూపణము
హరి బ్రహ్మాది దేవతా విగ్రహములను ప్రతిష్ఠించుటకై కమలాకరము గల కుండములు ఐదు లేక పండ్రెండ్రు ఏర్పరచి - ఆ యా దేవతల గాయత్రీ మంత్రములలో సమిధాజ్య చరువులను హవనమొనర్పవలెను. పార్వతీ దేవి మొదలగు శక్తులను స్థాపించుటకు తదంగహవనమునకై యోనికుండములను నిర్మింపఁజేయవలెను.
హరి బ్రహ్మాద్యమరులు రుద్రాంశసంభపులగుటచే సవ్వారిని శివ పరివారముగా భావించి ప్రతిష్ఠించుట - సువిహితంబగునని చెప్పవచ్చును.
గాయత్రీ మంత్రములు :-
1. “తత్పురుషాయ విద్మహే - వాగ్విశుద్ధాయ ధీమహి, తన్నః శివః ప్రచోదయాత్“ 2. “గణాంబికాయై విద్మహే - కర్మసిద్ధ్యై చ ధీమహి, తన్నో గౌరీ ప్రచోదయాత్“ 3. “తత్పురుషాయ విద్మహే - మహాదేవాయ ధీమహి, తన్నో రుద్రః ప్రచోదయాత్“ 4. “తత్పురుషాయ విద్మహే - వక్రతుండాయ ధీమహి, తన్నో దంతిః ప్రచోదయాత్“ 5. “మహాసేనాయ విద్మహే - వాగ్విశుద్ధాయ ధీమహి, తన్నః స్కందః ప్రచోదయాత్” 6. “శిక్షశృంగాయ విద్మహే - వేద పాదాయ ధీమహి, తన్నో వృషః ప్రచోచయాత్“ 7. “హరివ క్తాయ విద్మహే రుద్రవక్త్రాయ ధీమహి, తన్నో నందీ ప్రచోదయాత్“ 8. “నారాయణాయ విచ్మహే వాసుదేవాయ ధీమహి, తన్నో విష్ణుః ప్రచోదయాత్“ 9. “మహాంబికాయై విద్మహే - కర్మసిద్ధ్యై చ ధీమహి, తన్నో లక్ష్మీః ప్రచోదయాత్“ 10. “సముద్ధృతాయై విద్మహే - విష్ణునైకేన ధీమహి, తన్నో ధరా ప్రచోదయాత్” 11. “వైనతేయాయ విద్మహే - సువర్ణపక్షాయ ధీమహి, తన్నో గరుడః ప్రచోదయాత్“ 12. ‘‘పద్మోద్భవాయ విద్మహే - వేదవక్త్రాయ ధీమహి, తన్నః స్రష్టా ప్రచోదయాత్” 13. “శివాస్య జాయై విద్మహే - దేవీ రూపాయ ధీమహి, తన్నో వాచా ప్రచోదయాత్“ 14. “దేవరాజాయ విద్మహే - వజ్రహస్తాయ ధీమహి, తన్నః శక్రః ప్రచోదయాత్“ 15. “రుద్రనేత్రాయ విద్మహే - శక్తి హస్తాయ ధీమహి, తన్నో వహ్నిః ప్రచోదయాత్” 16, “వైవస్వతాయ విద్మహే - దండ హస్తాయ ధీమహి, తన్నో యమః ప్రచోదయాత్“ 17. “నిశాచరాయ విద్మహే - ఖడ్గహస్తాయ ధీమహి, తన్నో నిఋతిః ప్రచోదయాత్“ 18. “శుద్ధ హస్తాయ విద్మహే - పాశహస్తాయ ధీమహి, తన్నో వరుణః ప్రచోదయాత్“ 19. “సర్వప్రాణాయ విద్మహే - యష్టిహస్తాయ ధీమహి, తన్నో వాయుః ప్రచోదయాత్” 20. “యజేశ్వరాయ విద్మహే - గదాహస్తాయ ధీమహి, తన్నో యక్షః ప్రచోదయాత్“ 21. “సర్వేశ్వరాయ విద్మహే - శూలహస్తాయ ధీమహి, తన్నోరుద్రః ప్రచోదయాత్“ 22. “కాత్యాయన్యై విద్మహే - కన్యాకుమార్యై ధీమహి, తన్నో దుర్గా ప్రచోదయాత్“
ఈ గాయత్రీ మంత్రముల నుచ్చరించుచు ఆ యా దేవతలను ప్రతిష్ఠించి పూజింపవలెను. దేవతలందరికి ప్రణవాసనము నేర్పరుపవలెను.
“ఓం నమో నారాయణాయ” అను అష్టాక్షర మంత్రము - విష్ణు ప్రతిష్ఠకై ప్రశస్తమగును.శివలింగమును వలె శివపరివార దేవతల నభిషేకాదులతో నర్చింపవలెను. ప్రతిష్ఠకు ముందు దేవతలందరికి నేత్ర మంత్రముతో కన్నులఁదెరిపించవలెను.
జలాధివాస ధాన్యాధివాస శయనాధివాసాదులను - బిలములలో నవరత్నసహిత సువర్ణాది నిక్షేపమును - తూర్పు మొదలగు దిశలయందు విఘ్నేశ్వరాది దేవతా ప్రతిష్ఠ నొనర్పవలెను.
ఇట్లు సర్వదేతా ప్రతిష్ఠను సంక్షేపముగా చెప్పితిని. ఆలకించితిరి గదా! యని సూతుఁడు నేవిరమించెను.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (48)ప యధ్యాయము.
Summary of chapter 156 of the Linga Mahā Purana is as follows:
The narrative records the profound discourse imparted by Parameśvara Śiva to His beloved devotee Sage Upamanyu. Mahādeva revealed the subtle keys of internal meditation, the secret of mantra activation, and the eternal nature of Śakti, empowering Upamanyu to become a grand spiritual master of Sanātana Dharma.